చివరకు మిగిలేది…

రాసిన వారు: Halley
************************

గమనిక : ఈ వ్యాసం ఏదో అక్షరాలు గుణింతాలు సమాసాలు గట్రా తెలిసినందువలన తెలుగు చదవటం అబ్బిన ఒక సామాన్య తెలుగు పాఠకుడు రాసిన వ్యాసం. నాకు “విమర్శక రత్న” వంటి బిరుదులు లేవు . సినిమా భాషలో చెప్పాలంటే నేను నేల ప్రేక్షకుడిలా నేల పాఠకుడిని . నేల పాఠకులకి రెవ్యూలు రాసే హక్కులు లేవు అవి కేవలం వేద పండితులే వ్రాయవలెను అన్న అభిప్రాయం ఉన్నవాళ్ళు దయ వుంచి ఈ రెవ్యూ చదవకండి .

“చివరకు మిగిలేది” – బుచ్చిబాబు – 90/- – విశాలాంధ్ర

నేను తెలుగు సాహిత్యంలో కొంచెం వీకు . నాకు బుచ్చిబాబు అంటే “చివరకు మిగిలేది” తెలుసు అంతే .  మొన్నామధ్యన ఈ నవల చదవటం జరిగినది . నాకు నచ్చినది కనుక ఈ నవల గురించి పది మందికి తెలియజెప్పాలని ఇదిగో పుస్తకం.నెట్లో ఇలా రాయవలసి వచ్చింది.

ఇక కథ విషయానికి వస్తే .. కథానాయకుడు దయానిధి జీవితం తాలూకా కష్టాలూ , సుఖాలు , ప్రశ్నలు , సవాళ్ళూ … (అంటే సవాల్ ఔర్ జవాబ్ లో సవాల్ కాదు ! .. బస్తీ మే సవాల్ లో సవాల్ ! ).. ఈ ప్రయాణంలో అతనికి ఎదురయ్యే మనుషులు .. అతన్ని నీడలా వెంటాడే అతని గతం ..ఆడుగడుగునా సంఘం నుంచి అతనికి ఎదురయ్యే ఛీత్కారాలు .. ఇవన్ని కలిపి ఒన్ టు థ్రీ మహరజ మిక్సిలో కలిపేస్తే కథ రెడీ . 1930-1950 ప్రాంతం కథ ఇది .

రాజమౌళి సినిమాలోలాగ ఈ నవలలో కథానాయికలకి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు . అంటే ఉన్న నలుగురు హిరోయిన్లు (మరే మీరు త్తఫ్ఫుగా చదవలేదు ! .. నలుగురు !.. ఐతే అందరు మెయిన్ హీరొయిన్సు కాదు లెండి ) దయానిధి ఫాన్స్ !. దయానిధి యెం.బి.బి.యస్ చదివిన డాక్టరు . అతను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక తక్కువ కులం అమ్మాయితో ఒక “ఎఫైర్” (అదేంటో తెలుగులో వ్యవహారం అంటే ఆ ఫీలింగు రాదు !) నడుపుతూ ఉంటాడు . ఈ అమ్మాయి పేరు కోమలి . ఇది ప్రేమో , కామమో … కొంచెం రుచి కొంచెం చిక్కదనం లాగా కొంచెం కామం కొంచెం ప్రేమో నాకు ఆట్టే అర్థం కాలేదు !. ఈ వ్యవహారానికి దయానిధి అమ్మ తప్పితే ఇంక ఎవరి దగ్గర నుంచీ సపోర్టు దొరకదు అతనికి . కోమలి వాళ్ళ కుటుంబం మరియు దయానిధి వాళ్ళ అమ్మగారు అదో టైపు (అదేంటో తెలుగులో అదో రకం అంటే ఆ ఫీలింగు రాదు! )  అని లోకులు కూస్త్టూ ఉంటారు . తన తల్లి మరణించిన తర్వాత సంఘం నుంచి ఇటువంటి కామెంట్సు మరీ ఎక్కువ అయిపోతాయి ( శేంపిల్ : అమ్మ బుద్ధులే కొడుక్కి వచ్చాయి . లేకపొతే ఆ కోమలితో ప్రేమలు ఏంటి !).ఇదిలా సాగుతూండగా మరొక రెండు ఆడ పాత్రలు ప్రవేశ పెడతారు రచయిత… ఒకరు అమృతం.. మరొకరు సుశీల. అమృతంకి పెళ్ళి అయిపోయినా కూడా వరసకి బావ అయిన దయానిధి అంటే ఒక “ఇది” ( బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  “అది ఒక ఇది లే … ” ) . సుశీలకి దయానిధి అంటే ఇష్టమే కానీ దయానిధి అమృతంతోనూ మరియు కోమలితోనూ చనువుగా ఉండటం చూసి కాబోలు .. ఇష్టం బయటకి చెప్పదు . నిజానికి సుశీలకి దయానిధికి పెళ్ళి జరగటానికి ఆట్టే అడ్డంకులు లేవు అనట్టు గానే అనిపిస్తుంది . వీరు కాకుండా అమృతం తమ్ముడుగా జగన్నాథ్ పాఠకులకి కామిక్ రిలీఫ్ పంచుతాడు ( శేంపిల్ :  “…. కరెక్టు జగ్గూ !” నిధి అందుకున్నాడు . జగ్గన్నాథ్ : జగ్గూ – A jug the crow and the jug – దారుణం , నాథ్ అనండి ) . నమ్మిన బంటు పాత్రలో నారయ్య …  పాత సినిమాలలో జగ్గయ్య , గుమ్మడి, నాగయ్య లాగా అలరిస్తాడు ( నారయ్య అన్న పేరు వింటేనే పాత్ర అర్థం అయ్యుంటుంది చాలా మందికి !  ఇదే నవలలో కథానయకుడి పేరు “నారయ్య ” నౌకరు పేరు “దయానిధి” అంటే ఛీ అంటారేమో ! ) .

కోమలి వ్యవహారం ముదిరి పాకాన పడి, నానా గొడవ జరిగి మొత్థానికి కొన్ని పదుల పేజీలు అయ్యాక కోమలి ఇంకెవరితోనో ఊరు వదిలి పోతుంది , దయానిధికి ఇందిరతో వివాహం జరుగుతుంది . కుటుంబ కలహాలు , దయనిధి కాంగ్రెస్సువాదం , మామగారితో దాని గురించి పట్టింపులు వగైరా కారణాల వలన ఇందిరకు దూరంగా ఉండవలసి వచ్చి అతను మద్రాసులో ఒంటరిగా ప్రాక్టీసు  పెడతాడు .  తిరిగి మళ్ళీ రోస్ అని ఒక ఆడ అసిస్టెంట్ అతని దగ్గర జీతం లేకుండా పని చేయటం , శ్యామల అనే ఒక ఆడపేషంటు అతని ఆసుపత్రిలో కొన్ని దినములు ట్రీట్మెంట్ కోసమని ఉండటం వల్ల సంఘంలో మళ్ళీ రకరకాల పుకార్ల్లు పుడతాయి ( కోమలి , అమృతం, ఇందిర , సుశీల , రోస్ , శ్యామల , నాగమణి (సొంత ఊరిలో ఎదురింటి అమ్మాయి) – ఒక్క దయానిధికి ఇంత మందితో చనువు ఉంటే మన సంఘం ఊరుకుంటుందా ! ). ఈ పుకార్లతో  ప్రాక్టీసు దెబ్బతిని దయనిధి రాయలసీమలో కొత్త జీవితం మొదలుపెడతాడు.

“నరసింహ” సినిమాలో రజనీకాంతుకు గ్రనేటు కొండ దొరికినట్టు (నిజానికి నవలే పాతది కనుక “నరసింహ” సినిమానే కాపీ అని అనుకుందాం)  దయానిధికి వజ్రాలగని తాలూకు ఆనవాళ్ళు దొరకటంతో దశ తిరిగి ధనవంతుడు అయిపోతాడు ( ఇటువంటివన్నీ సినిమాలలో లేదా నవలలో మాత్రమే  జరుగును !). ఎప్పుడో ఊరు వదిలి వెళ్ళిన కోమలి తిరిగి దయానిధి సరసన చేరుతుంది , వచ్చిన డబ్బుతో దయానిధి పెట్టిన ఆసుపత్రి పనులలో సాయపడుతూ , అపుడపుడూ పాత ప్రేమను గుర్తుకు తెస్తూ దయానిధితో కాలం గడుపుతూ ఉంటుంది.

సుశీల మరియు ఇందిరల మరణం , అమృతానికి ఒక బిడ్డ జన్మించటం ( ఇది దయానిధి-అమృతం ల అక్రమ సంతానం అన్నట్టుగా అనిపించటానికి కావలసినన్ని హింట్లు ఇస్తాడు రచయిత ! ) , దయానిధి మిత్రుల జీవితాలు , జగన్నాథ్ కెరీరు బాపతు వగైరా సంఘటనలు మిగిలిన పేజీలను నింపుతాయి . దయానిధి సర్కారు జిల్లా వాడు అని అతను రాయలసీమలో ఆస్తులు కలిగి ఉండకూడదని ( మన తె.రా.స కూతల మల్లే ! ) అతనికి నలుగురు పెళ్ళాలనీ అతను అంత మంచి వాడేమీ కాదని అల్లర్లు రేగటంతో నారయ్య మరణం .. దయనిధి కోమలి ఊరు వదిలి పారిపోవటంతో కథ ముగుస్తుంది.

