నాకు పరిచయమైన బాలల సాహిత్యం

రాసిన వారు: లలిత

*************

అన్నప్రాసన చేసేటప్పుడు పిల్లలకి పలు రకాల వస్తువులను పరిచయం చేస్తాం. అందులో వారేమి ఎంచుకుంటారో చూసి ముచ్చట పడతాం. ఏసు క్రీస్తు పుట్టినప్పుడూ బంగారమూ, సుగంధ ద్రవ్యాలు బహుమతులుగా ఇచ్చారుట జ్ఞానులు. మరి ఆ వయసునుండే పలురకాల పుస్తకాలు పిల్లలకి పరిచయం చెయ్యగలిగితేనో? ఆ ఆనందం ‘అక్షరాలా’ అద్భుతం.

ప్రపంచాన్ని పిల్లల ముందు ఉంచుతాం. వారి కుతూహలానికి ‘మాటలూ’ ఇవ్వ గలుగుతాం. మనమెంతో నేర్చుకోగలుగుతాం.

మన వద్ద అక్షరాలు, కాయగూరలు, పళ్ళూ, జంతువుల పటాలు దొరుకుతాయి. కాకీ, గులక రాళ్ళూ వంటి కథలు కూడా. మా పిల్లలకు వాళ్ళ బామ్మ బహుమతిగా ఇచ్చారు. మా పిల్లలు అవి తనివి తీరా చదివించుకుని ఆనందించారు. కథలు తప్ప మిగిలినవన్నీ ఆంగ్లం, తెలుగు, హిందీ మూడు భాషలలోనూ పేర్లు ముద్రించి ఉన్నాయి. కథలు ఆంగ్లంలోనే దొరికాయి. ఆ భాష గురించి నా అభిప్రాయాలు చాలా సార్లు చెప్పుకొచ్చాను. అవి ఇక్కడ అప్రస్తుతం. ఆ వయసుకి ఆ బొమ్మలూ పటాలు అందించే ఆకర్షణ అమితం.

ఇక ఇక్కడ ఆ వయసుకు ప్రత్యేకంగా గట్టి అట్టలతో, ఆకర్షణీయమైన రంగులలో అందమైన బొమ్మలతో అలరారే హస్తభూషణాలు అతి తక్కువ వెలలో ఇక్కడ  అన్ని చోట్లా దొరుకుతాయి. రంగులు, వాహనాలు, జంతువులు, వస్తువులు, వాతావరణం , ఆకారాలు(shapes), patterns, ఇటువంటివి అన్నమాట. ఆ పైన అక్షరాలు, వాటితో మొదలయ్యే పదాలు, అంకెలు, rhymes, rhyming words,  వ్యతిరేక పదాలు ఇటువంటివి. ఇక కేవలం రెండు పదాలతో కథ రాసి ఉన్నవి, నిజం. “No, David” అనే ఈ పుస్తకం చూసి తీరాలి. చిన్నప్పుడు మనం భద్రత దృష్ట్యా, శుభ్రత దృష్ట్యా, manners దృష్ట్యా ఇట్లా ఏ కారణం చేతైతేనేమి, “వద్దు” అని పిల్లలకు పదే పదే చెప్తాము. అవి పిల్లల మనసులో నాటుకుంటాయి. కాని బాధ పెట్టేలా కాదు. ఆ పదం యొక్క అవసరం వారు పెరిగి తల్లి దండ్రులయ్యాక తెలిసి వస్తుంది మరి:-) అన్ని సార్లు “వద్దు” అని వారించి, రాత్రి పడుకునే ముందు  I love you అని మనస్ఫూర్తిగా ప్రేమను వ్యక్తం చేస్తుంది తల్లి. అదే విధంగా ఇంకో పుస్తకంలో ఆ పిల్లాడు అల్లరి పనులెన్నో చేసి తల్లిని విసిగించి , పడుకునేప్పుడు అల్లరి చేశానని అర్థం చేసుకుని I love you Mom అని చెప్తుంటే, పిల్లలకూ, తల్లి దండ్రులకూ  కూడా ఆ నిజాయితీకి మించి ఏం కావాలి?

