పుస్తకం
All about booksపుస్తకభాష

February 23, 2011

Rita Hayworth and Shawshank Redemption – Stephen King

More articles by »
Written by: Purnima

“Rita Hayworth and Shawshank Redemption” అనేది ఒక అద్భుతమైన రచన. దీన్నీ ఆధారంగా  తీసిన  సినిమా కూడా  గొప్పగా ఉంటుంది. వీలుపడితే.. కాదు, వీలుకుదిరించుకొని పుస్తకాన్ని చేజిక్కించుకొని, చదవండి.

నేను చెప్పదల్చుకున్నది అదే! కాకపోతే ఇట్లాంటి ఒంటి వాక్య వ్యాసాలు పుస్తకం.నెట్లో వేసుకోరు కాబట్టీ, ఒకవేళ వేసుకున్నా.. e-wasteకి నావంతుగా ఏమీ చేయలేకపోతున్నానని మనసు క్షోభిస్తుంది కాబట్టీ, రాసుకొస్తున్నానే కాని, ఆ పై వాక్యాలే నేను చెప్పదల్చుకున్నది.

పుస్తకాల గురించి రాయడమంత దండుగమారి పని ఇంకోటి లేదు అనిపించే సందర్భాలు, నా అనుభవంలోనివి:

౧. పుస్తకం చదవడమే దండగనిపించి, ఇక దానిపై రాసి, అపరాధభావాన్ని పెంచుకోవటం ఎందుకని.
౨. పుస్తకం తెగ నచ్చేసి, ఎడతెగని ఆలోచనలు పుట్టుకొచ్చి, వాటిల్లో పడి మునకలేస్తూ దాని గురించి రాయాలనుకోవడం, సముద్రంలో ఈతకొడుతూనే ఒడ్డునున్నవాడికి అనుభవాన్ని వర్ణించడానికి ప్రయత్నించడం లాంటిది.

ఇప్పుడు ఈ రచన్నే తీసుకుందాం. దీని కథ గురించి చెప్పుకోవాలనుకోండి..అలా మొదలై, ఇలా సాగి, అదిగో అక్కడో మలుపు తిరిగి, ఇదో ఇక్కడ ఆగుతుందని చెప్పడానికి వీల్లేదు. నాకీ రచన్ని పరిచయం చేసిన వ్యక్తి మాటలు పావలా వడ్డీకి అరువు తెచ్చుకుంటే, “ఇది చెప్పే కథ కాదు. చదవాల్సిన కథ!” అందుకని, ఇక్కడ నేను ఇంక్కొంచెం కథ గురించి మాట్లాడినా, చదవ నిశ్చయించుకున్నవారి ఆనందాన్ని పాడుచేసినదాన్ని అవుతాను.

కథ లేకుంటేనేం? కథనం ఉంది కదా అనుకుందాం. కాని దాన్ని విశ్లేషించడం చేతనవ్వాలి కదా! మనలో మన మాట (మన= కింగ్ వీరాభిమానులు తప్పించి) – ఈ రచన మీద అంచనాలు హెచ్చి, నా ఊహలు ఎక్కడెక్కడికో ఎగిరి, తీరా విశ్వప్రయత్నం తర్వాత పుస్తకం దొరకబుచ్చుకొని చదవటం మొదలెడితే, చప్పగా సా..గుతోందని అనిపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పుస్తకం చదివి తీరుతానని పంతం పట్టి చదివాను కాని, లేకపోతే మధ్యలోనే వదిలేసేదాన్ని.

తిండికి లోటులేని వాడు పొట్టనింపుకోవడంతో పాటు నాలుకనూ సంతోషపెట్టడానికి చూసుకుంటాడు. ఇంకా దుడ్డున్నవాడు నాలుకతో పాటు ముక్కునూ, కళ్ళనూ సంతోషపెడితేనే అది విందు అంటాడు. అందుకే బండి మీద అట్లు అమ్మేవాడు గార్నిషింగ్ జోలికి పోడు. కాఫీ డే వాడు సగం కప్పును నురగతో నింపి దానిపై ముగ్గులు వేయకుండా వదలడు.

రచన కూడా వండిన పదార్థం అనుకుంటే, కింగ్ రాసిన ఈ నవల చాలా సాదాసీదాగా, కాని అదే సమయంలో రుచికరంగానే వండిన పదార్థం. కాకపోతే నోట్లో ఉన్న సమయం కన్నా  నోట్లో నుండి గొంతులోకి జారుతున్న సమయంలో అసలు రుచి తెలుస్తుంది. అందుకని రుచి చూడ్డానికని నాలుకపై అంటీఅంటించనట్టు పెట్టుకుంటే దీని అసలు రుచి తెలీనే తెలీదు. ఒక రచనను అందులోని విషయం కన్నా హంగులూ ఆర్భాటాల కోసం చదివేవారికి అంతగా రుచించికపోవచ్చు. అండర్లైన్ చేయించకపోతే అది గొప్ప వచనం కాదు అనుకునేవారి సంగతన్న మాట.

