2009 – నేను చదివిన పుస్తకాలు

రాసిన వారు: వి. చౌదరి జంపాల

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.

******************************
కాలేజీలో చదువుకొనే రోజుల్లో చదివిన పుస్తకాలూ, చూసిన సినిమాలూ జాబితా వ్రాసుకొనే అలవాటుండేది. ఇప్పుడు లేదు. ఈ మాసం ఫోకస్ చూశాక 2009లో ఏం చదివానా అని గుర్తు చేసుకోవాలనిపించి, గుర్తున్నంత వరకూ వ్రాస్తున్నాను. ఆంగ్లపుస్తకాల వరకూ స్వల్ప పరిచయాలు వ్రాశాను. తెలుగు పుస్తకాలు చాలామందికి పరిచయమైనవే కావటం వల్ల (నిజం చెప్పాలంటే కొంత బద్ధకం, కొంత సమయాభావం వల్ల కూడా) పేర్లు మాత్రమే వ్రాశాను. ఇంకొన్ని పుస్తకాలు మర్చిపోయాననే అనిపిస్తుంది; తర్వాతేమన్నా గుర్తొచ్చి, ముఖ్యమైనవి అనుకొంటే మళ్ళా ఎప్పుడైనా వ్రాస్తాను.

English

Traffic: Why we drive the way we do — Tom Vanderbilt: రోడ్లూ, వాహనాలూ, వాటిని వాడే మనుషులూ, వివిధ ప్రదేశాలూ, సంస్కృతులూ వీటన్నిటి పరస్పర ప్రభావాల గురించిన పుస్తకం. ఢిల్లీలో ట్రాఫిక్ గురించికూడా ఒక మంచి ఛాప్టర్ ఉంది.

Gangleader For a Day — Sudhir Venkatesan : చికాగో యూనివర్సిటీలో సోషియాలజీలో పిహెచ్‌డీ చేద్దామని వెళ్ళిన ఒక సబర్బన్ కాలిఫోర్నియా తమిళ్-అమెరికన్ కుర్రవాడికి విచిత్రంగా పేద నల్లవారు నివసించే ఒక (ప్రాజెక్ట్) బిల్డింగ్‌లో మాదకద్రవ్యాలు అమ్మే గాంగ్‌లీడర్‌తో స్నేహం కుదిరింది. అతని అనుభవాలూ, పరిశీలనలూ, విశ్లేషణలూ ఈ పుస్తకం. Freakonomics పుస్తకం చదివినవారికి ఆ పుస్తకంలో సుధీర్ అనుభవాల ప్రస్తావన గుర్తుండవచ్చు

Past Due — Peter Goodman అమెరికా ఆర్థిక మాంద్యపు మూలాల విశ్లెషణ, కొంత మంది వ్యక్తుల కథలను ఈ విశ్లేషణకు ఉదాహరణలుగా తీసుకొని ఆసక్తికరంగా వ్రాసిన పుస్తకం.

Bringing Down the HouseBen Mezrich: ఎం.ఐ.టీలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు లాస్‌వేగాస్ కాసినోలతో ఆడుకున్న (డబ్బులు దండుకున్న) కథ. 21 అనే ఆంగ్లచిత్రానికి మూలం. నిజంగా జరిగిన కథేనట.

The Establishment – Howard Fast : చిన్నప్పుడు హొవార్డ్ ఫాస్ట్ స్పార్టకస్, ఫ్రీడం రోడ్ (స్వేఛ్ఛాపథం అన్న పేరుతో అనువాదం ఉన్నట్లు గుర్తు) చదివినప్పటినుంచీ అతని పుస్తకాలంటే మోజు. ఇజ్రాయెల్ తొలిరోజులనూ, 1950ల కాలిఫోర్నియా రాజకీయాలనూ, మెకార్దీ వేధింపుల్ని కలగలుపుతూ అల్లిన ఆసక్తికరమైన కథ.

