తెలుగులో ముప్పై ప్రముఖ పుస్తకాలు – నా ఎంపిక

నా ఎంపిక ఇది. నేనో సామాన్య పాఠకుడినే అని అనుకుంటున్నాను. ఇందులో చదవనివి కూడా ఉన్నాయి. అయితే వాటి రెఫరెన్సులు ఇతర పుస్తకాలలో చూడటం, అదే రచయిత మిగిలిన పుస్తకాలను చదవటం ద్వారా ఇందులో చోటు కల్పించటం జరిగింది.

కవితాసంకలనాలు, నవలలు, వ్యాసాలు, జీవితచరిత్రలు, కథల సంపుటాలు, 19,20 శతాబ్దాల రచనలు – ఇవి పరిగణనలో తీసుకొన్నవి.

కావ్యాలు, అనువాద రచనలు, రామాయణ, భారత, పురాణాది రచనల ఆధారితాలు – ఇవి విస్మరించినవి.

ఈ లిస్టులో లోపాలను సహృదయంతో మన్నిస్తారని ఆశిస్తాను.

1. సమగ్రాంధ్రసాహిత్యం – ఆరుద్ర  (ఓ వ్యక్తి జీవితకాలం శ్రమ ఈ పుస్తకాల సంపుటి.ఆ వ్యక్తి పద్యాలు వ్రాసి ఉంటే ఓ గొప్పకవి అయిఉండే వాడు. సినీపాటలు వ్రాస్తూ గడిపి ఉంటే కొన్ని వేలపాటలు రాసి ఉండేవాడు. కానీ ఆయన తన జీవితాన్ని ఈ రచనకు అంకితం చేశారు. అవును, తెలుగు సాహిత్యం మీద మరెన్నో రచనలు వచ్చి ఉండవచ్చు గాక, ఇంత సమగ్రంగా, వ్యావహారిక భాషలో తెలుగు గురించి, ఆనాటి నుండి ఈ నాటి వరకు తెనుగును పరిపుష్టం చేసిన కవులను గురించి ఇంత హృదయంగమంగా వ్రాయటం ఆరుద్రకే చెల్లింది. అందుకు ఆయనదే అగ్రపీఠం.)
2. వేయిపడగలు – విశ్వనాథ సత్యనారాయణ
3. కన్యాశుల్కం – గురజాడఆప్పారావు
4. మహాప్రస్థానం – శ్రీశ్రీ
5. అమృతం కురిసిన రాత్రి – తిలక్
5. అనుభవాలు-జ్ఞాపకాలు – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
6. విశ్వదర్శనం – నండూరి రామమోహన రావు
7. సాక్షి వ్యాసాలు – పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు
8. బారిష్టరు పార్వతీశం – మొక్కపాటి నరసింహ శాస్త్రి
9. ఎంకి – నండూరి సుబ్బారావు గారు
10. కొల్లాయి గట్టితేనేమి? – మహీధర రామ్మోహనరావు గారు
11. హంపి నుండి హరప్పా దాక – తిరుమల రామచంద్ర
12. మల్లాది రామకృష్ణశాస్త్రి గారి కథలు
13. మైదానం – చలం
14. రామాయణ విషవృక్షం – రంగనాయకమ్మ
15. గాలివాన – పాలగుమ్మిపద్మరాజు కథల సంపుటం
16. చివరకు మిగిలేది – బుచ్చిబాబు
17. అసమర్థుని జీవితయాత్ర – గోపీచంద్
18. నారాయణరావు – అడవి బాపిరాజు
19. చెంఘిజ్ ఖాన్ – తెన్నేటి
20. నామిని – సినబ్బకథలు, పచ్చనాకు సాక్షిగా వగైరా..
21. మధురాంతకం రాజారాం కథలు
22. కాలాతీత వ్యక్తులు – శ్రీదేవి
23. అమరావతి కథలు
24. శ్రీరమణ – మిథునం
25. కోతి-కొమ్మచ్చి – బాపు, రమణ
26. ఇట్లు మీ విధేయుడు – భరాగో
27. సెక్రెటరీ – యద్ధనపూడి సులోచనారాణి
28. చక్రవాకం – కోడూరి కౌసల్యాదేవి
29. అనుక్షణికం – వడ్డెర చండీదాస్
30. అల్పజీవి – రావిశాస్త్రి