జీవితానికి అర్థం యేమిటి ? అన్న ప్రశ్నతో మొదలు అయిన ఈ నవల . చివరకు మిగిలేది .. సమాధానం తెలుసుకోటానికి చేసిన ప్రయత్నాలు వాటి తాలూకా జ్ఞాపకాలు – తనను తాను సమాధానపరుచుకోవటం … అన్న దయానిధి స్వగతంతో ముగుస్తుంది !

రచయిత అక్కడక్కడ అడిగే ఫిలసాఫికల్ ప్రశ్నలు నవల చదివాక కూడా వెంటాడతాయి. సంఘం (దాని కట్టుబాట్లు) మరియు గతం ఒక మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చక్కగా వివరించారు.  అయితే నవల మగవారికి మరియు మగరాయుళ్ళవంటి ఆడవారికి మాత్రమే నచ్చుతుంది యేమో !   నవల చివరి పేజిలో ఒక మిని-సమీక్ష ఉంది .. అందులో ఎవరో ఒకాయన (ఒకావిడ ? .. వద్దు అలా చూడకండి నేను ఫెమినిష్టుని కాను . ఏదో ఆడో మగో తెలియక అలా రాసాను అంతే) ఇలా రాసారు .. తెలుగు కల్పనాసాహిత్యంలో చివరికంటా మిగిలేది ఈ “చివరకు మిగిలేది” అని … నిజమేనేమో ! . లేకపోతే ఎపుడో అరవై యేళ్ళ క్రిందటి నవల నేను ఇప్పుడు చదవటం ఏమిటి !

You Might Also Like

87 Comments

  1. కత్తి మహేష్ కుమార్

    @విశ్వనాధ్: అభ్యంతరాలు వ్యక్తపరచడం, విబేధించడం డెమోక్రటిక్ రైట్. ద్రౌపది విషయంలోనైనా ఇక్కడైనా అవి జరగాల్సిందే. కానీ ద్రౌపది విషయంలో చాలావరకూ జరిగింది హూలిగనిజం. రైట్ వింగ్ రౌడీయిజం.అవార్డు ఇవ్వకూడదు. పుస్తకాన్ని బ్యాన్ చెయ్యాలి వంటి అనాగరిక చర్యలకూ దీనికీ పోలికా!

  2. Viswanath

    @కత్తి మహేష్ కుమార్:

    >>> వ్యాసం ప్రచురణకు అర్హం కాదనో లేక పుస్తకం స్థాయికి తగదనో నేను అనటం లేదు. I believe in free expression. కేవలం నా అభ్యంతరాలేమిటో నేను చెప్పాను. అంతే. ఈ వ్యాసం “మదర్ థెరెసా నాకు మల్లికా షెరావత్ లాగా నాకు నచ్చింది” అన్నట్లుంది.If its OK with you, I am fine. But, I am surely not OK with it. <<<<

    ha … ha … ha …

    Similar opinions "Yarlagadda" Droupadi chadivina vallaki kuda untayani meeru enduku gurtincharu mahesh gaaru ….

    ==========
    Viswanadh

  3. బొల్లోజు బాబా

    పుస్తకం గురించి చెప్పిన విషయాలైతే ఒకె కానీ విధానంలో ఏదో లోపం అనిపిస్తుంది. ఒక పుస్తకాన్ని చదవటంలోను, అర్ధంచేసుకోవటానికి అది రాసిన కాలమాన పరిస్థితులను దృ్ష్టిలో ఉంచుకోవాలి. సమీక్షరాయటానికైతే ఆ రచయిత ఇతరపుస్తకాలను కూడా చదివి ఆతని భావజాలంపై తగిన అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

    ఇక చివరకు మిగిలేది లో ఉండే మరో ప్రధానమైన అంశం లైను లైను కు తొణీకిసలాడే కవిత్వం. ఒక్కోసారి కొన్నిచోట్ల కొన్ని పారాగ్రాఫులను పాదవిభజన చేసుకొని పోతే మంచి వచన కవితలాగ అనిపించటం గమనించవచ్చు. ఈ అంశాన్ని విస్మరించారు ఇక్కడ అందరూ.

    బొల్లోజు బాబా

  4. chavakiran

    వెనకటికి ఒక కథ ఉండేది, ఒక పెయింటర్ను రాజు గారు పిలిచి చక్కగా తన బొమ్మ వెయ్యమంటాడు, వాడేమో రాజుగారి భోజన శాలలో ఎక్కువ కాలం గడిపి, పెయింటిగ్లో తక్కువ కాలం గడుపుతాడు. చివరకు బొమ్మ చూపై రోజు ఒక తెల్ల గుడ్డ కట్టి కేవలం పుణ్యత్ములకే కనిపించిద్ది అంటాడు. ఎవరు మాత్రం నోరు తెరవగలరు అందరూ రాజు గారి బొమ్మ నాక్కనిపించిందంటే నాకు అని ఓ ఓ అనుకుంటారు. చివరకు మన విదూషకుడు మాత్రం బయటపడతాడు.

    —-
    మీరు బయట పడ్డారు, మేము ఇంకా లేదు, అంతే సంగతులు.

  5. సుజయ్

    ‘చివరకు మిగిలేది’ వంటి గొప్ప నవలను రివ్యూ చేసేముందు మనం ఆనవల స్థాయికి ఎదిగి ఆ పని చేయాలి. అందులోని పాత్రలు పైకి కనిపించేంత తేలికైనవి కానే కాదు. ఆ నవల అసాంతం మనోవిశ్లేషణాత్మకంగా అసాధారణమైన వర్ణనలతో నిండి వుంటుంది. శరత్ సాహిత్యంలో స్త్రీ పాత్రలను ఎంత హుందాగా, ఉదాత్తంగా కనిపిస్తాయో, ఈ నవలలో సుశీల, అమృతం, ఇందిర , సుశీల ,శ్యామల , నాగమణి వంటి వారు ఈ సమాజంలో అందరిలో ఏ ఒక్కరైనా కనిపిస్తారు మనకు. స్త్రీల అంతరంగాలను తాక గలగితే నా అభిప్రాయాన్ని ఒప్పుకుంటారు. నాకైతే ఈ నవల ఒ భగవత్ గీత, ఒ బైబిల్ ఎన్నిసార్ల చదివినా కొత్త భావాలు కనిపిస్తాయి. కొత్త పాత్రలు మాటలాడుతాయి.
    … సుజయ్

  6. సుజాత

    రాకేశ్వర రావు,
    జగన్నాధం కామెడీ అంటే జగన్నాధం “పాత్రలో” కామెడీ కాదు. అతడి సంభాషణల్లో హాస్యం అని!అతడి ప్రతి డైలాగూ నవలంతా నవ్విస్తూనే ఉంటుంది కాదా! గోదారి వొడ్డున గుడిసె వేసుకుని తత్వ చింతనలో ఒంటరి జీవితాన్ని గడపాలనుకున్న వ్యక్తి పాత్రలో లోతులు కాక ఏం చూస్తాం?

  7. రాకేశ్వర రావు

    @సుజాత: జగన్నాథం కామెడీ అనిపించిందా మీకు। లోతులు లోతులు చూడండి అతని పాత్రీకరణలోఁ॥

    అన్నట్టు వ్యాసకర్తల గుఱించి కాస్త పరిచయం వ్రాస్తే బాగుంటుంది। ప్రతీవ్యాసానికీ॥ అలా చేసిన ఇలాంటి వ్యాసాలకు ప్రత్యుత్తరార్హత వుందో లేదో తెలుస్తుంది॥

  8. HalleY

    మిత్రుడు ఒకడు ఏమిటి కామెంట్లు ఆపేసావు అని అడిగాడు . మళ్ళీ మొదటికి వచ్చా ! . ఒట్టు తీసి గట్టు మీద పెడతా !. నాకు ఇది అలవాటే లెండి 😀

    @Venu :
    “ఓ సీరియస్ తెలుగు సినిమాని ‘తెలుగు సినిమాలు’ చూడటంలో ‘కొంచెం వీకు’ అయిన ఓ ‘నేల ప్రేక్షకుడు’ చూశారు. తన పద్ధతిలో ఏదో రాసేశారు. దాన్ని ఆయన కామెడీ త్రీడీ కళ్ళజోడుతో చూసేసినట్టు ఎవరికైనా అనిపిస్తే మాత్రం? …‘సీరియస్’గా తీసుకోవటం ఏం న్యాయం? ఎవరి అభిప్రాయం వారిది కదా! ”
    Agree

    @Purnima @Malathi:
    “కోతి కొమ్మచ్చి పరిచయాన్ని సీరియస్ గా రాస్తే?! కూడదా?! ”
    చెప్పండి యువర్ ఆనర్ చెప్పండి 🙂

    @Praveen Garlapati:
    “అంతే కానీ ఆయ్‌ఁ… నువ్వు ఇలా వ్రాస్తావా ? ఇది ఎంత చారిత్రాత్మక పుస్తకం. నువ్వింకా పాలు తాగే పసివాడివి, అర్థం చేసుకోలేకున్నావు అనడంలో అర్థమే లేదు.”
    Agree

    @Vasu
    “కానీ ఒక పుస్తకాన్ని ఇలాగే చూడాలి అని అనడం మాత్రం సమంజసం గా అనిపించట్లేదు. ”
    “కానీ ఇలాటి (క్లాసిక్) పుస్తకాన్ని ఇలా చూడకూడదు అని ఇక్కడ చాలా మంది అనడం మాత్రం సమంజసం గా అనిపించట్లేదు.”
    Agree !.

