పుస్తకం
All about booksపుస్తకభాష

June 16, 2010

వేయిపడగలు – శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

రాసినవారు: టి.శ్రీవల్లీ రాధిక
***************
పాతికేళ్ళ క్రితం చదివినపుడు ఈ పుస్తకం చాలా నచ్చడం.. దాని గురించి స్నేహితురాళ్ళతో పదేపదే చెప్పడం లీలగా గుర్తుంది. అయితే ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ చదువ తలపెట్టినపుడు అదే ఉత్సుకతతోనూ, వేగంతోనూ చదవగలనని అనుకోలేదు. ఆశ్చర్యకరంగా వేయిపేజీల ఈ పుస్తకాన్ని నాలుగురోజులలో పూర్తి చేయడమే కాదు చదువుతున్నపుడు, చదివాక కూడా గొప్ప సంతృప్తిని పొందాను.

ఈ పుస్తకంలో రచయిత ఎన్నో విషయాలు చర్చించారు. కళలు, ఆచారాలు, సంప్రదాయాలు, కులాలు, మతాలు,విద్యా విధానాలూ, వైద్యం, తాత్వికత – వీటన్నిటి గురించీ ఆయన చేసిన వ్యాఖ్యలూ,విమర్శలూ ఆ అభిప్రాయాలు నచ్చని వారికి తిరోగమనమనిపించవచ్చు. మార్పుని ఒప్పుకోలేకపోవడమనిపించవచ్చు. కానీ రచయిత మంగమ్మ అనే పాత్ర ద్వారా చెప్పించిన ఈ క్రింది వాక్యాన్ని అర్ధం చేసుకుంటే ఆ అపోహలన్నీ తొలగిపోతాయి.

“.. సంఘములో కానీ, మతములో కాని, మరొకదానిలో కాని, మీరెన్ని మార్పులైన తేవచ్చును. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, తద్వారా భక్తియో, జ్ఞానమో కలుగుటకు వీలుండెనేని మీరు తెచ్చిన మార్పు శిరోగ్రాహ్యము. “

– ఈ వాక్యం రచయిత భావాలనీ, ఈ పుస్తకాన్నీ అర్ధం చేసుకోవడానికే కాదు మనజీవితంలో ఎదురయే మార్పులని అర్ధం చేసుకోవడానికీ, అంగీకరించడానికీ కూడా ఉపయోగించుకోగల మంచి సాధనం అనిపించిపింది నాకు.

36 అధ్యాయాలున్న ఈ నవలలో మొదటి మూడు, నాలుగు అధ్యాయాలు చదివేసరికే అన్ని పాత్రలపట్లా ఆసక్తి కలుగుతుంది. ఇక అయిదో అధ్యాయంలో ధర్మారావు, గిరికల మధ్య జరిగే ఈ క్రింది సంభాషణ చదివేసరికి ఆ పాత్రల పట్ల ఆకర్షణ కొండలా పెరుగుతుంది.

……
ధర్మా : భక్తియోగులకు కృష్ణస్వామి సులభుడు. జ్ఞానయోగులకు శివుడు సేవనీయుడు.
గిరిక : సేవనీయుడందువేమి? సులభుడు కాదా!
ధర్మ : తల్లీ, జ్ఞానయోగము సులభము కాదు.

నిజానికి నవలలో ఈ సంభాషణని ప్రవేశపెట్టిన తీరే చాలా గొప్పగా వుంది. నేరుగా ధర్మారావు, గిరిక మాట్లాడుకుంటున్నట్లుగా చదవము మనమీమాటలని. అంతకుముందు రెండు పేజీలలో రుక్మిణమ్మారావుగారి వ్యక్తిత్వాన్ని వర్ణించి, ఆవిడ ఆకర్షణలో మనల్ని ముంచి, ఆ తర్వాత ఆవిడతో పాటు మనల్ని గుడికి తీసుకువెళ్ళి అక్కడ…ఆవిడని అబ్బురపరిచే విధంగా ధర్మారావు, గిరికల మధ్య ఈ సంభాషణ వినిపిస్తారు రచయిత. వాళ్ళు మాట్లాడుకుంటుంటే రుక్మిణమ్మారావుగారు వింటారు. ఆవిడతో పాటు మనమూ వింటాం. గిరిక వివేచనాశక్తికి రాణిగారు అబ్బురపడినట్లే మనమూ అబ్బురపడతాం.