You Might Also Like

19 Comments

  1. Dr. Acharya phaneendra

    రవి గారు!
    చాలా చక్కని గ్రంథాలను ఏరి కూర్చారు. కాని, కావ్యాలను పూర్తిగా విస్మరిస్తే ఎలా ? కనీసం ఆధునిక దృష్టితో వ్రాసిన కొన్ని కలపవచ్చేమో ఆలోచించండి. వచన గ్రంథాల్లో కూడ మరికొన్ని కలపాలేమో ! నాకు తోచిన మరో 15 గ్రంథాలివి.
    1) ఆంధ్రుల సాంఘిక చరిత్ర : సురవరం ప్రతాపరెడ్డి
    2) ఆంధ్ర సంస్థానములు – సాహిత్య పోషణ : తూమాటి దొణప్ప
    3) ఆంధ్ర పురాణము : మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
    4) ఆధునికాంధ్ర సాహిత్యము – సంప్రదాయములు, ప్రయోగములు : సి.నా.రె.
    5) గబ్బిలం/ ఫిరదౌసి : జాషువ
    6) అగ్ని ధార/ రుద్ర వీణ/ గాలిబు గీతాలు : దాశరథి కృష్ణమాచార్యులు
    7) కృష్ణ పక్షం/ ప్రవాసం/ ఊర్వశి : కృష్ణ శాస్త్రి
    8) కొయ్య గుర్రం : నగ్నముని
    9) అత్తగారి కథలు : భానుమతి
    10) చిల్లర దేవుళ్ళు / జీవన యానం : దాశరథి రంగాచార్య
    11) ఉదయశ్రీ : కరుణశ్రీ
    12) కర్పూర వసంత రాయలు/ విశ్వంభర : సి.నా.రె.
    13) గణపతి : చిలకమర్తి
    14) చింతామణి : కాళ్ళకూరి
    15) మాలపల్లి : ఉన్నవ లక్ష్మీనారాయణ
    ఇంకా నేను కొన్ని మరచి ఉండవచ్చు. మరెవరైనా అందుకొని మరో 5 సూచిస్తే – 50 గ్రంథాలతో సమగ్రమయిన జాబితా తయారవుతుందని భావిస్తున్నాను. may be … ( I am not sure )
    16) తులసీదళం : యండమూరి
    17) ఆత్రేయ నాటికలు
    18) శేషేంద్ర మినీ కవితలు
    19) ?
    20) ?

  2. chinnari

    అబ్బ! అన్నీ అద్భుతమయిన పుస్తకాలు.గొప్ప పుస్తకాలన్నిటిని కోట్ చేయడమంటే మాటలా! నేను చాలా హ్యాపి .ఎందుకంటే నాలుగు తప్ప అన్నీచదవగలిగాను.మధురాన్తకమ్ వారి కధలు పూతరేకులే.గొప్ప కథకులు.అమరావతి కథలు.అబ్బబ్బబ్బ కొత్త ఆవకాయ అన్నమే.యండమూరి వారినీ కలపాలి తప్పనిసరిగా. కోతికొమ్మచ్చి నవ్వుల హరివిల్లు .రసరంజితం. హంపి నుండి హరప్ప దాకా అద్భుత ఆత్మావలోకనమ్.మనం సామాన్యులం. నన్రిషీ ఖూౠతె కావ్యం.ఆ రిషులందరకు నమస్సులు!

  3. రవి

    @Raj గారు:
    “కావ్యాలు, అనువాద రచనలు, రామాయణ, భారత, పురాణాది రచనల ఆధారితాలు – ఇవి విస్మరించినవి”

    ఆ వాక్యం వెనుక నా ఉద్దేశ్యం ఇది. “రామాయణం” అంటే – రాముని ప్రయాణం. రాముని జీవనగమనం, అందులో ఆయన ధర్మం ఎలా పాటించాడు, మూర్తీభవించిన ధర్మమూర్తి ఎలా అయ్యాడు – ఇది రామాయణం. మూల కావ్యానికి వ్యాఖ్యానంగానో, మూల ఆదర్శాన్ని ప్రతిబింబిస్తూనో అనేక కావ్యాలు వచ్చాయి (రంగనాథ రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, రామాయణ కల్పవృక్షం వగైరా). ఆ స్ఫూర్తికి కట్టుబడినవి నేను పరిగణనలో తీసుకోలేదు. ఎంచేతనంటే వాటి సంఖ్య పెద్దది, పైగా కావ్యాలంటూ మొదలెడితే, అనేక ఇతర కావ్యాలు వచ్చి చేరతాయి.