The RoadCormac McCarthy : రెండేళ్ళ క్రితం బాగా పేరు తెచ్చుకొన్న No Country for Old Men అనే కోన్ బ్రదర్స్ చిత్రానికి మూల కథ రాసిన కోర్మన్ మెకార్దీ మరో పుస్తకం ఇది. విధ్వంసపు తరువాతి రోజుల్లో ఇద్దరు తండ్రీకొడుకుల కథ; ఈ మధ్యే సినిమాగా వచ్చింది. ఇంకా చూడలేదుకానీ రివ్యూలు బాగున్నాయి.

Down Came the RainBrooke Shields : చాలా ఆశాభంగాల తర్వాత అపురూపంగా పుట్టిన బిడ్డను ఆనందించకుండా పోస్ట్‌పార్టం డిప్రెషన్ (ప్రసవించిన తరువాత కొంతమంది తల్లులకు కలిగే మానసిక రుగ్మత)తో బాధపడిన -ఒకప్పటి -యువకుల కలలరాణి స్వీయ కథనం; నాకు వృత్తిరీత్యా కూడా ఆసక్తికరమైన పుస్తకం.

Tabloid Valley : అమెరికాలో టాబ్లాయిడ్ పత్రికల పుట్టుపూర్వోత్తరాల గురించిన పుస్తకం. మచ్చుకు కొన్ని ఆసక్తికరమైన విశేషాలు: అమెరికాలో బాగా ప్రాచుర్యం ఉన్న ఐదు టాబ్లాయిడ్ పత్రికలు (నేషనల్ ఇంక్వైరర్ వగైరా) అన్నీ రెండు సంస్థల ప్రచురణలేనట. ఆ రెండు సంస్థలూ ఫ్లారిడాలో పక్కపక్క ఊళ్ళలో ఉంటాయట. ముఖ్య పాత్రికేయులందరూ బ్రిటిష్ వాళ్ళట.

They All Laughed : టెలిఫోను, ఎలక్త్రిక్ బల్బు, మైక్రోవేవ్ వంటి కొన్ని ముఖ్యమైన పరిశోధనల, పరిశోధకుల గురించి చారిత్రక కథనాలు.

The Last Days – Charles Walsh : నల్లవారి పౌర హక్కుల పోరాటాల ఆఖరు రోజుల్లో (1960ల్లో) మిస్సిస్సిపి రాష్ట్రంలో పెరిగిన ఒక తెల్ల పిల్లవాడి స్వీయ కథ

Better – Atul Gawande : బిల్ల్ క్లింటన్ మొదటి ఎన్నికలప్పుడు మెడికల్ స్కూల్ పోస్ట్‌పోన్ చేసుకొని హెల్త్‌కేర్ పాలసీ సలహాదారుగా పని చేసిన అతుల్ గవాండే ఇప్పుడు హార్వర్డ్‌లో కేన్సర్ సర్జన్, న్యూయార్కర్ పత్రికకు రెగ్యులర్ రచయిత. ఇది రెండో పుస్తకం. మంచికీ ఉత్తమానికీ ఉండే తేడా గురించి వ్రాసిన పుస్తకం; విడి వ్యాసాల సంకలనంలా ఉంటుంది.

Blink – Malcolm Gladwell
Tipping Point – Malcolm Gladwell
Outliers – Malcolm Gladwell
మాల్కొం గ్లాడ్వెల్ కూడా న్యూయార్కర్ పత్రికవాడే. ఒకో పుస్తకం ఒకో సామాజిక సిద్ధాంతం గురించి. ఆలోచింపచేసే పుస్తకాలు.

