మొబైల్ కమ్యూనికేషన్స్

రాసిన వారు: మేధ
**********
నేను పని చేసేది మొబైల్ ఫోన్స్ మీద. ఈ రంగంలో శరవేగంతో మార్పులు-చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రక్కవాళ్ళు (ఇతర మొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్) ఏమి చేస్తున్నారో తెలుసుకోకపోతే, ముందుకు వెళ్ళలేము. ఏదైనా ఒక క్రొత్త ఫీచర్ మార్కెట్లోకి వస్తే, మనం దానికంటే ఇంకో కిల్లింగ్ ఫీచర్ తీసుకురావాలి.. ఇలా ఉంటాయి మా ప్రాజెక్టులు. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే, ఎక్కువగా చదువుతూ ఉండాలి, చదివిన వాటిని ఆకళింఫు చేసుకుని, క్రొత్తగా ఎలా చేయచ్చో ఆలోచించాలి. దీనికోసం నేను పుస్తకాల మీద, ఇంటర్నెట్ మీద, ఆన్లైన్ మ్యాగజైన్ల మీదా ఎక్కువగా ఆధారపడతాను.

ఈ సమాచార సేకరణలో నాకు బాగా ఉపయోగపడింది, పడుతోంది “Google Alerts

Google Alerts: వీటి గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. తెలియని వారు ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం అప్‌డేట్స్ తెలుసుకోవాల్సిన విషయం గురించి “అలెర్ట్” రిజిస్టర్ చేసుకుంటే, మనం ఎంచుకున్న టైం ఫ్రేం ని బట్టి (రోజూనా, వారానికి ఒకసారా, లేదూ అప్‌డేట్స్ జరిగిన వెంటనే) మెయిల్ బాక్స్లో వివరాలు వస్తాయి. నేను “Mobile Communication”, “Japan Dtv” ఇలా కొన్ని అలర్ట్స్ పెట్టుకున్నాను. దానితో వీటికి సంబంధించిన ఏ విషయమైనా వెంటనే తెలుస్తుంది.. దానికి తగ్గట్లు మా ప్లాన్లు మార్చుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుంది..

ఆన్లైన్ బ్లాగులు: Mobile Trends
i-phone లో ఈ రోజు రిలీజైన క్రొత్త అప్లికేషన్ నుండి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్స్ లో ఏమి జరిగింది వరకూ అన్ని విషయాలు తెలుస్తాయి. రోజూ చదవడానికి కుదరకపోయినా, ప్రతీ శుక్రవారం ఆ వారంలో జరిగిన ముఖ్యమైన విషయాలన్నీ ఇస్తారు. దీనివల్ల ముఖ్యమైనవి మిస్స్ అవము. ఇంకా వీళ్ళు అప్పుడప్పుడు ఈ రంగం లో పేరున్నవాళ్ళ ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంటారు. మన రైవల్ కంపెనీస్ ఏ యే రంగాల్లో ముందుకు వెళుతున్నాయి అనే వాటి మీద అవగాహన వస్తుంది.

కొన్ని వెబ్సైట్స్: cnet news
దీంట్లో ఎక్కువగా మొబైల్ ఫోన్స్ కి సంబంధించిన రివ్యూస్ వస్తుంటాయి. ఏదైనా క్రొత్త ఫోన్ మార్కెట్లో కి రాగానే మొదట వీళ్ళు దాన్ని టెస్ట్ చేసి, ఆ వివరాలు అందిస్తారు. మా ఫోన్ మార్కెట్ లో రిలీజ్ అయినప్పుడు పబ్లిక్ టాక్ ఎలా ఉంది, అలాగే ఇతర కంపెనీల మోడళ్ళలో ఉన్న మంచి ఫీచర్స్ ఏంటి అని తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.

టి.వి. షోస్: NDTV Gadget Guru
ఈ షో ఒక రకంగా పైన చెప్పిన అన్నిటిని కలిపి ఒక 30నిమిషాల్లో అందించేది. మార్కెట్లో కి వచ్చిన క్రొత్త సెల్ ఫోన్ల నుండి, ఆ ఫోన్ల లో ఉన్న మంచి-చెడులు అన్నీ విశ్లేషించే కార్యక్రమం.
టి.వి.9 లో వచ్చే Gadget Guru పేరు మాత్రమే కాపీ కానీ, ఈ కార్యక్రమం తో పోలికే లేదు.

