కారా మాష్టారు రచనలు

కారా రచనలుకారా మాష్టారు,

కథలను ఇష్టంగా కష్టపడి చెక్కేవారు,

విరసంతో సరసం, విరసం నెరపినవారు,

ఆత్మాభిమానం, అంతరాత్మ సాక్షిగలవారు,

అంతర్ముఖులు, కథాముఖులు,

కథా నిలయమనే కల కని సాకారం చేస్తున్నోరు,

లక్షలాది తెలుగు కథలు చదివినవారు,

లక్షణాలు – తెలుగు కథకు చెప్ప చూసినవారు,

కుర్ర కారుతో కథలు చెప్పించినవారు,

గండరగండడు, ఉద్దండుడు

సీకాకులం చిన్నోడు,

లోగుట్టు తెలిసి తెలిపిన యజ్ఞ పెరుమాలుడు

తెలుగు జాతి పుణ్య ఫలం,

తెలుగు తల్లి స్వేదం తుడిచిన వారు,

కారామాష్టారు.

ఒక రచయిత జీవిత కాలం మొత్తం చేసిన సాహితీ మధనం మొత్తం ఇలా 500 పుటల్లో చదవటం బాగుంది.

కథ పేరు నేను వ్రాసుకున్న నోట్స్
అన్నెమ్మ నాయకురాలు బాగుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు, కొన్ని కొత్త ప్రశ్నలు.
రక్కసి బలుపు ఆగడం (కవిత) బాగుంది.
కుట్ర బాగోలేదు, బోరింగ్. రాజకీయ వ్యాసంలా ఉంది, కథలా లేదు.
జీవధార బాగానే ఉంది, కాని ఏదో అసంతృప్తి.
చావు బాగుంది. ప్రధాన విషయం బాగుంది, కాని అదే విషయం చెప్పటానికైతే ఇంత పొడుగు కథ అవసరం లేదు, కాకుంటే శైలి బాగుండుట వల్ల పొడుగు కూడా స్వీట్ గా ఉంది.
శాంతి ఓ.కే
భయం అర్థం కాలేదు.
ఆర్తి శైలి బాగుంది. చివరి దాకా చదవనిచ్చింది, కాని ముగింపు అర్థం కాలేదు.
స్నేహం ఓ.కే
ఆదివారం బాగోలేదు. సంభాషణలు తేలిపొయ్యాయి, మగోడు వ్రాసిన ఆడ సంభాషణలు అని అర్థం అవుతోంది.
యజ్ఞం ఇంకా చదవలేదు, తరువాత తీరిక చేసుకోని చదవాలి. కాని రివ్యాలు చాలా చదివాను దాంతో అసలు కథ చదవాలంటే మూడ్ రావటం లేదు.
అప్రజ్ఞాతం కాంప్లెక్స్ వన్
   

గత పది శతాబ్దాలుగా తెలుగు జాతి సృష్టించుకుంటూ వస్తున్న సాహిత్యాన్ని గమనానికి తీసుకోండి. మనం ఏం చేస్తూ వచ్చామో ఏం చేయడం లేదో తెలుస్తుంది.

సాహితీ క్షేత్రంలో ఏనాడో స్థిరపడ్డ రచయతలు కూడా యీనాడు చేస్తున్న రచనలు చూస్తే తెలుగు జాతికి వెన్నెముక ఎప్పటికీ ఏర్పడదేమో అన్న దిగులు వేస్తుంది.

– ఒక ఇంటర్వ్యూలో కారా మాష్టారు.

కథా ప్రియులు, కథా రచనా ప్రియులు, కథా రచనాభిలాషులు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.

You Might Also Like

12 Comments

  1. chavakiran

    ఈ పుస్తకం ఇప్పుడు కినిగెపై డిజిటల్ రూపంలో లభిస్తుంది. లింకు – http://kinige.com/kbook.php?id=223

  2. kcube

    kutra kathapai mee abhipraayamto vibhedistu. panchavarsha pranaalikalu, Nehru policy pai adi o astram. anta vivaranga appatlone vachchina maro katha ledu. ippatiki anta manchi political story raaledanukunta.

    yagnam kathapai kottapaalee gaari suchana aamodayogyam.

  3. కాళీపట్నం రామారావు రచనలు – చావా కిరణ్

    […] పుస్తకం.నెట్లో నేను వ్రాసిన వ్యాసం లింకు ఇక్కడ http://pustakam.net/?p=5119 […]

  4. shankarvoleti

    Sri Kara mastaru gari – “aaru saraa kathalu” – meeru chadavaleda

    1. సౌమ్య

      @Shankarvoleti: అవి రాసింది రావిశాస్త్రి గారు.

  5. chavakiran

    @మాలతి: ఆ ఇంటర్వ్యూలో అందరిని సున్నితంగా ఏకారు లేండి, నేను పై రెండు లైన్లు మాత్రమే టైప్ చేశాను (నాకు నచ్చి 🙂 )

  6. మాలతి

    @ చావా కిరణ్, కొత్తపాళీ, సరే. ఇప్పుడు అర్థమయింది. కానీ ఒక్క రచయితలనే అనడం ఎందుకండీ. రచయితలు ఏమాత్రం మూసకి దూరం అయినా పత్రికాసంపాదకులూ, పీర్ గ్రూపులూ, కొందరు పాఠకులు కూడా ఊరుకోరు కదా. ఏమోలెండి, రామారావుగారు వీటన్నిటినీ కలిపి మొత్తంగా అన్నారేమో, కిరణ్ చెప్పినట్టు. థాంక్స్.

  7. కొత్తపాళీ

    కిరణ్, గుడ్ షో.
    యజ్ఞం గురించి ఒక్క మాట. చదివిన రివ్యూలన్నీ మరిచిపోండి. మీకు మీరు కథ చదవండి అంతే.

    మాలతి, ఒరిజినాలిటీ ఒక్కటే అనే కాదు. తెలుగు కథారచయితలు అనేక అపోహల్లో బంధించబడి ఉన్నారు.

  8. chavakiran

    చిత్తశుద్దితో చెయ్యటం లేదని కాదు, వారి ఉద్దేశ్యం ఒరిజినాలిటీ ఉంటల్లేదని, అంతా కాపీ మయంగా ఉందని. తెలుగు జాతి ఇంత పెద్దది కదా, సాస్కృతికంగా, రాజకీయంగా, జనాభా పరంగా, చారిత్రికంగా కానీ సాహిత్యం మొత్తం కాపీ సాహిత్యంలా ఉంది అని వారి బాధ.

  9. మాలతి

    మీరు రాసుకున్న నోట్సుతో చాలామటుకు నేను ఏకీభవిస్తాను. అన్నీ కదానుకోండి. కానీ ఒక సందేహం.
    చివరలో @ సాహితీ క్షేత్రంలో ఏనాడో స్థిరపడ్డ రచయితలు కూడా యీనాడు చేస్తున్న రచనలు చూస్తే తెలుగు జాతికి వెన్నెముక ఎప్పటికీ ఏర్పడదేమో అన్న దిగులు వేస్తుంది – (కారా మాష్టారు)నాకు అర్థం కాలేదు. అంటే చిత్తశుద్ధితో రచనలు చేయడం లేదనా? నిజంగా అర్థం కాకే అడుగుతున్నాను.

  10. hanu

    nenu tappakumDaa chaduvutaanu

Leave a Reply