అయితే ఇక్కడో మాట. ఇట్లాంటి కథాంశాలు ఎన్నుకున్నప్పుడు కథకుడు ఓ కొత్త ప్రపంచాన్నే పూర్తిస్థాయిలో  సృష్టించవచ్చు. అందులో ప్రతీ చిన్న విషయాన్ని పాఠకుడికి వివరించవచ్చు. పాఠకుడి వాటిని శ్రద్ధగా గమినిస్తూ కథతో పాటు ముందుకు నడవచ్చు. ఇవేవీ చేయకుండా కేవలం అత్యవసర సంఘటనల్ని, పాత్రల్ని మట్టుకే పాఠకుడి ముందు నిలిపి, “తక్కినవన్నీ నువ్వే ఊహించుకో” అని వదిలేయడం కూడా ఒక రకం. కింగ్ చేసింది ఇదే!

ఉత్తమ రచయితలన్న గుర్తింపు ఉన్నట్టే, ఉత్తమ పాఠకులూ అన్న పోటీ ఉండే అవకాశం ఉంటే, ఈ రచన ఆధారంగా సినిమా తీయడానికి స్క్రిప్ట్, డైలాగులూ రాసి, తీసిన మనిషికి ఇవ్వచ్చు. ఈ రచనలోని ఆత్మను పట్టుకొని, ఆ ఆత్మ సరిగ్గా సరిపడే శరీరాన్ని ఇచ్చి అత్యద్భుతంగా ఆవిష్కరించిన ఘనత అతడిదే!  పైన అన్న “తక్కినవన్నీ ఊహించుకో” అన్న వాటిన్నంటినీ మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తాడు, సినిమాలో. ఉదాహరణకు, నవలికలో అసభ్యపదజాలం దాదాపుగా శూన్యం, ఎక్కడో ఒకటీ అరా తప్పించి. అదే సినిమాలో అమెరికెన్ కారాగార వ్యవస్థలో ఉన్న అసభ్యత, జుగుప్స లాంటి వాటిని హైలైట్ చేయటం వల్ల, అక్కడి వాతావరణం సుస్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటప్పుడు రచనను మించిన సినిమా అనిపిస్తుంది.

ఇందులో శిక్షను అనుభవస్తున్న ఖైదీలు నియమోల్లంఘన చేస్తే ఇచ్చే ప్రత్యేక శిక్ష ఉటంకించబడుతుంది. సినిమాలో అయితే టాయిలెట్ కాకుండా ఒక మనిషి పట్టేంత స్థలం మాత్రమే ఉన్న చీకటి గదిని చూపిస్తారు. ఆశ్చర్యపరిచే విధంగా, ఆ దృశ్యంకన్నా, “You had three ways to spend your time: sitting, shitting, or sleeping.” చదివేటప్పటి ఊహే నన్ను వణికించింది. “అబ్బ.. నాకసలు టైం ఉండడం లేదు.” అన్న complaintలో నిజానికి, కాలం మనల్ని చిత్రవథకు గురిచేయకుండా, మనమెంత సమర్థవంతంగా తప్పించుకుంటున్నామోనన్న smug satisfaction ఎక్కువనుకుంటా. కారాగారవాసంలో శిక్షాస్మృతి ప్రకారం అమలయ్యే శిక్షలకన్నా, రంపపుకోత పెట్టి కాని కదలని ప్రతి క్షణమే అసలైన శిక్షమోనని అనిపించింది. ఇలా చూసుకుంటే సినిమా కన్నా రచనే నచ్చుతుంది నాకు.

రచనైనా, సినిమా అయినా పూర్తిచేయగానే వెంటాడ్డం మొదలు పెడతాయి. అలా ఇలా కూడా కాదు, మన ప్రతి ఆలోచనలోనూ భాగమవుతాయి. అందులోని పాత్రలు మెదడుని ఆక్రమించుకుంటాయి. వాటిని వదిలించుకోవడం అంత తేలికైన పని కాదు.

