Then we set his hair on fire – Phil Dusenberry

రాసిన వారు: Halley
************
నాకు Indiaplaza.in ద్వారా పరిచయం అయిన ఎన్నో మంచి పుస్తకాలలో ఇదీ ఒకటి. పుస్తకం కవర్ పేజీలో చెప్పినట్టు ఇది ప్రధానంగా “Insights and accidents from a hall-of-fame career in advertising” గురించి. నాకు ప్రకటనా ప్రపంచం, మార్కెటింగ్ మరియు ప్రచారాల వెనుక కంపెనీలు పడే కష్టాల గురించి సమగ్రంగా చర్చించే ఒక పుస్తకం చదవాలి అని ఎప్పటి నుంచో కోరిక . ఈ పుస్తకంతో ఈ కోరిక తీరింది అని అనటం కంటే ,ఈ పుస్తకం ఇలాంటివి మరిన్ని చదవాలి అని అనిపించేటట్టుగా చేసింది అనటం సబబు. ఇదేదో ఈ పుస్తకం బాలేదు అని చెప్పటంకాదు, ప్రకటనా ప్రపంచంలో తెల్సుకోటానికి ఇన్ని విషయాలు ఉన్నాయా అని అనిపించేలా చేసింది ఈ పుస్తకం.

రచయిత ఫిల్ డూసెన్బెరీ అమెరికా లోని యాడ్ ఏజెన్సీలలో ఏళ్ళ కొద్దీ పని చేసి సంపాదించిన తన అనుభవాన్నంతటినీ రంగరించి రాసినది ఈ పుస్తకం.ప్రపంచ ప్రసిద్ధిగాంచిన G.E, Gillete , FedEx వగైరా బ్రాండ్లు 1980లకు అటు ఇటు కొన్ని దశాబ్దాలు వాటి శైశవదశలో పడిన కష్టాలు , తర్వాత వినియోగదారులను కట్టి పడేసే ప్రచార వ్యూహాలతో అవి నిలదొక్కుకున్న తీరు గట్రా చక్కగా వర్ణించారు. ముఖ్యంగా కేవలం ఏదో ఇలా “The best a man can get” అని ఒక లైను చెప్పాం Gillete పెద్ద బ్రాండు అయిపోయింది అని అనటం కాకుండా , అసలు ఆ లైను ఎలా వచ్చింది , ఆ కంపెనీకీ సరిగ్గానప్పే ప్రచారవ్యూహాన్ని తీర్చిదిద్దటానికి జరిగే పరిశోధన మరియు ఇతర ప్రహసనాలు బాగా వివరించారు.

మొదటి పరిచయ అధ్యాయములలోనే తన కథనంతో ఆకట్టుకుంటారు ఫిల్ డూసెన్బెరీ -G.Eకి 1979-2003 దాకా నిలబడిన “we bring good things to life” అన్న యాడ్ వెనుక ఉన్న పిట్టకథ చెప్పి. ఇది తన కంపెనీ BBDO గురించి కానీ తన ఉద్యోగ జీవితం గురించి కానీ రాసిన పుస్తకం కాదు అని డూసెన్బెరీ చెప్పినప్పటికీ పుస్తకంలో అంతర్లీనంగా అది కనపడుతుంది. ఉదాహరణకు పైన చెప్పిన G.E యాడ్ వలన రచయిత పని చేసే BBDO కంపెనీకి FedEx , Visa , HBO , FritoLay , Apple వంటి యెన్నో సంస్ఠల కాంట్రాక్టులు దక్కాయట. ఇలా అంతర్లీనంగా వ్యాపార లోకపు తీరు తెన్నుల గురించి , స్వీయ కెరీర్ మరియు BBDO యెదుగుదల గురించి కూడా మనకు తెలియచెప్తారు రచయిత.

తర్వాతి అధ్యాయంలో HBO బ్రాండు కథలు, HBOకి “There is no place like HBO” అని యాడ్ చేసిన వైనం వగైరా చెప్తూ అడ్వర్టైసింగ్ గురించి పాఠాలు చెప్తారు. ముఖ్యంగా నాకు ఇక్కడ నచ్చింది- ముందు చెప్పినట్టుగా , నేడు గొప్ప బ్రాండ్లుగా ఆదరణ పొందుతున్న HBO వంటివి .. 1984 ప్రాంతంలో ఇతర ఛానెళ్ళ నుంచి పోటిని తట్టుకొని అప్పట్లో తన వైవిధ్యాన్ని చూపుకోటానికి పడిన కష్టాలు , అవి అధిగమించటానికి రచయిత కంపెనీ ఎలా దోహదపడిందో చెప్పిన తీరు. రకరకాల యాడ్ ఏజెన్సీలు తమ తమ ప్రచార వ్యూహాలను కంపెనీల ముందు పెట్టే తీరు , తెర వెనుక వారు పడే కష్టాలు , ఒక్కొక వ్యూహంలో ఉన్న తప్పొప్పుల గురించి చక్కగా విశ్లేషించారు.

పరిశోధన ప్రాముఖ్యతను తెలుపుతూ మరొక అధ్యాయం . ఇందులో Frito-Lay , Pepsi గురించిన పిట్టకథలు. అమ్మకాలను పెంచేందుకు ప్రకటనలు ఎలా ఉపయోగపడతాయి అవి ఏ స్థాయిలో అమ్మకాలను పెంచగలవు అని చెపుతూ Mars-Snickers చాక్లేట్ బ్రాండు గురించేకాక మరికొన్ని చిన్న బ్రాండ్ల కథాకమామీషు కూడా చెప్పారు.తదుపరి అధ్యాయాలలో PizzaHut కథ , FedEx కథ , VISA కార్డ్స్ కథ , “Gillette-The best a man can get” కథ వగైరాలతో ఒక ప్రవాహంలా ఎక్కడా బోరుకొట్టకుండా సాగిపోతుంది.

ఒక్కో బ్రాండు కథ ఒక కేస్-స్టడీ .. ఒక పాఠం . వ్యాపారరంగంపై ముఖ్యంగా ప్రకటనలు , యాడ్ ప్రపంచం పై ఆసక్తి ఉండేవారు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

ఇండియాప్లాజా కొనుగోలు లంకె ఇక్కడ.

You Might Also Like

4 Comments

  1. పుస్తకం.నెట్ కు రెండేళ్ళోచ్! « sowmyawrites ….

    […] అడ్వర్టైజింగ్ ప్రపంచం గురించిన Dusenberry పుస్తకం దాకా, అలాగే, ఈవారంలోనే వచ్చిన […]

  2. మాలతి

    బాగుంది పరిచయం. చక్కగా వివరించేరు. అభినందనలు.

  3. Aruna Pappu

    హేలీ, ఈ పుస్తకం చదవాలనిపిస్తున్నది. పరిచయానికి కృతజ్ఞతలు.

  4. సౌమ్య

    Interesting book! Thanks for introducing 😛

Leave a Reply to Aruna Pappu Cancel