Golden Threshold – Sarojini Naidu (హైదరాబాద్ ఆడపడుచు)

రాసిన వారు: చావాకిరణ్
*************

 

సరోజిని నాయుడు గారు వ్రాసిన ఆంగ్ల కవితల పుస్తకం ఈ గోల్డెన్ థ్రెషోల్డ్. ఎంత చక్కని కవితలో ఇవి. ముఖ్యంగా వీటికి చదివించే గుణం ఉంది. నేను ముందు ఈ పుస్తకం చేతిలోకి తీసుకున్నప్పుడు ఎన్ని రోజులు పడుతుందో, రోజుకు ఒక కవిత చదువుదాంలే అని అనుకున్నాను, కాని కవిత తరువాత కవిత అలా చదివెయ్యాలనిపిస్తుంది. గొంతెత్తి చదువుతుంటే మరింత బాగున్నాయి. మొత్తం రెండు రోజుల్లో చదివాను, మళ్లా మళ్లా చదవాలి అనిపించేట్టున్నాయి.

ఈ పుస్తకంలో ముందుమాట ఆర్తర్ సైమన్స్ వ్రాశాడు. ఇందులో సరోజిని నాయుడు గారి గురించి చాలా వివరంగా వ్రాశాడు. సరోజిని నాయుడు ఎలా లండన్లో గడిపారో, ఇటలీని ఎంత ఇష్టపడ్డారో, ఆమె జీవితం గురించి క్లుప్తంగా, ఆవిడ కవితల గురించి వివరంగా వ్రాశాడు.

ఈ కవితల్లో సరోజిని నాయుడు హైదరాబాద్ ఆడపడుచు అని సులభంగా గుర్తుపట్టవచ్చు. హైదరాబాద్ ఆమెకు ఇవ్వవలసిన గుర్తింపు ఇప్పుడు ఇవ్వటంలేదేమో అనిపిస్తుంది నాకు. వికీలో బొమ్మ చూడంగనే బెంగాలి అమ్మాయి అంటే నమ్మలేనట్టు, తెలుగు అమ్మాయి అంటే నమ్మేట్టు ఉంది.

హైదరాబాద్ సుల్తాన్ల సమాధుల పై వ్రాసిన కవిత చూడండి – ఈ కవితను ఆ సమాధుల దగ్గర పురాతన శాఖల నోటీస్ బోర్డు పక్కన పెద్ద అక్షరాలతో వ్రాసి పెడితే ఎంత అందం, గాంభీర్యం వస్తుంది చెప్పండి. పర్యాటకులకు అది మరొక ఆకర్షణగా ఉండదూ?. ఈ సందర్భంగా పుస్తకం.నెట్ నుండి నేను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను, ఈ కవితను ఆ సమాధుల దగ్గర పెద్దగా చెక్కి పెట్టాలని.

THE ROYAL TOMBS OF GOLCONDA
I muse among these silent fanes
Whose spacious darkness guards your dust;
Around me sleep the hoary plains
That hold your ancient wars in trust.
I pause, my dreaming spirit hears,
Across the wind’s unquiet tides,
The glimmering music of your spears,
The laughter of your royal brides.
In vain, O Kings, doth time aspire
To make your names oblivion’s sport,
While yonder hill wears like a tier
The ruined grandeur of your fort.
Though centuries falter and decline,
Your proven strongholds shall remain
Embodied memories of your line,
Incarnate legends of your reign.
O Queens, in vain old Fate decreed
Your flower-like bodies to the tomb;
Death is in truth the vital seed
Of your imperishable bloom
Each new-born year the bulbuls sing
Their songs of your renascent loves;
Your beauty wakens with the spring
To kindle these pomegranate groves.

తన కూతురు పద్మజ గురించి వ్రాసిన ఈ కవిత చూడండి. ఎంత చక్కగా ఉందో.

Lotus-maiden, you who claim
All the sweetness of your name,
Lakshmi, fortune’s queen, defend you,
Lotus-born like you, and send you
Balmy moons of love to bless you,
Gentle joy-winds to caress you.
Lotus-maiden, may you be
Fragrant of all ecstasy.
లోటస్ బార్న్ అంటూ పద్మజ అనే సార్థక నామధేయాన్నీ, సరోజిని కుమార్తె అని తన కూతురును చెప్పకనే చెపుతుంది. (సరోజ – కలువ)

గోరింటాకును గురించిన ఈ కవిత చూడండి. కోకిల అని తెలుగు పదాన్ని(బెంగాలి పదం?) ఎంత చక్కగా ఆంగ్ల కవితలో వ్రాశారో.

A kokila called from a henna-spray:
LIRA! LIREE! LIRA! LIREE!
Hasten, maidens, hasten away
To gather the leaves of the henna-tree.
Send your pitchers afloat on the tide,
Gather the leaves ere the dawn be old,
Grind them in mortars of amber and gold,
The fresh green leaves of the henna-tree.
A kokila called from a henna-spray:
LIRA! LIREE! LIRA! LIREE!
Hasten maidens, hasten away
To gather the leaves of the henna-tree.
The tilka’s red for the brow of a bride,
And betel-nut’s red for lips that are sweet;
But, for lily-like fingers and feet,
The red, the red of the henna-tree.
చివరగా తన గురించి తాను చెప్పుకున్న మాట –

I am not a poet really. I have the vision and the
desire, but not the voice. If I could write just one poem full
of beauty and the spirit of greatness, I should be exultantly
silent for ever; but I sing just as the birds do, and my songs
are as ephemeral.

ఇలా మొహమాట పడకుండా మరిన్ని కవితలు వ్రాసి ఉంటే బాగుండేది.

ఈ పుస్తకాన్ని ఇక్కడ నుండి ఉచితంగా చదువుకోవచ్చు.

You Might Also Like

Leave a Reply