ఇడిగిడిగో బుడుగు

రాసినవారు: జంపాల చౌదరి
**********************
మీకు తెలుసో లేదో గానీ, అప్పుడెప్పుడో మాయమైపోయిన బుడుగు ఈ మధ్యే మళ్ళీ జనాల మధ్య కొచ్చాట్ట. ఇది జరిగి దాదాపు ఏడాదిన్నరైనా మరి ఇప్పటి దాకా నాకీ సంగతి తెలీనే లేదు. ఎక్కడా ఎవరూ మాట్లాడుకోగా విననూ లేదు. ఇవాళ అకస్మాత్తుగా వాడు, వాడి స్నేహితులతో కనిపిస్తే హాస్చెర్యపడి ఆనందపడి పడిపోయి లేచి ఘాట్ఠిగా పట్టేసుకొని వాళ్ళ కబుర్లకీ, చేష్టలకీ, వేషాలకీ ఎగిరెగిరి నవ్వుతుంటే, పక్కనున్నవాళ్ళంతా నన్ను కొద్దిగా వింతగా అనుమానంగా చూశారు. ఐతేనేం, ఇన్నేళ్ళ తరువాత కనిపించిన పాత నేస్తాలు, మరి.

నా చిన్నప్పుడు ఆంధ్రపత్రిక దినపత్రికలో రోజూ మూడు నాలుగు ఫ్రేములతో బుడుగు కార్టూన్లు (ఇప్పుడు డెయిలీ స్ట్రిప్ అంటున్నాం చూడండి, అదన్న మాట) వస్తుండేది. బుడుగూ, సీగేనపెసూనాంబా, దీక్షితులు ఇంకా నలుగురు అరడజెను పిల్లల్ని వెంటేసుకొని రోజూ తెగ అల్లరి చేస్తుండేవారు. దేశంలో పొలిటీషియన్లు అనబడే పెద్దాళ్ళు అల్లరి చిల్లర పనులు చేసినప్పుడు వాళ్ళని చూసి ఇంకా రెచ్చిపోయేవారు. ఒక ఏడాది తరవాత కాబోలు ఆ కార్టూన్లు ఆగిపోయాయి. అప్పటికి బాపు గారు సాక్షి సినిమా తీయడం మొదలెట్టేసినట్టున్నారు. ఈ కార్టూన్లలో బహుకొద్ది అప్పుడప్పుడు సావనీర్లలోనూ, మిత్రుల కలెక్షన్లలోనూ కనిపించినా, అన్నీ కలిసి ఒక్కచోట చూడటం ఇదే మొదలు. జాగ్రత్తగా ఈ పని చేసింది విజయవాడలో ఉండే గంధం అనే బాపు గారి అభిమాని. మచ్చుకి నాలుగు పానెల్స్ చూడండి. ఇట్లాంటివి నూటయాభై పేజీల్నిండా ఈ పుస్తకంలో ఉన్నాయి మరి. నవ్వు ఆరోగ్యానికి మంచిదన్న మాట నిజమే ఐతే, ఈ పుస్తకం మొదలెట్టాక మీ అంత ఆరోగ్యవంతులు బహు తక్కువ మందే ఉంటారు.

ఇడిగిడిగో బుడుగు
బాపు కార్టూన్లు
సేకరణ, కూర్పు: గంధం
ప్రచురణ: రెయిన్‌బో ఆర్ట్ సిరీస్, విజయవాడ 94401 83460
విశాలాంధ్ర, నవోదయాలలో దొరుకుతుంది
తొలి ప్రచురణ: మే 2009
154 పేజీలు.
రూ. 100

********************

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.

********************

You Might Also Like

12 Comments

  1. v.v.prasada rao

    1967 lo anukuntaanu….bapu budugu chetha modati saari naaku chakkiliginthalu pettinchaadu. manasu baaga lenappudu vaadine gurthu chesukuntaanu.idigidigo budugu anagaane ulikki paddaanu….

  2. jyoti

    budugu chinnapuudu eppudo chadivanu.chala rojula taruvata ekkada chadivi anandam vesindi

  3. పుస్తకం » Blog Archive » 2010లో చదివిన తెలుగు పుస్తకాలు

    […] ఇడిగిడిగో బుడుగు – బాపు: బుడుగు + బాపు… అస్సలు చెప్పక్కరలేదు! […]

  4. పుస్తకం » Blog Archive » హైద్రాబాద్ పుస్తక ప్రదర్శన, 2010 – నేను కన్నవి, కొన్నవి

    […] *ఇడిగిడుగో బుడుగు *ఆర్ట్ డైరెక్టర్ కళాధర్ గురించిన పుస్తకం ఒకటి. *రాయలసీమ రాగాలు (తెలుగు అకాడెమీ ప్రచురణ) *ఇస్మైల్ హైకూలు […]

  5. చౌదరి జంపాల

    ఇవ్వాళ బాపు గారి పుట్టినరోజు.
    ఆయనకు మరెన్నో బోల్డన్ని ఏళ్ళ పాటు ఆరోగ్యమూ, ఆనందమూ, మనకు మరిన్ని మనోజ్ఞమైన చిత్రాలూ కోరుకొందాం.

  6. చౌదరి జంపాల

    @లలిత (తెలుగు4కిడ్స్): ఆ కార్టూను ఈ పుస్తకంలో లేదు.

  7. లలిత (తెలుగు4కిడ్స్)

    “వచ్చిన వాడు ఫల్గుణుడు” అంటూ బుడుగు బాణం వెయ్యబోయి చేతకాక పోతే బుడుగే అంటాడో సీగాన పెసూనాంబ ఎక్కిరిస్తుందో కాని, “వీచినది ఎదురు గాలి!” అనడం గుర్తుంది.
    బుడుగు మళ్ళీ వస్తే తప్పకుండా పుస్తకాల అరలోకి ఆహ్వానించవలసిందే.
    ఈ విషయం తెలియచేసినందుకు Thanks.
    రెండో పేజీలో footnote ఇప్పుడే గమనించాను.
    బావుంది.

  8. రామ

    తెలియజేసినందుకు కృతఙ్ఞతలు. ఇండియా వెళ్ళినప్పుడు తీసుకొని రావాల్సిన పుస్తకాల్లో మొదట్లో చేర్చాను.

  9. Swathy

    అవును ..చాలా రోజులయింది ఈ నేస్తాల కబుర్లు విని ….

    Thanks for sharing 🙂

  10. లలిత

    నా దగ్గర బుడుగు 1,2 ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా బుడుగు కార్టూన్ల పుస్తకమా ! అయితే తప్పకుండా కొనుక్కోవాలి

Leave a Reply to చౌదరి జంపాల Cancel