మా నాన్నగారు

రాసిన వారు: తృష్ణ
**********

మొక్కపాటి నరసింహశాస్త్రి
గుర్రం జాషువా
అడివి బాపిరాజు
భమిడిపాటి కామేశ్వరరావు
దేవులపల్లి కృష్ణశాస్త్రి
త్రిపురనేని గోపీచంద్
కొడవటిగంటి కుటుంబరావు
జంధ్యాల పాపయ్యశాస్త్రి
బాలగంగాధర తిలక్
రావిశాస్త్రి
ఉషశ్రీ
పురాణం సుబ్రహ్మణ్యశర్మ
మధురాంతకం రాజారాం

-వీరందరూ….గొప్ప సాహితివేత్తలు. వీరే కాక మొత్తం కీర్తిశేషులైన మరో అరవై రెండు మంది సాహితీవేత్తల రచనల తాలూకూ విశేషాలు కాకుండా వారందరి జీవిత విశేషాలు, జీవన విధానాల గురించి వారి వారి పుత్రులు,పుత్రికలూ తెలియచేస్తే..? అదొక అద్భుతమైన, చదివి తీరాల్సిన పుస్తకమౌతుంది.

తెలుగు సాహిత్యంలో “అమ్మ” ను గురించి ఎన్నో పుస్తకాలు వచ్చాయి. వాటిల్లో నామిని గారి “అమ్మకు జేజే” అమ్మను గురించిన ఒక గొప్ప సంకలనమైతే, ద్వా.నా.శాస్త్రి గారి “మా నాన్నగారు” నాన్నను గురించిన మరొక గొప్ప సంకలనం. ఆంద్రభూమి “సాహితి”లో 25వారాలపాటు, 25సాహితీవేత్తల గురించి రాసిన తరువాత ఆ శీర్షిక ఆగిపోయింది. మిత్రుల సహాయంతో నలభై దాకా సాహితీవేత్తల జీవిత విశేషాలను సేకరించారుట శాస్త్రిగారు. కానీ విశాలాంధ్ర రాజేశ్వరరావు గారి ప్రోత్సాహంతో అరవైరెండు మందికి పైగా కీర్తిశేషుల జ్నాపకాలను సేకరించిన తరువాత “మా నాన్నగారు” పుస్తకరూపమైందని, తన వయసు కూడా అరవై రెండవటం విశేషం అనీ ద్వా.నా.శాస్త్రిగారు ‘ముందుమాట’లో చెబుతారు.

ప్రతి వ్యక్తికీ “అమ్మ” ప్రథమ గురువు అయితే, “నాన్న” రోల్ మోడల్. నాన్నలాగ అవ్వాలనీ, నాన్నలాగ ఉండాలనీ కోరుకోని కొడుకు ఉండడు. ఈ పుస్తకంలో ప్రచురితమైన అరవైరెండు మంది “నాన్నగార్లూ” సాహితీవేత్తలుగా కాక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులుగా, విశిష్ఠ వ్యక్తులుగా మనకు నూతనంగా కనిపిస్తారు. వారి వారి జీవన విధానాలూ, పద్ధతులూ, వ్యక్తిత్వాలూ మనల్ను ఆకర్షిస్తాయి. ఇటువంటి ఒక సంకలనాన్ని మనకు అందించిన ద్వా.నా.శాస్త్రిగారికి మనం ఎంతైనా ఋణపడిపోయామనిపిస్తుంది ఈ పుస్తకం చదువుతుంటే.

ఇంతకంటే ఈ పుస్తకం గురించిన మరే వర్ణన కానీ, పుస్తకంలోని విశేషాలను కానీ నేను రాయదలుచుకోలేదు. ఎందుకంటే ఈ పుస్తకాన్ని తెలుగు సాహిత్యం పట్ల మక్కువ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తీ కొనుక్కుని తీరాలన్నది నా అభిప్రాయం. మూడు వారాల క్రితం ’ఆంధ్రజ్యోతి’ ఆదివారం అనుబంధంలో ఈ పుస్తకాన్ని గురించి చదివింది మొదలు ఈ పుస్తకాన్ని కొనాలని ఉవ్విళ్ళూరాను. క్రితం వారం కొని చదివిన తరువాత సాహిత్యాభిమానులందరి ఇంటా ఉండదగ్గ పుస్తకం ఇదని అర్ధమైంది. ఫలితమే ఈ పరిచయం. అట్ట మీది బాపూగారి బొమ్మ పుస్తకానికి అదనపు ఆకర్షణ. మీరూ తప్పక కొంటారు కదూ…

ఈ పుస్తకం విశాలాంధ్రవారి అన్ని బ్రాంచీలలోనూ లభిస్తోంది. వెల:Rs.400/-

You Might Also Like

10 Comments

  1. vinaychakravarthi

    400 laaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

  2. Som

    శాస్త్రి గారికి వచ్చిన ఆలోచన నిజంగా హర్షించదగినది. ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదములు.

  3. మధురవాణి

    Interesting! Will surely buy it. Thanks for the post! 🙂

  4. ఉష

    ఆ అరవై రెండు మంది సాహితీవేత్తలకీ, ద్వా.నా.శాస్త్రిగారికి ధన్యవాదాలు. ఇకపోతే,

    >> నాన్నలాగ అవ్వాలనీ, నాన్నలాగ ఉండాలనీ కోరుకోని కొడుకు ఉండడు.

    ఇది మాత్రం నేను అంగీకరించలేను. అంగీకరించిన వరకు కొడుకుకి పరిమితం చేయలేను. నేను నాన్న కూతుర్ని. అచ్చంగా ఆయన తీరులు వచ్చినదాన్ని. మా అబ్బాయి ముమ్మూర్తులా నేనే. కనుక మావి క్రాస్ రోల్ మోడల్స్. ఒక్క ఔట్ లయ్యర్ అని తీసిపారేస్తే సరేకాని. కానీ, మా బోటి నాన్నకూతుర్లు, అమ్మకొడుకుల దాడికి మీరు సిద్దం కావాలి.

  5. భావన

    నాకు ఈ పుస్తకం వుందనే తెలియదు. మంచి పుస్తకం పరిచయం చేసేరు తృష్ణ. నైస్. థ్యాంక్స్.

  6. raana

    ద్వా.నా.శాస్త్రి గారి “మా నాన్నగారు”
    >> ఈ పుస్తకం విశాలాంధ్రవారి అన్ని బ్రాంచీలలోనూ లభిస్తోంది. వెల:Rs.400/-

    How do they price the book ?

    I’m not sure about the costs involved,
    but i sure feel Rs 400/-is too expensive.
    And that too when most people avoid buying at the pretext of expense
    (It is a different matter that the same people may not mind
    blowing out at eateries etc)

  7. చైతన్య

    మీ నాన్నగారి గురించేమైనా రాశారేమో అనుకున్నా

  8. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

    మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు.కృతజ్ఞతలు

  9. ramanarsimha

    @SHASTRI

    U R GREAT SIR..

Leave a Reply to G Cancel