జీవితం అంటే ఏమిటో ఖచ్చితంగా నాకు తెలీదు. పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకూ, ఒక మనిషి బ్రతికిన ప్రతీ క్షణపు చిట్టా జీవితమేమో. మన చేతిలో లేనివన్నీ, మన ప్రమేయం లేకుండా జరిగేవి, మన జీవితం మనకి అందిస్తుందని అనుకోవచ్చునేమో. దాని పట్ల మనకీ, మన పట్ల దానికీ బాధ్యతలూ గట్రా ఉంటాయో, ఉండవో?! ఇలా అంటే “జీవితాలని ప్రేమించటం / ద్వేషించటం అంటే?” అని ధీర్ఘాలు తీసేవారుంటారు కాని, బహుశా, జీవితాన్ని ప్రేమించనూ వచ్చు, కాళ్ళదన్నుకోనూ వచ్చునేమో. దాన్ని చిత్తుకాగితమూ అనుకోవచ్చు, లేదా, అత్యంత విలువైనదీ అనుకోవచ్చు. ఏదైనా ఆయా వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది అనుకుంట. ఉదాహరణకి, గుల్జార్ రాసిన సినిమా పాటలో ఒకడు,

“క్యా కరే జిందగీ.. ఇస్కో హమ్ జో మిలే..
ఇస్కీ జాన్ ఖా గయే.. రాత్ దిన్ కె గిలే”

అని పాడుకుంటాడు.

అంటే ఇక్కడ వీడు, “హయ్యో.. పాపం, నా జీవితానికి నేను దొరకడం వల్ల ఇలా తగలడిపోయింది. ఎప్పుడూ దాన్ని వేపుకు తినడం సరిపోయింది నాకు” అన్న ఉద్దేశ్యంతో వాపోతున్నాడు.

ఒక వేళ మనిషి పుడుతూనే వాడి పక్కగా ఒక “జీవితం” కూడా పుట్టి (అంటే, అందరూ కవలలుగా పుట్టడమన్నమాట), అది వీడితో పాటు పెరిగి, అత్యంత సన్నిహితురాలై, వీడి కష్టనష్టాల్లో పాలుపంచుకుంటూ, మృత్యువు కబళించేంత వరకూ విడదీయలేని బంధం పెనవేసుకుపోయాక, జీవితాన్ని ఎవడో “కిడ్నాప్” చేస్తే, వీడెళ్ళి వీరోచితంగా వాడి జీవితాన్ని కాపాడుకుంటే, చెర నుండి విముక్తికాగానే జీవితం ఏం చేస్తుంది? ఊపిరాడనివ్వనంత బలంగా వాటేసుకొని ముద్దులు పెడుతుంది? లేక నేలపై మోకాళ్ళపై కూర్చొని ఆనందం తట్టుకోలేక ఏడ్చేస్తుంది? లేదూ భావోద్వేగాలు గొంతుకు అడ్డం పడుతున్నా పేజీలకు పేజీలు డైలాగులు అప్పజెప్పుతుందో? లేదా గుల్జార్ చేత ఇంకో పాట రాయించుకొని కూని రాగం తీస్తుందో? Your life celebrating you! What a feast it could be!

జీవితం పట్ల ఇంతటి ఆసక్తిని, అనురక్తిని ప్రేరేపించే కథలు అరుదు! నా ఫేవరెట్స్ లో ముందుండే రచన ఇది.About the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..9 Comments


 1. WoW! Gulzar had this to say, which I didn’t know when I had written this post.

  “Ek roz zindagi ke roobaroo aa baithe. Zindagi ne poocha, ‘Dard kya hai? Kyun hota hai? Kahan hota hai yeh bhi toh pata nahin chalta. Tanhayee kya hai aakhir? Kitne log toh hain, phir tanha kyun ho?’ Mera chehra dekh kar zindagi ne kaha, ‘Main tumhari judwa hoon. Mujhse naraaz na hua karo’.”


 2. అత్యద్భుతం పూర్ణిమగారూ
  ఇలా కూడా రాయొచ్చా ఒక పుస్తక సమీక్ష అనిపించి చివరకు రాస్తే ఇలా రాయలి అని ముక్తాయించుకున్నాను.ముఖ్యంగా ఉత్తమ పాఠకుడు అవార్డులూ ఇవ్వొచ్చు అని నాక్కూడా అనిపించేది.
  –సంతోష్ సూరంపూడి


 3. @శారద: I think the point being made here is that if someone can find hope while in captivity, there’s hope for the rest of us. We should not stop dreaming and trying.
  There is so much disturbance around us. Still, imagine if we were pulled away from it and kept in a cell. How much we would long to be in the ‘free’ world!