    విషవృక్షం – మూలకావ్య స్ఫూర్తితో వ్రాసినది కాదు. రామాయణం అనువాదం చదివి, ఆమె గతితార్కిక భౌతిక వాదం గురించి చెప్పడానికి రాసినది. అందులో ముఖ్యంగా గ్రహించవలసిందీ అదీ. లేదూ మీరు చెప్పే “లాజిక్” మాత్రమే కరెక్ట్ అంటే – టపాలోనే రచయిత పొరబాట్ల గురించిన డిస్క్లైమర్ ఉన్నది అది చదువుకోగలరు.

    ఆరుద్ర గారు కూడా “సీత రామునికి ఏమవుతుంది?” అని ఒక పుస్తకం రాశారు. ఈ లిస్టు నూరుకు పెంచితే బహుశా అందులో ఆ పుస్తకమూ చేరి ఉండేది.

    ఆ కారణాల చేత విషవృక్షాన్ని ఈ లిస్టులో చేర్చడం జరిగింది.

  4. raj

    @రవి గారు,
    నేను కొంచెం దుడుకుగా అడిగినా ఓర్పుగా సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు…మిమ్మల్ని నొప్పిస్తే మన్నించండి…అది ఎలాటి పుస్తకమైనా కావచ్చండీ…అది ఎలాటి విషయాలనైనా చెప్పుండవచ్చు, కానీ రామాయణాన్ని ఆధారం చేసుకుని రాసిందే కదా!అందువల్ల మీరు తీసుకున్న వర్గీకరణ ప్రమాణాల ప్రకారం,లిస్టులో ఉండకూడదనే కదా! ఇక్కడ నేను పూర్తిగా లాజికల్ గా ఆలోచించి చెప్తున్నానే కాని,ఎటువంటి ఉద్దేశ్యాలనీ రచయితకి ఆపాదించాలని నా అభిమతం కాదు..మీరు అన్యధా భావిస్తే మన్నించ ప్రార్థన..but still i am strong at my point…hope u will understand and make necessary corrections in the list….

  5. రవి

    @చావాకిరణ్ : :-). నా మనసులో మాట చెప్పారు. అందులో మొదటి పొజిషను మాత్రం “బంజాయ్” నవల.

  6. chavakiran

    ఇంత లిస్ట్ అవసరమా, మధుబాబు వ్రాసిన నవలల్లో ఓ ముప్పై ఎంచుకోక. 🙂

  7. సుజాత

    వావ్,మొదటిది చివరిది తప్ప అన్నీ చదివేశా(\మొదటిది పది పడగలు చదివాక భయమేసి ఆపేశా) చాలా వరకూ నా దగ్గర ఉన్నాయి కూడా!

  8. రవి

    @raj గారు: మీరు విషవృక్షం గురించి చెబుతున్నారనుకుంటాను. ఈ పుస్తకం గతితార్కిక భౌతికవాదం గురించి చెబుతున్నదని అందరికీ తెలిసిన విషయం. అప్పట్లో ప్రాచుర్యం పొందిన పుస్తకాలలో ఇదొకటి. రామాయణం మీద గౌరవం వీడకుండానే ఆమె చెబుతున్న విషయం గ్రహించవచ్చు.

    ఈ లిస్టు కేవలం కొన్ని పుస్తకాలను, రచయితలను సూచించడానికి తప్ప, ఇవే పుస్తకాలను చదవమనో, లేక ఒక రచయిత(త్రి) గొప్పదనాన్ని ఉద్దేశ్యపూర్వకంగా వర్ణించడానికో ఎంచుకున్న వేదిక కాదు. దయచేసి అనవసర ఉద్దేశ్యాలు రచయిత మీద ఆపాదించి, అనుమానించకండి.

