మహాభారతానికి ఒక పంచనామా – పర్వ

parvaప్రసిద్ధ కన్నడ రచయిత ఎస్.ఎల్.భైరప్ప గారి ‘పర్వ’ నవల చదవడానికి నాకు ప్రేరణ కలిగించింది కత్తి మహేష్ కుమార్ గారి ఈ టపా. పుస్తక సమీక్షలు నాకు కొత్త కాబట్టి సమీక్షించే సాహసం చెయ్యకుండా పుస్తకం చదివాకా నాకు కలిగిన అభిప్రాయాలేవో నిజాయితీగా చెప్పడం మాత్రమే చేస్తాను.

మహాభారత కథ చదివిన/తెలిసిన ఆలోచనాపరులెవ్వరికైనా అనేక ప్రశ్నలు కలగడం సహజం. మచ్చుకి –
పాండవులు దేవతల వరం వల్ల పుట్టినవారా? (immaculate conception?)
ద్రౌపది అయోనిజా? యజ్ఞకుండం లోంచి పుట్టిందా?
వస్త్రాపహరణ సమయంలో ద్రౌపదికి అక్షయ వస్త్రాలనిచ్చి కృష్ణుడు మహిమ చూపించాడా?
అస్త్రాలు అంటే ఏమిటి?
శాపాలు నిజంగా జరుగుతాయా?
గాంధారికి వందమంది పిల్లలు కలగడం సాధ్యమేనా?
కృష్ణుడు రాయబార సమయంలో విశ్వరూపం చూపించాడా?
లక్షలమంది ఒకచోట చేరి యుద్ధం చెయ్యడం ఆ కాలంలో సాధ్యపడిందా? వాళ్ళకి ఆహారం, కాలకృత్యాలూ గట్రా ఎలా కుదిరి ఉంటాయి?
అతి వృద్ధుడైన భీష్ముడు యుద్ధం ఎలా చేశాడు? అతనికి నిజంగా స్వచ్ఛంద మరణం ఉందా? ఒంటికి గుచ్చుకున్న బాణాలే అతనికి నిజంగా పడక అయ్యాయా? సెప్టిక్ అవకుండా గాయాలతో అన్నాళ్ళు ఎలా ఉన్నాడు?

ఇటువంటి ప్రశ్నలు పుట్టలు పుట్టలుగా పుట్టుకుని వస్తాయి – కొంచం ఆలోచించడానికి సాహసించేవాళ్ళకి. ఈమాత్రం ఆలోచించగలిగినవాళ్ళకి Occam’s razor గురించి తెలిసే ఉంటుంది. నమ్మడానికి కష్టంగా అనిపించే  అంశాలని విశ్లేషించడానికి ఈ రేజర్ని వాడ్డం బుద్ధిజీవులకి మంచి సరదాని ఇస్తుంది. పైన చెప్పిన ఏ ప్రశ్ననైనా తీసుకోండి. దానికి వీలైనన్ని సమాధానాల్ని ఆలోచించండి. వాటిల్లో అతి తక్కువ ఊహాగానాలతో, సరళంగా ఉన్న సమాధానాన్ని ఎన్నుకోండి. అలా ఎంపిక చేసుకోడమే Occam’s razor ని ఉపయోగించడం అంటే.

ఉదాహరణ –
వివరించాల్సిన అంశం: మానవుల కలయిక లేకుండానే దైవాంశతో గర్భం కలగడం (immaculate conception)
వివరణ 1: దేముడి దయ ఉంటే సాధ్యమే.
వివరణ 2: దైవాంశతో గర్భం కలిగిందని చెప్తున్న వ్యక్తి బహుశా అత్యాచారానికి గురై ఉంటుంది. తనవాళ్ళ దగ్గర దైవాంశ అని అబద్ధం చెప్పి ఉంటుంది.

ఈ రెండు వివరణల్లోనూ రెండోది చాలా సరళమైనది కాబట్టి Occam’s razor ప్రకారం రెండోదే అంగీకారయోగ్యం అవుతుంది.

ఇప్పుడు సరదా ఉన్నవాళ్ళెవరైనా మహాభారతం గురించి మీకు పుట్టిన ప్రశ్నలన్నిటికీ ఈ రేజర్ని ఉపయోగించి సమాధానాలు వెతకండి. తర్వాత ‘పర్వ’ నవల చదువుకోండి. మీ సమాధానాలనీ నవల్లోని విషయాల్నీ పోల్చి చూసుకోండి. పెద్దగా ఆశ్చర్యం కలగదు! ‘అలాంటప్పుడు, ఈ మాత్రం సమాధానాలు మేం ఆలోచించుకోలేమా, దానికోసం ఈ నవల ఎందుకు చదవాలి’ అంటే – సరే, మనకు ఇప్పటివరకు తెలిసిన చరిత్ర జ్ఞానం ప్రకారం మీరు మహాభారతాన్ని అర్థం చేసుకోడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? ఆర్యులంటే ఎవరు? వాళ్ళ సంస్కృతి ఏమిటి? వాళ్ళు ఏం తినేవారు? ఏం తాగేవారు? వాళ్ళ నమ్మకాలు ఏమిటి? వాళ్ళలో కుల వ్యవస్థ ఉందా? సూత కులం అంటే ఏమిటి? ఎలా పుట్టింది? రాక్షసులు అంటే ఎవరు? దేవతలు, నాగులు, గంధర్వులూ అంటే ఎవరు? ఆర్య సమాజంలో వివాహాచారాలు, కట్టుబాట్లు ఎలా ఉండేవి? బహుభర్తృత్వం పాత సమాజాల్లో ఉండేదా?

ఈ ప్రశ్నలన్నిటికీ మీకు సమాధానం తెలిసినా  – ఈ చారిత్రక నేపథ్యంలో చిత్రించిన ఒక జీవన దృశ్యాన్ని (నవలని) ఎప్పుడైనా చదివారా? అదీగాక- అతి పరిచయమైన, అతి సన్నిహితమైన, మహాభారతం లాంటి మహోజ్జ్వల కథల్ని ఈ నేపథ్య చిత్రణలో చదివారా? చదవకపోతే తప్పకుండా చదవాల్సిన నవల ‘పర్వ’.

