పుస్తకం
All about booksపుస్తకంప్లస్

October 13, 2010

ఆడియోలో సాహిత్యం – నా అనుభవం

More articles by »
Written by: అసూర్యంపశ్య

ఈమధ్య కాలంలో కొన్ని రచనల ఆడియో రికార్డింగులు వింటున్నప్పుడు కొన్ని ఆలోచనలూ, అనుమానాలూ కలిగాయి. అలాగే, ఆ మధ్యోసారి ఒక స్నేహితురాలి కోసం ఒక వ్యాసం, మరో‌స్నేహితురాలి కోసం ఒక కథా – రికార్డింగ్ చేసాను. ఆ చేస్తున్నప్పుడు – ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగా వస్తుందేమో : ఇలా అనుకుంటూ‌చేసిన సంగతులు గుర్తొచ్చి, అప్పటి ఆలోచనలని ఇంకొకరి రికార్డింగ్ వింటున్నప్పుడు పోల్చుకుంటే ఏమనిపించిందో చెప్పడానికి ఈ టపా.

మొదటి పాయింటు:
కర్ట్ వొనిగాట్ కథ 2 B R 0 2 B [2] ఆడియోలో ఒక నాలుగైదు గొంతుకలున్నాయి. పాత్రల మధ్య సంభాషణలు – కథకుడు చెబుతున్నట్లుగా కాక, ఈ గొంతుకల మధ్య సంభాషణల లాగానే వినిపిస్తాయి. కానీ, కొన్ని చోట్ల, ఏకధాటిగా కొన్ని లైనులు సంభాషణలే నడిచినపుడు – మామూలుగా రచయితలైతే రెండు రకాలుగా రాస్తారు: ఒకరైతే – ఎవరు అన్నారు? అన్నది ప్రత్యేకం రాయరు. ఆ సంభాషణ ప్రవాహాన్ని బట్టి మనమే అర్థం చేస్కుంటూ పోవాలి.

ఉదాహరణకి:
‘ఎక్కడ్నుంచి వస్తున్నావ్?’ – అతను అడిగాడు
‘ఎక్కడ్నుంచి రాగలను? అల్లంత దూరాన ఉండే ఆఫీసు నుండి ఇంటి వచ్చేందుకే ఓపికుండదు…మళ్ళీ బైటకి వెళ్ళి రావడం కూడానా?” – ఆమె జవాబు.
‘మరింతాలస్యమైందేం?’
‘బస్సు దొరకలేదు’
‘నీకెన్నిసార్లు చెప్పాను కార్లో వెళ్ళమని?’
‘అవును, కార్లో వెళ్తే, రేప్పొద్దున్నకి వస్తాను ఇంటికి -ఈ ట్రాఫిక్ లో’
‘బస్సైనా అంతేగా..’
‘బస్సు లో నేను నిద్రపోవచ్చు..’
– ఇలా సాగుతుంది. ఇక్కడ ఎవరు ఎవరితో ఏం‌మాట్లాడుతున్నారు అన్నది ఇదీ అని రాయకపోయినా మనకి అర్థమౌతున్నది కదా!

ఇంకో రకంలో, ప్రతి వాక్యం చివరా – ‘అతను అన్నాడు’, ‘ఆమె జవాబిచ్చింది’- ఇలా వస్తాయి.
అయితే, వేర్వేరు వ్యక్తులు రికార్డింగులో భాగం పంచుకుంటున్నప్పుడు – రచయిత ఎలా రాసినా కూడా – ‘అతను అన్నాడు, ఆమె అన్నది..’ ఈ వాక్యాలు పలకడం అనవసరం అని నాకనిపిస్తుంది. ఉదాహరణకి – ‘2 B R 0 2 B'[2] కథలో – అలా ప్రతి చోటా – ఒక ఆడ గొంతుకా, ఒక మగ గొంతుకా మాట్లాడుకుంటూ ఉంటే, వాక్యం వాక్యానికీ’హీ సెడ్, షీ సెడ్’ అని నెరేటర్ పలికి పలికి – ఎంత చికాకు పుట్టించాడో చెప్పలేను. కానీ, ఒకే మనిషి కథ మొత్తం వినిపిస్తున్నప్పుడు మాత్రం – భిన్న వ్యక్తుల సంభాషణలు పలికేటప్పుడు – మధ్య పాజెస్ ఇవ్వడం, అలాగే, అవసరాన్ని బట్టి : ఎవరు మాట్లాడారో చెప్పడం చేయొచ్చేమో! (ఒక వేళ రచయిత ఆ ముక్క చెప్పినా, చెప్పకున్నా!)

