కిండిల్ మంచి చెడూ

కిండిల్ అమెజాన్ వారి ఈ బుక్ రీడర్.

ముందుగా ఒక పిట్ట కథ. వెనకటికి మా ఊర్లో ఒక ధనవంతుల ఉమ్మడి కుటుంబం. వారి ఇంట్లో నాలుగైదు ఇసుర్రాయిలుండేవి. ఒకటి కంది పప్పు ఇసరటానికి, మరొకటి ఇడ్లీ రవ్వ ఇసరటానికి, మరోటి మరోదానికి, ఇలా విపరీతమైన స్పెషలైజేషన్ ఉండేది. ధనం మూలం ఇదం స్పెషలైజేషన్ కదా. ఆ తరువాత వారు వేర్లు పడ్డారు, ఒక్కొక చిన్న కుటుంబానికి ఒక ఇసుర్రాయి వెళ్లింది, ఆశ్చర్యంగా అన్ని పనులూ అన్ని ఇసుర్రాయిలూ చెయ్యగలిగాయి. 🙂

ఫోన్లో మాట్లాడటానికి ఒక తెర, కంప్యూటర్ ఇంట్లో ఒక తెర, తిరిగితే వాడే కంప్యూటర్ అనే అంకోపరి తెర, ఆఫీస్లో ఒక తెర, ఇలా పలు తెరలు మన జీవితాల చుట్టూ పెనవేసుకోని పొయ్యాయి. అటువంటిదే మరో తెర. ఈ బుక్ రీడర్. పుస్తకరి అనవచ్చేమో.

మంచి
తెరకు వాడిన సాంకేతికం వల్ల ఎంత సేపు చదివినా కళ్లు మండవు. అచ్చు పుస్తకం పై చదివినట్టే ఉంటుంది. పీడీయఫ్లు కాపీ చేసుకోవచ్చు. పీడీయఫ్లు కూడా జూం చేసుకోవచ్చు. తెలుగు పీడీయఫ్లు కూడా పని చేస్తున్నాయి. ప్రాజెక్ట్ గూటన్ బర్గ్ నుండి పుస్తకాలు కాపీ చేసుకోవచ్చు. పుస్తకాలను ఈ పుస్తకరి చదివి కూడా వినిపిస్తుంది. ప్రస్తుతానికి తెలుగు చదవలేదనుకోండి. అన్నిటికంటే నాకు నచ్చిన ఫీచర్ నిఘంటువు, ఏదన్నా పదం అర్థం తెలీకపోతే అక్కడికక్కడే కర్సర్ కదిలించటం ద్వారా చూడవచ్చు. వేరే ఎక్కడికో వెళ్లక్కరలేదు. ఇంకో అద్ఫుతమైన ఫీచర్ ఎంత ఎండలోనయినా చదువుకోవచ్చు. బావి గట్టుపైన, చెరువు గట్టుపైన, చెట్టు క్రింద, పుట్ట పక్కన, బస్సులో, కారులో, రైలులో ఎక్కడైనా మామూలు పుస్తకం చదివినట్టు చదువుకోవచ్చు. వాడటం కూడా సులభం. ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. చిన్న అక్షరాలు అని ఇహ పుస్తకాలు పక్కన పడెయ్యక్కర్లేదు. ముఖ్యంగా సైట్ సరిగ్గా లేని వారికి, వృద్దులకు వరం. ఏ డైరక్షన్లో అయినా పెట్టి చదువుకోవచ్చు. ఆటేమోటిగ్గా అడ్జస్ట్ అవుతుంది. వైర్లెస్ కనక్షన్ కోసం నెల నెలా బిల్లు కట్టక్కర్లేదు. ఇంకా బ్యాటరీ లైఫ్ వైర్లెస్ ఆఫ్ చేస్తే చాలా సేపు వస్తుంది. అంటే ఒక నాలుగైదు రోజులు అదే పనిగా చదువుకోవచ్చు.

చెడు
ధర – అబోబో చాలా కాస్ట్లీ.
అమెరిగా చుట్టూ ఉంటుంది. – ఇంకా ఇండియాకు కస్టమైజ్ చెయ్యలేదు, అందుకని పత్రికలు, మాగజైన్లు అన్నీ అమెరికా చుట్టూ ఉంటాయి.
చీకట్లో మామూలు అంకోపరిలా చదవలేము. లైట్ వేసుకోవాలసిందే. అంటే మనం మామూలు పుస్తకం చదివినట్టు అన్న మాట.
పుస్తకాల అందుబాటు – అమెజాన్ వాడు భూమిపై పెద్ద కొట్టు అని చెప్పుకోవటమే గాని కిండిల్కు పెద్దగా పుస్తకాలు అందుబాటులో లేవు. నేను ఐదారు పుస్తకాలు కొందాం అని చూస్తే అవి కేవలం ప్రింట్ పుస్తకాలుగానే లభిస్తున్నాయి వాడి దగ్గర. ఇంకా టెక్నికల్ మాగజైన్లు ఏమీ లేవు. నేను కిండిల్ కొనంగనే చూసినది వాటి కోసమే. సాంకేతిక పుస్తకాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. పుస్తకాల లభ్యత విషయంలో వాడింగా కిలోమీటర్ల కొద్దీ వెళ్లాలి.
చివరగా మీరు ఒక పుస్తకాల పురుగు అయి ఉంటే, మీరు చిత్తు కాగితాలు, పొట్లం కాగితాలు కూడా చదివే వారైతే, మీకు ధర సమస్య కాకుంటే దీన్ని కొనుక్కోవచ్చు.