హేతువాద ఆలొచనా దృక్పథంతోనూ,ఈ చారిత్రికాంశాలతోనూ బొత్తిగా పరిచయం లేకుండా కేవలం మహాభారతం యొక్క ఉజ్జ్వలత్వంతో మాత్రమే మీకు పరిచయం ఉంటే మాత్రం ఈ నవల చదవడానికి మీరు గుండె దిటవు చేసుకోవాల్సిందే.

కానీ ఇవన్నీ మీకు బాగానే తెలిసి ఉంటే, ఈ నవల చదివాకా – ‘ఇందులో పెద్ద విషయం ఏముంది? ఈ మాత్రం లాజిక్కుల్ని ఉపయోగించి రామాయణ, భాగవతాల్ని కూడా నవలల్లాగా నేను రాయలేనా?’ అని మీరు అనేస్తే నేనూ మహాకవి శ్రీశ్రీ గారిలాగే, ‘శభాష్,తప్పకుండా రాయగలరు. అసలు ఏ రచన చదివినా ఇలా నేనెందుకు రాయలేను అనిపించడమే ఆ రచన గొప్పదనడానికి కొలమానం’ అంటాను. (శ్రీశ్రీ గారు ఒక కవి సమ్మేళనంలో కవిత చదివార్ట. అది విన్న కుర్రాడొకడు లేచి, ‘ఓస్, కవిత్వమంటే ఇంతేనా, ఈ మాత్రం నేను రాయలేనా?’ అన్నాట్ట.)

అదలా ఉంచితే, మహాభారత కథతో చిన్నతనం నుంచీ పరిచయం ఉన్న వ్యక్తిగా ఒక రెండు చిన్న పొరపాట్లు మాత్రం నాకు ఈ నవల్లో కనిపించాయి. (బహుశా నాదే పొరపాటు కావచ్చు. నేను సంస్కృత మహాభారతం చదవలేదు. పరిశోధనాత్మక దృష్టితో అసలు చదవలేదు.)
1. పాండవుల్లో అర్జునుణ్ణి మినహాయించి, మిగతా వాళ్ళెవరికీ ద్రౌపది తప్ప  వేరే భార్యలు లేరనడం పొరపాటు కావచ్చు. నాకు తెలిసినంతవరకు వాళ్ళందరికీ ఎవరి భార్యలు వారికి ఉన్నారు. ద్రౌపది మాత్రమే ఉమ్మడి భార్యా, పట్టమహిషీను.
2. వ్యాసుడి తాతగారు వశిష్ఠుడు కాదు, శక్తి మహర్షి. ఆ శక్తి మహర్షి తండ్రి వశిష్ఠుడు. అంటే వ్యాసుడి ముత్తాత గారు వశిష్ఠుడు.
వీటిని కూడా పక్కనపెట్టండి.

‘పర్వ’ లోని పాత్రలూ, కథా మహాభారతానివే అయినా, మనకి చిరపరిచితమైన పాత్రలు కావవి. వాటి స్వభావాల్లో సమూలమైన మార్పులు కనిపిస్తాయి. పాండవులు సయోధ్య కలిగిన అన్నాదమ్ములు కారు. అలాగే కృష్ణ బలరాములూను. అందరూ భైరప్ప గారి కలం పోటుకి బలహీనపడిపోయి కనిపిస్తారు. కొంతమటుకు తట్టుకు నిలబడగలిగింది భీముడూ, కృష్ణుడూ మాత్రమే. (ద్రౌపదీ, కుంతీ కూడా పరవాలేదు.) మరీ దెబ్బతినిపోయింది ధర్మరాజూ, వ్యాసుడూ, మహాభారతానికి theme అయిన ‘ధర్మం’ అనబడే ఒక అయోమయపు భావనాను. వీళ్ళందర్లోకీ పాపం, వ్యాసుణ్ణి చూస్తే జాలి వేస్తుంది. ఇన్ని వేల (క్షమించాలి, వందల) సంవత్సరాలుగా ఒక జాతి ప్రజల  మనస్సుల్లో పూజలందుకుంటున్న ఆ మహానుభావుడు దీనాతిదీనంగా కనిపిస్తాడు. మనబోటి నాస్తికుల ప్రశ్నలకే దెబ్బతినిపోతాడు.

ప్రశ్నలంటూ పుట్టడం మొదలయ్యాకా ఎన్ని సమాధానాలు తెలిసినా ప్రశ్నలు మిగిలిపోతూనే ఉంటాయి. అలాగే నాకూ ఓ ప్రశ్న మిగిలిపోయింది, ‘పర్వ’ చదివాకా. పాతకాలపు వ్యక్తులంటే మనంత తార్కిక బుద్ధి కలిగినవారు కాదు. మనంత తెలిసినవారూ కాదు. కూపస్థ మండూకాలు. వాళ్ళ సిద్ధాంతాలూ, ఆదర్శాలూ మనకి పేలపిండీ, ఒడియాలూను. అయినా వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని తరాల ప్రజల్ని ప్రభావితం చెయ్యగలిగారు కదా. మరి మన ఆధునికుల ఊహా చిత్రాల్లో వాళ్ళు ఎందుకంత దీనంగా కనిపిస్తారా, అని. ఆఫ్టరాల్, ఈ రోజుల్లో గల్లీలో తిరిగే ఛోటా రాజకీయనాయకుడికి కూడా పెద్ద పరివారమూ, పలుకుబడీ, గొప్ప చైతన్యవంతమైన జీవితమూ ఉంటాయి కదా. చిన్నా, చితకా రచయితలకే అభిమాన సంఘాలూ, బిరుదులూ, శాలువాలూ ఉంటాయి కదా. మరి అప్పట్లో దేశాల్నేలిన రాజులూ, ఆదర్శ పురుషులని పేరుగాంచిన వాళ్ళూ, వేదాల్ని విభజించినవాళ్ళూ మరీ అంత దీనంగా బతికారంటారా? ఈ ప్రశ్నకీ కొన్ని సమాధానాలు ఊహించుకున్నాను.

