పుస్తకం
All about booksవార్తలు

October 21, 2010

లెక్కట్లూ…చప్పట్లూ..

“హుర్రే… పుస్తకం.నెట్ కు వచ్చిన హిట్ల సంఖ్య మూడు లక్షలు దాటింది!”

“ఏంటా పిల్ల చేష్టలు?! ఖాళీ బుర్రలా మీవి కూడా?! అంకెల గారడీలో పడి.. పోతున్నారు. బాగుపడ్డాన్ని ఇలా లెక్కేసుకోరు తెల్సునా? ఎంత ఎదిగితే, అంత ఒదగాలి తెల్సా?  ఛ! ఛ! ఈ కాలం పిల్లలూ.. డిస్సపాయింటింగ్ గాల్స్.. “

ఆగండాగండాగండి…

అంకెలు అబద్ధాలు చెప్తాయని మాకు తెల్సు. కనీసం అన్ని నిజాలూ తెలియజెప్పవనీ తెల్సు. మరెందుకిలా ఐస్‍క్రీం షాపులో పిల్లకాయల్లా గెంతులేయడమంటే..

బేబీ స్టెప్స్ అంటారే.. పసిపాప తప్పటడుగులు! – అలానే మొదలయ్యింది. అడుగులో అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ పోతున్న వేళ కొన్ని ’ఉత్త’ రాళ్ళు (మైలురాళ్ళంటే పెద్దాళ్ళకి కోపం వస్తుందేమోనని!) కనిపిస్తున్నాయన్న మాట! చూసిన దాన్ని చూసినట్టు ఊరుకోం గా! “ఎందుకు? ఏమిటి? ఎలా?” అని మొదలెడతాం! అప్పుడు తెలుస్తుంది, “చూపులు కలసిన శుభవేళ” సినిమాలో వీరభద్రరావులా మేం నడుస్తూ………ఉన్నాం అని. కాకపోతే, ఇది ఒక్కరిద్దరి నడక కాదని, దీన్ని ఒక “రిలే” పందెంలా నడుపుతున్న అందరికీ “థాంకులు!” చెప్పుకుందామనీ!

మేమేదో సరదాకి మొదలెట్టాం. మా సరదాని నలుగురితోనూ పంచుకున్నాం = రుద్దాం! మా సరదా చూసి ముచ్చటపడో, మా నస భరించలేకో, “పోనీలే పిల్లలు!” అనుకునో, “అయ్యో పాపం! వ్యాసాలు లేవంట.. పిల్లలిద్దరకీ ఖాళీ లేదంట. ఈ పూటకు నేను రాస్తాను” అని పుస్తకం.నెట్ పస్తులుండనవసరం లేకుండా దగ్గరకు తీసుకొని, వ్యాసాలు రాసిచ్చిన / రాస్తున్న / రాయబోతున్న వారందరికీ థాంకులు!

“ఇదిగో.. రాస్తున్నా! ఇవ్వాళ హెడ్డింగ్ పెట్టా.. వచ్చే ఏడాది తొలి వాక్యం.. అయ్యిపోతుంది, కాస్త ఓపిక పట్టూ!”, “గొంతెమ్మ గారూ.. ఇవ్వన్నీ రాయడం నాకు కుదరదుగా!”, “రాస్తా.. రాస్తా జర రు(రో)కో..” అంటూ మాటల మాయలో పడేసినా, మాట సాయానికి ఎప్పుడూ అందుబాటులో ఉండి, మాకు అండదండా ఉన్న పెద్దోళ్ళకి థాంకులు!

పుస్తకాల గురించే కదా, ఏం చదువుతాం? ఏమని వ్యాఖ్యానిస్తాం? అని వదిలేయకుండా, వెన్నుతట్టే వ్యాఖ్యలు రాసేవారికి థాంకులు!

పుస్తకాలు! పుస్తకాలు! పుస్తకాలు! తప్ప మరో మాట వినిపించని సైటులో ప్రతీ రోజూ సగటున ఐదొందల హిట్లు రావటం, మామూలు విషయం కాదు. (And we’re not any good at faking humbleness!)

పుస్తకంనూ, పుస్తకాలనూ ఇంతిలా ఆదరిస్తున్న అందరికీ థాంకులూ!

ఈ సైటు సమిష్టి వ్యవసాయం (ముళ్ళపూడి గారికో ఓ వేసుకుంటూ) కావున,  ఇరవై రెండు నెలల్లో సైటును మీరు నడిపిన తీరును అంకెల్లో మీ ముందు పెడుతున్నాం (అంకెలు అబద్ధాలు చెప్తాయి – కనీసం, అన్ని నిజాలూ చెప్పవూ అన్న పాఠం అప్పజెప్పుతూ)

హిట్లు: 300,001
వ్యాసాలు: 528
కమ్మెంట్లు: 3557

థాంకులూ! థాంకులూ! టాంకుల్లో పట్టేన్ని థాంకులూ! మా ఇద్దరి చప్పట్లూ! మా తప్పట్లని పెద్ద మనసుతో మన్నిస్తారని భావిస్తూ

మీ,
సౌమ్య, పూర్ణిమ

పి.ఎస్: ఇదంతా సరే గాని, ఈ సందర్భాన పుస్తకం.నెట్ కు మీరేం రాసిస్తున్నారు? 🙂About the Author(s)

పుస్తకం.నెట్13 Comments


 1. సంతోషం. అభినందనలు.


 2. harsha

  Good going sowmya, Your dedication & efforts towards pustakam is amazing


 3. మోహన

  🙂 Congrats.


 4. Swathy

  Congratulations !! Party time 😉

  Very Happy =)


 5. sayee peeveeyes

  CONGRATS ON THIS HAPPY OCCASION! KEEP IT UP.


 6. ఏంటీ?… ఆమధ్యెప్పుడో నేను రెండు లక్షల హిట్లకు కామెంటు పెట్టినట్టున్నాను. అప్పుడే ఇంకో లక్ష కొట్టారా?
  సౌమ్య, పూర్ణిమ… కంగ్రాట్స్!


 7. నరసి

  ఆనంద భాష్పాలు అపుకోలేకపోతున్నా !! నాకు తెలిసిన పూర్నిమేనా అనిపిస్తోంది !!
  మీ ప్రయాణం లో ఒక కోటి మంది చదువరులు చేరాలని ఆకాంక్షిస్తూ !!


 8. “పుస్తకం” కు వచ్చిన ప్రాచుర్యానికి ముఖ్యకారణం – అందుబాటులో ఉండడం, అందరూ రాయగల్గటం, భేషజాలవీ ఎక్కడా కనబడకపోవటం. వీటిని ఇలానే నిలబెట్టుకుంటారని ఆశిస్తూ, అభినందిస్తున్నాను.


 9. మాలతి

  సౌమ్యా, పూర్ణిమా – మీఇద్దరికీ మెచ్చుకోళ్లు, వర్చువల్ శాలువాలు :)). ప్రపంచంలో సాధించిన ఘనకార్యాలన్నీ ఇలా చిట్టి పొట్టి అడుగులతో మొదలు పెట్టినవే కదా 😛


 10. janardhana Reddy

  సౌమ్య, పూర్ణిమ… తెలుగు సాహీత్యనికి మీరు చెస్తున్న సేవ కు నా అభినందనలు…


 11. ‘నిప్పట్ల ట్రీట్’ ఏమైనా ఉందా 🙂


 12. rAm

  అభినందనలు తెలుపుతూ కామెంట్’రాస్తున్నా’ 😀 !  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0