రెండో పాయింటు: టెక్స్ట్ లో తేడా!

పైన చెప్పిన కారణానికి, కథలో ఉన్న పదాలు యధాతథంగా ఉండకుండా అక్కడక్కడా – ‘అతను అన్నాడు’ వంటి చిన్న వాక్యాలు కలిస్తే పర్వాలేదు కానీ పదాలు మారిపోతే కష్టం. ‘చెహోవ్’ కథ ‘ది మ్యాన్ ఇన్ ది కేస్’ [1] వింటున్నప్పుడు అలాంటిదే అనుభవం కలిగింది. ఆడియో వింటూ, మధ్యలో‌ఏదో సందేహం కలిగి కథ కోసం గూగుల్ చేస్తే, టెక్స్ట్ దొరికింది. ఆడియో లో ‘ఉక్రెయిన్’ అన్న చోటల్లా టెక్స్టులో – ‘లిటిల్ రష్యా’ అని ఉంది! అంతే కాక, కొన్ని కొన్ని వాక్యాలు చదివినదానికీ, విన్న దానికీ చాలా తేడాగా ఉన్నాయి. ఇది అనవసరం అనుకుంటాను. ఒకటీ అరా వాక్యాల్లో పదాలు మారినా, అది వినేవారి సౌలభ్యం కోసం, వారికి అర్థం కావడానికే కావాలి కానీ, ఇలా ఉండకూడదని నాకనిపిస్తుంది.

మూడో పాయింటు: వాయిస్ మాడ్యులేషన్

ఆడియో పుస్తకాల ఆయువు పట్టు ఇక్కడే అనిపిస్తుంది నాకు. విశ్వనాథ వారి కథా[3], శ్రీపాద వారి కథ[4] : ఆడియోలో అద్భుతంగా రావడానికి కారణం – పావని‌శాస్త్రి, కొత్తపాళీ గార్లే అని నాకనిపిస్తుంది. ఈ రెండు కథలూ – ఒక గొంతుకలోనే సాగుతాయి. ప్రధానంగా ఇవి రెండూ ఏకపాత్రాభినయం తరహాలోనే సాగాయనుకోండి, అది వేరే సంగతి. పుస్తకం చదువుతున్నప్పటి కథ వేరు. మనం మనసులో కథా భావోద్వేగాలకు తగినట్లు మన‌ ఆలో చనల్ని మాడ్యులేట్ చేసుకుంటాము. కానీ, వింటున్నప్పుడు, ఒకే టోన్ లో భావోద్వేగాలు లేకుండా సాగిపోయే కథనం అంత ఆకట్టుకోదేమో అనిపిస్తోంది. వాయిస్ ఓవర్ ఇచ్చేవారి ప్రతిభ అంతా అందులోనే ఉంది అనిపిస్తుంది నాకైతే.

నాలుగోపాయింటు:
ఒకరా? చాలా మందా? చాలా మంది చేస్తే – అది నాటకమైపోదూ? అన్న సందేహం కలిగింది నాకు.
అవును, సురసా.నెట్ వారి సైట్లో‌ ప్రతాప రుద్రీయం వినడానికీ, పది గొంతుకల్లో , సంభాషణలు నిండిన ఒక తెలుగు కథ వినడానికీ – పెద్ద తేడా ఉందేమిటీ?
ఒక విధంగా ఆలోచిస్తే: కథని బట్టి, కొన్నింటిలో భిన్న గొంతుకలు అవసరం కావొచ్చు – స్పష్టత కోసం. కొన్ని చదివితే అర్థమైనంతగా వింటే ఎక్కవు. వాటికోసం. పూర్వం రేడియో నాటకాలొచ్చేవి కదా (నేను అలా విన్నవి చాలా తక్కువ.. స్కూల్ రోజుల్లో,అప్పుడప్పుడూ వినేవాళ్ళమంతే. అసలిప్పుడు రేడియోలో వస్తున్నాయో లేదో‌కూడా తెలీదు) – అలాగే. అయితే, వీలైనంతవరకూ – ఒకే గొంతుకతో చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తోంది. ‘కోతికొమ్మచ్చి‘ లాగా కొన్ని ఛాప్టర్లు ఒకరు, కొన్ని ఇంకొకరు – ఇలా చేయడం కథలకి నప్పదేమో. కానీ, ఆ పుస్తకానికి బాగా నప్పవచ్చు.