1. వాళ్ళ జీవితాల్లోని ఉజ్జ్వలత్వం అబద్ధం. ఈ కథలన్నీ విజేతలు రాయించుకున్నవీ, భట్రాజు పొగడ్తలూను. లోకం గుడ్డిది కాబట్టి ఇంతకాలం ఇవి చెల్లుబాటయ్యాయి.
2. పూర్వకాలంలో కొంతమంది జనాలు ఒక స్ఫూర్తితో బతికారు. ఆ స్ఫూర్తే వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళని ప్రభావితం చేసి తరతరాలుగా నిలిచిపోయింది. వాళ్ళ జీవితాలు legends అయిపోయి వాళ్ళ చుట్టూ మాయ,మంత్రాలు అల్లుకున్నాయి. వాటిని తొలగించేసినా ఇప్పటికీ ఆ స్ఫూర్తికి నష్టం కలగదు. ఆ స్ఫూర్తిని చంపుకోలేకే ఇప్పటికీ ఈ కథల్ని పట్టుకు వేళ్ళాడుతున్నాం.
3. దేవతలు భూమ్మీద సంచరించారు. వాళ్ళ కథలే ఇవి. ఇవన్నీ దైవలీలలు, మనకి అర్థం కావు. మనకి అర్థం కాకపోయినా వీటిని విశ్వసించాలి.
4. ఇదంతా అర్థం లేని చెత్త. దీనిమీద సమయం వృధా చేసుకోడం దండుగ.

పైన చెప్పిన సమాధానాలమీద కూడా  Occam’s razor ని ఉపయోగించాలి. అది ఎవరికివాళ్ళు చేసుకోవాల్సిన పని.

మొత్తానికి మహాభారతంలోని ‘ఆత్మ/స్ఫూర్తి’ గురించి పట్టించుకోకపోతే, ‘పర్వ’ చాలా గొప్ప నవల. అందులో తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.

Details of the book:
Parva
Author: S.L.Bhyrappa
Flipkart Link – here.

You Might Also Like

45 Comments

  1. prathi venkateswara rao

    chala bagundi. pustaka priyulaku manchi plotform.

  2. vijaya

    పర్వ పుస్తకం నెనూ చదివాను. చాలా మంచి పుస్తకం. ఈ
    వ్యాసం నాకు ఎన్నో పాఠాలను నేర్పింది.ఒక్కసారి
    చదివితే మీకే తెలుస్తుంది..చదవండి చదివి ఆనందించండి.దీని పుఉర్తి పాఠం
    నా బ్లాగు లో ఉంది.

    mithabhashi.blogspot.com

  3. vijaya

    నమస్కారం
    మీ పుస్తకం.నెత్ లో ఇప్పుడే నేను పర్వ పుస్తకం గురించిన వ్యాసం చదివాను. ఈ సందర్భంలో ఒక విషయం మీతో పఒచుకోవాలనుకొటున్నను. చాలా సంవత్సరాల క్రి తం నెను ఒక మంచి వ్యాసం చదివాను. దానిని రచించిన వారెవరో నాకు తెలియదు
    .అది నెను సిటీ సె సెంట్రల్ లైబ్రరీ నుండి తీసుకున్న పుస్తకం. మొదటి పే జీలు చిరిగిపోయినవి. అది నచ్చి కాపి చేసాను.
    నాకు అది చలా నచ్చింది. మహా భారతం పై ఒక వాస్తవిక దౄక్పధాన్ని అది అందిస్తుంది.
    ఒక సారి పరిశీలించండి
    .

  4. sunnygadu

    bangalore లో ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా?

  5. యోగి

    నరసింహరావు గారు,

    మీ బ్లాగు లంకె ఇవ్వగలరా?

  6. నరసింహారావు మల్లిన

    కవిత్రయ భారతాన్ని వీలైన వారందరూ చదవండి.నేను శ్రీమదాంధ్రమహాభారతం-ఆణిముత్యాలు పేరు మీద నేను ఒక బ్లాగు ప్రారంభించాను. అందులో భారతంలో నాకు నచ్చిన విషయాలగురించి వ్రాస్తున్నాను. వీలైతే ఓసారి దర్శించండి.

  7. కిరణ్మయి

    ఇక్కడ రాసిన అభిప్రాయాలు చదివిన తరువాత, కొన్ని విషయాలు చెప్పాలని అనిపించి రాస్తున్నాను…
    మహాభారతం జరిగిందో లేదో తెలియదు, కాని, కొన్ని వేల సంవత్సరాల పూర్వము, హస్తిన పరిసరాలలో ఒక మహా యుద్ధము జరిగిందని, ఆ యుధం లో కొన్ని లక్షల మంది పాల్గొన్నారని, ఎవ్వరు ప్రాణాలతో మిగలలేదని మన చరిత్రకారులు కనుక్కున్నారు. యుద్ధానికి దారి తీసిన పరిస్తితులు మనకి తెలిసిన భారత గాధ అవ్వచ్చు, లేదా వేరేది అవ్వచ్చు, కొన్ని సంఘటనలు జరిగాయన్నది నిజము.
    అధర్వణ వేదములో ఎన్నో శక్తియుక్తమైన ఆయుధాల గురించి చెప్పారు. బ్రహ్మాస్త్ర మంటే మన ఆటం బాంబు అవ్వచ్చు. ఎందుకంటే, బ్రహ్మాస్త్రాన్ని ఒకసరి ఉపయోగిస్తే వెనక్కి పిలవటము కుదరదని మన పురణెతిహాసాలలో చెప్పారు. Immaculate Conception ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీ లతో సమానము.

    When we disscect the books in a postive note, and compare the history, as well as the timeline, we find large pieces of missing details for great lengths of time periods.

    something that I believe in based on my reading of all the scriptures as well as the research documents from various people is that, There was a great civilazation that flourished years back, thusands of years back. It was great in all aspects and people across the world have good relationships, I mean the whole seven continents. some thing happened that killed the majority of population and the survivors started fresh. We can find a lot of similarities between the traditions of different cultures from the corners of the world.

    This may not be relevant here, but then, thought of putting in my thoughts also.