    @Kameshwara Rao :
    “అక్కడ జరిగేది శాస్త్రీయ సంగీత కచేరీ. దాని మీద ఆసక్తి ఉన్నవాళ్ళే అక్కడికి వచ్చుండాలి. అక్కడకి వచ్చి ఆసక్తి లేకపోతే గప్ చిప్పని వెళ్ళిపోవాలి. అలా చెయ్యకుండా అక్కడే కూర్చుని ముచ్చట్లాడుకోవడం ఆ జనాల తప్పు. వాళ్ళని చూసి, వాళ్ళకి నచ్చేట్టు పాడమనడం అంతకన్నా తప్పు! ”

    ఒక తేడా ఉన్నది గమనించ ప్రార్థన ! . “చివరకు మిగిలేది” పుస్తకం పైన బుచ్చిబాబుగారు కానీ లేదా ప్రచురణకర్తలు కానీ “ఈ పుస్తకం ఫలానా ఫలానా మాత్రమే చదవవలెను అని వ్రాయలేదు” . కాబట్టి శాస్త్రీయ సంగీత కచేరీ పోలిక అంత కరేక్టు కాదేమో మరి . శాస్త్రీయ సంగీత అభిమానులు మాత్రమే రావలెను అనట్టుగా .

    As mentioned in my previous comment if there is only one way of looking at a book that is deemed right by a select few and viewing it in any other manner amounts to heresy , i might sound harsh but i will ask the “select few” to do me a favour : Please get in touch with the publishers/authors and put a statuatory warning on the select books – “This book should be interpreted and read in only this way” :).

    Now for the reply to comment by జంపాల చౌదరిగారు (since someone here asked for it):

    “ఆ రెండు వాక్యాలు తీసేసి సమీక్ష (లేదా పరిచయం) చదివితే ఈ పుస్తకం ఆయనకు మిక్సీలో వేసి రాసేసిన ఫార్ములా పుస్తకంలా కనిపించిందనీ, గందరగోళంగానూ, వేళాకోళంగానూ అనిపించింది అన్న అభిప్రాయం వస్తుంది. ఈ అస్పష్టతతోనూ, వైరుధ్యాలతోనే ఈ వ్యాసంతో ఇబ్బంది. ఉద్దేశపూర్వకంగానో, అనాలోచితంగానో కానీ హాస్యం ఎక్కువై, చెప్పదల్చుకొన్న విషయాలు చెప్పలేదేమో అనిపిస్తుంది”

    I still liked the book for the simple storyline with all the drama , twists , turns , love , humor.However , if my writing style was found confusing (which i know is the case with many) then i will see what i can do about it :).

    Sorry for the controversy though :
    నేను కొంచెం Bala saheb thackarey టైపు అనుకుంటున్నారో ఏమో ! 🙂 .

  9. KumarN

    ఈ సందర్భంగా ఈ పుస్తకం మొదటి 20-30 పేజీలు మాత్రం చదివి బోర్ అనిపించో, వేస్ట్ అనిపించో పక్కన పడేసిన వారికి నా అభ్యర్థన ఏంటంటే, కావలిస్తే మీరా 20-30 పేజీలు వదిలేసి మిగతా చదవండి. నేను పుస్తకం మొదలు పెట్టినప్పుడు అలాగే ఫీల్ అయ్యాను కాని, మళ్ళీ ఎప్పుడో మధ్యలో రెండు, మూడు పేజీలు చదివితే, చాలా ఇంట్రస్టింగా ఉండి, మళ్ళీ మొదటి కొచ్చి పూర్తిగా చదివాను. తరవాత మళ్ళీ మళ్ళీ చాలా సార్లు చదివాను.

    Earth Shattering ఏం కాదు కాని, మొదటి 20 పేజీల వల్ల పుస్తకం చదివే అనుభవం కోల్పోతున్నారేమోనని ఈ రిక్వెస్ట్.

  10. వేణు

    సుజాతా! కామేశ్వరరావు గారి వ్యాఖ్య చదవమన్న మీ ఉద్దేశం అర్థమైంది. నేను అనుకుంటున్నదేమిటంటే… శాస్త్రీయ సంగీతమంటే ఆసక్తి ఉన్నవాళ్ళం ‘ఇక్కడ’ సినీ సంగీత విభావరికి వచ్చామేమోనని! 🙂

    హేలీ గారి సమీక్షను ‘పునర్ మూల్యాంకనం’ అనో, మరోటో నేననుకోను. ఆ పుస్తకాన్ని అర్థం చేసుకునే తీరు ఇది కాదు. దాని గురించి చెప్పిన తీరూ అంతే. మళ్ళీ సినీ పరిభాషలో చెప్పాలంటే- ‘మాతృదేవోభవ’ సినిమాను ‘అహ నా పెళ్ళంట’ టైపులో కామెడీగా అర్థం చేసుకోకూడదు.

    కానీ- ‘ఆ పుస్తకం నాకలాగే అర్థమైంది. ఇప్పటికీ తు.చ తప్పకుండా నేను ఇదే చెబుతాను’ అని చెప్పేవాళ్ళతో వాదనేమీ ఉండదు!

  11. కత్తి మహేష్ కుమార్

    @వాసు: ఎవరన్నారు ఈ పుస్తకాన్ని ఇలాగే చదవాలి అని? హేలీ రాసింది తను రాశాడు. అది తనిష్టం. మాకు తను రాసిన శైలితో కొన్ని అభ్యంతరాలున్నాయి. అవే మేమూ చెప్పాము. త ను రాసింది తప్పు మ్ేము రాసింది కరెక్ట్ అని ఎవరన్నారు?

  12. సుజాత

    వేణు గారూ,
    ఒక్కసారి మీ వ్యాఖ్య పైన ఉన్న కామేశ్వర రావు గారి వ్యాఖ్య చదవండి!

    కామేశ్వర రావు గారూ, సింధు భైరవి లో ఆ సీన్ చాలా గొప్పదని చెప్తారు కానీ నాక్కూడా ఒళ్ళు మండించిన సీను. శాస్త్రీయ సంగీతమంటే ఆసక్తి లేనివాళ్ళు సినీ సంగీత విభావరికే పోవాలి.

    చిలకపాటి శ్రీనివాస్ గారు.
    కాలాతీత వ్యక్తులా! ప్లీజ్ సర్!

  13. Vasu

    నేను ఈ పుస్తకం చదవలేదు. కానీ ఇలాటి (క్లాసిక్) పుస్తకాన్ని ఇలా చూడకూడదు అని ఇక్కడ చాలా మంది అనడం మాత్రం సమంజసం గా అనిపించట్లేదు.

    @ కొత్తపాళీ గారు – “సరికొత్త కాంత్రవర్సీకి తెరతీస్తున్నాను. డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు ద్రౌపదిని పరామర్శించిన తీరుకీ, హేలీ గారు దయానిధిని పరామర్శించిన తీరుకీ పోలికలేమిటి, తేడాలేమిటి” – ఎవరన్నా చెప్తారేమో అని వెయిటింగ్. నేను రెండూ చదవలేదు కనుక.

  14. Vasu

    నేను పుస్తకం చదవలేదు. కానీ ఒక పుస్తకాన్ని ఇలాగే చూడాలి అని అనడం మాత్రం సమంజసం గా అనిపించట్లేదు.

    @ కామేశ్వర రావుగారు – పోలిక సరిగ్గా బోధపడలేదు. సింధు భైరవి లో సుహాసిని ఇక్కడ Halley గారా . ప్రేక్షకులు హ్యలీ గారి లాటి పాఠకులా??

  15. కామేశ్వర రావు

    This is my last comment on this post.

    శ్రీనివాస్ గారు,

    పాయింటు 3 గురించి:

    నేనీ వ్యాసం పట్ల నిరసన వ్యక్తం చెయ్యలేదు. దీన్నిక్కడ ప్రచురించడం వల్ల ఆశించిన ప్రయోజనం ఏమిటని అడిగాను. దీని వల్ల ఒక “డయలాగ్”కి ఆస్కారముంటే ఏమైనా ప్రయోజనం ఉండేదేమో. దానికి ఇక్కడెవరూ సిద్ధంగా ఉన్నట్టు లేరు. Everyone is eager to only express their opinions, nobody is ready to listen to others. Ofcourse, that is what happens in almost all the “discussions”! 🙂

    పాయింటు 7 గురించి:

    నేను చెప్పిన ఎనాలజీని మీరు సరిగా అర్థం చేసుకోలేదు. I hope HalleY understands it!