  9. raj

    రవి గారూ..
    నా మాట అస్సలు పట్టించుకున్నట్టు లేరు…..

    “కావ్యాలు, అనువాద రచనలు, రామాయణ, భారత, పురాణాది రచనల ఆధారితాలు – ఇవి విస్మరించినవి.”

    మరి టపాలో ఈ లైను తొలగిస్తే బాగుంటుందేమో…

  10. రవి

    @వంశీ గారు: బాగా చెప్పారు. ఏం చేస్తాం చెప్పండి. బ్లాగుల్లో రాతలకే డిస్క్లైమర్లు పెట్టుకు రాయవలసిన పరిస్థితులు. ఇక పబ్లిక్ ఫోరంలో నచ్చినవి రాసుకుని అయ్యా! నీనూ మీవాణ్ణే అని చెప్పుకోకపోతే, రాతలెలా ఉన్నా కోల్పోయేది మాత్రం సహృదయులైన మిత్రులనే కదా! అభిప్రాయాలకంటే మనుషులే కదండీ ముఖ్యం. (అలాగని అందరినీ తృప్తిపర్చడం కుదరదనుకోండి) అదీ సంగతి.అందుకే మధ్యస్థంగా ఓ రెండు డిస్క్లైమర్లు.

    @కొత్తపాళీ గారు: నాలుగు సార్లు మార్చిన లిస్టులో రెండు పాయింట్లే దొరికాయంటే గొప్పసంగతే. ఇదిగోండి, మీరున్న అమెరికాకు వినబడేలా భుజం చరుచుకుంటున్నాను.

  11. మాగంటి వంశీ

    లిష్టు చంద్రుడిలా బానే ఉంది, వెన్నెలనీ, అందులోని అందాన్నీ ఆస్వాదించాం – అనుభవించాం. మధ్యలో పుడకలా “సామాన్య పాఠకుడినే” “లోపాలను సహృదయంతో మన్నిస్తారని” – ఈ మచ్చలేమిటి? మీకు నచ్చినవి మీరు రాసుకున్నారు, అది నచ్చేసి పుస్తకం వాళ్ళు అచ్చేసారు. మధ్యలో ఎవరో మన్నించటం ఎందుకు? మిమ్మల్ని మీరు సామాన్య పాఠకుడనుకోవటం ఎందుకు ?

    ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనకు నచ్చింది కాబట్టి “రంభే” – అందులోనూ పుస్తకాలతోనూ , వాటి లిష్టులతోనూ రాజీ ఉండకూడదని పరమపిత చెప్పగా త్రికరణశుద్ధిగా ఫాలో ఐపోతూ మన పుస్తక త్రిశంకులో మనం తిరుగుతూండటమే! ఇంకోరెవరికన్నా మన (త్రి)శంకులోకి రావాలని బుద్ధి పుడితే వాళ్ళ లిష్టు తీసుకుని వాళ్ళొస్తారు. కాబట్టి…అదండీ సంగతి…

    ఇలాగన్నాని మనిషి సంఘ జీవి అనీ, ఇంకోటనీ, పక్కనున్నోడిని నొప్పించకూడదనీ…..ఇలా ఓ లిష్టేసుకుని వచ్చేరు…చేసే పని చెడ్డదీ, చెరిచేదీ కాక మంచి పని (నిర్వచనమేమిటో మీకు తెలుసు!) చాలున్ననీ, అదన్నీ ఇదన్నీ నేను ఇంకో లిష్టేసుకోవాల్సుంటుంది …

    విప్పటికి వింతే
    వుంటాను..
    వంశీ

    1. Purnima

      @మాగంటి వంశీ: రవిగారు అన్న సామాన్య పాఠకుడి సంగతేమోగాని, మీ వ్యాఖ్యలు, వాటి అర్థాలు, అంతరార్థాలూ చదివీచదవగానే అర్థంకాని నాబోటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సామాన్యపాఠకులని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మీరు రాసింది తెలుగులోనే అయినా, నాకెందుకు తికమకగా ఉంటుందో ఏంటో?! అబ్బే.. మాకు చేతకాకపోవడం వల్లనేనండి.