  8. sujata

    నా జావా ప్రకారం, మహా భారతం, ఒకవేళ నిజంగా కట్టుకధా – బూటకమే అయినా, ఆ ప్లాటు కు, భారతం లో పాత్రలకూ, అందులో ఉన్న నియమాలూ, ధర్మాలూ – ఫిక్షనూ – వీటన్నిటికీ జనంలో ఉన్న పాపులారిటీ (జనాకర్షణ) – కు సరి సాటి అయిన రచన లేదు. రామాయణం, మహాభారతం క్లియర్ గా చాలా కుయుక్తులూ, దుష్టులూ – ఎట్ సెట్ రా ల పైన, మంచి, ధైర్యం, వగైరాల విజయం గురించి చెప్తాయి. ఇది ధర్మ ప్రచారం. మత ప్రచారం కాదు. అందుకే తింటే గారెలు తినాలి, వింటే (చదివితే) భారతం చదవాలి అని.. అంటారు. గారెలు ఇష్టం లేని వాళ్ళూ ఉండొచ్చు. పోనీ ఇడ్లీలో, పేపరు దోశో తినండి. మహాభారతాన్ని గురించిన విమర్శలూ, వివరణలూ కూడా మహా భారతం లానే రసాత్మకంగా ఉంటాయి అని నా అభిప్రాయం. అన్నట్టు పరిచయం బావుంది.

  9. పుస్తకం » Blog Archive » నాలుగు నెలల పుస్తకంలో..

    […] రవిగారు. నాగమురళిగారు చేసిన పర్వ పుస్తక పరిచయం ఇప్పటిదాకా అత్యధిక హిట్లనూ, […]

  10. Siva Rama Krishna

    Hitulara,
    Gata rendu rojuluga nenu mee andari abiprayalanu chaduvutunnanu. Kani annitikante munduga manam telusukovalasinadi emitante, Adharva Vedam loni chala putalu kalagharbhamlo kalasi poinavi. Naku telisinavaraku, 64 kalalaku sambhandinchina vidyalu, vati upasanalu oka pratyeka paddatilo sadhincha valasi vastundi. Eg: Pasupatastram koraku Arjunudu sivuni goorchi tapassu cheyatam, sadhinchatam. Ilage, ramayanamlo PUSHPAKA VIMANAM. Ivanni pratyekamina sadhanalu, prakriyalu.

    Deennibatti manam alochinchalsindi emante, bahusa aarojullo sastra prakriya baga abhivruddhi chendi vundali. Kani enduko aa prakriyalu kalagarbhamlo kalisipoyai.

    Nenu parva chadavaledu kani okkati matram cheppagalanu, mana puranalalo vrasina vatilo chalamatuku ippatike rujuvu ayenavi.

    e.g: Rama Setuvu – Adams Bridge (Between Srilanka and India)You can see it on satellite images from NASA.
    Dwaraka : DIscovered in the Arabian Ocean few miles from Moola Dwaraka.
    and many more.

    Conclusion : These may not entirely correct, but there is a great amoun t of truth in our HISTORY.(I don’t like to call it a story).

    Thanks

  11. Sampath

    ఉదయం పూట టీవీ చానెళ్ళలో కొందరు క్రైస్తవ గురువులు తమ “ఒకే ఒక్కడు” దేవుడిని తెగ మార్కెట్ చేస్తుంటారు. వాళ్ళ భాష, చేష్టలు… ఆవేశాలు… అబ్బో, ఎందుకులే. ఈ మధ్య దొంగ బాబా గాడు ఒకడు షిరిడీ సాయి బాబా వారసుడినని తెగ కథలు చెబుతున్నాడు. అబ్బో వాడి మార్కెటింగ్ కూడా ఎందుకులే…. ఈ నాయాళ్ళ మూర్ఖత్వాన్ని చూసి జాలి వేయదు సరికదా లాగి ఒకటి గూబ మీద పీకలనిపిస్తది. సరిగ్గా అలాంటి మార్కెటింగే ఈ పర్వ విషయం లో జరుగుతున్నట్లున్నది ఇక్కడ. పుస్తకం పరిచయం అయ్యింది చర్చలు అయ్యాయి… కానీ ఈ మార్కెటింగ్ ఎందుకని నాకర్థం కావట్లా. ఇక్కడున్న ఒక మూర్ఖుడిని చూసీ నాకు లాగి ఒకటి పీకాలనున్నది

  12. కె.మహేష్ కుమార్

    @రాకేశ్వర్రావు: పర్వలో తార్కిక ధృక్కోణంకన్నా మనోవిశ్లేషణ, హేతుసంవాదనా ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఇదేదో పాశ్చాత్య కొలమానాల్లో పురాణాల్ని చూసే పద్ధతిగా అనుకోవడానికి వీల్లేదు.కాబట్టి మీరు నిస్సందేహంగా ఈ పుస్తకాన్ని చదవచ్చు.

  13. nagamurali

    రాకేశ్వరా,
    నా అభిప్రాయాలు ఈ పుస్తకం చదవడానికి మిమ్మల్ని నిరుత్సాహపరిచాయంటే నేను కొంచం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందనే అర్థం. మరి అంతకన్నా ఇంకేం చెప్పను!! 🙂

    (నేను అడిగినది ’ఆవరణ’ కోసం, పర్వ కోసం కాదు. ఆవరణ నవలని తెలుగులోకి ఇంకా ఎవరూ అనువదించలేదనుకుంటా. దాని గురించి కూడా ఇంగ్లీషులో ఒక సమీక్ష చదివాను. దాన్ని చదవడానికి ’పర్వ’ చదవడానికి కావాల్సినదానికన్నా చాలా ఎక్కువ గుండె దిటవు ఉండాలి అనిపించింది.)

  14. రాకేశ్వర రావు

    నా కన్నడ స్నేహితుణ్ణి అడిగాను కన్నడంలో మంచి పుస్తకాలు చెప్పమని. వాడు వేంటనే బైరప్పగారి పర్వ చదవు అని చెప్పాడు, దాని థీం పలానా అని కూడా చెప్పాడు. నేను అంత మంచి నవల కాబట్టి అది తెలుఁగులో కూడా వుండివుంటుంది, రెండు భాషల్లోను చదివుతాను అని అన్నాను.

    ఇప్పుడిక్కడ సమీక్ష చదివింతరువాత అది అనవసరమనిపిస్తుంది. అసలే మొన్న రాజమహేంద్రిలో నేను శ్రీనివాస శాస్త్రిగారు ఈ పుస్తకం కోసం వెదికాం (మీరు ఇప్పటికే చదివేసారని తెలియదనుకుంట) దొరకలేదు.

