నాగయ్య స్మారక సంచిక

మద్రాసులో నాగయ్యగారి కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ఇంటూరి వెంకటేశ్వర రావు గారి సంపాదకత్వంలో “నాగయ్య స్మారక సంచిక” ను వెలువరించారని ఈ పుస్తకం దొరికాక, ముందుమాట చదువుతూ ఉంటే తెలిసింది. పుస్తకం వెలువడిన సంవత్సరం – 1978 అనుకుంటున్నాను. నాగయ్య గారి స్వీయచరిత్రను పధ్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులో రెండు మూడు సార్లు చదివినప్పటికీ, నా బుర్రకెక్కింది తక్కువే. అప్పట్లో, దొరికినవాటిలో ఏదన్నా కాస్త ఆసక్తికరంగా కనిపిస్తే, కథలాగా చదివేసే పద్ధతిలో చదివేసిన వాటిలో అదీ ఒకటి. ఊహ తెలిసాక ఆయన సినిమాలు (అంటే ఆయన ప్రధాన పాత్రధారి అయినవి) ఒకటీ అరా చూడ్డం, బాగున్నాయి, ఆయన భలే ఉన్నారు అనుకోవడం తప్ప ప్రత్యేకం ఆయన గురించి ఏ విధమైన అభిప్రాయమూ కలుగలేదు. అయితే, ఈ స్మారకసంచిక ఇంట్లో పాత పుస్తకాల మధ్య కనబడ్డప్పుడు చదవడం మొదలుపెట్టాక, నాగయ్య గారి స్వీయచరిత్రను మళ్ళీ చదవాలి అన్న కుతూహలం కలిగింది. ఒక వ్యక్తి గురించి ఇంతమంది గొప్పగా చెబుతున్నారే – ఆయన ఎంతటి వాడో! అన్న భావన కలిగింది.

(ఇదే అనుభవం బూదరాజు రాధాకృష్ణ గారితో ప్రత్యక్షంగా అయ్యింది. ఆయన ఉన్నన్నాళ్ళూ ఒకే అపార్ట్మెంట్ లో ఉన్నందువల్ల తరుచుగా పలకరిస్తూనే ఉన్నాకూడా, అసలు ఆయన ఎవరు? ఏమిటి? అన్నది ఆయన పోయాక శిష్యులు వెలువరించిన ’సదాస్మరామి’ పుస్తకం చదివాకే తెలిసింది నాకు!)

అలాగే, ఈ పుస్తకం కూడా, నాగయ్య గారంటే సినీప్రముఖుల్లో మరెందరో పెద్దలకు ఎంత గౌరవమో తెలియజెప్పింది. అక్కడక్కడా నాగయ్య గారి పాత ఫోటోలు మరో ఆకర్షణ. పుస్తకం లో పేజీ పేజీకి కనబడ్డ వివిధ స్టూడియో వాళ్ళ ప్రకటనలు, పేర్లు – ఆసక్తికరంగా అనిపించాయి. ఈ పుస్తకం గురించి ఇంతకంటే వ్రాసే ఉద్దేశ్యం లేదు కానీ, అక్కడక్కడా కనబడే ప్రముఖుల సందేశాలు వదిలేస్తే, నాగయ్య గారిని తలుచుకుంటూ ఈ సంచికలో వెలువరించిన వ్యాసాలు ఇవీ:

అపర త్యాగయ్య-శ్రీ నాగయ్య: డాక్టర్ పి. భానుమతి
అజాత శత్రువు-శ్రీ నాగయ్య: గుమ్మడి వెంకటేశ్వరరావు
నటలోకానికి మకుటం లేని మహారాజు నాగయ్య – ఇంటూరి
అమరజీవి మా నాగయ్య బావ: నటయోగి ముదిగొండ లింగమూర్తి
చివరకు మిగిలింది శిలా విగ్రహం : ఎం.సత్యం (జైహింద్ స్టూడియో)
Sri Nagayya-The Eminent artist : P.Rangareddy, Minister for finance & Information, Government of AP.
స్మృతివీచిక – డాక్టర్ దాశరథి
నాగయ్యగారికి శ్రద్ధాంజలి : డాక్టర్ బి.ఎన్.రెడ్డి
మా నాగయ్యగారు: కొడాలి ఉమామహేశ్వరరావు
అమరజీవి శ్రీ నాగయ్య: పేకేటి శివరాం
స్మృత్యంజలి : శ్రీ ఎం.ఎస్.రెడ్డి
మా అన్నగారు: వి.సుబ్రహ్మణ్యం
మహామనీషి శ్రీ నాగయ్య: హరి అచ్యుతరామశాస్త్రి
కీ, శే. నాగయ్య : పి.పుల్లయ్య
నాన్నగారు! : అంజలీదేవి
అమరజీవి శ్రీనాగయ్య: పి.ఆదినారాయణరావు
కళాతపస్వి నాగయ్యగారు! : మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
నేనెరిగిన నాగయ్యగారు: నేరెళ్ళ వేణుమాధవ్
గీతాంజలి: ఇమంది రామారావు
శ్రీనాగయ్య అమరుడు: ’విద్యావిశారద’ గోటేటి రామారావు
నాగయ్యగారితో నా అనుభవాలు: రాళ్ళబండి కామేశ్వరరావు
శ్రీనాగయ్య మనీషి-మానవాతీతుడు : కమలాకర కామేశ్వరరావు
నటమార్తాండులు శ్రీ నాగయ్య: కె.సత్యనారాయణ

ఇతరత్రా “మెసెజ్” ఇచ్చిన వారు:
Mohanlal Sukhadia (Governer of Tamilnadu), Dr.P.V.Rajamannar (Ex. Chief Justice, Madras), Dr K.V.Gopalaswamy (President, Andhrapradesh Sangita Nataka Academy), Dr D.V.S.Raju (D.V.S.Productions, Madras), K.Rajagopal Chetty (President, South India Film Chamber of Commerce, Madras), J.V.Somayajulu (President, Chennapuri Andhra Mahila Sabha, Madras), S.L.Nahata, J.Vengalrao (CM, Andhrapradesh), B.Nagireddy, B.V.S.S.Mani, Sreerajyam Sinha (Director, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ, హైదరాబాదు), బి.పద్మనాభం, ఠాకూర్ పి.హరిప్రసాద్ (స్థానిక సంపాదకులు, సినీ ఓం హెరాల్డ్, అధ్యక్షులు – అఖిల భారత లఘు వార్తాపత్రికల సంఘం), దుక్కిపాటి మధుసూదనరావు, డి.రామానాయుడు, యార్లగడ్డ వెంకన్న చౌదరి, ఛాయాదేవి, భట్టిప్రోలు మధుసూదనరావు, మొహద్దీన్ భాషా, ధూళిపాళ, బి.విఠలాచార్య, పి.మంగపతి (గ్రామఫోను కంపెనీ ఆఫ్ ఇండియా, మద్రాసు).

వీళ్ళంతా ఎవరు? అన్నది సగం సదర్భాల్లో నాకు తెలియదనుకోండి, అది వేరే విషయం.
పుస్తకం డీఎల్ఐ లో లభ్యం అని విన్నాను. వివరాలు తెలీవు.

You Might Also Like

3 Comments

  1. varaprasad

    sowmyagaru,,andukovalasina sikaralanni alavokaga natanato adirohinchi teluguvadi keertini bhrateeya chitraparisrarisramalo ajaramarm chesina nagayya garni cinemavallu elanu smarinchukoru,endukante vallaku ippate nayakulaku dabbakottadanike time saripovatamledu,kasta meeraina punyam kattukoni varinigurinchi marinta samacharam andinchandi

  2. సౌమ్య

    రఘురాం గారికి:
    ఆ “సదాస్మరామి” పుస్తకం అమ్మకానికి వేశారో, ప్రైవేట్ సర్కులేషన్ కి వేశారో నాకు తెలియదు. ముందే చెప్పినట్లు, ఒకే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్నందువల్ల ఆ పుస్తకం చదవడం సంభవించింది అంతే.

  3. RAGHURAM

    Parichayam raastu Sri Budaraju Radhakrishna gari gurinchi aayana mitrulu veluvarinchina pustakam ani sadasmarami gurinchi prastavincharu. Ekkada dorukutundo teliya cheyamani vinnapam.

Leave a Reply