సంభాషణలని ఎంచుకున్న తీరూ, వాటిని కథలో ప్రవేశపెట్టిన తీరు, వాటిద్వారా పాత్రలని చిత్రించిన తీరూ.. చాలా బాగున్నాయి. ఉదాహరణకి ఇందులో హీరో ధర్మారావు చాలా విషయాలు చెప్తుంటాడు. అతని చుట్టూ వున్నవారూ, స్నేహితులూ .. అతనితో విభేదించేవాళ్ళూ కూడా వాటిని గౌరవంగానే వింటూ వుంటారు. అయితే ఇది అసహజంగా అనిపించకపోవడానికి కారణం .. తాను మాట్లాడే విషయం పట్ల ధర్మారావుకి వున్న స్పష్టత. ఆ స్పష్టతని కూడా మనకి చాలా నేర్పుగా తెలియచెప్తారు రచయిత.

ధర్మారావు మాటలని ప్రశంసిస్తూ తొలిపరిచయంలో అతని సవతి అన్న రామచంద్రరాజు ‘చక్కగా మాటాడితివి. ఎట్లయినను చదువుకొన్న దారి వేరు.’ అంటాడు, ధర్మారావు బాగా మాట్లాడడాన్ని అతని బి.ఏ చదువుకు ఆపాదిస్తూ.

ఆ ప్రశంసకి బదులుగా, ‘ఇంగ్లీషు చదువుకొనుట వలన కాదు నేనిట్లు మాటాడునది.” ఆన్న సమాధానం సూటిగా వస్తుంది ధర్మారావు నుంచి.

ఇష్టం లేకుండా చదివిన చదువుల పట్లా, అనాసక్తితో సాధించిన ప్రతిభల పట్ల కూడా మనుషులకి మోహమూ, గర్వమూ వుండడం మనం సాధారణంగా చూసే విషయం. అందుకు అతీతంగా వున్న ధర్మారావు వ్యక్తిత్వాన్ని ఈ చిన్ని సంభాషణ సమర్ధవంతంగా చూపిస్తుంది.

సంభాషణలే కాదు.. రచయిత వ్యాఖ్యలు కూడా చాలా చోట్ల పదిపేజీల భావాల్ని ఒకటి రెండు చిన్న వాక్యాలలో చెప్పేస్తాయి.

జమీందారు రంగారావు, మొదటిభార్య చనిపోయాక లండన్ నుంచి శశిని (సుసానీ) అనే దొరసానిని భార్యగా తెచ్చుకుంటాడు. ఆ అధ్యాయం ఈ క్రింది వాక్యాలతో ముగుస్తుంది.

…శశిని వచ్చినది.! రంగారావుకు భార్యయే. భార్యయా? కోటకు రాణియా? హరప్పకు తల్లియా? స్వామికి ఏకాదశులుండునా?

-దాదాపుగా అన్ని అధ్యాయాలూ ఇలా ఒక ఆలోచనాత్మకమయిన వ్యాఖ్యతోనో, చలోక్తి తోనో ముగుస్తాయి.

ఇక ఎన్నో తాత్విక విషయాలు కథలో అలవోకగా కలిసిపోయి కనిపిస్తాయి.

* “..ప్రతివ్యక్తియందును సృష్టిలోనున్న సర్వశబ్దము బీజరూపమున సన్నిహితమై వుండును. తచ్చబ్దానుభవ మతని సూక్ష్మ శరీరికి కలదు. కాని స్థూలశరీరికి లేదు. సంగీతము వినుచుండు తన్మయత్వ స్థితిలో మనమందరమాసూక్ష్మ శరీరికి దగ్గరగా వుండి, అతడెరిగిన సర్వశబ్దానుభవము పొందుచుందుము. అందుకనియే ఆనందము పొదుచుందుము. ఆనందము ఆ సూక్ష్మశరీరి లక్షణములలోనొకటి.”
* “ఆత్మలో భేదము లేదు. జీవునిలో భేదమున్నది. …. … అట్లే ఆత్మ భిన్నోపాధిగతమై భిన్నత్వము తెచ్చుకొనుచున్నది. తదుపాధిగత గుణదోష సంక్రాంతి చేత జీవుడు భిన్నుడగుచున్నాడు.”

ఒకవైపు యిలాంటి తాత్వికమయిన విషయాలు నవలలో ఇమిడిన తీరు అద్భుతంగా తోస్తే, మరోపక్క లోకరీతిని గురించిన, ఉద్యోగాలు .. అధికారులను గురించిన కొన్ని వ్యాఖ్యలు “ఎంత నిజం!” అనిపించాయి.