ఈ దశలో బోలెడు రంగు రంగుల పుస్తకాలు, అల్లరి చిల్లరి ఆనందాలు. ఇంకొంచెం పెరిగి పెద్దయ్యాక పరిచయమైన పుస్తకాలు ఇప్పటికీ మా ఇంటిల్లిపాదికీ ఇష్టమే. ఇందులో ఒక దాని గురించి మా చిన్నబ్బాయి ఇలా చెప్పాడు.
“I like ‘Splish Splash Spring‘ by Jan Carr because the pictures are made by paper. I also like it because it reminds me of Spring, one of the four seasons. It talks about all the fun thngs you can do in Spring. I like it because the words are like a peom. I also like the phrase ‘Daffodilly’.”


తెగ చదివేసి తొందరగా young adults కి ఎదిగిపోయే మా పెద్దబ్బాయి లాంటి వారికి Indiana Jones, Star Wars లాంటి వాటితో పాటు అమాయాకమైన ఆనందాలతో నిండిన Wind in the Willows వంటి పుస్తకాలూ ఇష్టమే. అడిగాను కదా అని ఏదో ముక్తసరిగా రాసిచ్చి మళ్ళీ చదువుకునే పనిలో పడిపోయాడు. ఇదిగో వాడి అభిప్రాయం.
“‘Wind in the Willows‘ is an exciting book. It’s about animals living near or on a river in England. They are Water Rat, Mole, Mr.Badger, Otter and Mr.Toad of ToadHill.  (Otter is not a main character). Toad happens to have many fads. His newest is motorcars. His friends try to stop him, but he escapes and has adventures. Then he learns that weasels are living in Toad Hall. So, he and his friends capture it back, and Toad has a party. This classic is wonderful. Read it, for you will never stop.”

కదిలే వాటి గురించి మా చిన్న వాడికి ఎంత కుతూహలముందో, అదే కుతూహలాన్ని పెంచి పోషించుకుంటూ పెద్దలైన రచయితలు అన్ని రకాల పుస్తకాలు వాడి లాంటి వాళ్ళ కోసం రాసి ఉంచారు, రాస్తూనే ఉంటారు. పెద్ద వారికే అనుకునే విషయాలనూ పిల్లల కోసం, వారి పరిధిలో పరిచయం చేస్తూ ఇంకా బోలెడు పుస్తకాలు. ఇక ఈ వ్యాసం మొదట్లో ప్రస్తావించిన Three Wise Men ఇచ్చిన బహుమతుల లాగా అప్పుడు అసంబద్ధంగా తోచినా, మెల్ల మెల్లగా వాటి విలువ తెలియ వచ్చినవి, మన వద్దనే హిమాలయా వారి దుకాణంలో అనుకుంటాను కొనబడినవి కారు, విమానం, ఓడ, రాకెట్టు లోపలి భాగాల గురించి పిల్లలకు పరిచయం చేసే పుస్తకాలు, ఇక విశాలాంధ్ర వారివి నెహ్రూ గారి రచనలు.