    ఇక,
    పురాణాల్లో తర్కం వెదుక్కోవడం గటికశ్రాద్ధాం పెట్టడంవంటిది. తర్కం అనేది unimaginative nerds (ప్రాశ్చాత్యులు) కోసం అన్నది నా చిరువినయాభిప్రాయం. అది వారి తప్పుకాదులెండి, భగవంతుఁడు అన్నీ అందరికీ ఇవ్వడు. ఊప్స్.. భగవంతుడన్నానా? క్షమించాలి chance అన్నీ అందరికీ ఇవ్వదు.

    నాకు నేను మహాభారతాన్ని ఆ అసాధ్యాలతో చదివి ఆస్వాదించగలను. ఎంతో శ్రమ మిగిల్చినందుకు మురళిగారికి ధన్యవాదాలు. కన్నడం నేర్చుకోవడానికి వేఱే పుస్తకం వెదుక్కోవడం మంచిదనుకుంట. బైరప్పగారి వంశవృక్షమే ఎత్తుకుంటే పోలే? 🙂

    మీ రాకేశ్వర

  15. పుస్తకం.నెట్

    పుస్తకం.నెట్ “పుస్తకాల” గురించి చర్చించుకోడానికి ఒక వేదిక. వ్యక్తిగత దూషణలకూ, ఆరోపణలకూ, అసభ్యపదజాలానికి కాదు.

    వ్యాఖ్యాలను ఆయా పోస్టులలో పరిచయం చేసిన పుస్తకాలపై అభిప్రాయాలకి పరిమితం చేస్తే ఆమోదయోగ్యం. లేదా, వ్యాఖ్యపై తుది నిర్ణయం “పుస్తకం.నెట్”ది.

  16. కె.మహేష్ కుమార్

    @Achilles: మహాభారతాన్ని చదవాలని బహబాగా శెలవిచ్చారు.ఈ సలహా ఇవ్వడం చాలా సులభం కూడా. అర్జంటుగా సంస్కృతం ఔపోసనపట్టి, వ్యాసమహాభారతాన్ని ముందేసుకుని పారాయణం చేసే సమయం,అవసరం మొత్తం భారతావనిలో కనీసం వెయ్యి మందికి కూడా ఉండదు. మరి మిగతావాళ్ళ అర్థం నిరర్థకమందామా? అందుకే సులభంగా సారం అర్థమవ్వడానికి, ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నవాళ్ళు సరళమైన భాషలో తెలియజెప్పుతుంటే ఆసక్తి చూపుతున్నాం.

    నాకు తెలిసిన మహాభారతం ఉషశ్రీ రాసింది. ఆ తరువాత తెలిసిన కథలు సినిమాల్నుంచో లేక ఇతర పుస్తకాలనుంచో గ్రహించినవి. నాలాంటి ఎందరో కొంత జ్ఞానాన్ని ఇలాగే సంపాదించారు. అద్దంలో కొండ రూపం పట్టకపోయినా, దాని రంగు, ఆకారం,వ్విస్తృతత్వం బోధపడదంటారా?

    అయినా ‘పర్వ’లో మహాభారతమనే కొండను అద్దంలో చూపించలేదు. 1966-75 వరకూ అంటే దాదాపు పది సంవత్సరాలు లభ్యతలో ఉన్న అన్ని మహాభారతాల్నీ చదివి,మహభారతం జరిగిందంటున్న అన్ని ప్రదేశాలనూ సందర్శించి, విజ్ఞులతో,పండితులతో చర్చించి. 14 నెలల కాలం శ్రమించి రాసి,అ తరువాత కూలంకషంగా చర్చించి కూర్చిన గ్రంథం ఇది. ఇందులో మూలకథను జీర్ణించుకుని వెలువరించిన energy కనబడుతుందేతప్ప ప్రతిరూపాన్ని చూపే ‘చిన్నచూపు’ కనిపించదు.

    కనీసం ప్రస్తుతం చర్చిస్తున్న పుస్తకాన్ని చదివే సమయం లేని మీరు, మహాభారతం చదవండీ మిగతా ఆలోచనలన్నీ “తూచ్” అని తేల్చేస్తుంటే, మీ విజ్ఞత చూసి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు.మూలగ్రంధం చదవమనడం వరకూ సబబేకానీ, మిగతా ఆలోచనలూ,విమర్శనలూ,దృక్కోణాలూ విలువలేవనే భావన కుత్సితం.

  17. Achilles

    మహాభారతాన్ని అర్థం చేసుకోవాలంటే మహాభారతాన్ని చదవాలి. మిగతావన్నీ కొండను అద్దం లో చూపించడం లాంటి ప్రయత్నాలే!

  18. అరుణ పప్పు

    ఇరావతి కార్వే రాసిన ‘యుగాంత’ ఎవరైనా చదివారా? మహాభారత పాత్రల గురించి అర్థం చేసుకోవడంలో ఆ పుస్తకం తీరు కొంతవరకూ ఉపయోగపడుతుంది. చదివినవాళ్ళ్లెవరయినా దాన్ని పరిచయం చేస్తారా?

  19. ధర్మకథలు -3-కథ చెబుతా కథ చెబుతా « Rayraj Reviews

    […] లక్ష్యాన్ని నేను చెప్పలేను. కానీ “పుస్తకం.నెట్” లోని పర్వ సమీక్షని  చదవండి. వ్యాఖ్యలూ చదవండి – అందులో […]

  20. పర్వ - ధర్మకధలు - కధ చెబుతా కధ చెబుతా « Rayraj Reviews

    […] లక్ష్యాన్ని నేను చెప్పలేను. కానీ “పుస్తకం.నెట్” లోని పర్వ సమీక్షని  చదవండి. వ్యాఖ్యలూ చదవండి – అందులో […]

  21. nagamurali

    ఒక మిత్రుడందించిన వివరం:
    ధర్మరాజుకి దేవిక; భీముడికి హిడింబ, జలంధర; అర్జునుడికి సుభద్ర, ఉలూపి, చిత్రాంగద; నకులునికి కరేణుమతి; సహదేవునికి విజయ అనేవాళ్ళు భార్యలు.