అసలు ఆడియో పుస్తకాలెందుకు?
– భాష చదవడం రాని వారిని – చదవడం నేర్చుకుని చదువుకో పోవోయ్! అనేయడం కంటే, ఇలా ఆడియో పుస్తకాలు వినిపించి, నేర్చుకునేలా పురికొల్పవచ్చు.
– ఒక్కోసారి, టెక్స్ట్ కంటే ఆడియోనే ప్రభావవంతం కావొచ్చు (అది గొంతుకను బట్టీ, కథను బట్టి ఉంటుందనుకోండీ!!)
– ఎంచక్కా, డ్రైవ్ చేస్తూ వినొచ్చు. నాబోటి వారికి ఐతే,అదో వరం. నేను రోజుకి కనీసం రెండు గంటలు డ్రైవింగ్ లో ఉంటాను. లేదంటే, బస్సో ఏదో‌ఎక్కితే, కనీసం మూడు గంటలు నాన్-డ్రైవింగ్ ట్రావెల్ లో ఉంటాను. ఆ లెక్కన, ఇంటికెళ్ళేసరికి మరి చదూకోడానికి ఓపికుండదు. నా బోటి వారికి – ఆడియో పుస్తకాలు గొప్ప వరం.

నాకేమనిపిస్తుందంటే –
కానీ, ఎన్ని ఉపయోగాలున్నా, టెక్స్ట్ కి సరిసాటి కాలేవు . చదివేందుకు ఆప్షన్ లేకుంటే వినొచ్చు కానీ, వినడంతోనే చదివేయడం కష్టం.. నిజంగా అది మంచి కథే అయితే, నిజంగా ఆ రికార్డింగ్ బాగా చేయబడ్డదైతే, మనం అసలు కథ కోసం వెదుక్కుంటూ, టైం ని సృష్టించుకుని చదవడం ఖాయం – ఇప్పుడు కాకున్నా, ఏదో ఒక సమయంలో! ఆడియోలో ఆమాత్రం ప్రభావవంతం చేయగల గుణం ఉంది. రికార్డింగ్ విన్నాక – ‘అర్జంటుగా చదవాలి’ అనిపించాలి… లేకపోతే- ‘ఆ ఏవుంది లెద్దూ’ అనేసి అది పూర్తి చేయకుండానే ఆపేసి, మన పనిలో మనం మళ్ళీ పడాలి: అంతే! మధ్యే మార్గం లేదు. పోనీ: మధ్యే మార్గం ఉన్న పుస్తకాలైతే, రికార్డింగ్ వినడం కూడా దండగే! అందునా, అన్ని పుస్తకాలూ, అన్ని కథలూ – ఆడియో రికార్డింగుకు పనికిరావు – అని తేలింది ఈ విడత ఆడియో కథల అనుభవంలో!

ఈ వ్యాసం రాయించిన రికార్డింగులు:

[1]ఆంటోన్ చెహోవ్ కథ – ‘The man in a case’. (ఇక్కడ) [నేను విన్న ఆడియో ఇదో కాదో, అని అనుమానం!]
[2] కర్ట్ వొనిగాట్ కథ – ‘2 B R 0 2 B’ (ఇక్కడ)
[3]విశ్వనాథ పావనిశాస్త్రి గారు రికార్డు చేసిన విశ్వనాథ వారి కథ: ‘ఉరి’ (ఇక్కడ)
[4]కొత్తపాళీ గారు రికార్డు చేసి- శ్రీపాద వారి మార్గదర్శి (ఇక్కడ)
-నాలుక్కి నాలుగూ నాకు అర్జంటుగా టెక్స్ట్ లో చదవాలి – అనిపించేలా చేశాయి!About the Author(s)

