వెబ్ జర్నల్ సాహిత్య సమ్మేళనంలో ఆంగ్ల కవితా సంపుటి ఆవిష్కరణ

వ్యాసం రాసిపంపినవారు: పెరుగు రామకృష్ణ

తేది 10 .01 .2010 న హైదరాబాద్ లో హబ్సిగుడా  దగ్గర NGRI లో ఉదయం పది గంటల నుండి మూడు గంటల వరకు మ్యుస్ ఇండియా .కామ్ వెబ్ జర్నల్ ఆద్వర్యంలో మ్యూస్  మీట్ జరిగింది.ముఖ్య అతిధి గా అమెరికా నుండి విచేసిన ప్రసిద్ద భారతీయ కవయిత్రి మీనా అలేగ్జాందర్ హాజరయ్యారు.మ్యూస్ సంపాదకులు సూర్య,కుమరేంద్ర మల్లిక్ ఆహ్వానితుల్ని అందరిని సాదరంగా స్వాగతించారు.ముందుగా సమైఖ్యతను చాటే “మిలే సుర్”  ప్రార్ధన తో ఆరంభించి ప్రొ.సచిదానందా మొహంతి చైర్ గా సాహిత్య ,కవి సమ్మేళనం జరిగాయి ..మంచి విందు భోజనం అనంతరం మళ్ళీ ప్రొ విజయకుమార్ చైర్ గా కవిసమ్మేలనం లో  ఇంకోతమంది కవితాగానం చేసారు.ఇందులో పద్మభూషణ్ ప్రొ శివ.కే.కుమార్ కుమరేంద్ర మల్లిక్ ఆంగ్ల కవితా సంపుటి “Letter To an Imaginary Pen friend And Other Poems” ఆవిష్కరించారు.ఈ గ్రంధాన్ని మరో అతిధి ప్రొ ఐ.వి.చలపతిరావు సమగ్రంగా మీక్షించారు.ప్రొ.శివ.కే.కుమార్ చమత్కార భరితమైన గొప్ప ఉపన్యాసం అందరిని అలరించింది.ఆహ్వానిత కవుల్లో కర్నాటక నుండి పుట్టు.కులకర్ణి నెల్లూరు నుండి నేను తప్ప మిగతా అందరు హైదరాబాద్ దగ్గర ప్రాంత  కవులే ..పుస్తకం లో ఆరు విభాగాలుకు రేఖా చిత్రాలు గీసిన కవయిత్రి వారణాసి.నాగలక్ష్మిని మరియు పుస్తక ప్రచురణలో సహకరించిన
కవయిత్రి సుజాత గోపాల్ ని మల్లిక్ గారు శాలువాతో సత్కరించారు.చివరగా సూర్యగారు  మ్యూస్ జ్ఞాపికలను అందరికి పంచి వీడ్కోలు  పలికారు.

IMG_1369

(ఫోటోలో మీనా ,కవి ముకుందరామారావు ,పెరుగు,చలపతిరావు ,శివ కే.కుమార్,గ్రంధ రచయిత మల్లిక్)

You Might Also Like

Leave a Reply