టివి నైన్ పుస్తక పరిచయ కార్యక్రమం: మార్చి 7 నాటి ఎపిసోడ్ వివరాలు

గత కొన్ని వారాలుగా టీవీ 9 న్యూస్ ఛానల్ లో ప్రతీ ఆదివారం ఉదయం పుస్తక పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఒక్కో వారం ఒక్కో పుస్తకం పై ప్రముఖులచే విశ్లేషణ చేయబడుతుంది. పుస్తకాలపై ప్రముఖుల అభిప్రాయాలు తెల్సుకునే వీలు కలిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎక్కువ మందికి తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా, రాబోయే ఎపిసోడ్ వివరాలను టూకీగా మీకందించే ప్రయత్నం “పుస్తకం.నెట్” చేస్తుంది. మా ఈ ప్రయత్నానికి సహకరించి వివరాలు అందజేసిన ప్రోగ్రామ్ మానేజర్ సాంబశివ రావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు!

మార్చి 7, 2010 నాడు, ఉదయం పదకొండింటికి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో:

పరిచయం చేయబడుతున్న పుస్తకం: “కోతి కొమ్మచ్చి” – ముళ్ళపూడి వెంకటరమణ

పుస్తకం పై మాట్లాడేందుకు ప్రముఖ చిత్ర దర్శకుడు,రచయిత – వంశీ; రావికొండలరావు గారు పాల్గొంటున్నారు.

(ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో వచ్చిన సమీక్షలు ఇవిగో)

You Might Also Like

One Comment

  1. శ్రావ్య

    tv9 లో ఈ ప్రొగ్రాం గురించి తెలియజేసినందుకు thanks . ఎందుకనో అసంపూర్ణం గా అనిపించింది ఇవ్వాళ్టి ఎపిసోడ్. పుస్తకం గురించి విశ్లేషణ తక్కువ గా , మరి ఇతర విషయాల గురించి ఎక్కువగా మాట్లాడారేమో అని నాకు అనిపించింది.మిగితా ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Reply