* అన్నిమతములకు అదొకరీతిగా ముడిపెట్టుట, అన్ని మతములందును యాదార్ధ్యమున్నదనుట, ఎచ్చట మంచి యున్నదో అచ్చట గ్రహించవలయుననుట , దేనియందును నిశ్చయ జ్ఞానములేక “ఇతో భ్రష్ట స్తతో భ్రష్ట:” యగుట – బ్రతుకుతెరువునకు ముఖ్యధర్మము.
* ……ఒక కచేరీలో ఒక గుమాస్తా ఒక తప్పు చేసెననుకొందము. ఆపైని గల అధికారి యా తప్పులను సర్ది “నాయనా! ఇట్లు చేయరాదు!” అని దిద్దినచో ఆ దోషమంతటితోనే యంతరించును. …

నవలలో ఎక్కువ భాగం అభిప్రాయాలు, వ్యాఖ్యలూ ధర్మారావు పాత్ర ద్వారానే చెప్పబడ్డాయి. అయితే అంత మాత్రం చేత ధర్మారావు పాత్ర మిగతా పాత్రలని డామినేట్ చేసినట్లు కనబడదు. నిజానికి ఈ నవలలో నాకు గొప్పగా అనిపించిన విషయాలలో ఇది కూడా ఒకటి. రచయిత ధర్మారావు ఆలోచనలలో వున్న స్పష్టతని చూపారే తప్ప ధర్మారావు వ్యక్తిత్వం మిగతా వారి వ్యక్తిత్వం కంటే ఉన్నతమయినదని చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇది ఒకరకంగా రచయిత ఆత్మకథ అనీ, ధర్మారావు పాత్ర ఆయనదేనని విన్నపుడు ఈ గౌరవం మరింత పెరుగుతోంది. తాను చేస్తున్న రచనలో తన పాత్రని మహోన్నతంగా చూపించే బలహీనత లేకపోవడం గొప్ప విషయం కదా!

చాలా విషయాలమీద ధర్మారావు వ్యాఖ్యానాలు చేస్తాడు. లలితకళలన్నిటి గురించీ ఎన్నో అభిప్రాయాలూ, ఆసక్తికరమయిన విషయాలూ చెప్తాడు. అభినయంలో వున్న భేదాలు, ఆహార్యంలో, పాత్రపోషణలో తీసుకోవలసిన జాగ్రత్తలూ, పతాక మొదలయిన ముద్రలు, వాటి విశిష్టత. సాహిత్యం విషయానికొస్తే… ఒకచోట పింగళి సూరన కవిత్వాన్నీ, రామలింగడి కవిత్వాన్నీ పోల్చి చూసి వ్యాఖ్యానిస్తే, మరో చోట ఆముక్తమాల్యదలోని సొగసు గురించీ, ఇంకొక చోట ప్రభంధాలనెలా అర్ధం చేసుకోవాలన్న విషయాన్ని గురించీ….కథాచమత్కారము అంటే ఏమిటన్న విషయం గురించీ – ఇలా ఎన్నో విషయాలు.

అలాంటి వ్యాఖ్యల్లో కొన్ని ఎక్కువమందికి అసంబద్ధంగా అనిపించేవీ, విమర్శకు గురయ్యేవీ కూడా వున్నాయి. ఉదాహరణకి ధర్మారావు “భోగముదానికిచ్చిన డబ్బు మోటారుకొన్నదానికన్న చెడిపోయినదా!” అనుకుంటాడోచోట. ఆలోంచించినకోద్దీ లోతు కనిపించిందీ వ్యాఖ్యలో. రెండూ అలవాటు లేనివాళ్ళకి రెండూ ఒకటేనని అనిపించడం సమంజసమే కదా! అయితే ఇంత బాహాటంగా ఈ అభిప్రాయాన్ని ధర్మారావు ఆలోచనల ద్వారా మనకి చెప్పిన రచయిత.. ఈ ఆలోచన తర్వాత ధర్మారావు ” ఇంటిలో పండుకొని అనుకొనుచున్నాను గనుక సరిపోయినది” అనుకున్నట్లు వ్రాయడం చూస్తే రచయిత గడసరితనానికి ముచ్చటేసింది.

