పుస్తకం
All about booksపుస్తకలోకం

January 13, 2010

Resources: Book Sneeze – బ్లాగర్ల కొరకు పుస్తక సమీక్షా కార్యక్రమం.

More articles by »
Written by: Achilles
అమెరికన్ పుస్తక విపణిలోని పెద్ద పబ్లిషర్లలో థామస్ నెల్సన్ ఒకటి. తమ ప్రచురణల ప్రమోషన్ లో భాగంగా ఇప్పుడు థామస్ నెల్సన్ ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చింది. అదే Book Sneeze – బ్లాగర్ల కొరకు పుస్తక సమీక్షా కార్యక్రమం.
మీరు పుస్తకపఠనాభిలాష కలిగిన బ్లాగరులై ఉంటే, పుస్తక సమీక్షలు వ్రాయటం మీరు ఆస్వాదిస్తే, ఈ కార్యక్రమం మీలాంటి వారి కోసమే. Book Sneeze సైటులో థామస్ నెల్సన్ వారు తమ ప్రచురణలనుంచి ఎన్నుకున్న పుస్తకాల ను కొన్నింటిని కాటలాగ్ చేసి ఉంచారు. మీరు ఆ సైటులో సభ్యత్వాన్ని నమోదు చేసుకుని, అందుబాటులో ఉన్న పుస్తకాల్లోంచి ఒకటి ఎన్నుకుంటే, థామస్ నెల్సన్ వారు ఆ పుస్తకాన్ని మీకు ఉచితంగా పంపిస్తారు. మీరు చెయ్యవలసిందల్లా, ఆ పుస్తకాన్ని చదివి మీ బ్లాగులోనూ, ఇంకా ఏదేని ఒక పుస్తక విక్రయ సైటులోనూ (ఉదా: amazon.com, barnesandnoble.com, booksamillion.com, borders.com) ఒక సమీక్ష వ్రాయాలి. సమీక్ష వ్రాసిన టపాల లంకెలను తిరిగి Book Sneez కు సమర్పిస్తే,  మరో పుస్తకాన్ని తెప్పించుకోవటానికి అర్హులౌతారు. మీరు సమర్పించిన లంకెలు వారు తమ సైటులో ఉటంకిస్తారు. తద్వారా మీ బ్లాగుకు నూతన పాఠకులకూ చేరుతుంది (well.. If you care about it)
ఉచితంగా పుస్తకాలు దొరుకుతాయని కాదు గానీ, ఈ మొత్తం ఆలోచన నాకు బాగా నచ్చింది. MBA వాళ్ళు అప్పుడప్పుడూ మాట్లాడుతుంటారు చూడండి win-win situation అని, ఇదే! మనదేశపు పబ్లిషర్లు దీన్ని కాపీ కొట్టేంతగా థామస్ నెల్సన్ వాళ్ళ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను!!
మీలో ఎవరికైనా ఆసక్తి ఉన్నవారు ఇక్కడ నొక్కి, సభ్యులు గా నమోదు కండి. ప్రస్తుతం అక్కడ అందుబాటులో ఉన్న పుస్తకాలు ఇవీ. ప్రస్తుతానికి జాబితా చిన్నదే అయినా, నిస్సందేహంగా త్వరలోనే మరిన్ని పుస్తకాలు చేరుస్తారు. ఇంకేం మరి, ఒక పుస్తకాన్ని తెప్పించుకుని, సమీక్ష రాసి పడేసి (పన్లో పని గా దాన్ని తెలుగులోకి తర్జుమా చేసి పుస్తకం.నెట్ లో వెయ్యటం మర్చిపోకండి 😉 ) ముందుకు దూసుకెళ్లండి.
అనంట్టు సమీక్షలు ఇలా ఉండాలి అన్న విషయం పై వారికి కొన్ని ఆలోచనలనున్నాయి – ఇక్కడ చూడండి.

booksneeze_badgeఅమెరికన్ పుస్తక విపణిలోని పెద్ద పబ్లిషర్లలో థామస్ నెల్సన్ ఒకటి. తమ ప్రచురణల ప్రమోషన్ లో భాగంగా ఇప్పుడు థామస్ నెల్సన్ ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చింది. అదే Book Sneeze – బ్లాగర్ల కొరకు పుస్తక సమీక్షా కార్యక్రమం.