  16. chinni

    బాగుంది సమీక్ష -:) దయానిధి నాకెప్పుడు అర్ధం కాడు ఎన్ని సార్లు చదివిన .

  17. ప్రవీణ్ గార్లపాటి

    ఇక్కడ వ్యాఖ్యలు నాకు వింతగా తోస్తున్నాయి.
    ఒక పక్కన Freedom of expression లాంటి మాటలు మాట్లాడుతూనే నువ్వు ఇలా ఆలోచించాల్సింది అని చెప్పటం హాస్యాస్పదం.

    ఒక సినిమాకి సమీక్ష వ్రాసినా, ఒక పుస్తకానికి సమీక్ష వ్రాసినా అది వ్రాసిన వారి పంథాలో సాగడమే నే విన్నది కానీ చదివే వారు కావాలనుకునే పంథా కాదు. అందులో ఇంకేమీ మిగలదు ఒక్క మనోభావాలను గాయపరచుకోవడం తప్ప.

    మధ్య మధ్యలో ఎవరో ఇది ఇలా అని ఒక్కొక్క పాత్రనీ విశ్లేషించారు. అద్భుతం, మీ కన్నీ సరిగా అర్థమయ్యాయి. మీకర్థమయినట్టు మీరు సమీక్ష వ్రాయండి పుస్తకం.నెట్ లో అయితే. అంతే కానీ ఆయ్‌ఁ… నువ్వు ఇలా వ్రాస్తావా ? ఇది ఎంత చారిత్రాత్మక పుస్తకం. నువ్వింకా పాలు తాగే పసివాడివి, అర్థం చేసుకోలేకున్నావు అనడంలో అర్థమే లేదు.

    ఒక మనిషికున్న అనుభవాలని బట్టీ, అతని వయసుని బట్టీ, ఆలోచనలని బట్టీ interpretation మారుతుంది. అలాగే ఒక మనిషి చెప్పాలనుకున్న తీరూ అతను కోరుకున్నట్టు ఉంటుంది.

    ద్రౌపది మీద యార్లగడ్డ గారు తనకి నచ్చిన విధంగా interpret చేస్తే ఆహా ఓహో అన్నవాళ్ళు ఇక్కడ ఒక పాఠకుడు తన interpretation చెబితే అంతగా ఎందుకు hurt అయ్యారో నాకర్థం కాదు.
    Interpretations and representation of interpretations are not limited to famous people. It could be done by anybody who can think.

    నేనయితే ఈ వ్యాసాన్ని ఆ ఆలోచనతోనే చదివాను. నాకేమీ అభ్యంతరంగా కనబడలేదు.

    (వ్యక్తిగతంగా ఈ పుస్తకం ఇరవై పేజీలు చదివేసరికి పక్కన పెట్టాను. అంత అనాసక్తంగా నాకు అనిపించింది. అంచేత ఇప్పుడు నన్ను కూడా వెలివెయ్యరు కదా 🙂 )

  18. Purnima

    @మాలతి:

    >> ఏ పుస్తకం పరిచయం చేస్తున్నారో ఆపుస్తకానికి తగిన గొంతుతో పరిచయడంలో ఓ పట్టు ఉంటుందనే నేను కూడా అనుకుంటున్నాను. కోతికొమ్మచ్చి పరిచయంచేసినప్పుడు నవ్వుతూ తుళ్లుతూ చెప్పినట్టుగానే.

    కోతి కొమ్మచ్చి పరిచయాన్ని సీరియస్ గా రాస్తే?! కూడదా?!

  19. పుస్తకం.నెట్

    @HalleY:

    హాలీ గారు, కామేశ్వరరావు గారు,

    ఈ వ్యాసం పుస్తకం.నెట్ లో ప్రచురించటం వల్ల ప్రయోజనం ఏంటి అని అడిగారు. ఒక వ్యాసాన్ని అంగీకరించటంలోనూ, నిరాకరించటంలోనూ తుది నిర్ణయం పుస్తకం.నెట్ అడ్మిన్‍లదే! ఇక్కడ మీకు ఈ వ్యాసం గురించి వివరణ ఇవ్వడానికి ఏకైక కారణం, పుస్తకం.నెట్ ముఖ్యోద్దేశ్యాన్ని మరోసారి హైలైట్ చేసే అవకాశం కనిపిస్తుంది కావున.

    ఈ వ్యాసం మేం అంగీకరించడానికి కారణాలు:
    ౧. ఈ వ్యాసంలో ఒక పుస్తకం నచ్చిన తీరుని ఒక పాఠకుడి తన అనుభవాలతో, తనకున్న పరిమితుల్లో వివరించడానికి ప్రయత్నించడం. సినిమా పోలికలు మాకు ఇబ్బంది కలిగించలేదు. ఓ పాఠకుడి తనకున్న అనుభవంతో పోల్చి చూడ్డాన్ని మేం తప్పుబట్టలేదు.
    ౨. ఈ వ్యాసం ఒక “క్లాసిక్”గా పరిగణించబడ్డ పుస్తకమే అయ్యుండచ్చు గాక! అంత మాత్రం చేత దీన్ని ఆరాధనపూర్వకంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో, ఈ పుస్తకానికి అభిమానులుంటే వారికి నచ్చే విధంగా ఉండాలనీ మేం అనుకోలేదు. ఒక రచన సీరియస్ అనేదీ, కాదనేదీ ఆయా పాఠకుడి నిర్ణయించుకోవాలి. పాఠకునిగా ఇందులో కామెడీ కనిపించి ఉంటే, అది అతడి అనుభవం.
    ౩. ఒక రచన “క్లాసిక్” గానో, “అద్భుతమైన” రచన గానో కొన్ని దశాబ్ధాల పాటు నిల్చి ఉంటే, అందులో ఏదో విషయం ఉండే ఉంటుంది అనుకున్నా, వ్యాసకర్త ఆ విషయాన్ని విస్మరించినా, వ్యాసం చదివేవారు ఆ విషయం మీద ఆసక్తికరమైన చర్చ మొదలెట్టే అవకాశం లేకపోలేదనీ ఒక ఆలోచన.
    ౪. ఈ వ్యాసంలో రచయితని కానీ, పాత్రలని కానీ దుర్భాషలాడలేదు. అభ్యంతరకర పదజాలం వాడలేదు.

    “పుస్తకం.నెట్” అనేది ఒక చట్రంలో ఇరికించబడ్డ “సమీక్ష”, “విమర్శ”, “పరిచయం” లాంటి పదాల (ఈ పదాల వల్ల చాలా వరకూ గందరగోళం ఏమో) కోసం పుస్తకం పట్ల పాఠకునిలోని భావాలను నిలువరించేది కాదు. పుస్తకాలు చదివి ఆనందించడానికి ఏ ప్రత్యేకమైన అర్హతలూ అవసరం లేనట్టే, పుస్తకం.నెట్ లో పుస్తకాలపై రాయటానికీ ఏ అర్హతలూ, ఏ standards లేవు. (అంటే ఇహ ఏం రాసినా పర్లేదు అని అర్థం కాదు.)

    ఈ సైటు ముఖ్యోద్దేశ్యం మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాం:

    “ఈ సైట్ ముఖ్యోద్దేశ్యాన్ని విఖ్యాత రచయిత జార్జ్ ఆర్వెల్ మాటల్లో చెప్పాలంటే..

    Nearly every book is capable of arousing passionate feeling, if it is only a passionate dislike in some or the other reader, whose ideas about it would surely be worth more than those of a bored professional.”

    పుస్తకం.నెట్ అనేది మరో వికీపీడియానో, ఎన్‍సైక్లోపీడియానో కాదు. ఇక్కడ పుస్తకాల చదివే సామాన్య పాఠకుల అనుభవాలు / జ్ఞాపకాలు / సమీక్షలు / పరిచయాలు – అన్నీ ఉంటాయి. సైటున విచ్చేసే వారు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని మనవి.

    హాలీ గారు “నేల పాఠకుడు” అనే పదప్రయోగం చేశారు. అలా క్రియేటివ్ ఉపమానాలు కావాలనుకుంటే ఆర్కే లక్ష్మన్ “కామన్ మాన్”లా “కామన్ రీడర్” అనుకోండి.. వారికి వేదిక కావాలన్నది ఈ సైటు ఉద్దేశ్యం.