  22. Achilles

    ఇంకెవరికో నాగార్జునుడు అనే కొడుకుండాలి?

  23. nagamurali

    నా బ్లాగులో శ్రీ మల్లిన నరసింహారావు గారి కామెంటు:

    ధర్మరాజుకు పౌరవతి అనే భార్య ద్వారా దేవకుడు,
    భీమునికి హిడింబ ద్వారా ఘటోత్కచుడు, కాళి అనే ఆవిడ ద్వారా సర్వగతుడు,
    అర్జునునికి ఉలూపి ద్వారా నిరావంతుడు, చిత్రాంగద ద్వారా బభ్రువాహనుడు, సుభద్ర వలన అభిమన్యుడు,
    నకులునికి రేణుమతి ద్వారా నిరమిత్రుడు,
    సహదేవునికి విజయ అనే ఆవిడ ద్వారా సుహోత్రుడు కలుగుతారు.
    ఈ వివరాలు నేనెప్పుడో రాసుకున్న నోట్సులోనివి.

  24. కె.మహేష్ కుమార్

    @Dreamer:ప్రమీల కూడా అర్జునుడి భార్యే (ప్రమీలార్జునీయం సినిమా చూశారా!)

  25. Dreamer

    ధర్మరాజుకి కూడా ప్రమీల అనే ఒక భార్య ఉన్నట్టు ఎక్కడో చదివాను.

  26. nagamurali

    పెదరాయుడు గారూ, మీ కామెంటుకి నెనర్లు.
    @Achilles: Thanks a lot for your constructive discussion. I believe these are the kinds of questions one should ask while trying to understand the mythologies/cultural heritage of any culture.

    Myth busting is easy. Appreciating the multidimensionality of any phenomenon is difficult.

    Btw, I gave the immaculate conception example keeping in my mind the Biblical research you have mentioned.

    I would like to continue the discussion with you (and other friends like Mahesh) offline, given the seriousness of the topic.

    I think pustakam.net’s primary motive is to encourage people to talk about books and encourage people to read more. I think people should be allowed here to talk whatever they want about books without any fear of these heavy discussions. It was probably wrong on my part to come out a bit too strongly on Parva. I will take more care in future.

    If a bibliophile like me is afraid of writing freely about what he thinks of a book because of these scary ideological discussions, what about novice people? Guys, let us try to encourage each other to talk nonsense (of course about books). 😀

    మహేశ్ గారూ, మీ కామెంటు బాగుంది. అంతమటుకు నేనూ ఏకీభవిస్తున్నాను. మొహమాటాలు వదిలిపెట్టి అన్ని విషయాల గురించీ అన్ని విధాలుగానూ ఆలోచించాల్సిందే.

  27. కె.మహేష్ కుమార్

    ఎప్పుడైతే కథలు నమ్మకాల్ని నిర్దేశిస్తాయో,ఆ నమ్మకాలు సామాజిక ప్రవర్తనకు మూలం అవుతాయో, అప్పుడు ఆ కథల్లోని “నిజం” ప్రశ్నించబడుతుంది.రామాయణం, మహాభారతం, బైబిల్ కథల విషయంలో అదే జరుగుతోంది. జరుగుతుంది కూడా.ఇందులో అభ్యంతర పెట్టడానికీ,”అయ్యో నమ్మకాల్ని నాశనం చేస్తున్నారు” అని అనుకోవడానికీ ఆస్కారం లేదు.
    మహాభారతాన్ని అప్పటి కాలమానపరిమితుల ఆధారంగా నిజంగా జరిగుంటే ఇలా జరుగుతుందని చెప్పడం ఆ రచయిత యొక్క మేధ,సామాజిక చరిత్రపట్ల నిబద్ధత,చేయదగిన research చేయగల సత్తాకు నిదర్శనం. అంతేకాక, ఒక అత్యుత్తమ కల్పనా శక్తికి ఇదొక చిహ్నం.దీంతో మనం అంగీకరించినా, అంగీకరించకపోయినా తప్పకుండా చదివి తీరవలసిన పుస్తకం ఇది.

  28. Achilles

    further explanation may not be out of place –

    I guess most of us have read the famous Sherlock Holmes adventures. We do talk about these stories in analogues fashion. There is a film called “The Return Of Sherlock Holmes” in which, the Sherlock Holmes character utters what is now a hugely famous line “Elementary, Mr Watson”. This line is so popular. Now the Sherlock Holmes Society disputes whether the detective ever really said “Elementary, Mr. Watson” – What is being disputed here? We know Sherlock Holmes is fictitious, but yet people talk about Sherlock Holmes. Though fictitious, it is true that he lived in 221B Baker Street.

    When we talk about the truth of fictitious objects, we *know* that we are talking about fictions. (For further study- please read: Truth in Fiction- American philosophical quarterly- Lewis David, 1978.. You’ll find it in JSTOR Archives)

    Whether the Events of Ramayana or Mahabharatha or any other story is true or not; whether it is a fiction or fact, its epistemic *status* is irrelevant to its truth. The story of Rama or Mahabharata impart knowledge without being a knowledge claim. Stories are ‘true’ not because they are ‘fictions’ and even less because they are historical facts. (To study further – Read: Comparative anthropology and action sciences – An Essay on knowing to Act and Acting to Know). I will email this paper to you.

  29. Achilles

    “మహాభారత కథ చదివిన/తెలిసిన ఆలోచనాపరులెవ్వరికైనా అనేక ప్రశ్నలు కలగడం సహజం. మచ్చుకి –
    పాండవులు దేవతల వరం వల్ల పుట్టినవారా? (immaculate conception?)
    ద్రౌపది అయోనిజా? యజ్ఞకుండం లోంచి పుట్టిందా?
    వస్త్రాపహరణ సమయంలో ద్రౌపదికి అక్షయ వస్త్రాలనిచ్చి కృష్ణుడు మహిమ చూపించాడా?
    అస్త్రాలు అంటే ఏమిటి?
    శాపాలు నిజంగా జరుగుతాయా?
    గాంధారికి వందమంది పిల్లలు కలగడం సాధ్యమేనా?
    కృష్ణుడు రాయబార సమయంలో విశ్వరూపం చూపించాడా?
    లక్షలమంది ఒకచోట చేరి యుద్ధం చెయ్యడం ఆ కాలంలో సాధ్యపడిందా? వాళ్ళకి ఆహారం, కాలకృత్యాలూ గట్రా ఎలా కుదిరి ఉంటాయి?”