తాత్వికతా, లోకరీతే కాదు, శృంగారమూ, భార్యాభర్తల మధ్య అనురాగమూ కూడా అద్భుతంగా వర్ణింపబడ్డాయి ఈనవలలో. భార్య చనిపోయేముందు ఆమె చీరలున్న పెట్టె తెచ్చేందుకు ధర్మారావు ఆమె పుట్టింటికి వెళ్ళిన సన్నివేశం చదువుతుంటే గుండె బరువెక్కుతుంది.

ఇలాంటి కొన్ని సన్నివేశాలు, భావాలు చాలా సున్నితంగా రచించారు. కిరీటి (ధర్మారావు స్నేహితుడు) తన తల్లి మరణం తర్వాత తన బాధను ధర్మారావుకి చెప్పుకుంటూ
“.. దేవాలయములోనికి పోయితిని. సాయంకాలమగుట చేత స్త్రీపురుషులు దేవాలయములోనికి ప్రవాహముగా వచ్చుచు పోవుచుండిరి. తల్లిపోయినవాడని నన్నొక్కరాదరించలేదు. సర్వజీవలోకము నాయందంత నిర్దయమేలయైనదో!” అంటాడు. అది చదివితే ఒక సంఘటనకి మనసు ఎలాస్పందిస్తుందనే విషయాన్ని ఈ రచయిత ఎంత సున్నితంగా, సునిశితంగా గమనించారో కదా! అనిపించింది.

ఫక్కున నవ్వు తెప్పించే చలోక్తులూ కోకొల్లలు ఈ నవలలో. ధర్మారావు బయటకు వెళ్ళబోతూ భార్యతో “మధ్యాహ్నపుపూట కొంచెము ఫలహారమైనను పెట్టవుగదా!” అంటాడు. వెంటనే అరుంధతి “నేడు ప్రొద్దుపోయినగాని రారా ఏమిటి?” అంటుంది.
ఆ ప్రశ్న విని ధర్మారావు “ఈనాటి కవులకు ఈమాత్రమైనను ధ్వని తెలియదు ” అంటాడు.

మరోచోట రామచంద్రరావనే ఆయన “డాక్టరు పరీక్ష చదువుటకు ఇంగ్లండు పోవుచున్నాను” అంటాడు. “ఎందులో డాక్టరు” అంటే “తెలుగు పరొశోధనాశాఖలో” అంటాడు.
దానికి కుమారస్వామి “తెలుగు పరిశోధనకింగ్లాండు పోవుచున్నారా? టిబెట్టు పోరాదా?” అని స్పందిస్తాడు.

ఇంకా ఈ నవలలో కొన్ని పోలికలు, ఉపమానాలు కూడా నాకు బాగా నచ్చాయి. ఉదాహరణకి ఒకటి.

ఒక సంప్రదాయము చచ్చిపోవుచు, చావులో కూడ దాని లక్షణమైన మహౌదార్యశ్రీనే ప్రకటించును. మరియొక సంప్రదాయము తాను నూత్నాభ్యుదయము పొందుచు, అభ్యుదయములో కూడా దాని లక్షణమైన వెలతెలపోవుటయే ప్రకటించును. వేసగినాటి అస్తమయము కూడ తేజోవంతమే. దుర్దినములలోని యుదయము కూడ మేఘాచ్చాదితమే.

ఏ రచన చదివినా లోపాలను ముందు పసిగట్టడం, ఆ గోలలో పడి ఇక రచనలోని సొగసును ఆనందించలేకపోవడం నా బలహీనత. కానీ ఈనవల నాకా అవకాశాన్నీ, బాధనీ కలిగించలేదు. ఈ నవలలో నేను పట్టుకోగలిగింది ఒకేఒక్క పొరపాటు.

శ్రావణశుద్ధ ఏకాదశినాడు రుక్మిణమ్మారావుగారు ఉపవాసముండడం, ధర్మారావుని పిలిచి భాగవతం చదివించుకోవడం .. ఆ తర్వాత రెండ్రోజులకి ధర్మారావు తన కార్యానికి లగ్నం పెట్టించుకోవడం.., పదిరోజుల తర్వాత కుదిరిన ఆ లగ్నం “శ్రావణశుద్ధ దశమి” అవడం – ఇదొక్కటే నేను కనిపెట్టిన పొరపాటు ఈ నవలలో.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.34 Comments


