నెల్లూరియుని సృష్టి – పెద్దబాలశిక్ష

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. – పుస్తకం.నెట్]

అక్షరాలు నేర్చుకోవడం, అ,ఆలు దిద్దుకోవడం అంటే నేలమీద, ఇసుకమీద, రాళ్ళమీద నేర్చుకునే రోజుల్లో పెద్దబాలశిక్ష సరస్వతీ పుత్రుల పాలిట వరమైంది. తెలుగుభాషలోనే బాలలకు ప్రథమశిక్షణకై ఉపయోగపడే విజ్ఞానకోశం ఈ గ్రంథం. ఈ పెద్దబాలశిక్ష విరచించించి వజ్ఝల సీతారామశాస్త్రి, వీరు సింహపురి వాసులు. దీనిని 1820లో రచించారు. సీతారామశాస్త్రి బ్రౌనుదొర వద్ద ముఖ్య పండితులుగా ఉండి, వారి సూచనమేరకు దీనిని రచించారు. ఇది మొదట 78 పుటలతో వెలువడింది. ఆతర్వాత 98 పుటలకు వెలువడింది. ఆ తర్వాత ఎక్కువ పుటలతో వెలువడింది. దీనియందు అక్షర సంఖ్య, త్రివిధి గణితము, నామావళియు, నీతివాక్యములు, ద్వంద్వ వాక్యములు, లెక్కలు, ప్రభవలు చెప్పబడి ఉన్నవి. బాలురకు విశేషమైన బుద్ధి సులభముగా ఉత్పన్నమయే విధంగా దీనిని లిఖించారు. పండితత్రయంచే విస్తరింపబడిన బాలశిక్ష 1847 సంవత్సరంలో ప్రభాకర ముద్రాక్షరశాలలో ముద్రించబడింది. వజ్ఝల సీతారామశాస్త్రి రచించిన పెద్దబాలశిక్షకు 180 ఏళ్ళు పూర్తయినప్పటికీ ఇప్పటికీ ఆదరణ ఉంది. పెద్దబాలశిక్షకు మరికొన్ని పేర్లతో రూపాలు మార్చినా ఆదరణ పొందలేకపోయాయి. ఈపెద్దబాలశిక్ష మాత్రమే నేటికీ సజీవకార్యం.

You Might Also Like

7 Comments

  1. budugoy

    am i the only one cringing to hear “nellooriyudu”..?

    1. సౌమ్య

      @Budugoy: Is that a wrong usage?? I think I heard the term a couple of times before.

  2. ఆనంద్

    ఇంటి పేరు ఏదైతేనేమి, అందరూ మహానుభావులే కదా ! అందరూ వందనీయులే.

  3. k.purushotham

    nellorians believe that sitarama sastry, he taught telugu in S.George kallege. His brother anantarama sastry wrote in sanskrit, vivahya kanya swaroopya kanya niroopaNama against child marriages. Mr.vajjala venkata subramanya sarma felt that peddabalasiksha was written by vajjala sitarama sastry. He has no evidene to prove it. This is only my view.

  4. వేణు

    ‘పెద్ద బాలశిక్ష’ అనే పేరులో కనిపించే వైరుద్ధ్యం ఒక విశేషం. దీన్ని రాయటం వెనక బ్రౌను గారి సూచన ఉందనీ, రచయిత వజ్ఝల సీతారామశాస్త్రి అనీ నాకిప్పుడే తెలిసింది. దీని భిన్న రూపాల ప్రచురణల్లో కనిపించే మూఢనమ్మకాలూ, ఏకపక్ష నీతులూ మినహాయిస్తే… దీనిలో విశేషాలు పిల్లలకూ, పెద్దలకూ ఉపయోగపడేవే!

    1. సౌమ్య

      కొన్నిచోట్ల ఏమో, రచయిత పేరు చదలవాడ సీతారామశాస్త్రి అని కూడా చదివాను….

Leave a Reply