సాహితీదీపం – దీపాలపిచ్చయ్య శాస్త్రి

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. – పుస్తకం.నెట్]

గుంటూరుజిల్లా వాసి అయినప్పటికీ సింహపురి సాహితీదీపాన్ని వెలిగించిన బహుభాషా శాస్త్రవేత్త దీపాల పిచ్చయ్యశాస్త్రి. ఐదు దశాబ్దాలకు పైగా సింహపురి సాహితీసహవాసం చేసిన సాంస్కృతిక ఆంధ్రపండితులు వీరు. 1894లో గుంటూరు జిల్లాలో జన్మించినప్పటికీ నెల్లూరు వెంకటగిరి మహారాజా కళాశాల ఉన్నత పాఠశాలలో పాతికేళ్ళు, మరో పాతికేళ్ళు జిల్లాలో సంబంధాలు, సాహితీ నివాసంతో జిల్లా కీర్తి ప్రతిష్టలలో భాగస్వామిగా నిలిచారు. సంస్కృత,ఆంధ్ర భాషలలో ఆయన ఉద్ధండ పండితులు. తెలుగు సాహితీలోకంలోనే సాటిలేని విమర్శకుడు. అంతకుమించి అనుపమ వక్త. శబ్దముల సాధుత్వం గురించి విశేషపరిశ్రమ చేసిన భాషా శాస్త్రవేత్త. విద్యార్థుల హృదయాలను హత్తే ఆయన తెలుగు భాషాభిమానం పలువురిని కవులుగా, గ్రంథకర్తలుగా తీర్చిదిద్దింది. అనువాదాల్లోనూ వీరు లబ్ద ప్రతిష్టులు. దశకుమార చరిత్రము, రఘువంశం, ద్రోణ ప్రశస్తి రచనలు కథాకథన కౌశల పదాలాలిత్యములందు మూలములతో సృష్టించగలిగారు. చేమకూరి వెంకటకవి ప్రౌఢకావ్యం సారంగధర చరిత్రకు శాస్త్రిగారు సమగ్ర వ్యాఖ్య వైచిత్రులను చిత్రించారు. ఈచిత్రణ సుప్రసిద్ధ పండితులను సైతం అబ్బురపరచింది. మేఘదూత, భక్తకల్పద్రువము, ప్రణయకుసుమము చక్కని కవితకు దర్పణాలు, భాషా మృదుత్వమునకు మచ్చుతునకలు. రసమునకు కాణాచులు. కమ్మని తెలుగు నుడికారములకు వెలుగులు. సమగ్ర భాషాదర్పమునకు సజీవ సాక్ష్యాలు. కవి కొట్టరపు తిక్కన గురించి విశేషంగా తిక్కన తెలుగు తెన్నులను రాశారు. ఇదో గొప్ప పరిశోధన గ్రంథం. శబ్దపల్లవ ధాతుకోశం ఒక అపురూప నిఘంటువు. భాస మహాకవి రూపకములు కొన్నింటిని భావగాంభీర్యం చెదరకుండా తెలుగునుడికారంలో అనువదించిన తీరు ఇప్పటికీ ఎందరికో ఆదర్శం.

You Might Also Like

9 Comments

  1. dvs prasad

    regards to every one.
    my name is Deepala VS Prasad and i am eldest grand son of Deepala Pitchayya Sastry. i read many comments on his efforts to the literature of our mother tongue. although this is little shame on my part but honestly i agree openly that many of his books are not in any of his family members but certainly with his friends. in fact i made a futile effort of collecting at least one copy of his entire list of books. however i was told recently that few books are available with my uncle [younger son of Deepala Pitchayya Sastry] i shall be supplying his name and complete details for the interested parties.
    with warm regds
    dvs prasad

  2. రామ

    @రామ:
    క్షమించాలి. “DLI” అంటే ఏమిటో కొంచెం వివరించగలరు.. అని వ్రాయబోయి మొదటి పదం రాయకుండా పోస్ట్ చేసాను.