తెలుగులో నాకు నచ్చినవి చాలా తక్కువ. చిన్నగా రామాయణం, పరమానందయ్య శిష్యుల కథలు, పంచతంత్రం కథలు, ప్రముఖుల పరిచయాలూ పుస్తకాలుగా వస్తున్నాయి. కొన్నాను కూడా. కొన్ని పరవాలేదు. బొమ్మలూ పరవాలేదు. బాలానందం వారి పుస్తకాలూ మంచి బొమ్మలతో పిల్లలు చదవడానికి ఇష్టపడే fontతో వస్తున్నాయి. అందులో కొన్ని తప్ప అన్నీ, ముఖ్యంగా ప్రవాసంలో సులభంగా చదువుకుంటూ పోవడానికి అంతగా నప్పవు. తేలికైన పదాలతో ఉన్న వాటిల్లో ఎన్ని సార్లు చెప్పినా నాకు హరివిల్లు పుస్తకం లాగా నచ్చినవి మరి కనపడలేదు. ఆ పుస్తకం AVKF ద్వారా కొన్నాను. పుస్తకానికి డైరెక్టుగా లంకె ఇవ్వలేకపోతున్నాను. ఉదాహరణకు ఇది ఒకటి చాలు:


“ఉయ్యాల జంపాల ఊపవే ఓ అమ్మ, కథ ఒకటి చెప్పవే కలగంటూ నిదురింతు
కథలోని ఒక రాజు కలలోకి వస్తేను వేటకై నేకూడ వెళతానే ఓ అమ్మ…”

ఈ మధ్యనే teluguthesis వారి వెబ్ సైటులో తిరుపతి వెంకటకవులు రాసిన పద్యాలు కనిపించాయి. అందులో కొన్ని బలే నచ్చాయి.
ఉదాహరణకు:
“ఎగిరిపోవుచున్న యేనుగు లాగున
గునిసి యాడు నల్ల గొండ లాగు
ఆకసంబు మీద నాడుచునున్నది
చల్ల గాలితోడ నల్ల మబ్బు”.

పరమానందయ్య శిష్యులు, మర్యాద రామన్న కథలు, పంచతంత్రం, రామాయణం, మహాభారతం, పేదరాశి పెద్దమ్మ కథలు, కాశీ మజిలీ కథలు, తెనాలి రాముడూ, తిమ్మరుసూ ఇలా classics గా పరిచయం చెయ్య తగ్గ వస్తువులను తగు  గౌరవంతో తగు పరిశోధన చేసి వీలైనంత authentic గా present చేస్తే బావుంటుంది. తెనాలి రాముడిని విదూషకుడి level లో పరిచయం చేస్తే పిల్లలు నవ్వుతారేమో కాని అది మనని మనం నవ్వుల పాలు చేసుకోవడమే కదా. పాఠ్య పుస్తకాలలో ఎదిగే కొద్దీ ఎటువంటి సాహిత్యాన్ని  పరిచయం చేస్తున్నారో అనే అంశం కూడా ఆసక్తి కరమే మరి. మన పిల్లలు పెద్ద వాళ్ళుగా ఎటువంటి సాహిత్యాన్ని అందుకోవాలనుకుంటున్నామో, వారి పఠనాసక్తి పెరిగితే అది తీరేందుకు ఎటువంటి పుస్తకాలు వారికి అందుబాటులో ఉంటాయో, ఇవన్నీ కూడా పాఠకత్వాన్ని, పిల్లల రచనలనీ ప్రభావితం చెస్తాయి కదా?

తొలి దశలో తేలికగా తెలుగు పరిచయం చెయ్యడానికి సరైన పుస్తకాలు చాలా తక్కువ తారసపడ్డాయి. నా మాతృభాషే కదా నేను పరిచయం చెయ్యగలననుకుని ఒక ప్రయత్నం మొదలు పెట్టి నా కుటుంబం సహాయంతో నాలుగేళ్ళలో ఎనిమిది కథలకు అక్షరరూపం ఇవ్వగలిగాను.  దొరికిన ఆణిముత్యాలను కొన్ని పరిచయం చెయ్యగలిగాను. కొన్ని పరిచయాలు మెరుగు పరచ వలసి ఉంది. ఇంకా వెతికి పట్టుకుని పరిచయం చెయ్య వలసి ఉంది. మాగంటి, ఆంధ్రభారతి వంటి వారి విలువైన సేకరణలను తరచూ తరిచి చూడవలసిఉంది.

