“My Telugu Roots – Telangana State Demand – A Bhasmasura Wish” in TV9

గత కొన్ని వారాలుగా టీవీ 9 న్యూస్ ఛానల్ లో ప్రతీ ఆదివారం ఉదయం పుస్తక పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఒక్కో వారం ఒక్కో పుస్తకం పై ప్రముఖులచే విశ్లేషణ చేయబడుతుంది. పుస్తకాలపై ప్రముఖుల అభిప్రాయాలు తెల్సుకునే వీలు కలిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎక్కువ మందికి తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా, రాబోయే ఎపిసోడ్ వివరాలను టూకీగా మీకందించే ప్రయత్నం “పుస్తకం.నెట్” చేస్తుంది. మా ఈ ప్రయత్నానికి సహకరించి వివరాలు అందజేసిన ప్రోగ్రామ్ మానేజర్ సాంబశివ రావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు!

మార్చి 28, 2010 నాడు, ఉదయం పదకొండింటికి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో:

పరిచయం చేయబడుతున్న పుస్తకం: “My Telugu Roots – Telangana State Demand – A Bhasmasura Wish”

You Might Also Like

One Comment

  1. Prabhakar Mandaara

    టీ వీ 9 నిర్వహిస్తున్న పుస్తక పరిచయం కార్యక్రమం పుస్తకాభిమానులకూ , ప్రచురణకర్తలకూ , రచయితలకూ నూతనోత్సాహాన్ని ఇస్తోంది .
    ఎలెక్ట్రానిక్ మీడియా విజ్రుంభణ తర్వాత పుస్తకాలను చదివేవారి సంఖ్య , పుస్తకాలు కొనే వారి సంఖ్య తగ్గిపోయిందని లేదా స్టాగ్నేట్ అయిందనే అభిప్రాయం వుంది .
    ఇలాంటి సమయంలో ఒక ఎలెక్ట్రానిక్ మీడియానే ముందుకొచ్చి పుస్తకాలకు జై కొట్టడం నిజంగా గొప్ప విషయం .
    టీవీ 9 వారికీ , ప్రోగ్రాం మేనేజర్ సాంబశివరావు గారికీ , సమీక్షించ బోయే పుస్తకం గురించి ముందుగానే తెలియజేస్తున్న మీకూ హృదయపూర్వక అభినందనలు .
    ఒక చిన్న సూచన ….
    సమీక్షించ బోయే పుస్తకం పేరు తో పాటు రచయిత పేరు , ప్రచురణ కర్త వివరాలు కూడా మీరు ముందుగానే తెలియజేస్తే – ఉత్సాహం ఆసక్తి వున్నవాళ్ళు ముందే పుస్తకాన్ని కొని/ సేకరించి చదివి మరీ సమీక్షా కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసేందుకు వీలవుతుంది .
    పరిశీలించగలరు .
    అభినందనలతో
    -ప్రభాకర్ మందార

Leave a Reply