    ధన్యవాదాలు,
    పుస్తకం.నెట్

  20. Chilakapati Srinivas

    1. భలే! భలే!
    2. ఒక పుస్తకాన్ని అందరూ ఒకేలా అర్థం చేసుకోవాలనీ, ఆ పుస్తకంపై అందరూ ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉండాలనీ ఎవరైనా అనుకుంటారని నేననుకోను. ఒకరి చెత్త మరొకరికి బంగారం. లేదా ఒకరి దేవుడు మరొకరి దయ్యం. అదే ప్రకృతీ, వికృతీ.
    3. తనకు నచ్చినట్టూ, వచ్చినట్టూ సమీక్ష/పరిచయం రాయడానికి హేలీ గారికి ఎంత హక్కుందో, దాని పట్ల నిరసన వ్యక్తం చేయడానికీ సుజాత/మహేష్/కామేశ్వరరావు గార్లకు అంతే హక్కుంది. అయితే ఈ సమీక్ష/పరిచయం/అభిప్రాయం ఇట్లా రాసి ఉండకూడదని వాళ్ళు రాసి ఉందకూడదని మరికొందరు అభిప్రాయపడే హక్కుందా? ఉంటే వాళ్ళు అట్లా రాసి ఉండకూడదని నేను అభిప్రాయపడవచ్చా? నేను ఇట్లా రాసి ఉండకూదదని మరొకరు అభిప్రాయ పడే హక్కుందా? ఈ అనంత లూపుకు (దీన్ని పరమ దుష్ట సమాసమనవచ్చా?) అంతెక్కడ?
    4. అన్నిటికీ సమాధాన మిచ్చిన హేలీ గారు జంపాల చౌదరి గారికేల జవాబీయలేదు? నాది కూడా అదే ప్రశ్న కదా! ఆ రెండు వాక్యాలయినా తీసేయాలి; లేదా వాటిని సమర్థించే సమాచారమన్నా అతికించాలి. ఇంతకీ హేలీ గారికి ఇది నచ్చిందా లేదా?
    5. హేలీ ఈ పుస్తకం చదివినందుకే కొందరు ఆనందపడినట్టుంది. నేనూ పడవచ్చా? ఇప్పుడు కాదు కానీ రేపు చూద్దాం.
    6. పాత కాలంనాటి పాత్రల్ని (వంటవి కాదు – నమ్మినబంటు నాగన్న, కొవ్వొత్తి కరుణ లాంటివి) వాడి వాడి అరగదేస్తే, ఇప్పుడవి ఎదురుపడితే గేలి చేయవచ్చా? లేక నవ్వుకోకుండా ఉండగలమా?
    7. శాస్త్రీయకచేరీ మధ్యలో సన్మానాలూ, ఉపన్యాసాలూ లేకుండా ఉండవు. మధ్యలో మిమిక్రీ కూడా పెడ్తే “ఓహో! ఈ మధ్య మిమిక్రీ కూడా పెడుతున్నారు కాబోలు ఇప్పటి కుర్రకారు కోసం” అని సమాధానపడమా, లేమా?
    8. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటుంటే అందరూ చుట్టూ మూగుతారా? ఇద్దరు పోట్లాడుకుంటుంటే చుట్టూ చేరి తలో మాట విసరరా?
    9. హేలీ గారు కాలాతీత వ్యక్తులు ఎప్పుడు చదవబోతున్నారు?

  21. మాలతి

    క్లాసులో చివరిబెంచిలో కూర్చున్న కుర్రాడు నేనూ ఉన్నానని చెయ్యెత్తి తనఉనికిని తెలియజేసుకుంటున్నట్టు, నామాటలు రెండు.
    ఏ పుస్తకం పరిచయం చేస్తున్నారో ఆపుస్తకానికి తగిన గొంతుతో పరిచయడంలో ఓ పట్టు ఉంటుందనే నేను కూడా అనుకుంటున్నాను. కోతికొమ్మచ్చి పరిచయంచేసినప్పుడు నవ్వుతూ తుళ్లుతూ చెప్పినట్టుగానే. పైవ్యాఖ్యలలో కామేశ్వరరావుగారి వ్యాఖ్యే నాది కూడాను.
    telugu4Kids అడిగిన ప్రశ్న నేను కూడా ఆలోచిస్తున్నాను. ఏటపాకి స్పందనలు ఎక్కువగా ఉంటున్నాయి, వేటికి ఆదరణ నామమాత్రంగా ఉంటోంది అన్నది నేను కూడా ఇంకా అర్థం చేసుకోడానికే ప్రయత్నిస్తున్నాను.

  22. వేణు

    చాలామంది గొప్ప కళాఖండంగా అర్థం చేసుకున్న ఓ సీరియస్ తెలుగు సినిమాని ‘తెలుగు సినిమాలు’ చూడటంలో ‘కొంచెం వీకు’ అయిన ఓ ‘నేల ప్రేక్షకుడు’ చూశారు. తన పద్ధతిలో ఏదో రాసేశారు. దాన్ని ఆయన కామెడీ త్రీడీ కళ్ళజోడుతో చూసేసినట్టు ఎవరికైనా అనిపిస్తే మాత్రం? …‘సీరియస్’గా తీసుకోవటం ఏం న్యాయం? ఎవరి అభిప్రాయం వారిది కదా!

  23. కామేశ్వర రావు

    @HalleY,

    మీరిచ్చిన చివరి కామెంట్లో ఎనాలజీని తీసుకొని ఒక ప్రశ్న అడుగుతున్నాను. శాస్త్రీయసంగీతం రాని ఒకడు ఆ సంగీతం విని ఇది వట్ఠి “సపస సంగీతం” అని కొట్టి పారేస్తే, దానికి అందులో అభిరుచి ఉన్నవాళ్ళు ఎలా స్పందించాలి చెప్పండి? తనకి నచ్చే సంగీతం కావాలని అతను కోరుకోవడంలో తప్పు లేదు. రుద్రవీణలో హీరో చేసినట్టు సామాన్య ప్రజలకి ఇష్టమైన సంగీతాన్ని అందించాలనుకోవడమూ తప్పు లేదు.

    మీకు సినిమాలు బాగా తెలుసు కాబట్టి మరొక సినిమా ఉదాహరణ ఇస్తాను. సింధుభైరవి సినిమాలో (ఇదీ బాలచందర్ సినిమానే) హీరో శివకుమార్ సంగీత కచేరి ఇస్తూ ఉంటాడు. హీరోయిన్ సుహాసిని కొంతమంది ప్రేక్షకులు కచేరి వినడం లేదన్న విషయాన్ని గ్రహించి, కచేరి మధ్యలో ఆపించి, ప్రజలకి అర్థమయ్యేట్టు పాడమని అడుగుతుంది. పెద్ద లెక్చరు కూడా ఇస్తుందని గుర్తు. తనే స్వయంగా పాడి వినిపిస్తుంది కూడా! ఇది నా దృష్టిలో అర్థం లేని పని. ఈ సీను నాకు మహా కంపరంగా ఉంటుంది. అక్కడ జరిగేది శాస్త్రీయ సంగీత కచేరీ. దాని మీద ఆసక్తి ఉన్నవాళ్ళే అక్కడికి వచ్చుండాలి. అక్కడకి వచ్చి ఆసక్తి లేకపోతే గప్ చిప్పని వెళ్ళిపోవాలి. అలా చెయ్యకుండా అక్కడే కూర్చుని ముచ్చట్లాడుకోవడం ఆ జనాల తప్పు. వాళ్ళని చూసి, వాళ్ళకి నచ్చేట్టు పాడమనడం అంతకన్నా తప్పు!

    నేను, రుద్రవీణ సినిమాలో తండ్రిలాగా శాస్త్రీయ సంగీతమే గొప్ప అని జానపద సంగీతాన్ని తూలనాడను. అందులో హీరోలా శాస్త్రీయ సంగీతాన్ని కూడా సామాన్యులకి అర్థమయ్యేలా పాడాలని చేసే ప్రయత్నాన్ని సమర్థిస్తాను. కాని సింధుభైరవి సినిమాలోలా శాస్త్రీయసంగీత సభకి వచ్చి దాని మీద ఆసక్తి కలగకపోయినా అక్కడే కూర్చుని ముచ్చట్లాడుకునే వాళ్ళని, వాళ్ళకి నచ్చేలా పాడమని లెక్చరివ్వడాన్నీ హర్షించను.

    Hope you got my point!

  24. సౌమ్య

    @Halley: NitPicking…. Its ‘తరలి రాద తనే వసంతం..’ I think 😛

  25. HalleY

    My BarahaIME has gone bonkers . So resorting to english . Please pardon.

    @Katthi Maheshkumar :
    On your thoughts on potrayal of female characters :
    Hmm Interesting :). But that is precisely the reason why i didnt like the potrayal of the female characters in this novel . If making an impact on some man’s life is the ulterior motive of a woman and just potraying that is doing full justice to a woman … then sorry ! . I’ve always thought about woman on different lines.

    “ఉన్న ఒక్కమగాడినీ తమవైపు తిప్పుకోవాలనే అసంకల్పిత ఆలోచన అక్కడున్న కోమలి,సుశీల,నాగమణి,అమృతం తమదైన విధంగా చెయ్యటం అత్యంత సహజపరిణామం. కాలేజీ టుర్లలో, కార్పొరేట్ ఆఫీసుల్లో ఇది కొత్తకాదే!”

    Okie .. like i mentioned above , i haven’t seen these species of the female fraternity yet ! in my brief stint in the corporate up-north in Pune and in whatever college life i have been through . Anyway if that is such an oh-so-natural thing .. then perhaps you are right. That way actually even S.S.Rajamouli would be right ! 🙂 .