JusticeMichael J Sandel : హార్వర్డ్‌లో ఫిలాసఫీ ప్రొఫెసర్. ఏ విషయమైనా న్యాయమయిందో కాదో, ఎవరి ప్రవర్తనైనా సరి అయిందో కాదో మనం ఏ ప్రాతిపదికన నిర్థారిస్తాం? విభిన్న తత్వ శాస్త్ర ప్రాతిపదికల ఆధారంగా వివరంగా చర్చించిన పుస్తకం

On The Road with Charles Kuralt : నేను అమెరికా వచ్చిన కొత్తలో సి.బి.ఎస్.న్యూస్‌లో సంచార విలేఖరిగా అమెరికా అంతా తిరుగుతూ, గొప్ప పనులు చేసే సామాన్యుల విషయాలను చెబ్తుండేవాడు ఛార్లెస్ కురాల్ట్. 60 మినిట్స్‌కు విలేఖరిగానూ, ఆదివారం ఉదయం వార్తలకి యాంఖర్‌గా కూడా చేశాడు; అతను రిపోర్ట్ చేసిన కొన్ని విషయాల ట్రాన్‌స్క్రిప్ట్స్ ఈ పుస్తకం; ఆహ్లాదకరైమైన పుస్తకం (ఇది చదివిన కొన్నాళ్ళకు ఎన్.పి.ఆర్ శనివారం ఉదయం వార్తల్లో కురాల్ట్ కెమెరామన్‌తో ఇంటర్వ్యూ విన్నాను; ఈ ట్రాన్‌స్క్రిప్ట్స్ తాలూకు ఒరిజినల్ బ్రాడ్‌కాస్ట్స్ కొన్ని వినగలిగాను కూడా.)

Krishna’s Cosmos – Ratnottam Sengupta ఎచింగ్, ప్రింట్‌మేకింగ్ కళల్లో ప్రపంచ ప్రసిద్ధుడైన తెలుగు చిత్రకారుడు ఎన్. క్రిష్ణారెడ్డి (నందమూరు, న్యూయార్క్) గురించి పుస్తకం. ఈ కోవలోనే యూనివర్సిటీ ఆఫ్ హవాయి వారు 2008లో ఆయన ప్రింట్ల ప్రదర్శన సందర్భంగా ప్రచురించిన పుస్తకం కూడా చదివాను.

Aravind Adiga White Tiger బుకర్ ప్రైజ్ గెల్చుకొన్న నవల

Anurag Mathur – The Inscrutable Americans చాలా ఏళ్ళ క్రితం, అమెరికాలో భారతీయులు బాగా తక్కువగా ఉన్న రోజుల్లో, ఒక చిన్నపట్టణంలో చదువుకోవడానికి వచ్చిన ఒక అమాయకపు యువకుడి కథ; అక్కడక్కడా బాగా నవ్వొస్తుంది. ఆ నలుగురు తీసిన చంద్ర సిద్ధార్థ అంతకు ముందు ఈ పుస్తకాన్ని ఇంగ్లీషు సినిమాగా తీశాట్ట.

Chetan Bhagat- five point someone
Chetan Bhagat – One night at the call center
Chetan Bhagat- The three mistakes of my life
జనవరిలో ఇండియా వెళ్ళినప్పుడు యువత ఈ పుస్తకాలు చదవడం గమనించాను. 3 ఇడియట్స్ సినిమా మొదటి పుస్తకం పైన (కొద్దిగా, బహుకొద్దిగా) అధారపడింది. ఆసక్తికరంగా వ్రాస్తాడు.

Vikas Swarup : Q & A స్లండాగ్ మిలియనీర్ సినిమాకి ఆధారభూతమైన పుస్తకం; మంచి కల్పన; సినిమాతో చాలా పోలికలున్నా, చాలా తేడాగా ఉంటుంది.

Robin Sharma : Monk Who Sold His Ferrari సెల్ఫ్ హెల్ప్, మానేజ్‌మెంట్ తరహా పుస్తకం. గొప్ప టైటిలు; అంతవరకే.

