దైవం వైపు – మల్లాది వెంకట కృష్ణ మూర్తి

రాసిన వారు: నాగేంద్రప్రసాద్ గొంట్ల
************************

పుస్తక పరిచయము : దైవం వైపు
రచయిత : మల్లాది వెంకట కృష్ణ మూర్తి
వెల : యాభై రూపాయలు

వివిధ ఆధ్యాత్మిక పత్రికలలో మల్లాది గారు వ్రాసిన అనేక ఆధ్యాత్మిక వ్యాసాల సంకలనం ఈ పుస్తకము. ఆధ్యాత్మిక విద్యలో పాఠాలు త్వరగా పట్టుబడవు. వాటిని మళ్లీ మళ్లీ చదవకపోతే పట్టుబడ్డ కొంచము కూడా విస్మరించబడుతూ ఉంటుంది. ఇందుకు కారణం మన మీద మాయ సదా పని చేస్తుండడమే. మనలోని అన్ని దుర్గుణాలని పోగొట్టుకోడానికి ఆధ్యాత్మిక పుస్తకాలు తరచూ చదవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆధ్యాత్మిక పుస్తకాలు సత్సంగంతో సమానం అని పెద్దలు చెప్తారు. ఈ పుస్తకము అందుకు ఉపయోగపడుతుంది.

ఈ పుస్తకములో మొత్తము ముప్పయి తొమ్మిది వ్యాసాలు ఉన్నాయి. దానామృతము గురించి ౭౧వ పేజిలో బాగా చెప్పారు. మనము చేసే దానం ఇంకొకరికి తెలియకూడదు అని అంటారు. కానీ తెలియడము ద్వారా ఇంకొకరికి కూడా దానము చేయాలని ఉద్దేశము కలుగుతుంది కదా అంటారు. ఒక సారి వార్రెన్ బఫ్ఫెట్ అనే కోటీశ్వరుడు తనకున్న ఆస్తిలో ౮౫% దానం చేస్తున్నానని చెప్పి చేసారు. ఈ ప్రకటన వెలువడ్డ కొద్ది రోజులకే నటుడు జాకి చాన్ తన ఆస్తిలో సగము బీదల ప్రయోజనానికి ఇచ్చారు. అలాగే మన తెలుగు నటుడు మురళీమోహన్ గారు కూడా బీదల చదువుకోరకు కొంత డబ్బు ఇచ్చారు. ఇది ఇంకొకరిని ఆదర్శముగా తీసుకొని జరిగినవే. అందువలన చేసిన దానం చెప్పిన తప్పు లేదు. ఎవరి శక్తి కొలది వాళ్ళు దానం చేయవచ్చు.

అన్ని దానాలలోకల్ల అన్న దానం గొప్పది అంటారు. రాయలసీమలో ౧౮౬౦ లో వచ్చిన కరువు సమయములో బుడ్డా వెంగళరెడ్డి గారు చేసిన అన్నదానం గురించి, తూర్పు గోదావరి జిల్లా కి చెందిన డొక్కా సీతమ్మ( ౧౯౦౦ ) గారి గురించి, నంద్యలకి చెందిన ఆకుల గంగమ్మ గారి గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు.

౩౯వ వ్యాసములో సెల్ ఫోన్ వెర్సుస్ గీత గురించి చాల బాగా చెప్పారు. సెల్ ఫోన్ లాగా భగవద్గీత పుస్తకాన్ని జేబులో ఉంచుకోవాలి అన్నారు.

ఈ పుస్తకము చదువడము ద్వారా ఆధ్యాత్మిక భావాలు కలుగుతాయి. మరు జన్మకి కావలసిన పుణ్యము ఎలా వస్తుంది అని చెప్పారు. మన భావాలు, ఆలోచనలు ఎలా ఉన్న ప్రతి ఒక్కరు చదువవలసిన పుస్తకము ఇది.

You Might Also Like

2 Comments

  1. రవి

    Dear Rajendra, This is not a review. The author mentioned clearly it as, “పుస్తక పరిచయము”.Please point out things clearly and aptly.

  2. rajendra

    This is not the way a book review is written. Please publish something readable. Thanks Rajendra

Leave a Reply