 1. varaprasaad.k

  ఓ మహాత్మా ఓ మహర్షి, ఏది సత్యం ఏదసత్యం,ఏది నీది ఏది నాది, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఎన్నెన్నో సమీక్షలు చదివి, విని ,బుర్ర బద్దలు కొట్టుకున్నా అవగాహన అయింది గోరంత,అర్ధం చేసుకోవాల్సింది కొండంత.వేయి పడగలు విశ్వరూపం,ఒక్క పడగను దర్శించినా ధన్యులము.సహస్ర ఫన్ గా హిందీలోకి అనువదించిన స్వర్గీయ పి.వీ. నరసింహారావు గారు అన్న మాట ఇది.ఆయనకంటే గొప్పగా విశ్వనాధ వారిని అర్ధం చేసు కోవటం మనలాంటి అల్పులకు సాధ్యమా.


 2. దయచేసి ఈ పుస్తకాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పండి.నాకు కూడా చదవాలని ఉంది .


 3. siddhunaath kiran

  వేయి పడగలు పుస్తకం చదవాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. మీ సమీక్ష వలన కొంత అవగాహన
  వచ్చింది. రచనాశైలిని అందుకోగాలనో లేదోనని భయం ఉండేది. పోతన ఆంధ్రుల పుణ్యఫలము అని విశ్వనాథవారు అన్నారు. విశ్వనాథవారు కూడా ఆంధ్రుల పుణ్యఫలమే అని నేనంటున్నాను.


  • dev

   ఏ మాట చెప్పిన మీరు కూడా ఆంధ్రుల పుణ్యఫలేమేనండోయ్…ఆ ఆ


 4. raghunand kotike

  రాధిక గారి సమీక్ష కు abhinandanalu. సమీక్ష వ్రాసే వారి భావాలు వారికి విషయం పట్ల వున్నా లోతును మరియు వారి హ్రిదయ సౌందర్యాని కూడా తెలియ jesthayi. అటువంటి వారు వ్రాస్తేనే సమీక్క్ష కు viluva. అంతే కానీ సమీక్ష చేసే స్థాయి లేనివారు రాధిక గారి సమీక్ష లాంటి వాటిని చదివి ఆననదిచితే సాహిత్య సేవ chesinatle.


 5. gangarapu usharani. madanapalli

  sree valli gaaru mee sameeksha chala baagundi. ee puathakam nenu 30 years munde okasari chadivanu. mallee 5 years mundu chadivanu. Nenu madanapalle rachayithala sangham sabhyu ralini. naaku eppatnundo sameeksha cheyalanundedi . ipudu nenu sameeksha chesthunnanu. mee sameeksha naku upayogapaduthondi.


 6. kavithavsr

  రాధిక గారు
  మీరు ఎంచిన తప్పు నాకూ అనిపించింది. బహుశః శ్రావణ బహుళ దశమి ఐతే సుమారుగా సరిపోతుంది. ఏమయినా ప్రమాదో ధీమతా మపి అనుకోవాలి!


 7. sandeep

  ఎవరైనా ఇ పుస్తకం ఎక్కడ దొరుకుతదో చెప్పగలరా దయ చేసి.


  • Shashank Anumandla

   ప్లీజ్ ఫాలో ది లింక్:

   http://kinige.com/book/వేయిపడగలు


  • Shashank Anumandla

   సారీ ఇత్స్ నాట్ అవైలబ్ల్లె నౌ.


  • sailaja

   NAVODAYA book house koti, hyderabad


  • తాతారావు...

   ప్రముఖ పుస్తక విక్రేతల వద్ద దొరుకుతుంది.లేకపోతే నెట్ లో చదవండి..వైజాగ్ లో Book Centre లో ట్రై చేయండి.దీనిని మొదటిసారి 1966 లో మా వూరి హైస్కూలు లైబ్రరీలో చదివాను.ఆ తదుపరి నాలుగు,ఐదు సార్లు చదివాను.1960/70 దశకాల్లో ఆంధ్రపత్రిక దినపత్రికలో సీరియల్ గా ప్రచురించారని గుర్తు.గత సంవత్సరంలో నెట్ లో సుమారు 196 పేజీలు చదివాను.ఇది తెలుగువారి అమూల్యమైన సొత్తు. ……తాతారావు.


 8. Murthy Kavali

  రాదిక గారు చాలా బాగా రాసారు, మీ సమీక్ష చూసాక ఈ పుస్తకం చదవాలి అని నిర్ణయం తీసుకున్నాను.
  మీ ప్రేరణ కు గాను ధన్యవాదములు.