సరైన వారు తల్చుకుంటే ఇంకెంత సాధించవచ్చో కదా. బ్లాగులు రాస్తాము, పుస్తకాలు చదువుతాము, మన ఆనందం కోసమే కదా. మరి పిల్లల కోసం ఆనందమే ఆశయంగా మొదలు పెట్టి మనమే అచ్చు వేసినా మరీ ఖర్చు లేకుండా ప్రచురించుకుని ప్రభుత్వ పాఠశాలలకైనా పంచి పెట్టవచ్చు కదా. Commercial success తోటే మొదటి అడుగు పడాలనుకుంటేనే కష్టం మరి. అసాధ్యం మాత్రం కాదు. మన nativity తో మన భాషలో మన అనుభవాలతో మన పిల్లలకు కావలిసినవి, మన పిల్లలూ మనమూ మెచ్చేవి ఆనందాన్ని పంచి పెంచేవి, అద్భుతాలని అక్షరాలలో పరిచయం చేసేవి, అవసరమైన విషయాలను అందుబాటులో ఉంచేవి, మహానుభావుల జీవిత చరిత్రలను పిల్లలకు అర్థమయ్యేలా, వారు అనుసరించాలనిపించేలా పరిచయం చేసేవీ పుస్తకాలు తెలుగులో ఆలోచించి తెలుగు వారు తెలుగు వారి కోసం రాయాలి. పరిశోధించి, పరిశ్రమించి ప్రయోజనాన్ని పొందాలి. ఇప్పటికే అలా చేస్తున్న వారిని ప్రోత్సహించి వారి గురించి ప్రచారం పెంచాలి. పాఠశాలలకూ, గ్రంథాలయాలకూ దొరికినన్ని మంచి తెలుగు పుస్తకాలు బహుమతిగా ఇవ్వాలి.

You Might Also Like

5 Comments

  1. telugu4kids

    మాలతి గారు అందించిన మొదటి సామెత కథ http://telugu4kids.com మొదటి పేజీలో చూడగలరు.
    ఆ పేజీలో రెండు వీడియోలు ఉన్నాయి, కొంచెం scroll చెయ్యవలసి వస్తుంది.

    వారు ఇచ్చిన కథలు ఇంకొన్ని క్యూలో ఉన్నాయి.తెలుగు4కిడ్స్ లో కొత్త అధ్యాయం రూపు దిద్దుకుంటోంది.

    తరచూ వచ్చి చూసి సలహాలు, సూచనలు అందించగలరు.

  2. Telugu4kids

    Thanks మాలతి గారూ.
    ఇది తెలుగు4కిడ్స్ అదృష్టం.

  3. మాలతి

    మీవ్యాసం చాలా ఆలస్యంగా చూశాను. చాలా మంచి మాటలు చెప్పేరు. నేను పిల్లలకి రాయలేను కానీ మనసామెతలవెనక కథలు రాయాలని నాకు చాలా కాలంగా ఉంది. వీలయినప్పుడు రాసి మీకు పంపుతాను. చూడండి. వీలయితే వాడుకోవచ్చు.
    మీకృషిని మనసారా అభిందిస్తూ
    – మాలతి

  4. telugu4kids

    Thanks.
    ఈ fututre group గురించి మరిన్ని వివరాలు తెలియ చేస్తారా? లేదా ఎక్కడ తెలుసుకోవచ్చో చెప్పగలరు.ఇప్పటి వరకూ వచ్చిన వచ్చిన పుస్తకాలేమైనా తెలుసా?

    kottaplli.in గురించి “చెప్పాలని ఉందా” లో ప్రస్తావన వచ్చింది.
    దాదాపు రెండేళ్ళ క్రితం అనుకుంటా, మొదలు పెట్టినప్పుడు చూశాను.
    అప్పుడప్పుడూ వెళ్ళి progress గమనిస్తూ ఉన్నాను.
    ఇది చాలా ప్రత్యేకమైన వెబ్ సైటే కాదు, బడి కూడా కదా?
    వారు పుస్తకాలు ప్రచురిస్తున్నారు, PDFలో కూడా ఉంచుతున్నారు.
    వీరి వెబ్ సైటు నేను తెలుగు4కిడ్స్ లంకెలలో చేర్చాల్సి ఉంది.