      “హేవిటో.. వెధవది, చచ్చేవరకూ బతకటం తప్పటం లేద”న్నంత భారీ స్థాయిలో ఆపసోపాలు పడుతూ పుస్తక త్రిశంకులో తిరుగుతూండటమెందుకండీ?! హాయిగా, అలా బయటకెళ్ళి స్వేచ్ఛావాయువులు పీల్చుకోండి చెప్తాను.. ఏ లిష్టుల గోలా లేకుండా! ’సంఘజీవీ.. మై ఫుట్’ అని మీరే అనేసారు గనుక, “ఐ, మీ, మైసెల్ఫ్” అనుకుంటూ అయిన్ రాండ్ పుస్తకాలు చదూకోండి.. హాయిగానూ!

  12. కొత్తపాళీ

    good list.

    నా వుద్దేశంలో బారిస్టర్ పార్వతీశం, అల్పజీవి అనవసరం.

  13. రవి

    నచకి గారు, సవరించబడింది.

  14. raj

    బాగుంది మీ లిస్టు….కానీ మీ అనుసరణ ప్రకారం ఈ లిస్టులోంచి తొలిగించాల్సిన ఓ గొప్ప్ప పుస్తకం ఉంది….
    రామాయణ,భారతాలను గురించి రాసినవి పరిగణనలోకి తీసుకోనన్నారుగా మరి…..అర్థమై ఉంటుందనుకుంటాను ఆ ‘మహా’గ్రంథమేంటో….దయచేసి దాన్ని తొలగించి(othrwise change ur norms n make a new list again), ఆ మహానుభావురాలి మీద మీకు అంత అభిమానం ఉంటే,ఆమె రాసిన మరో గొప్పపుస్తకమేదన్నా ఉంటే పెట్టుకోండి…

  15. NaChaKi

    #8. Barrister Parwateesam – The author’s name is Mokkapati Narasimha Sastri. (Chilakamarthi is another famous writer, famous for his comedy writeups, one of the popular among those being “Ganapathi”.)

    @pAlana: meeru PaLaNa gaarEnaa? 🙂 elaa unnaaru? bahukaaladarSanam!

  16. రవి

    @pAlana: ఇంత చిన్న టపా రాసినప్పుడే ఓ చిన్న తప్పు దొర్లింది. వేయి సంవత్సరాల తెలుగు సాహిత్యాన్ని, సాహిత్యకారులని గురించి రాసేప్పుడు తప్పులు దొర్లటం సహజం. చరిత్రకు సంబంధించిన తప్పులని సమన్వయలోపంగా మాత్రమే గుర్తించాలి. సమగ్రాంధ్రసాహిత్యంలో అవి కూడా ఎంతవరకూ ఉన్నాయనేది అనుమానమే.

    పోతన, తిక్కన అంటే కూడా ఎవరో తెలియని రోజులివి. ఈ రోజుల్లో ఈ పుస్తకం ఇతర నవలా సాహిత్యం కన్నా, కవితా సంకలనాలకన్నా ముఖ్యంగా ప్రతి ఇంటా ఉండాలని నా అభిప్రాయం. నా అభిప్రాయానికి అనుగుణంగా ఆరుద్రగారికి అగ్రపీఠమే. నా అభిప్రాయం మార్చటం కన్నా, మీరూ మీ అభిప్రాయాలను సాధికారంగా ప్రకటిస్తూ ఓ లిస్టు ప్రకటిస్తే బావుంటుంది.

  17. pAlana

    Choosing Arudra’s Samgrandhra Sahityam is a mistake.
    Actually, it is a big tragedy that Arudra attempted to “compile” that and called it “Samgrandrasahityam”. That is full of errors, blunders, and it is trash. It has so many factual errors and historical mistakes. This has to be triaged or revised thoroughly.
    This should be removed from your list.
    –pAlana

  18. సౌమ్య

    మీ లిస్టు లో నేను చదివినవి సగమే..వా :((
    మంచి జాబితా అందించారు – ధన్యవాదాలు.
    అయితే, ఎందుకు ఫలానా పుస్తకం ఈ జాబితాలో పెడుతున్నారు? అన్నది కూడా చెబితే బాగుండేదేమో?

Leave a Reply