You Might Also Like

13 Comments

  1. varaprasaad.k

    కిరణ్ గారు ఆరంభం అదిరింది ఇసుర్రాయి ప్రయోగంతో.,మీ పోలిక అదుర్స్,

  2. krishna mohan kandula

    కిన్డిల్ కన్నా sony trs t3 అయితే బెస్ట్. అందులో అయితే pdf కూడా బ్రహ్మాండంగా వాడువోకోవచ్చు. తెలుగు బ్రహ్మాండం. నేను కినిగి నుంచి డౌన్లోడ్ చేసిన పుస్తకాలు హాయిగా చదవ గలుగు తున్నాను. ఫేస్ బుక్ కి కూడా కామెంట్స్ ఈజీ గా పోస్ట్ చెయ్యొచ్చు. కాని కిన్డిల్ లో లాగ పైదీపం (front light ) కాదు. నేను cell light తో చదువుతాను.

  3. పారదర్శి

    కినిగె.కాం లో ఉన్న పుస్తకాలను (అడొబీ డిజిటల్ రైట్స్ నియంత్రణలో ఉన్నవి) ఈ Calibre అనే సాఫ్ట్‌వేర్ తో కిండిల్ లో చదువుకునేలా మార్చుకోవచ్చునా?

    1. dvenkat

      తెలియదు. ప్రయత్నించండి.

    2. సౌమ్య

      @C.B.Rao: Its not possible. Kinige’s books are DRM Protected, as far as I know. So, even if you try doing it, Calibre can’t convert (is my guess).

  4. dvenkat

    కిండిల్ గురించి ఇంకో చిన్న వివరణ. … calibre అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొంటే ఎలాంటి ఫార్మాట్ లో వున్నా డాక్యుమెంట్ నైనా కిండిల్ కి అనుగుణంగా మార్చుకోవచ్చు. అలాగే పుస్తకాతురాణాం నభయం న లజ్జ అనుకొంటే వందల పుస్తకాలు టొరెంట్ లో దొరుకుతాయి. తెలుగు పుస్తకాలు పిడిఎఫ్ నుండి కిండిల్ అనుగుణంగా మార్చుకోవచ్చు.

  5. తాడేపల్లి

    రీడర్ కి సరైన తెలుగుమాట వాచకం.

  6. chavakiran

    @leo: ఎక్కడన్నా పీడీయఫ్లు దొరికితే కాపీ చేసుకోవటమే. ప్రత్యేకంగా కిండిల్ కోసం తెలుగు పుస్తకాలు నాకయితే తారసపడలేదు.

  7. leo

    కేవలం తెలుగు పుస్తకాలు చదవటానికి కిండిల్ కొనవచ్చునా? కిండిల్ లో చదవటానికి తెలుగు పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి?

  8. Purnima

    Short and sweet :)Both the variants of Kindle are now $100 lesser than their original prices. And DX model is soon to be available in Graphite colour.

    I’ll get hands on my kindle within a day or two. Would like to write an experience post after sometime.

  9. chavakiran

    @cbrao: కిండిల్ వైర్లెస్ – ఇది అమెజాన్ కి కనక్ట్ అవ్వటానికి, వాడి దగ్గర పుస్తకాలు కొనుక్కోవటానికి. ఇంకా వికీపీడియా చదువుకోవచ్చు. ఇంకా కొన్ని సైట్లు కూడా చూసుకోవచ్చు, కాని నేను వాడలేదు. వేగులు పంపలేము అనుకుంటాను.

    కిండిల్ లో నేను టచ్ చెయ్యని సౌకర్యాలు చాలా ఉండవచ్చు. ఇంకెవరన్నా వ్రాయాలి ఆ వ్యాసాన్ని. 🙂

  10. cbrao

    కిండిల్ -వైర్లెస్: ఈ సదుపాయం అంతర్జాలానికా? ఆపిల్ ఐపాడ్ లా కిండిల్ లో ఇ-మైల్స్ పంపుకోవచ్చా? కిండిల్ లో మీరు వ్రాయని సదుపాయాలు (features) ఇంకా ఏమున్నాయి?

  11. సౌమ్య

    బాగుంది.
    ఎవరన్నా కిండిల్ గురించి రాస్తారేమో అని చూస్తూ ఉన్నా ఇన్నాళ్ళూ! 🙂

Leave a Reply to తాడేపల్లి Cancel