మ్యాగజైన్స్: My Mobile
బాగా పని వత్తిడిలో ఉండి పైన పేర్కొన్నవి ఏవీ చూడడానికి, చదవడానికీ కుదరకపోయినా నెలకి ఒకసారి ఈ పుస్తకం చదివితే చాలు. అన్నీ కవర్ చేస్తారు ఇందులో. వీరు ఇచ్చే రివ్యూలు బావుంటాయి.

ఈ పుస్తకం లో ఒక విశేషం ఏమంటే: మనకి సెల్ ఫోన్ల వల్ల కానీ, సర్వీస్ ప్రొవైడర్ల వల్ల కానీ ఇబ్బందులు ఎదురవుతుంటే, వీళ్ళకి తెలియజేస్తే వాళ్ళు Concerned Authorities ని కలిసి విషయం చెప్పి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు.

ఇప్పటివరకూ చెప్పినవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పబోయేది ఇంకో ఎత్తు.
IP Meeting: మా ఆఫీస్ లో వారంలో ఏదో ఒకరోజు ఈ మీటింగ్ ఉంటుంది. బుఱ్ఱ మధించి క్రొత్త అయిడియాలు కనుక్కోవడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఆల్రెడీ ఉన్నవాటిని ఇంకెలా అభివృధ్ధి చేయచ్చు, లేక క్రొత్త టెక్నాలజీని కనుక్కోవడం మీద సాగుతుంటాయి చర్చలు. ప్రతీ వారం ఒక టాపిక్ ఉంటుంది, అందరూ వాళ్ళకి తెలిసిన ఇన్‌ఫర్మేషన్ ని పంచుకుంటారు. మనం ఇంకా Value Addition ఏం చేయచ్చు.. ఇలా సాగుతాయి.

వీటన్నింటితోపాటు Ric Ferraro’s blog, మాకు నెల-నెలా వచ్చే Japan News Letter, SmartPhone Essentials, Doom9 Forums మరికొంత సమాచారాన్ని అందిస్తూ ఉంటాయి.

మొబైల్స్ గురించి తెలుగు బ్లాగుల్లో వచ్చిన కొన్ని టపాలు:

కూడలిలోని టపాలు

వేగంగా మారుతున్న మొబైలు విపణి …

మొబైల్ ఫోన్ల నూతన పోకడలు

టీ9 కథా కమామీషు

మొబైల్ బ్రౌజింగ్

మొబైల్ టి.వి.

క్రొత్త పుంతలు తొక్కుతున్న మొబైల్

You Might Also Like

3 Comments

  1. మేధ

    @రవి గారు:
    ఊళ్ళకి వెళ్ళి, ప్రజలతో మాట్లాడి వాటిని implement చేయడానికి మాకు ఓ సపరేట్ గ్రూప్ ఉంది.. మేము ఆ పనులు చేయం.. 🙂 మా పని అంతా కమర్షియలైజేషన్.. దానితో పాటు చేసే పనులు ఇవే…

  2. రవి

    ప్రొఫెషనల్ సీక్రెట్సు ఇలా పబ్లిక్ గా చెప్పేస్తున్నారు! :-). నేనూ కొన్ని చెప్పేస్తాను.

    సరే, మీరు చెప్పినవి కాస్త పాతబడ్డాయండి. ఇప్పుడు విషయమేమంటే, ఇలాంటివి ఓ టీము సేకరించి, ప్రతి రోజు న్యూస్ లెటర్ పంపుతారు. ప్రతీ ఉద్యోగి వీటికోసం వెతుక్కోకుండా.

    ఇప్పుడు జనాలు బేసిక్స్ కొస్తున్నారు. పల్లెటూర్లకు వెళ్ళడం, అక్కడ రెండ్రోజులు తిష్ట వేసి జనాలతో మమేకమై, వాళ్ళకేం గావాలో అడిగి రాబట్టడం. ఇదీ నవనూతన పద్ధతి.

Leave a Reply to chavakiran Cancel