    @ Nagamurali – before one approaches anything in a purely scientific way, it is necessary that one poses *right* questions.

    Western scholars spent hundreds of years dissecting every word of the ‘Jesus tale’ and posing myriad of questions like… “Was Jesus historical?”, “How would a Virgin conceive Jesus?”, “Is it scientific?”, “Is it true?”, “Did they really crucify him?” so on and so forth. In Bible, there are claims of historical accuracy, and what follows is but natural, close scrutiny of whether they occurred in *reality*

    If one approaches the Indian stories in the same way, one runs the risk of committing a fundamental fallacy. Questions like “Did Ramayana happen?”, “Did Mahabharata happen?”, “Were they historical?”, “Is it real?” are *wrongly posed questions*. They do not make sense at all for none of the Indian stories ever claim historical accuracy.

    Then what are they? Why are they significant? They are *stories*. The dominant way of teaching and learning in ancient India was through stories. Stories are *moral exemplars*. The question whether Ramayana/mahabharata occurred or not has nothing to do with their respective value and truth. Are they real? may be not, who cares. Are they true? Yes they are!

    Note: My comment here is a response to *Nagamurali* and to the quoted text *only*. I have neither read Parva, nor do I wish to.

    Pustakam Guys – Excuse my ingiless this one last time 😉

  30. కె.మహేష్ కుమార్

    @పెదరాయ్డు:
    ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో కృష్టుడు తన మాయతో చీరలు ప్రసాదించి “మానసంరక్షణ” చేసాడనేది సాధారణంగా చెప్పే విషయం. కానీ భైరప్ప దాన్నొక రాజకీయ సంవాదంగా ద్రౌపది చేత చెప్పించిన తీరు ఆశ్చర్యంతోపాటూ “నిజమే కదా!” అనే భావన కలిగిస్తుంది.

    ఈ నవలలో ద్రౌపది కృష్ణుడికోసం ప్రార్థించదు.తనకీ అవమానం జరిగితే (అత్యంత శక్తివంతమైన)ద్వారకలోని తన అన్న ఒకవైపూ,దక్షిణం దిశనుంచీ తన సొంత అన్న,నాన్న(పాంచాలురు)దండెత్తి హస్తినావతిని గంగలో కలుపుతారు అని ఒక సాధ్యమైన యుద్ధ భయాన్ని కలిగిస్తుంది.

    అప్పటికే (విదేశాలతొ)వ్యాపారంతో అత్యంత బలంగా తయారయిన ద్వారక,అంతే బలవంతుడైన కృష్ణుడు ఒకవైపు. కురువులతో ఎల్లప్పుడూ వైరం కలిగిన పాంచాలురు మరొవైపూ, ఇద్దరికీ ఇకేసారి కురువంశాన్ని మట్టుబెట్టే కారణం దొరికితే ఇంతేసంగతులన్న నిజాన్ని ద్రౌపది తెలియజెప్పి తన మానాన్ని కాపాడుకుంటుంది.

    కృష్ణుడి మాయ యొక్క సాధ్యాసాధ్యాలకన్నా ఈ రాజకీయ-భౌగోళిక నిజం అంగీకారాత్మకంగా అనిపిస్తుంది.

  31. పెదరాయ్డు

    పాండవులు దేవతల వరం వల్ల పుట్టినవారా?
    ద్రౌపది అయోనిజా? యజ్ఞకుండం లోంచి పుట్టిందా?
    గాంధారికి వందమంది పిల్లలు కలగడం సాధ్యమేనా?

    భారతంలో చాలా వరకు సహజ పుట్టుకలు కావు. మనం కూపస్థ మండూకాలుగా భావిస్తున్న వారు, మనకన్నా అభివృద్ది చెందినవారుగా ఎందుకు వుండకూడదు? టెస్ట్ ట్యూబ్ బేబి, క్లోనింగుల యుగంలో ఉన్న మనం, వీటిని ఆ దృష్టికోణంలో ఎందుకు చూడకూడదు? అత్యాచారపు, అక్రమసంభందాల పరిధి కంటే ఇది మరింత మెరుగైన తర్కంగా ఉంటుంది. నా ఊహ ప్రకారం వాళ్ళు మనకన్నా ఎంతో అభివృద్ది చెందిన పరివారం.

    వస్త్రాపహరణ సమయంలో ద్రౌపదికి అక్షయ వస్త్రాలనిచ్చి కృష్ణుడు మహిమ చూపించాడా?
    కృష్ణుడు రాయబార సమయంలో విశ్వరూపం చూపించాడా?

    పి.సి. సర్కార్ మేజిక్కులను నమ్ముతారా? కృష్ణుడు కూడా అటువంటిదే ఏదో మాయ చేసి వుండొచ్చు. పోనీ ఇటివల సిస్కో వారు అభివృద్ది చేసిన ‘టెలీ ప్రెసెన్స్ ‘ గురించి విన్నారా? పై ప్రశ్నలకు ఇవి అతికినట్టు సరిపోతాయి.

    అస్త్రాలు అంటే ఏమిటి?

    Voice activated self guided micro missiles

    అంటే, శబ్ద తరంగాలకు ఉత్తేజం పొంది ప్రయోగింపబడే స్వయం చాలిత సూక్ష్మ క్షిపణులు. అర్జునుడు బాణం తీసి మంత్రం చదవగానే దానిలోని ప్రోగ్రాం ఆక్టివేట్ అవుతుంది. విల్లులో పెట్టి సంధించగానే తగిన గతిని పొంది చలన లక్ష్యాన్నీ చేదిస్తుంది. ఇక సూక్ష్మ రూపమంటారా మనం ఇప్పుడు లేటెస్ట్ గా భావిస్తున్న నానో టెక్నాలజీ లాంటిదానితో సాధ్యమే.

    లక్షలమంది ఒకచోట చేరి యుద్ధం చెయ్యడం ఆ కాలంలో సాధ్యపడిందా? వాళ్ళకి ఆహారం, కాలకృత్యాలూ గట్రా ఎలా కుదిరి ఉంటాయి?