    మంచిపుస్తకం వారిగురించి బుక్ ఫెయిర్ తర్వాత మంచి మాటలు బ్లాగుల్లో వ్రాశారు.

    చంద్రలత గారు workshop నిర్వహించి రాయించిన “పట్టు పువ్వులు” పుస్తకం గుర్తు చేసుకున్నాను ముందు రాసిన వ్యాసంలో, వ్యాఖ్యలలో. నేను మళ్ళీ మళ్ళీ అలా ప్రచురిస్తున్నారని అనుకోలేదు. వారు చేస్తుంటే తెలియపరిస్తే బావుంటుంది. “పట్టు పువ్వులు” తో పాటు పిల్లన గ్రోవి, “ప్రియమైన అమ్మా నాన్న” కూడా ప్రచురించినట్టున్నారు. నా దగ్గర “పిల్లనగ్రోవి” ఉంది. ఇంకేవైనా పుస్తకాలు కూడ ప్రచురిస్తుంటే పది మందికీ తెలియపరిస్తే బావుంటదనే కదా నేను అడుగుతున్నది.

    ఏరి కోరి పిల్లల పుస్తకాలనే ప్రత్యేకంగా ఫోకస్ చేసి మాట్లాడుతున్నప్పుడు పుస్తకం వారికి ఎవరూ వీరి గురించి వివరంగా రాయరేమని నా సందేహం. నేను వ్యాసంలో రాశానో లేదో కాని, వ్యాఖ్యలలో విజ్ఞప్తి చేసుకున్నాను. మళ్ళీ అడుగుతున్నాను. నాకు ఈ పుస్తకాలు online లో కొనే వీలు కనిపించలేదు. ఇవి కొన్న వారు, చదివిన వారు, పిల్లల చేత చదివించిన వారు రాస్తే బావుంటుంది కదా. ఊరికే ప్రస్తావించడానికి కాదు కదా ఫోకస్ అనుకున్నది. పదే పదే ఇదే నా విన్నపం.
    నాకు తప్పనిసరిగా ఉపయోగపడ్తాయి ఈ చర్చలు, ఇక్కడ లభించే వివరాలు అన్నీ. నా ఆశ అవి ఇంకా చాలా మందికి ఉపయోగపడాలని. ఇంకా చాలా మంది చర్చించాలని. ఇంకా చాలా మెరుగైన ప్రయత్నాలు జరగాలని.
    ఉదాహరణకు, మంచి పుస్తకం, ప్రథం వంటి వారు పుస్తకాల గురించి ఇంకొంచెం వివరంగా పరిచయాలూ, సమీక్షలూ పెడితే బావుంటుంది కదా. అన్ని పుస్తకాలూ బావున్నాయి అనే అనుకున్నా, అభిరుచికి తగ్గట్టు, అవసరానికి తగ్గట్టు ఎంచుకోవడానికి ఉపయోగపడ్తుంది కదా. online కొనగలిగితే ఇంకా బావుంటుంది. కానీ, కనీసం ఎంచుకోవడమైనా తేలికైతే ఎవరి చేతైనా తెప్పించుకోవచ్చేమో.