    On a lighter note please let me know the details of such corporate offices , colleges 😀

    “నారయ్య పాత్ర కల్లాకపటం,మకిలి- మాలిన్యం లేని పల్లెజనుల ప్రవర్తనకి చిహ్నం”
    I am not sure how many B&W films you have seen , But those actors have acted in multiple roles which stand for just that esp.Nagaiah and Gummadi .

    @Sravya :

    Pretty much . If i am reading this novel and some friend of mine comes along and asks “Ooo novel .. what is the story?” .. I will tell him the story in a manner similar to the way i have narrated above.

    For all the brickbats i have received . I still strongly feel the story of the novel is just that 🙂 (Yes! with all the sarcasms , analogies intact) .

    Yes perhaps someone who is older than me would perhaps say “Oree Mlecchuda !” 🙂 But that doesn’t mean i change my opinion on something :D.

    @Ruth :
    Thanks

    Finally one small clarification on the term “nEla pAThakuDu” .
    Again i go back to movies 😀 (No! don’t look at me like that) .. There is this film “Rudraveena” by a gentleman called “K.Balachander” in which there is a debate between the hero and his father on him singing a song for woodcutters by tweaking a raga here and there . The song is “Nammaku nammaku ii reyini” . I think the people who are hitting me with brickbats stand on one end and i am the woodcutter like fellow :).

    This novel can be seen as a intense psychological story with each character and the novel perhaps worth some 10-20 PhD thesis’. I saw it as a simple story with all the drama,love,humour etc as mentioned . I believe that is the rawest ground-zero way of looking at this novel.If that is wrong and if there is only one way of looking at the novel which is deemed right by a select few then sorry for the folks who took offense.

    I am not going to comment anymore on this thread .. i dont want to sound like an old tape recorder 😀 .. though that doesn’t really stop future readers from throwing more bricks 🙂 .

    Again apology for not typing in telugu . My IME is seriously gone 🙁

  26. Ruth

    First of all, Bravo Halley !!!
    I really liked this whole thread because the ppl who are always thrashed as the modern/free/new thinkers (ppl like kathi or sujatha- no offence intended!) are the offended here. I haven’t read this book so no comments about that, but really, even if the book is oh-so-great!, Halley has full right to say what he felt when he read it, period. I have heard so much about chalam and when I finally read his works, I felt sssooo yaak ! (but ofcourse, I didn’t write a review abt it :)) when I tried to discuss about it, I always got the answer – you are not matured enough to understand chalam or so n so….. I just thought the elite/matured/great telugu literature is not my cuppa and went back to my jane austen, antony trollope, or PG Wodehose.
    But this guy really dared to read and express his views about a oh-so-great book and is even answering all the queries/comments. Wow !!! way to go Halley !!!
    Probably if this trend continues, who knows, I might come up with my own views about another oh-so-great book chalam’s “Premalekhalu”………….al the best !!!

  27. mandaakini

    @Sraya
    correct.

  28. కత్తి మహేష్ కుమార్

    @హేలీ:1)–”రాజమౌళి సినిమాలోలాగ ఈ నవలలో కథానాయికలకి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు”
    కోమలి దయానిధిలోని యవ్వన శక్తిని ప్రజ్వలించి “యవ్వనమొక ప్రాచీనశక్తి… నిశోధి తెరుచుకున్న ద్వారాలమధ్య ఆత్మహత్య చేసుకున్న యవ్వనపు శక్తి, సంస్కారాన్ని కోరదు… ఏ చదువు ఈ అస్థిపంజరపు నిర్మాణాన్ని మార్చగలదు? బుర్ర,మెదడు, యివి దాస్యానికి అంతరాయాలే.”అని గ్రహింపజేసే మహత్తరమైన catalyst.ఒక మనిషి జీవితంలో పూర్తిగా ఏర్పడని యవ్వనం- సౌందర్యాలకి చిహ్నం.ఈ పరిణామక్రమంలో దయానిధి “నాకు చంద్రుడూ, నక్షత్రాలూ, మేఘాలూ, హిమాలయా పర్వత శిఖరం, కోమలీ అందరూ సమానులే. ఇవి లేకపోతే నే జీవించలేను. వీటిని వాంఛించను. ప్రేమిస్తాను.” అని కోమలికి తన జీవితంలోని ప్రాముఖ్యతను వివరిస్తాడు. ఇంతకన్నా ఉత్తమమైన ప్రేమ,స్వార్థరహితమైన ప్రేమ ఉంటుందా? అంతకన్నా గౌరవం “సౌందర్యానికి” లభిస్తుందా?”. ఇది దయానిధి తాత్విక చింతనలోని మార్పుకాదా…ఆ మార్పుకు కారణం స్త్రీకాదా? Komali is a symbol primordial womanhood.

    అమృతం సంపూర్ణ కులస్త్రీకి చిహ్నం. బ్రతకనేర్చినతనం,జాణతనం, ప్రేమతత్వం,మాతృకాంక్ష,కుటుంబ ఇచ్చ కలిగిన స్త్రీ.అమృతం-దయానిధి కలయిక ప్రేమోద్రేకమే అయినా, పరిస్థితి అమృతం కల్పించింది అనేది కాదనలేని నిజం. ఆ కలయిన అమృతం తన సంసారాన్ని నిలబెట్టుకోవటానికి ఒక “అవసరం” అయినంత మాత్రానా, తనకు దయానిధి పట్ల ఉన్న ప్రేమ మలినమైపోదు. ప్రేమలేని దయానిధికి తన అపేక్షని అందించి, తన అవసరాన్ని పూర్తి చేసుకున్నంత మాత్రానా అమృతం స్వార్థపరురాలైపోదు. కానీ ఆ విషయాన్ని అంగీకరించడానికి మనకు మనసొప్పదు.

    అమృతం నిజరూపాన్ని (ఒక స్థాయిలో విశ్వరూపాన్ని) చూసిన కళ్ళతో “ఈ వ్యక్తుల్నీ, ఈ స్థలాన్నీ”చాడలేను అనుకుని వెళ్ళిపోతాడు. ఈ పరిణితి అమృతం ప్రేమవలనకదా దయానిధిలో వచ్చింది? మరి హీరోయిన్లకు ప్రాధాన్యత లేదంటావే!!!

    2) “నాకు ఈ నవలలో స్త్రీ పాత్రలు అదే పనిగా ఎదో దయనిధి ఒక పెద్ద నవమన్మధుడు అనట్టుగా అతని వెంట పడేటట్టుగా చిత్రీకరించటం నచ్చలేదు”…

    నవలలోని ‘అనుభవానికి హద్దులు లేవు’ ప్రకరణ మొత్తంగా ఈ ఆకర్షణ,వికర్షణ,ప్రకర్షణలదే. ఇందులో దయానిధి మురిసిపాటుకన్నా, స్త్రీత్వంలోని మార్మికతను అర్థంచేసుకునే ప్రయత్నం కనిపించకపోవడం శోచనీయం. యవ్వనాకర్షణలోని స్వేచ్చననుభవిస్తున్న స్త్రీపాత్రల మధ్యనున్న సౌందర్యాస్వాదకుడైన యువకుడు ఆ స్త్రీల స్త్రీత్వాన్ని గురించి అర్థం చేసుకునే ఆలోచన చేస్తే అది సత్యాన్వేషణ కాదా? ఉన్న ఒక్కమగాడినీ తమవైపు తిప్పుకోవాలనే అసంకల్పిత ఆలోచన అక్కడున్న కోమలి,సుశీల,నాగమణి,అమృతం తమదైన విధంగా చెయ్యటం అత్యంత సహజపరిణామం. కాలేజీ టుర్లలో, కార్పొరేట్ ఆఫీసుల్లో ఇది కొత్తకాదే! ఒకమగాడు పదిమంది ఆడవాళ్ళ మధ్యనున్నా అదే జరుగుతుంది. ఒక స్త్రీ పదిమంది స్నేహపూరితమైన మగాళ్ళమధ్య ఉన్నా ఈ ప్రయత్నాలు తప్పవు. వాటి ఉద్దేశం “అనుభవించడం” కానఖ్ఖరలేదు. కానీ ఆకర్షించడం వరకూ అసంకల్పితంగా జరిగేదే.

    3)–”నమ్మిన బంటు పాత్రలో నారయ్య … పాత సినిమాలలో జగ్గయ్య , గుమ్మడి, నాగయ్య లాగా అలరిస్తాడు”

    నారయ్య పాత్ర కల్లాకపటం,మకిలి- మాలిన్యం లేని పల్లెజనుల ప్రవర్తనకి చిహ్నం.దయానిధి కుటుంబంలాంటి cultured families లోవున్న భయంకరమైన మానసికహీనతకు ఒక contrasting alternate గా సృష్టించిన పాత్ర అది.ఆ పాత్రలోకి గుమ్మడి,జగ్గయ్యలు ఎలా దూరతారో నాకైతే అర్థం కాని విషయం.