మీరు పుస్తకపఠనాభిలాష కలిగిన బ్లాగరులై ఉంటే, పుస్తక సమీక్షలు వ్రాయటం మీరు ఆస్వాదిస్తే, ఈ కార్యక్రమం మీలాంటి వారి కోసమే. Book Sneeze సైటులో థామస్ నెల్సన్ వారు తమ ప్రచురణలనుంచి ఎన్నుకున్న పుస్తకాల ను కొన్నింటిని కాటలాగ్ చేసి ఉంచారు. మీరు ఆ సైటులో సభ్యత్వాన్ని నమోదు చేసుకుని, అందుబాటులో ఉన్న పుస్తకాల్లోంచి ఒకటి ఎన్నుకుంటే, థామస్ నెల్సన్ వారు ఆ పుస్తకాన్ని మీకు ఉచితంగా పంపిస్తారు. మీరు చెయ్యవలసిందల్లా, ఆ పుస్తకాన్ని చదివి మీ బ్లాగులోనూ, ఇంకా ఏదేని ఒక పుస్తక విక్రయ సైటులోనూ (ఉదా: amazon.com, barnesandnoble.com, booksamillion.com, borders.com) ఒక సమీక్ష వ్రాయాలి. సమీక్ష వ్రాసిన టపాల లంకెలను తిరిగి Book Sneez కు సమర్పిస్తే,  మరో పుస్తకాన్ని తెప్పించుకోవటానికి అర్హులౌతారు. మీరు సమర్పించిన లంకెలు వారు తమ సైటులో ఉటంకిస్తారు. తద్వారా మీ బ్లాగుకు నూతన పాఠకులకూ చేరుతుంది (well.. If that matters to you)

ఉచితంగా పుస్తకాలు దొరుకుతాయని కాదు గానీ, ఈ మొత్తం ఆలోచన నాకు బాగా నచ్చింది. MBA వాళ్ళు అప్పుడప్పుడూ మాట్లాడుతుంటారు చూడండి win-win situation అని, ఇదే! మనదేశపు పబ్లిషర్లు దీన్ని కాపీ కొట్టేంతగా థామస్ నెల్సన్ వాళ్ళ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను!!

మీలో ఆసక్తి ఉన్నవారు ఇక్కడ నొక్కి, సభ్యులు గా నమోదు కండి. ప్రస్తుతం అక్కడ అందుబాటులో ఉన్న పుస్తకాలు ఇవీ. ప్రస్తుతానికి జాబితా చిన్నదే అయినా, నిస్సందేహంగా త్వరలోనే మరిన్ని పుస్తకాలు చేరుస్తారు. ఇంకేం మరి, ఒక పుస్తకాన్ని తెప్పించుకుని, సమీక్ష రాసి పడేసి (పన్లో పని గా దాన్ని తెలుగులోకి తర్జుమా చేసి పుస్తకం.నెట్ లో వెయ్యటం మర్చిపోకండి 😉 ) ముందుకు దూసుకెళ్లండి.

అన్నట్టు సమీక్షలు ఎలా ఉండాలి అన్న విషయం పై వారికి కొన్ని ఆలోచనలున్నాయి – ఇక్కడ చూడండి.About the Author(s)

Achilles

"I confess I do not know my mind, and what little I do know of it I do not like. I did not make it, I did not select it. I am more dissatisfied with it than you can possibly be. It is a greater mystery to me than it is to you, and I have to live with it. You should pity not blame me." అదే నేను! ఇంతకంటే చెప్పాల్సినదేమీ లేదు.6 Comments


 1. బూక్ స్నీజ్ లో సమీక్షలు రాస్తానో లేదో తెలియదు కాని పుస్తకం.నెట్ లో మాత్రం నేను చదివిన పుస్తకాల సమీక్షలు రాయాలని ఎంతో కుతూహలంగా ఉంది.త్వరలో నా కోరిక తీరుతుందని ఆశిస్తున్నాను.


 2. RK

  @Purnima: Most of the books listed at the moment are not that great, but surely the list will grow.


 3. Purnima

  I think those reviews can be posted here, without any translations as such.

  But I didn’t find the books cater to my tastes.


 4. Fine..Good scheme..Hope to see reviews there and
  Translations here..


 5. బాగుంది. నేను కూడా ఇలాంటి పధకం ప్రవేశ పెడతాను.


 6. సౌమ్య

  Interesting!!!  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు సాహిత్య విమర్శలో ఖాళీలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (యాకూబ్ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ పుస్తకానికి ముందుమాట) హ...
by అతిథి
0

 
 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 

 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 
 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1