ఫోకస్ : పద్య సాహిత్యం

పుస్తకం.నెట్ లో ఈ నెల ఫోకస్ ” తెలుగు పద్య సాహిత్యం” . ఈ ఫోకస్ లో –  పద్య సాహిత్య ప్రధానమైన పుస్తకాల పరిచయాలు, సమీక్షలతో బాటు, మీ అభిమాన పద్య రచయిత పై వ్యాసాలూ, పద్యసాహిత్యం లో ని ప్రక్రియల పై వ్యాసాలూ, మీ పద్య పఠనానుభవాలు – లాంటి వాటిన్నింటి పై రాయవచ్చును. ఇతర భాషల నుండి తెలుగులోకి అనువదింపబడ్డ పద్య సాహిత్యం పైనా రాయవచ్చును.

అంతే కాక, ఒక ఇద్దరు ముగ్గురు కల్సి, ఏదైనా కావ్యం పై మెయిళ్ళలో చర్చించి, దాని విశేషాలను పుస్తకం.నెట్ లో ప్రచురించవచ్చు. చర్చ పై ఆసక్తి ఉన్న వారు, మాకో వేగు పంపితే, ఆసక్తి ఉన్న తక్కిన వారిని పరిచయం చేస్తాం.

ఈ అంశం పై సలహాలూ, సూచనలూ, ప్రశ్నలూ ఉంటే మాకు తెలుపగలరు.

You Might Also Like

Leave a Reply