    Your creative visualization is not even good for making Hotshots kind of spoof films. Be happy in your BLISS.

  29. శ్రావ్య

    తెలుగు బ్లాగర్లలో వేరు వేరు age groups వాళ్ళు ఉన్నారు అని నా భావన.ఒక పుస్తకం చదివినప్పుడు అచ్చమైన సహజ ధోరణిలో ఓ కుర్రాడు తన ఫ్రెండ్స్ కి చెప్పిన విధంగా హేలి చెప్పినట్టు అనిపించింది. బహుశా అతను ఒక నాలుగైదేళ్ళు తరవాత చదివి ఉంటే వేరే విధం గా రాసేవాడేమో. తెలుగు పుస్తకాలకి ఆదరణే తగ్గుతున్న ఈ రోజుల్లో ఇంకా ఈ నవలలు younger generation చదవడం హర్షనీయమే కదా.నేల పాఠకుడు అంటే ఎక్కువ తెలుగు పుస్తకాలు చదివిన అనుభవం లేదు అని అలా చెప్పినట్టు అనుకోవచ్చు ఏమో. ఒక్కో age వాళ్ళు చదివినప్పుడు perception వేరు గా ఉంటుంది అని ఎవరికి వాళ్ళం మన age కి తగ్గట్టు స్పందించచ్చు ఏమో .వ్యాసం శైలి నచ్చని పక్షం లో చిలికి చిలికి గాలివాన తీరున వ్యాఖ్యల మీద వ్యాఖ్యలు చేసుకునే బదులు సూచనగా తెలియజేసి వదిలివేయచ్చేమో?

  30. KumarN

    “నాకు ఈ నవలలో స్త్రీ పాత్రలు అదే పనిగా ఎదో దయనిధి ఒక పెద్ద నవమన్మధుడు అనట్టుగా అతని వెంట పడేటట్టుగా చిత్రీకరించటం నచ్చలేదు”.

    Not so accurate observation I think. On both fronts, facts ans perceptions.

    1950ల కాలాల్లో, ఒక యువకుడు డాక్టరు చదివి, ఊర్లో కొస్తే, చుట్టుపక్కల ఊళ్ళల్లో(జిల్లా నిండా కాకపోతే) అతనికి ఉండే ఆకర్షణా భావం కానీ, అతనికి దొరికే adulation కాని ఇప్పుడు మీకర్ధమయ్యేలా వివరించటం కష్టమనుకుంటా. So, I guess your observation misses that perspective. Now onto facts..నిజంగా అందరూ అతని వెంట పడ్డారా? నా పక్కన నవల లేదు కానీ, నాకు అలా గుర్తు లేదే? అతను ఎంతగానో కావాలనుకున్న కోమలే అతన్ని పెద్ద పట్ట్టించుకోదు మొదట్లో. పోతే వాళ్ళ ఆవిడ కానీ, సుశీల కానీ వాళ్ళెవరూ అతని వెంట పడుతున్నట్లు ఏమీ చూపించలేదే.

    పోతే మీ observations తో నేను విభేదించే మిగతా విషయాలు.

    1. దయానిధి కోమలి తో ఎఫైర్ ఏమీ నడపడు. ఈ మధ్యన ఆ పదానికి ఏమన్నా నిర్వచనం మారితే తప్ప. Infact ఆ అమ్మాయి ఓ రోజు దీపం వెలిగించి పెడతాను రమ్మంటే వెళ్ళి తనని చూసి వచ్చేస్తాడు వెనక్కి. ఇక్కడ నాకు బుచ్చిబాబు పదాలు గుర్తు లేవు కాని అదేదో ఆయన మాటల్లో చదివితేనే బాగుంటుంది. కోమలి పట్ల తనకున్న విపరీతమైనా దహించి వేసే మోజునీ, తనకి కోమలి కావాలి అన్న వాంచనీ, అందుకని అతను మొదట్లో చేసిన ప్రయత్నాలనీ అఫైర్ అంటారని అనుకోను. ఇంతకీ వాటన్నిటినీ అతను జయిస్తాడు కూడానూ.

    2. మీరు సుజాత గారి కిచ్చిన సమధానంలో, దయానిధి కున్న చనువు గురించి, “దీని గురించి నేను ఇంక ఏమీ మాట్లాడలేను!” అని గూఢార్ధం వచ్చేలా రాసారు. ఆవిడ చెప్పింది దయానిధి ఓ ఇంట్రావర్ట్ అని, అది నిజమే కదా. అతనికి అంత చనువే ఉంటే అతని రిలేషన్స్ వేరేగా ఉంటాయి. అతనితో మిగతా వాళ్ళకుంటుంది చాలా చనువు. ఉదా: అమృతం.

    ఇహపోతే, నేను రజనీ కాంత్ల, బలక్రిష్నల సినిమాలు చూడను కానీ, మీరు గ్రానైట్ గురించి చెప్పింది నాకూ చాలా నవ్వు తెప్పించింది.

    నవలలో చాలా ముఖ్యమయిన భాగాలు వదిలేసారు హేలీ మీరు. దయానిధి లో ఉన్న రెబెల్ గురించి మీరేమీ ప్రస్తావించలేదు, దయానిధి స్నేహితుడి(పేరు గుర్తు లేదు) పరివర్తన, స్వామీజీ ప్రభోదాల మీద రచయిత వ్యంగ్యాస్త్రాలు, దయానిధి జీవితం పొడుగూతా చేసే నిరంతర క్వెస్ట్, కోమలి లో ఉండే పొగరుబోత్తనమో, నిర్లక్ష్యమో. అలాగే జగన్నాధం పాత్రని రచయిత అధ్బుతంగా వాడుకున్న తీరూ.

  31. Telugu4kids

    పిల్లల సాహిత్యం గురించి ఇంతలో సగం కూడా చర్చ జరగలేదు…..
    తీవ్రమైన భేదాభిప్రాయాలు ఉన్న చోట మాత్రమే వ్యాఖ్యలు ఎక్కువ ఉంటాయా?

  32. HalleY

    సభకు నమస్కారం ! :).

    ఈ స్థాయిలో కాకపోయినా ఏదో ఒక స్థాయి దుమారం రేగుతుంది అని నేను ముందే అనుకున్నాను . ఇప్పటికీ ఈ నవల కథ ఏమిటి అని నన్ను ఎవరన్నా అడిగితే తు.చ తప్పకుండా నేను ఇదే చెబుతాను . కథాపరంగా నేను అక్కడ రాసిన వాటిలో ఎదన్నా తప్పు కనిపిస్తే చెప్పండి సరి చేస్తాను .

    ఇక సినిమాలతో పోలిక విషయం :
    –రాజమౌళి సినిమాలోలాగ ఈ నవలలో కథానాయికలకి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు
    నాకు ఈ నవలలో స్త్రీ పాత్రలు అదే పనిగా ఎదో దయనిధి ఒక పెద్ద నవమన్మధుడు అనట్టుగా అతని వెంట పడేటట్టుగా చిత్రీకరించటం నచ్చలేదు .ఆ విషయాన్ని ఇంత కంటే బాగా చెప్పటం నాకు తెలియలేదు.
    — బావ అయిన దయానిధి అంటే ఒక “ఇది” ( బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ “అది ఒక ఇది లే … ” )
    ఈ సంబంధం గురించి నేను రాసిన ఈ పోలిక యెబెట్టుగా ఉంటే . ఇదే నవలలో బుచ్చిబాబుగారు చిత్రీకరించిన సమాజం కూడా ఇలానే రెయాక్ట్ ఔతుంది !. మరి అది కూడా తప్పెనంటారా .
    –నమ్మిన బంటు పాత్రలో నారయ్య … పాత సినిమాలలో జగ్గయ్య , గుమ్మడి, నాగయ్య లాగా అలరిస్తాడు
    మీ సంగతి నాకు తెలియదు కానీ పుస్తకం చదువుతున్నప్పుడు “creative visualisation” అంటూ ఒకటి ఏడిచింది నాకు . ఈ పాత్ర పేరు వినగానే నాకు స్పురణకి వచ్చేది ఆ నటినటులే మరి !.
    –“నరసింహ” సినిమాలో రజనీకాంతుకు గ్రనేటు కొండ దొరికినట్టు
    ఇప్పటికి నవలలో ఆ భాగం చూస్తే నాకు ఇదే గుర్తుకు వస్తుంది . మీరు ఎవరన్నా సగటు తెలుగు వాడికి కేవలం ఈ పార్టు చెప్పండి .. అరె ఇది నరసింహ సినిమాలోలా ఉందే అని ఇద్దరిలో ఒకరన్నా అంటారు.

    @jeevani :
    “మీరు చేసింది సరిగాలేదు అది ఒప్పుకోక పోగా”
    ఒకటి అడుగుతాను చెప్తారా .. నువ్వు వెధవవి అది ఒప్పుకోక పోగా ఇంకా ఏమిటి ఎదురు చెబుతున్నావు అని మీతో ఎవరన్నా అంటే మీకు ఎలా ఉంటుంది. నేను తప్పుచేసాను అని అనుకొని ఉంటే ఈ వ్యాసం పుస్తకం.నెట్ వారికి పంపే వాడినే కాదు.