  3. రామ

    @Sreenivas Paruchuri:
    అంటే ఏమిటో కొంచెం వివరించగలరు (పుస్తకాలు దొరికే ప్రదేశమేమో అని అనిపిస్తోంది). అలాగే, అంతర్జాలం లో తెలుగు పుస్తకాలు చదవడానికి వీలు కల్పించే (ముఖ్యం గా అచ్చులో లేని ఇటువంటివి) సైట్ లు వుంటే తెలియజేయగలరు.

  4. జంపాల చౌదరి

    @Sreenivas Paruchuri:
    mea culpa 🙁

    పోస్టు పంపిన కాసేపటికి తప్పు తెలిసింది.

  5. Sreenivas Paruchuri

    > దశకుమార చరిత్రము, రఘువంశం, ద్రోణ ప్రశస్తి,సారంగధర చరిత్ర, మేఘదూత, భక్తకల్పద్రువము,
    > ప్రణయకుసుమము

    పైవాటిలో భక్తకల్పద్రువము తప్పించి మిగిలినవన్నీ DLIలో వున్నాయి. అదనంగా, “కాలము, భాగవత పాఠ్పరిశోధనము, కుమార కథా మంజరి, సాహిత్య సమీక్ష వ్యాస సంపుటం” వున్నాయి.

    > కవి కొట్టరపు తిక్కన గురించి విశేషంగా తిక్కన తెలుగు తెన్నులను రాశారు. […] శబ్దపల్లవ ధాతుకోశం

    ఈ రెండు నాకు కనపడలేదు.

    జంపాలగారు: చాటు పద్య రత్నాకరము is the title of దీపాల పిచ్చయ్యశాస్త్రి.
    చాటుపద్యమణిమంజరి is Veturi Prabhakara sastry’s compilation.

    Regards,
    Sreenivas

  6. సౌమ్య

    Srinivas garu: ఆ పుస్తకంలో వ్యాసాలన్నీ అలాగే ఉన్నాయి. ఏదీ వివరంగా అనిపించలేదు నాకు. అందుకే, ఇక్కడిలా పెడితే, మీబోటి వారొచ్చి ఏమన్నా వివరంగా రాస్తారేమోనని ఆశ 🙂

  7. Sreenivas Paruchuri

    *మరీ* క్లుప్తంగా వుంది! “పెన్నాతీరం” పుస్తకంలో వివరాలకు యెక్కువ అవకాశం లేదని తెలుసుకానీ, అంత గొప్ప పండితుణ్ణి గురించి మరీ 10 వాక్యాలే అంటే కాస్త కష్టంగా వుంది :). ఆయన చేసిన గొప్ప చాటు పద్యాల సంకలనం, అలాగే రాసిన కవిత్వం గురించి ఒక వాక్యం అయినా రాస్తే బాగుండేది. గుర్రం జాషువా, పిచ్చయ్య శాస్త్రి గార్లు జంటకవులుగా కవిత్వం రాద్దామనుకున్నారు కానీ, పేర్లు కలవక ఆ ప్రయత్నం ఆగిపోయింది :-).

    పైన పేర్కొన్న పుస్తకాలేవీ ప్రస్తుతం అచ్చులో వున్నాయనుకోను. కానీ సంపాదించడం కష్టం కాదు.

    — శ్రీనివాస్

  8. జంపాల చౌదరి

    దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి పుస్తకాల్లో బాగా ప్రచారంలో ఉన్నదీ, ఇప్పటికీ దొరికేదీ, చాటుపద్య మణిమంజరి అనుకొంటాను. ఈ పుస్తకంతోనే నాకు వారి పరిచయం అయ్యింది. ఈ పుస్తకం ప్రసక్తి ఈ వ్యాసంలో కనిపించనేలేదు.

  9. సుజాత

    వ్యాసంలో పేర్కొన్న పుస్తకాలన్నీ ఇప్పుడు లభ్యమవుతున్నాయా? అయితే ఎక్కడ లభ్యమవుతున్నాయి?

Leave a Reply