Mahanati Savitri -a Lengendary Actress — VR Murthy, V Soma Raju సావిత్రి మీద అమితమైన ప్రేమతో, వివరంగా పరిశోధించి వ్రాసిన పుస్తకం; చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి; మంచి ఫొటోలు కూడాను. కాకపోతే చాలా విషయాలు అవసరమైనదానికన్నా విపులంగా ఉండటంతో పుస్తకం కొద్దిగా పెద్దదయ్యింది. ఇది చదవడానికి కొన్నిరోజుల ముందే తెలుగులో సావిత్రి మీద రెండు పుస్తకాలు చదవటంతో చాలా విషయాలు మళ్ళీ మళ్ళీ చదివినట్లు అనిపించింది.

ఇంటర్నెట్, సెర్చ్ ఇంజన్ల వాడకాల విశ్లేషణ ఆధారంగా అనేక సాంఘిక ప్రశ్నలకు సమాధానాలు చెప్పటానికి ప్రయత్నించిన ఆసక్తికరమైన పుస్తకం ఒకటి గత జనవరిలో చదివాను; పేరు, రచయిత పేరు గుర్తు లేవు. మీలో ఎవరికైనా ఈ పుస్తకం పేరు గుర్తుకొస్తే చెప్పండి.

ఇంకా చాలా (ముఖ్యంగా అమెరికన్) మిస్టరీ నవలలు చదివాను గానీ, గుర్తున్నవి:
Scott Turow – Reversible Errors,
Frederick Forsyth – The Afghan

తెలుగు

పరిచయాలు – ఎన్. వేణుగోపాల్
పరి పరి పరిచయాలు – ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

న్యూజెర్సీ తెలుగు కళా సమితి రజతోత్సవ సంచిక
వంగూరి ఫౌండేషన్ 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక

హెచ్చార్కె – చిన్న చిన్న ఘటనలు
వైదెహీ – శశిధర్ నిద్రిత నగరం
సీతారాం – కుప్పం
సీతారాం – అదే పుట
శ్రీశ్రీ – మహాప్రస్థానం
బసవరాజు అప్పారావు గీతాలు
ధనేకుల వెంకటేశ్వరరావు – కవిజీవిక
ధనేకుల వెంకటేశ్వరరావు – గుంటూరు కథ

వెల్చేరు నారాయణరావు – తెలుగులో కవితావిప్లవాల స్వరూపం (మూడో ప్రచురణ)
తెలుగులో లలిత గీతాలు – వడ్డేపల్లి కృష్ణ

కళాశిల్పి కళాధర్
ధృవతార కన్నాంబ
మహామహిళ భానుమతి
ఆరుద్ర సినీ మినీ కబుర్లు
మహానటి సావిత్రి – పల్లవి
సావిత్రి జ్ఞాపకాలు
పూర్ణోదయం – పులగం చిన్నారాయణ
వడ్డేపల్లి కృష్ణ సినిమా గీతాలు

గోపీచంద్ నవలలు (2009 ప్రచురణలు) 1,2 + పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
కొడవటిగంటి కుటుంబరావు – కథలు (2009) – 1
కొడవటిగంటి కుటుంబరావు – సంస్కృతి వ్యాసాలు (1)
భావవిప్లవకారుడు కొడవటిగంటి

పిల్లలపుస్తకం – సైకం నాగరాజు

ఐ.వెంకట్రావు – ఫ్లాష్‌బాక్
లక్ష్మీపార్వతి వ్రాసిన ఎన్‌టీఆర్ జీవిత చరిత్ర – (మొదటి భాగం) తెలుగు తేజం; (రెండో భాగం) ఎదురులేని మనిషి
నాదెళ్ళ భాస్కర రావు – ఆత్మకథ

ముళ్ళపూడి వెంకట రమణ — కోతి కొమ్మచ్చి
ఆచంట జానకీరాం – సాగుతున్న యాత్ర, నా జీవనపథంలో…

