లూథియానాలో జాతీయ కవితాసమ్మేళనం

రాసిన వారు: ఇంద్రాణి పాలపర్తి
*************************************
నేను కవిత్వం రాసుకుంటాను ఏకాంతంలో.
రాస్తున్నప్పుడు అంతులేని ఆనందాన్ని పొందుతాను.
మంచి పదాలు దొరకనప్పుడు చిరాకు పడిపోతాను.
దొరికినప్పుడు ఎగ్గిరీ గంతేస్తాను.

అలా నాకో‍సం నేను కవితలు రాసుకుంటూ,కొట్టేసుకుంటూ,దిద్దుకుంటూ ఉండగా కేంద్ర సాహిత్య అకాడమీ వారినుండి పిలుపు వచ్ఛింది.విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూరు 150వ జయంతిని గుర్తు చేసుకుంటున్నామని,ఆ సందర్భంగా ఆగస్టు 13‍,14 తేదీలలో జాతీయ కవితా సమ్మేళనం,సెమినారు ఏర్పాటు చేస్తున్నామని, అందుకు తెలుగునించి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని.

తత్తర పడ్డాను.మా ఏడు నెలల పాపను తీసుకుని అంత దూరం వెళ్ళగలనా అని ఆలోచించాను.చివరకు,మిత్రుల ప్రోత్సాహంతో మా అమ్మ గారిని,మా పాపాయిని తీసుకుని విజయవాడ నుండి లూథియానాకు బయలు దేరాను.

13 సాయంకాలం కవితాసమ్మేళనం ప్రారంభమైనది.బెంగాలీ నుండి బిశ్వాస్ రాయ్ చౌదరి,హిందీ నుండి లీలాధర్ జగూరీ,సుశిల్ జైన్,కన్నడ నుండి మంజునాధ్ లత, త్రిపుర భాష కొక్బొరోక్ నుండి చంద్రకాంత్ మురా సింగ్,మరాఠీ నుండి అనుపమా ఉజ్గరే,పంజాబీ నుండి జస్వంత్ దీద్,వనిత,జస్వీందర్,నీతూ అరోరా,ఉర్దూ నుండి షీన్ కాఫ్ నిజామ్ వారి వారి కవితలను వినిపించారు.ముందు వారి మాతృభాషలో తరువాత హిందీ/ఇంగ్లీషులో అనువాదాలు వినిపించారు.

వీరిలో పద్మశ్రీలున్నారుట,భాషా సమ్మాన్లున్నారుట.

నేనక్కడ చదివి వినిపించిన కవితలివి:
1.వానకు తడిసిన పువ్వొకటి
2.ఏదో ఒక ఇసుక రేణువు
3.కవితా జననం
తరువాత వీటికి దెసెట్టి కేశవ రావు గారు చేసిన ఇంగ్లీషు అనువాదాలు చదివాను.
అప్పటికే వారు కేటాయించిన పది నిమిషాల సమయం అయిపోయిందేమోనని వేదిక దిగి వచ్ఛేసాను,ముందుగా అనుకున్న మరొక కవిత చదవకుండా ఒదిలేసి.

అది ఇదీ: నువ్వు,నేనూ హవాయీలో

మరుసటి రోజు సెమినారు జరిగింది.
పంజాబీల ఆతిథ్యాన్ని అందుకొని,ఆదరణను పొంది తిరుగు ప్రయాణమయ్యాం విజయవాడకు.
ఆసక్తి ఉంటే పై కవితలన్నీ ఇక్కడ చదువుకోవచ్ఛును:

You Might Also Like

Leave a Reply