  • Rajashekar

   నాకు కూడా బాగా నచ్చిందండి. నేను కూడా చదవాలని నిర్నైన్చుకున్నాను. ఇన్ని రోజులు చదవాలి అని అనుకోవడమే ఉంది కానీ ఎప్పుడు అంత ఆకర్షణ కలగలేదు. కానీ రాధిక గారి సమీక్ష చదివాక చదివి తీరాల్సిందే అని అన్పిస్తుంది ఇప్పుడు. కానీ దాని ధర గురించి నా భయం అంత. నేను కొనగలిగే ధరల లభిస్తుందా అని చిన్న సంకోచం.


 9. Pavan

  ఈ పుస్తకం డౌన్లోడ్ ఎక్కడ చేసుకోవచు


  • Ravi Kumar,zpss sambaigudem

   ఈ పుస్తకం చాలా బాగా నచ్చింది,నా కున్న సందేశం ఇందులో చాలానే వుడేది,కానీ ఈ పుస్తకం ద్వారా చాలా సందేశాలు తిరైనవి.


 10. gsskiran

  శ్రీవల్లీ రాధిక, చాలా మంచి సమీక్ష వ్రాశారు. దయచేసి వేయి పడగలు పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొనే అవకాశం కల్పించాలి.


 11. AcharyaKVS

  మంచి వ్యాసం. విశ్వనాథ వారు అతి తక్కువ సమయం లో పోటి కోసం వ్రాసిన (వారు చెబుతుండగా
  వారి సోదరుడు లిఖించిన) నవల, ఎన్నో విషయాలను కలుపుకుంటూ మహా ప్రవాహ సద్రుశంగా సాగి,
  నే టికీ జీవనది లాగ తెలుగు పాఠకుల తృష్ణ ను తీరుస్తుండడము గొప్ప విషయము.

  రాధిక గారిని అభినందిస్తూ మరింత విపుల సమీక్ష ను అందించాలని అభ్యర్థిస్తున్నాను.చదువరులకు ముఖ్యంగా యువతకు మీ సమీక్ష బాగా ఉపయోగపడుతూ పూర్తి నవలను చదివే ఆసక్తిని ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నాను..


 12. Halley

  రాధిక గారూ, చక్కని సమీక్ష . . ఏదో వెతుక్కుంటూ గూగుల్ నుంచి ఇక్కడకి వచ్చి పడ్డాను .


 13. N.Phani kumar

  I heard somany times about this book, but i am unable to read it, how can i get on line please advise.


 14. naku e book name vinagane chala intrestng ga anipinchindi.chadavalianipinchindi.munduga book gurinchi search cheyalani search chesa.daniki sambammdnchna vishayalu,alane aa pusthakam gurchi meerandaru chepthunte m soooooooooooo intrresting.so nenu kooda chaduvutanu.& then snt my comments.thanku soooooooo much frnz inta infrmtn ichinanduku.


 15. శ్రీవల్లి రాధిక గారు,
  ’వేయి పడగల’ మీద మీ సమీక్ష లింకు నా బ్లాగులొ వుంచాను. వీలు చేసుకొని చూడగలరు.
  ‘వేయి పడగలు’ చదివేశానోచ్…!(http://radhemadhavi.blogspot.com/)

  అభినందనలతో,
  – రాధేశ్యామ్
  సొంతఘోష


  • kusumanjali

   నాకు చాల ఇంట్రెస్ట్ ఘ వుంది చదవాలనే నీను వన్ ఇయర్ నుంచి వెయ్తుఖుతునన్ను అ బుక్ ఖోసం ఖానే నాకు దొరఖలేయ్దు ఖోచం నాకు అ బుక్ లింక్ పంపిస్తార ప్లెఅశె నాకి వెబ్ సైట్ ఖుదా తేయ్లియదు


 16. […] వచ్చిన శ్రీవల్లీరాధిక గారి సమీక్ష ఇక్కడ) గురొచ్చింది ఈ కథాంశం వల్ల. దానితో […]


 17. […] నరసింహశాస్త్రి); మైదానం (చలం); వేయి పడగలు (విశ్వనాధ సత్యనారాయణ), నారాయణరావు […]


 18. anjali

  from where can i download telugu books please give me the site


 19. Harin

  Very nice comments.
  I am reading the book right now, and it’s good to see the reviews of many people on the thought process of Mr.VSN Rao garu.I’m very glad that my father has introduced Telugu literature to me.

  thanks to all.


