ఈనెల ఫోకస్ వృత్తి పరంగా మీకు నచ్చిన పుస్తకాలు

నమస్కారం!
ఈ నెల ఫోకస్: వివిధ వృత్తులకు సంబంధించిన సాంకేతిక పుస్తకాలు.

పుస్తకం.నెట్ మొదలయ్యి ఏడాదిన్నర కావస్తున్నా, ఇప్పటి దాక ఇక్కడ ఏ వృత్తికి సంబంధించిన పుస్తకలయినా పరిచయం చేయబడలేదు. సాహిత్యపు లోతుల్ని తెలిపే పుస్తకాలు, లేక ఆహ్లాదాన్ని పంచే పుస్తకాలే ఎక్కువగా పరిచయం అయ్యాయి. వృత్తిపరంగా నెగ్గుకురావడంలో కూడా పుస్తకాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని పుస్తకాలు మనది కాని రంగాలపై ఆసక్తి పెంపొందించేలా ఉంటాయి. కొన్ని మన రంగంలోనే మరింత తెల్సుకునే వీలు కల్పిస్తాయి. ఇలాంటి రచనలకు కూడా పుస్తకం.నెట్ వేదిక కావాలనే సదాశయంతో ఈ నెల ఫోకస్ గా “వృత్తిపరంగా సహాయపడే పుస్తకాలు” పెడదామని నిర్ణయించాము.


ఐ.టి, జర్నలిజం, వైద్యం, అకౌంట్స్, ట్రేడింగ్, లా, మేనేజ్మెంట్, పర్యావరణ శాస్త్రం, సైన్స్, ఫోటోగ్రఫి – ఇలా వివిధ రంగాలకు సంబంధించిన పుస్తకాలు, లేక పత్రికలను పరిచయం చెయ్యండి. సమీక్షించండి. ఇలాంటి రచనలు చేసే రచయితల్లో మీకిష్టమైన వారి గురించి మీ మాటల్లో చెప్పండి. మీ కెరీర్ కి ఉపయోగపడే ఈ పుస్తకాన్ని అయినా చట్టుక్కున తెచ్చి ఇవ్వగల పుస్తకాలయం / పబ్లిషర్ గురించి వివరాలు తెలపండి. మీకు ఎక్కువగా అక్కరుకొచ్చిన గ్రంథాలయం గురించి రాయండి. అంతర్జాలం లో మీరు తప్పకుండా ఫాలో అయ్యే సాంకేతిక బ్లాగ్స్ /మేగజీన్ల గురించి వ్యాసాలూ కూడా రాయొచ్చు.

ఖాళీ సమయాల్లో చదివే పుస్తకాలు కాక, ఖాళీ చేసుకొని చదివి, మన కెరీర్ ని మెరుగుపరచుకునే పుస్తకాల పరిచయం కోసం ఎదురుచూస్తున్నాం.

You Might Also Like

One Comment

  1. అయినవోలు ప్రణవ్

    చాలా మంచి ఆలోచన.
    తప్పకుండా ఈ వారాంతం పంపడానికి ప్రయత్నిస్తాను.

Leave a Reply