    “మీరు రాసింది గుర్తుపెట్టుకోండి, మరి కొన్నేళ్ల తర్వాత మరోసారి చివరకు మిగిలేది చదవండి. మీరెంత సిల్లీగా రాశారో మీమీద మీకే అసహ్యం వేస్తుంది”
    I understand your anguish . But this is downright personal abuse :).

    @neelanchala:
    “నవల మగవారికి మరియు మగరాయుళ్ళవంటి ఆడవారికి మాత్రమే నచ్చుతుంది యేమో !….
    దీని భావమేమి?”
    ఎందుకనో మగవారి వెంటపడటం తప్పితే ఆడవారికి మరింకేం పనిలేదు అన్నట్టుగా రాసినట్టు అనిపించింది. ప్రతీ స్త్రీ పాత్ర గురించి ఎవరో ఒకరు చీపుగా మాట్లాడటమే ! . మరి అప్పుడూ ఇప్పుడూ సమాజం ఇలానే ఉందో ఎమో.

    @ravi.env :
    🙂

    @రవి :
    “మీ మనోభావాలను మీరే అర్జంటుగా గాయపెట్టుకుని, బాధపడితే ఎట్లాగ? వ్యాస రచయిత నవలారచయితను పల్లెత్తుమాటన్నాడా? పోనీ రచనను విమర్శించాడా? పోనీ నవలను దిగజారుస్తూ పనికిరాదన్నాడా? తన పద్ధతిలో కథ చెప్పాడు, పరిచయం చేశాడు. అదీ తప్పంటే ఎట్లాగ?”
    Precisely ! . Amen !. నా పద్దతిలో కథ చెప్పాను అంతే ! . ఇక్కడ చాలా మంది పెర్సనల్ లెవల్లో తీసెసుకొని సమరసింహా రెడ్డి సినిమాలోలాగా “ఒరేయ్ హేలీ సీమ సందుల్లోకి రారా చూసుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపమో అనట్టుగా మాట్లాడుతున్నారు మరి !” . (మళ్ళీ సినిమా పోలిక !. హతవిధీ !)

    @mandakini :
    “ఎవరి శైలి వాళ్ళది. ఎవరి ధోరణి వాళ్ళది. ఇంతటితో ఈ అనవసర చర్చ ఆపితే బావుంటుంది”
    🙂

    @Kameshwara rao
    “ఇక్కడ Halleyగారు చెప్పిన దానిలో కొందరికి వెటకారం, అవహేళన కనిపించింది. ఇది నిజమే! అయితే ఇది నాకు వ్యంగ్యం కోసం చేసినట్టుగా నాకనిపించలేదు. అతనికి ఆ పుస్తకం చదివినప్పుడు అతను వెటకారంగా చెప్పిన అంశాలు నిజంగానే వెటకారంగా ఎందుకు తోచి ఉండకూడదు?”
    At places where i was sarcastic .. yes i found it funny that lets say for example as mentioned above that all female characters almost are busy 24×7 wooing the protagonist. At other places they were mere analogies not sarcastic . Eg : The analogy with Narasimha is no sarcasm !.
    “అయితే, ఒక బ్లాగుకీ, పుస్తకం.నెట్ కీ నేను ఒక తేడా ఉందని అనుకుంటున్నాను. కాదంటే చెప్పండి, నా అభిప్రాయాన్ని సరిదిద్దుకుంటాను. ఒకరు తన బ్లాగులో ఒక టపా రాసారంటే అందులో ఆ రాసినతని ఆత్మతృప్తి తప్ప వేరే ప్రయోజనం ఆశించడం వ్యర్థం. కాని పుస్తకం.నెట్ లో ఒక టపాకి(లేదా వ్యాసం) ఆ పాఠకులు ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశిస్తారు. ఇప్పుడు ఈ వ్యాసాన్ని ప్రకటించడంలో పుస్తకం వాళ్ళు ఆశించిన ప్రయోజనం ఏమిటన్నది స్పష్టంగా లేదు. రాసే అతను కేవలం తన అభిప్రాయాన్ని ప్రకటించడం కోసమే ఈ వ్యాసం రాసినట్టుగా అనిపిస్తోంది.”
    Hmm .. I did exhibit my inhibitions to the editors before sending this article to them (as mentioned in comment#5) .. It is only after seeking their approval that they accept all kinds of opinions/reviews on books that i went ahead and sent it.
    “ఇప్పుడు ఈ వ్యాసాన్ని ప్రకటించడంలో పుస్తకం వాళ్ళు ఆశించిన ప్రయోజనం ఏమిటన్నది స్పష్టంగా లేదు. రాసే అతను కేవలం తన అభిప్రాయాన్ని ప్రకటించడం కోసమే ఈ వ్యాసం రాసినట్టుగా అనిపిస్తోంది.”
    Over to the editors then :).

  33. సుజాత

    రవి గారూ,

    కృష్ణ మూర్తి తత్వమే చివరికి మిగిలేది నవల్లో అంతర్లీనంగా కనపడేది. కృష్ణ మూర్తి తత్వాన్ని హాస్య వ్యంగ్య శైలిలో పరిచయం రాయాలని మీరు అనుకుంటారా?(మీ బ్లాగులో ఓషో వగైరా పరిచయాలు చదివాను కాబట్టి అడుగుతున్నాను) ఎవరైనా రాస్తే “ఇదీ ఒక రకమైన పరిచయమే” అని స్వాగతిస్తారా?

    మనోభావాలు గాయపరుచుకోవడం ఈ రోజుల్లో చాలా సులభం లెండి!మనకు నచ్చని సినిమా ఇంకో వందమందికి నచ్చిందంటే కూడా గాయపడే రోజులు మరి!

  34. కత్తి మహేష్ కుమార్

    @పూర్ణిమ: నచ్చడం నచ్చకపోవడం వ్యక్తిగత అభిరుచి, ఆ సమయంలో చదువరి యొక్క మానసిక స్థితినిబట్టి ఉంటాయి. దాంతో ఎవరికీ సమస్యలేదు. So called great అనుకునే రచయితల పుస్తకాల్ని చీల్చిచండాడినా, హాస్యాలాడినా,నచ్చలేదని తూలనాడినా అది పాఠకుడి హక్కు. కానీ ఇలా నిర్హేతుకమైన అపహాస్యాలాడ్డం అర్థరహితం.

    వ్యాసం ప్రచురణకు అర్హం కాదనో లేక పుస్తకం స్థాయికి తగదనో నేను అనటం లేదు. I believe in free expression. కేవలం నా అభ్యంతరాలేమిటో నేను చెప్పాను. అంతే. ఈ వ్యాసం “మదర్ థెరెసా నాకు మల్లికా షెరావత్ లాగా నాకు నచ్చింది” అన్నట్లుంది.If its OK with you, I am fine. But, I am surely not OK with it.

  35. KumarN

    బాబోయ్, చాలానే రగడ జరిగిందే! అంతకు ముందు మీరేమైనా రాశారో లేదో నాకు తెలీదు కాని హేలీ, మొన్నో కామెంట్ రాసేసి ఏకంగా మాలతి గారో టపా రాయడానికీ తద్వారా అక్కడో దుమారానికీ, ఇవ్వాళేమో ఓ రివ్యూ రాసేసి, ఒరల్లోంచి కత్తులు బయటకు లాగారుగా!. సామాన్యులు కాదు మీరు 🙂

    ఆ పెట్టే గమనికేదో అట్లా provocative గా పెట్టకుండా, ఈ రివ్యూలో ఉండే tone different అని పెడితే ఇంత గొడవ జరిగేది కాదేమో కదండీ? As they say it’s all in the presentation. Expectations Management అనేది పెద్ద subject. If I have to draw anologies of the entire episode, it’s like turning on the TV to watch a reputed, substance filled, policy wonk(charlie-rose/tim russert) talk-show, and suddenly the host delivers it in Jay Leno style. I think that is what has happened here.

    సగం ప్రాబ్లం పుస్తకం.నెట్ కి వచ్చే మైండ్ సెట్ తో వచ్చింది. అదే ఏ తేటగీతి లాంటి బ్లాగో అయితే ఎవరూ గొడవ పెట్టేవాళ్ళు కాదు.

    నేను పైకెళ్ళి మళ్ళీ చదివాను. నాకిప్పటికీ జనాలు అభ్యంతర పెట్టినంతగా అనిపించట్లా..బానే ఉందే!!. పుస్తకం బాగుంది, కొన్ని ప్రశ్నలు వెంటాడుతాయి అని కూడా అన్నాడు కదా.ఎక్కడా అవహేళన చేసినట్లు ఏమనిపించలేదే. Something is wrong with me I guess.

    ఇంతకీ తను పుస్తకం కొంచెం చదివి పక్కన పడేయకుండా పూర్తిగా చదివాడు, అది ఏ దండగ మారి పుస్తకమో అని అనుకోకుండా, దానికి అతన్ని అభినందించాలి అని అనుకుంటున్నాను.

    Much ado about nothing.

Leave a Reply