 20. When I introduced sr viswanadha satyanarayana to the crowd of IISC
  I have drawn greatly from velicheru narayana rao’s essay in telugu bhashapatrika and madhunaapanthula in andhra rachayithalu.while I appreciated his kinnerasani patalu I disagreed with him on LOOKING BACK.Today I am looking back!I found what I lost by not looking back
  is a lot.
  He writes any thing with several layers .We normally do not have the tools to remove all th layers.
  That day viswanatha said “I do not know whethr sarm ahas praised me or insulted me. Because he is good enough to call me to IISc i take it her said it in appreciation.”I conncluded my introduction saying I can tell those those who have not seen him that I saw him actually. Today Nenu chaala vinamramu gaa thala vanchi ayananu choodatamu naa adrustamu naa duduku thanaanni aayana choosi yemi anakapovatam ayana goppathanam .finally veyi padagalu is a great piece of art and philosophy . I may not agree in parts. adi aayana goppathananni yemaathram thagginchadu.ayana goppathanam valla naa abhipraayalu maaravu


 21. డాక్టర్ ఎస్.గంగప్ప గారు వ్రాసిన ఈ పుస్తకం చదవండి. పడగలన్నీ మన కళ్ళముందే.

  http://www.archive.org/details/veipadgaluvishle024984mbp

  వ్యాసకర్త చెప్పిన పడగల విశేషాలే కాక ఇంకా బోల్డన్ని సంగతులు

  మాగంటి వంశీ


 22. నేను పాఠశాలలో చదువుకునే రోజుల్లో ప్రతిరోజు సైకిల్లో ఎంతో దూరమెళ్ళి, లైబ్రరీలో ప్రతిరోజూ కొంచెం కొంచెంగా చదివానీ నవల.అప్పట్లో చాలా విషయాలు అర్థం కాలేదు. ఇప్పుడు మళ్ళీ చదవాలి.


 23. రాధిక గారికి ముందుగా సాహిత్యాభినందనలు…
  మీ సమీక్ష చాలా బాగుంది…విశ్వనాథుల వారి పడగలన్నిటినీ తక్కువ కాలం లో చదివినట్టుంది మీ సమీక్ష….


 24. మాలతి

  శ్రీవల్లీ రాధిక, చాలా మంచి సమీక్ష. అభినందనలు.


 25. మెహెర్

  చాలా బాగా రాసారు. ఈ మధ్యనే “లైఫ్ ఆఫ్ శామ్యూల్ జాన్సన్” [రచన: జేమ్స్ బాస్వెల్] చదువుతూంటే కొన్ని చోట్ల జాన్సన్‌ స్థానే విశ్వనాథ గుర్తొచ్చాడు ఎందుకో! 🙂  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు సాహిత్యంలో బలమైన స్త్రీ పాత్రలు-మొదటి భాగం:విశ్వనాథ నాయికలు

వ్యాసకర్త: సూరంపూడి మీనాగాయత్రి ***************** ఏ సాహితీ ప్రక్రియలోనైనా కథ, కథనంతో పాటు బలమైన...
by అతిథి
1

 
 

తెఱచిరాజు – ఒక పరిశీలనా ప్రయత్నము

వ్యాసకర్త: శ్రీకాంత్ గడ్డిపాటి (విశ్వనాథ గారి తెఱచిరాజు నవలపై బెంగుళూరులో జరిగిన సా...
by అతిథి
6

 
 

స్వర్గానికి నిచ్చెనలు – అస్తి నాస్తి ల గంభీర చర్చ

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************ భారతీయ భాషల్లో ఆలోచనాత్మకమైన రచనలకు ఏ క...
by అతిథి
0

 

 

విశ్వనాథలోని ‘నేను’ – మూడవభాగం

రచయిత: పేరాల భరతశర్మ టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి మొదటి భాగం ఇక్కడ. రెండ...
by అతిథి
1

 
 

విశ్వనాథలోని ‘నేను’ – రెండవభాగం

రచయిత: పేరాల భరతశర్మ టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి మొదటి భాగం ఇక్కడ. (తొలి ...
by అతిథి
0

 
 

విశ్వనాథలోని ‘నేను’ – మొదటిభాగం

రచయిత: పేరాల భరతశర్మ టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి (తొలి ముద్రణ విశ్వనాథ ...
by అతిథి
2