 4. Interesting write up, Purnima! ముఖ్యంగా మీ “జీవితం కిడ్నేప్ అయితే” అన్న కాన్సెప్టు నాకు చాలా నచ్చింది. అయితే-
  నాకెందుకో ఇప్పటికే మనందరి జీవితాలూ సామూహికంగా కిడ్నేప్ అయిపోయావనే అనిపిస్తుంది.
  => సహజంగా ప్రకృతిని చూసీ, అమ్మ ఒడిలో ఙ్ఞానం పెంచుకుంటూ, విరుస్తున్న పూల వంకా, ఇంద్రధనుస్సు వంకా అబ్బురంగా చూస్తూ పెరగాల్సిన బాల్యం, నగ్న తారల మధ్యా, టీవీ రియాల్టీ షోల మధ్యా, కార్పొరేట్ కాలేజీల మధ్యా, ఎంట్రన్సు పరీక్షల మధ్యా చిక్కుపడిపోవటం చూస్తే జీవితం కిడ్నేప్ అయిపోయిందనిపించటం లేదా?

  ==> అన్న దమ్ముల్లా మెలగవలసిన ప్రజలు, భాషా/యాసా, కులమూ, మతమూ, ప్రాంతమూ, తేడాలతో ఒకళ్ళనొకళ్ళు నరికేసుకోవటానిక్కూడా సిధ్ధమవటం చూస్తే, ఇంకా జీవితం మనతోనే ఉందనిపిస్తుందా?

  ==> చచ్చే నాడు డబ్బు మనవెంట తిరిగి రాదని తెలిసినా తీరని ధన దాహంతో దేశాన్నీ, ప్రజలనీ దేన్నయినా సరే అమ్మేయగలిగే రాజకీయ నాయకుల సమాజంలో ఇంకా ఎక్కడుంది జీవితం?

  I know I am sounding defeatist, కానీ ఎప్పుడో జీవితం మన మధ్య జీవించలేక తనే పారిపోయింది!

  Sharada


 5. amma Purnima,
  I did not know that my words could be understood this way too.
  I meant you write so well, you should just express yourself independent of reviews.
  I’m sorry I gave you wrong impression.
  I did not know that you are continuing to blog.
  When you write a review, your own expression is so captivating that the book becomes secondary.
  I mean that as a complement.
  That makes me think you should write something of your own, more like poetry, because your expressions are so intense.


 6. Purnima

  @లలిత (తెలుగు4కిడ్స్): I’m not quite knowing how to take that comment. The instinctive response is, “Hell, No. Never did I write here as an excuse. I write only when I really want to.”

  Also, I’m not sure of what you meant by “letting your expression on your own.”, but if blogging comes under it, yeah, I do blog. And pustakam has been just a small part of what I’ve been blogging.

  Please come back soon to tell me, that you didn’t intend to mean that I’m using this platform for my own causes. I never intended to do it! God.. this is not easy to take! 🙂

  On that note, pustakam.net may reconsider the published article to check if it’s relevant. I’m fine to remove the write-up, if they find it otherwise.

  Thanks.


 7. జంపాల చౌదరి

  బాగా రాశారు పూర్ణిమ గారూ. ఇంకా చాలా రాయాలి మీరు.


 8. Purnima,
  high time you started writing and letting your expression free on its own, without a book / review for an excuse.
  పుస్తకం సంగతేమో, నీ మాటల నుంచి బయటపడితే కదా ముందు.


 9. Srinivas Vuruputuri

  పూర్ణిమ గారికి

  అనగ అనగ రాగమతిశయిస్తోందండోయ్! చాలా బాగా రాసారు.

  “ఒక వేళ, మనిషి పుడుతూనే, వాడి పక్కగా ఒక “జీవితం” కూడా పుట్టి (అంటే, అందరూ కవలలుగా పుట్టడమన్నమాట), అది వీడితో పాటు పెరిగి, అత్యంత సన్నిహితురాలై, వీడి కష్టనష్టాల్లో పాలుపంచుకుంటూ, మృత్యువు కబళించేంత వరకూ విడదీయలేని బంధం పెనవేసుకుపోయాక, జీవితాన్ని ఎవడో “కిడ్నాప్” చేస్తే, వీడెళ్ళి వీరోచితంగా వాడి జీవితాన్ని కాపాడుకుంటే…”, చెర నుండి విముక్తికాగానే, జీవితం ఏం చేస్తుంది?…”Your life celebrating you! What a feast it could be!”

  వందకి నూట యాభై మార్కులు మీ ఊహాశక్తికీ, అభివ్యక్తికిన్నూ!  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు సాహిత్య విమర్శలో ఖాళీలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (యాకూబ్ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ పుస్తకానికి ముందుమాట) హ...
by అతిథి
0

 
 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 

 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 
 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1