    ఇలా, బాల సాహిత్యానికి ఆదరణ పెరగడానికి ఏదో ఒక్క కోణంలోనే కృషి చేస్తే సరిపోదు అని నేను చెప్పదల్చుకున్నది. తల్లిదండ్రులూ, పిల్లలూ, రచయితలూ, చిత్రకారులూ, ప్రచురణకర్తలూ, గ్రంథాలయాలూ, బడులూ, నోటి మాట promotionలూ అన్నీ కలిసి రావాలి. అలాంటి కృషి నిరంతరమూ జరగుతూనే ఉండాలి.
    ఆరోగ్యకరమైన competetion కూడా కావాలి. ఏ ఒక్క పత్రికో, కొన్ని పుస్తకాలో ఉన్నాయి కదా అని ఊరుకోవడం కాదు. పిల్లల కోసం ప్రచురణ ఐతే చేస్తున్నాం కదా అది చాలదా అన్నట్లు ఉండకూడదు. నాణ్యత, ఉత్సాహం, దిశా నిర్దేశం కావాలి.

    టోటో ఛాన్ పుస్తకం గురించిన పరిచయం అప్పటికప్పుడు ఆ పుస్తకం చదివించేలా చేసింది. అద్భుత చిత్రగ్రీవం ఇంకో పుస్తకం వెతికి చదవాలనిపించేలా చేసింది. అలా “ఉన్నాయి” అని కాకుండా “చదవాలి” అనిపించేలా పరిచయాలు కొత్త తెలుగు పిల్లలల పుస్తకాల గురించి రాస్తారని ఆశగా ఉంది.

  5. Aruna Pappu

    **తెలుగులో ఆలోచించి తెలుగు వారు తెలుగు వారి కోసం రాయాలి. పరిశోధించి, పరిశ్రమించి ప్రయోజనాన్ని పొందాలి. ఇప్పటికే అలా చేస్తున్న వారిని ప్రోత్సహించి వారి గురించి ప్రచారం పెంచాలి.**
    లలితగారూ,
    ఇప్పటికే ఈ పని చేస్తున్నవాళ్లున్నారు. ఉదాహరణకు ‘కొత్తపల్లి’వారు. వారి పరిచయం : http://www.kottapalli.in లో చూడండి. ప్రతినెలా పిల్లలు చెప్పే కథలు, గేయాలు ఇతర వివరాలతో ఒక e – పుస్తకం తీసుకొస్తారు, దాన్నే తక్కువ ఖర్చుతో వీలయినంత నాణ్యంగా ముద్రిస్తారు కూడా. ఆగస్టు 2008 నుంచీ ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే కొందరికి ఈ సైటు గురించి తెలిసే ఉండొచ్చు. అలాగే రిషి వ్యాలీ స్కూలు పిల్లలు చెప్పిన కథలతో నాకు తెలిసి రెండు పుస్తకాలు రెండేళ్ల కిందట వచ్చాయి. అవి ప్రతి ఏడూ వస్తాయేమో మరి. వాటి గురించి చంద్రలతగారు పరిచయం చేస్తే బావుంటుంది. అందులో కనీసం ఒకదానికి ఆమె సంపాదకురాలిగా వ్యవహరించారని జ్ఞాపకం. ఇప్పుడు వస్తున్న కథా వార్షికల వలెనే పన్నెండేళ్లలోపు పిల్లలు రాసిన కథలతో ప్రతి ఏటా ఒక కథా సంకలనం తీసుకొస్తే బావుంటుంది. మై హోమ్, బిగ్ బజార్ వంటి చెయిన్ స్టోర్లను నిర్వహిస్తున్న ఫ్యూచర్ గ్రూప్ ‘డిపో’ పేరుతో ఒక ప్రచురణ విభాగాన్ని ప్రారంభించింది. దీనిద్వారా ఎవరైనా (ముఖ్యంగా పిల్లలు) తమ రచనలను నాణ్యంగా ప్రచురించుకునే వీలుంది. ఇలా ప్రచురించుకున్న పుస్తకాలను దేశవ్యాప్తంగా తమ అన్ని స్టోర్లలో అమ్మకానికి ఉంచుతుంది ఫ్యూచర్ గ్రూప్.

Leave a Reply