అసూర్యంపశ్య16 Comments


 1. మరి కొన్ని రెండం ఆలోచనలు (ఇవ్వాళ్ళ నా పని అంతా రేండంగా ఉండేట్లు ఉంది!)
  వయోజనులకి ఇంగ్లీషు చదవడం మాట్లాడ్డం నేర్పించేందుకు వాలంటీర్ చేశానోసారి. శిక్షణాశిబిరంలో బోధించారు – నేర్చుకునే పద్ధతులు మూడు రకాలుగా ఉంటాయిట – చూసేది, వినేది, స్పర్శద్వారా తెలిసేది అని. నేను పూర్తిగా చూపుమీద ఆధార పడ్డవాణ్ణి. ఎవరింటికైనా వెళ్ళేందుకు దారి కనుక్కోడానికి ఫోన్ చేసి మాట్లాడితే, అది రాసుకోవాలి, ఇంకా వీలైతే, లెఫ్టు రైట్లన్నీ బొమ్మగా వేసుకోవాలి. కేవలం విన్నదాని ఆధారంగా గమ్య చేరప్రయత్నించినప్పుడల్లా సెల్‌ఫోనుల యుగంలో పుట్టినందుకు భగ్వంతుడికి నివాళులర్పించాను. మన “చదువు” డామినేట్ చేసే సంస్కృతిలో పెరిగిన పలుమంది అనుభవం అదే అని నాకనుమానం. ఏదైనా “చదివితే” గానీ మనకి తృప్తి కలగదు. ఒకరిద్దరు ఈ విషయం బాగా తెలిసిన మిత్రులు బలవంతపెట్టగా ఆడియో బుక్స్ ప్రయత్నించానుగానీ నాకు సఫలం కాలేదు.


 2. Audio పుస్తకాలు కంటి చూపు సరిగా లేని వారికీ, dyslexia లాంటి సమస్యలు ఉన్న వారికీ కూడా ఉపయోగపడతాయి అనుకుంటా.


 3. SIVARAMAPRASAD KAPPAGANTU

  @MAALATI GAAROO.

  REALLY! I DO NOT KNOW ABOUT THIS ETIQUETTE. I ALWAYS WRITE MY MAILS (INCLUDING IN THE OFFICE) IN CAPS WHICH I FIND EASY, BECAUSE I NEED NOT USE THE SHIFT KEY AGAIN AND AGAIN. I WRITE IN CAPS FOR MY CONVENIENCE AND IT IS NOT SYMBOLIC OF ANY OF MY INNER FEELINGS, KINDLY BE ASSURED.


 4. పోతే, ఆడియో పుస్తకాలవిషయంలో నీ పరిశీలన బాగుంది. నాక్కూడా అలాగే అనిపిస్తుంది. ఒక్కసారి కారులో ఒక నవల వినడానికి ప్రయత్నించేను కానీ నాకు సాధ్యం కాలేదు. కళ్లు గ్రహించినట్టు చెవులు గ్రహించవు అనిపించింది.


 5. ఎవరినీ తప్పు పట్టాలని కాదు కానీ, ఈమెయిళ్లలో ఒక మర్యాద – సాధారణంగా మెయిలంతా caps లో రాస్తే, చాలా కోపంగా అరుస్తున్నట్టు అర్థం. నిజానికి చదవడం కూడా కాస్త కష్టమే. పోతే ఇక్కడ అన్నది కూడా texting languageలాగే సర్వసాధారణమయిపోయిందనే అనుకుంటున్నాను. కాదా?


 6. ramnarsimha

  Your article is very nice.

  Congratulations.


 7. SIVARAMAPRASAD KAPPAGANTU

  @PUSTAKAM.NET

  Thank you very much for you courteous response.

  Regarding Audio Books I shall write a comprehensive article in my blog sometime during this year. I have been an avid listner of audio books for the last 4-5 years. I have been listening to various works of P. G. Wodehouse, Charles Dickens and Arthur Conan Doyle from British Library in Mumbai and Bangalore. The other day I could get an audio book of Mark Twain’s Tom Sawyer and with the same sources the other works of Mark Twain too are also available. Alas, we do not have any good audio books in Telugu for want of interest from the Listners. In fact there is no dearth for good readers for Audio Books,provided there are interested people to support this kind of art. I am just trying to trace the people who read classic Telugu Novels in Navala Sravanti in All India Radio, Hyderabad during 1980 thru 1982 If I remember correctly. I wish I knew them so that I can write about their excellent work some 3 decades back itself.


 8. పుస్తకం.నెట్

  @SIVARAMAPRASAD KAPPAGANTU: It was a slip.. not intentional error. In fact, it has been the norm. Anyway, we’d keep it in mind not to repeat it.

  @కొత్తపాళీ: It could have been better, but as it is, it wasn’t that bad too. 🙂


 9. @Asooryampasya:

  just to say that I agree with this view 🙂

  regards


 10. సౌమ్య

  @Ranjani garu: Thanks for referring to Maganti.org.
  I am feasting for the past 3,4 days 😛


 11. Asooryampasya

  @Sivaramaprasad garu: There is only one way any one can access the audio at ‘ikkada’ and that is by reaching your blog. I did not even link to the .mp3 directly. I just linked to your blog post. I did not even put the .mp3 here directly. I was infact directly guiding people to go to your blog to listen to the audio! I could have as well told – I listened to the audio somewhere, and I can’t provide the link right now! Or, I could have just downloaded the mp3 myself and put it here, without saying where I got it from.