    హరప్పా, మొహంజదారోలే, అత్యంత ప్రాచీన నాగరికతలుగా మనకు తెలుసు. అది నిజం కాదేమో? ఇంతకంటే మరుగైన వ్యవస్థలు వారికి వుండి వుండవచ్చు.

    అతి వృద్ధుడైన భీష్ముడు యుద్ధం ఎలా చేశాడు? అతనికి నిజంగా స్వచ్ఛంద మరణం ఉందా? ఒంటికి గుచ్చుకున్న బాణాలే అతనికి నిజంగా పడక అయ్యాయా? సెప్టిక్ అవకుండా గాయాలతో అన్నాళ్ళు ఎలా ఉన్నాడు?

    మనకు ఇప్పటికీ పరిచయం కాని, వైద్య పరిఙ్ఞానం కారణమై వుండొచ్చు.

    శాపాలు నిజంగా జరుగుతాయా?

    తెలియదు. మెరుగైన తర్కం ఆలోచించాల్సి వుంది.

    ఈ టెక్నాలజీ అంతా ఏమైందంటారా? ఒకరోజు ఏ బ్రహ్మాస్త్రమో, ప్రళయమో తన పని కానిచ్చింది.

    గమనిక: పెద్దలు మనకు నేర్పింది దేన్లోనైనా మంచిని చూడమని. ‘Occam’s razor’ సిద్దాంతం ప్రకారం నెగటివ్ గా కాకుండా పాసిటివ్ గా కూడా ఆలోచించవచ్చు. ఇదే సరైనది కాకపోవచ్చ్చు. సమాజాన్ని విచ్చిన్నం చేసే దృక్కోణాలకన్నా, కలిపి వుంచగలిగే పార్శ్వాలాను ఆవిష్కరిస్తే మంచిది. నూతన పోకడల పేరుతో సమూహ ప్రయోజనాన్ని వెనక్కు నెట్టి వ్యక్తిగత మోహావేశాలకు, ప్రయోజనాలకు పెద్ద పీట వేసే సిద్దంతాలకు ఆదరణ లభిస్తుండటం ఆందోళనకరం.

  32. nagamurali

    మహేశ్ గారూ,
    తలంటు మొదలుపెట్టినందుకు చాలా కృతజ్ఞతలు.
    మహాభారతం పైన గుడ్డిప్రేమ నాకు లేదండీ. అక్కసు, ఉక్రోషం, కోపం కూడా లేవనే అనుకుంటున్నాను. మీతో వాదించే ఉద్దేశ్యం అంతకన్నా లేదు. మహాభారతంలో postmodern స్ఫూర్తిని చూడాలని అన్నారు. అందులో దొరికేది అదొక్కటే స్ఫూర్తి అని నేను అనుకోవడం లేదు. అయినా ఆత్మల గురించి చర్చించడం అనవసరం అనుకుంటాను – అవి ఉన్నాయో లేవో నాకూ తెలియదు కాబట్టి.

    నాకు చిన్నతనంలో చదివిందీ, విన్నదీ గుర్తు ఉన్నంతవరకు ధర్మరాజుకీ, భీముడికీ కూడా వేరే భార్యలు ఉన్నారనుకుంటాను. అయితే రిఫరెన్సులు ఇవ్వలేను. ఎప్పుడైనా ఓసారి భారతం తిరగెయ్యాలి.

    అన్నట్టు చెప్పడం మరిచాను. ’పర్వ’ కి మీరు చేసిన పరిచయమే నాకా పుస్తకం చదవడానికి కోరిక కలిగించింది. ఇది చదివాకా భైరప్పగారి పుస్తకాలు ఇంకా చదవాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి మీకు నా కృతజ్ఞతలు.

  33. కె.మహేష్ కుమార్

    నకులుడు – జరాసంధుడి కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు
    సహదేవుడు – మాద్ర రాజు ద్యుతిమతుడి కూతురు విజయని పెళ్ళి చేసుకున్నాడు
    భీముడు – హిడింబిని పెళ్ళి చేసుకున్నాడు (వీళ్ళకు పుట్టినవాడే ఘటోత్కచుడు)
    ధ్రర్మరాజు – ఇతనికి ద్ర్రౌపది కి మినహా భార్యలు లేరు
    అర్జునుడు – అందర్లోకల్లా ఆరితేరిన అర్జునుని కథలు అందరికీ తెలిసినవే సుబద్ర,ఉలూపి మొ” భార్యలు ఇతర flings

  34. కె.మహేష్ కుమార్

    “మహాభారతంలోని ‘ఆత్మ/స్ఫూర్తి’ గురించి పట్టించుకోకపోతే”…అసలు మహాభారతం యొక్క ఆత్మ/స్ఫూర్తి ఏమిటంటారూ?

    నా వరకూ ఆ కాలంనాటి ‘ధర్మ’చింతనను తెలియజెప్పడం మహాభారతం యొక్క ముఖ్య ఉద్దేశం. పర్వ నవలకూడా ఇదే విషయవస్తువుని మూలంగా తీసుకుని చేసిన మనోవిశ్లేషణ(psycho analysis).”ధర్మం అంటే ఇది” అని రామాయణం చెప్పినంత సూటిగా మహాభారతం చెప్పదు. మహాభారతంలో సమయానుగుణంగా, పరిస్థితులకు అనుకూలంగా ధర్మాలు ఏర్పడ్డాయి,మార్చబడ్డాయి. ఈ post modern existential ధృక్పధం, మహాభారతాన్ని “మనుషుల కథగా” చేసింది. ఆస్ఫూర్తి/ఆత్మని చక్కగా ఆవిష్కరించిన నవల ఇది. తెలిసిన మహాభారతంపై గుడ్డిప్రేమతో కాకుండా,ఒక సామాజిక పరిణామ దృష్టితో ఈ నవలను చదవడం శ్రేయస్కరం. లేకపోతే మిగిలేది అక్కసు,ఉక్రోషం, కోపం.

  35. ఆదివారం తలంటు « Naga Murali’s Blog

    […] మహాభారతానికి ఒక పంచనామా – పర్వ […]

Leave a Reply