వంశీ – మహల్లో కోకిల
వంశీ వెండితెర నవలలు (శంకరాభరణం, మరో మూడు)
మాదిరెడ్డి సులోచన (అగ్ని పరీక్ష, ఇంకో మూడు పుస్తకాలు)

ఫురాణం సుబ్రహ్మణ్య శర్మ – జేబులో బొమ్మ

వంగూరి చిట్టెన్ రాజు – అమెరికామెడీ కథలు
ఫణి డొక్కా – పల్లకి

సోమరాజు సుశీల – దీపశిఖ
అన్నంగుడ్డ – సుంకోజి దేవేంద్రాచారి
కథ – 2008

పుస్తకం.నెట్‌కు జన్మదిన శుభాకాంక్షలు; నిర్వాహకులకు అభినందనలతో…

– జంపాల చౌదరి

You Might Also Like

7 Comments

  1. పుస్తకం » Blog Archive » పుస్తకంతో ఒక సంవత్సరం

    […] వేస్తాం అంటే సరే అన్నాను. ఆ తర్వాత ఆ వ్యాసాన్ని ప్రచురించినప్పుడు (జనవరి 9, 2010), నేను […]

  2. జంపాల చౌదరి

    >>ఇంటర్నెట్, సెర్చ్ ఇంజన్ల వాడకాల విశ్లేషణ ఆధారంగా అనేక సాంఘిక ప్రశ్నలకు సమాధానాలు చెప్పటానికి ప్రయత్నించిన ఆసక్తికరమైన పుస్తకం ఒకటి గత జనవరిలో చదివాను; పేరు, రచయిత పేరు గుర్తు లేవు

    ఆలస్యంగానే ఐనా గుర్తుకు వచ్చింది. పుస్తకం పేరు CLICK: What milions of people do online and why it matters. రచయిత Bill Tancer. వివరాలకు: http://www.billtancer.com

  3. చౌదరి జంపాల

    @kiranmayi:

    కిరణ్మయి గారూ:

    వంగూరి చిట్టెన్‌రాజు గారి పుస్తకాలకోసం వంగూరి గారికి (rvanguri@wt.net) టపా పంపండి.
    పల్లకీ కోసం శ్రి ఫణి డొక్కాకు (phanidokka@yahoo.com; phone no. 404-435-0309) టపా పంపండి.

  4. రంజన్

    మీరు చదివిన పుస్తకాల్లొ నెను వికాస్ స్వరూప్ రాసిన పుస్తకమొకటే చదువుతున్నాను.కాని మీ యొక్క అలోచన చాలా బాగుంది.నేను చదివిన వాటిలో నాకు బాగా నచినవి బి.వి.పట్టాభిరాం “మాటే మంత్రము”మరియు సాయి క్రిష్ణరాం “చూస్తూనే ఉండండి” .ఫ్రతి ఒక్కరు చదవదగిన పుస్తకలు.

  5. kiranmayi

    Wonderful. ఒక్క సంవత్సరం లో బోలెడు బుక్స్ చదివారు. మీ లిస్టు లో ఉన్న కొన్నింటినైనా చదవాలనుకున్నా కాని వీలు పడలేదు. వంగూరి చిట్టెన్ రాజు ఇంకా ఫణి డొక్కా పుస్తకాలు ఎక్కడ కొన్నారో చెప్పగలరా ప్లీజ్?

  6. సౌమ్య

    చాల పుస్తకాల పేర్లు తెలిసాయండీ ఈ పోస్ట్ చదువుతూ ఉంటే. అలాగే, ఈ పోస్ట్ తాలూకా లింక్స్ ద్వారా మరిన్ని కథనాల గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. జంపాల గారు ఇలాగే తాము చదివిన పుస్తకాల గురించి తరుచుగా పుస్తకం.నెట్ లో రాస్తే, మాబోటి వారికీ కొత్త బంగారు లోకాల గురించి పరిచయం చేసినవారౌతారు 🙂

Leave a Reply