  Well, I did not THANK you and others for providing them online – that is true. Linking to your blog is a very indirect way of acknowledging, which apparently does not deserve neither acknowledgement nor recognition from the linked. Perhaps, it was a mistake not to publicly thank you. But, certainly, its not as much a crime as it is potrayed to be..for heaven’s sake, I did not steal someone’s content! I was directly linking to where I heard it from!

  At any rate, thank you everyone for providing those audios on your blogs.

  Extremely sorry for the inconvenience caused by not acknowledging anyone!

  -Asooryampasya.


 12. శివప్రసాద్ గారు పైన చెప్పిన సూచన సరియైనదే. లంకె ఇచ్చిన దగ్గర కేవలం “ఇక్కడ” అని కాకుండ వారి బ్లాగు ఎడ్రసు ఇస్తే బాగుంటుంది.


 13. SIVARAMAPRASAD KAPPAGANTU

  INSTEAD OF SIMPLY GIVING A LINK “IKKADA” YOU COULD HAVE WRITTEN MY BLOG NAME. HAVING COLLECTED THE AUDIO AND KEPT, IT IN THE BLOG SO THAT MANY CAN HEAR, I HOPE DESERVES THE MINIMUM COURTESY OF WRITING THE BLOG WHERE YOU ARE GETTING IT.

  REGARDING AUDIO BOOKS, I AM QUITE HAPPY WITH SUCH AUDIO BOOKS WHICH ARE READ WITH GOOD DICTION. SOME AUDIO BOOKS ARE AVAILABLE IN NET LIKE BARISTAR PARVATISAM AND SOME ATTAGARI KATHALU, WHICH ARE HORRIBLE. IN TELUGU AUDIO BOOKS ARE YET TO MAKE AN ENTRY AND WE AWAIT GOOD AUDIO BOOKS.

  LONG LONG BACK IN ALL INDIA RADIO, HYDERABAD DURING 1980 I HEARD EXCELLENT RENDITION OF “CHADUVU” OF SHRI KODVATIGANTI KUTUMBARAO. I DO NOT WHO READ IT (MALE VOICE) IT WAS GREAT. AUDIO BOOK MEANS IT SHOULD BE THERE. UNFORTUNATELY, EVEN EX RADIO DIRECTORS ARE UNABLE TO TELL WHO THAT GENTLEMAN WAS. I READ SOMEWHERE THAT MADAM TURAGA JANAKI RANI MAY BE KNOWING. I SHOULD TRY TO CONTACT MADAM AND GET THE DETAILS TO WRITE ABOUT THAT GREAT MAN IN ALL INDIA RADIO.

  IF ANYBODY KNOWS ABOUT THAT GREAT VOICE IN AIR WHO READ “CHADUVU” I SHALL BE GRATEFUL IF THEY CAN WRITE ABOUT HIM WHO PIONEEREED 3 DECADES BACK THE AUDIO BOOK IN TELUGU.


 14. Srinivas

  చక్కగా చర్చించారు.
  నాక్యైతే ఒక్కరే చదవడం నచ్చుతుంది. ప్రతిభావంతులయితే ఎన్ని గొంతుకల్లో అయినా వైవిధ్యం చూపగలరు.


 15. Thank you. That is a big certificate.
  Your observations are very valid.
  ఆంగ్లంలో ఆడియో పుస్తకాలని మంచి రంగస్థల అనుభవం ఉన్న నటులతో చదివిస్తారు. పుస్తకంలో డయలాగులు వచ్చిన చోట ఆ చదివేవారు, గొంతుని మార్చకపోయినా, అక్కడ ఆ డయలాగులో ఉన్న టోన్‌ని మూడ్‌ని ప్రకటించడం విన్నాను నేను.


 16. రేడియో ప్రసారాల్లో అనుభవం ఉన్న కళాకారులు చదివితే
  పై రచనల రికార్డింగులు ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది..

  రేడియో కేంద్రాల్లో ఇప్పటికీ చక్కటి నాటకాలు, కథలు ప్రసారం అవుతున్నాయి.
  ఆకాశవాణిలోనే కాదు – బిబిసి, జపాన్ (NHK) వంటి విదేశీ రేడియో కేంద్రాల
  నుండీ నాటకాలు, రూపకాలు మొ|| వస్తున్నాయి

  కొన్ని ఆకాశవాణి కార్యక్రమాలని మాగంటి సైట్లో వినవచ్చును  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0