eveninghour.com – హైద్‍లో ఒక కొత్త గ్రంథాలయం / పుస్తకాలయం

హైదరాబాద్ నగరవాసులైన పుస్తకప్రియులకి ఓ శుభవార్త! ట్రాఫిక్ జామ్స్, పార్కింగ్ గోలలూ భరించాల్సిన అవసరం లేకుండా మనమున్న చోటుకి మనక్కావల్సిన తెలుగు / ఇంగ్లీషు పుస్తకాలు మనకోసం ఒక క్లిక్ లేదా ఒక కాల్ తో లభ్యమయ్యే అవకాశం, eveninghour.com వాళ్ళు మనకందిస్తున్నారు. కె.పి.హెచ్.బిలో ఉన్న ఈ షాపుకి మనం వెళ్ళనవసరం లేదు. షాపే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది, మనకి కావాల్సినవి ఇస్తుంది. “అబ్బా.. తెలుగు పుస్తకాలు కావాలంటే కోఠీకెళ్లాలి. అక్కడ ట్రాఫిక్ ఎక్కువ, పార్కింగ్ తో వెధవ తలనొప్పి” అనుకుంటూ ఉన్నవారికి ఇప్పుడు వీరు ఒక మంచి సదుపాయాన్ని అందిస్తున్నారు. ఈ లైబ్రరీ / షాపును నిర్వహిస్తున్న ప్ర్రియాంక గారితో కొన్ని ముచ్చట్లు!

మీకేవైనా ప్రశ్నలుంటే కమ్మెంట్స్ లో అడగండి.. ప్రియాంక గారే జవాబిస్తారు.

1. eveninghour.com అంటే?

ఈ ఆధునిక కాలం లో ప్రతి ఒక్కరు ఉద్యోగాలు, పిల్లలు, శుభకార్యాలు లాంటి అనేకమయిన పనులు వత్తిడిలో మనకంటూ సమయం కేటాయించటం కుదరటమే లేదు. ఒకవేళ ఎప్పుడయినా సమయం దొరికినా, దానిని ప్రయోజనాత్మకంగా ఉపయోగించటానికి కావలసిన సదుపాయాలూ సులభముగా లభ్యమవటం లేదు. మీ ఈ అమూల్య మయిన ఖాళీ సమయాన్ని సద్వినియోగ పరచటమే EveningHour.com ఒక్క ముఖ్య ఉద్దేశం.

ఆలోచించి చూడగా, మనస్సుని ఆహ్లాద పరచి, ఆలోచనలని పక్కన పెట్టి, వేరే ప్రపంచానికి తీసుకుని వెళ్ళగల శక్తి ఒక్క పుస్తక పఠనానికే ఉంది అని అనిపించింది.

మనలో చాలా మంది చిన్నప్పుడు విపరీతంగా పుస్తకాలు చదివి ఇప్పుడు పనుల వత్తిడిలో చదవటం తగ్గించేసాము. సమయ, దొరకకపోవటం ఒక కారణం అయితే, ఇంకో ముఖ్య కారణం పుస్తకాలు సులభంగా దొరకక పోవటమే. పెరుగుతున్న ధరలు ఒక కారణం అయితే, అవి కొన్నుకోవటానికి దూరాలు ప్రయాణం చెయ్యవలసి రావటం ఇంకో కారణం. హైదరాబాద్ లో గ్రంథాలయాలకి కరువు అనే చెప్పచ్చు, ఏవో కొన్ని చోట్ల తప్పించి. వాటికి కూడా మనమే వెళ్లి తెచ్చుకోవాలి. ఈ సమస్యలని పరిక్షరించాటానికే మేము EveningHour .com మొదలు పెట్టాము.

EveningHour.comలో పుస్తకాలు కొనుక్కోవచ్చు మరియు అరువు తీసుకోవచ్చు. ఇదే కాకుండా జంట నగరాలలో మీరు ఎక్కడ ఉన్నా, మేము మీ ఇంటికి లేదా కార్యాలయానికి నేరుగా వచ్చి పుస్తకాలని చేరుస్తాము.

2. EveningHour.com ప్రారంభించాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

నేను అమెరికా లో M .S ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి తరువాత అక్కడే UBS (స్విస్స్ బ్యాంకు) lo ఉద్యోగం చేసే దానిని. అక్కడ ఉన్నప్పుడు విపరీతంగా గ్రంథాలయాలకి వెళ్లి పుస్తకాలను చదివేదానిని. 2007 లో ఇండియా కి తిరిగి వచేసాము. అప్పుడు గ్రంధాలయాల కోసం చాలా వెతికాను. అంతగా దొరకలేదు – దొరికిన వాటిలో నాకు నచ్చిన పుస్తకాలు లేవు. ఎవరో చెయ్యలేదు అని బాధ పడే బదులు, మనమే ఒకటి మొదలు పెట్టాలి అని అనుకున్నాము. అలా  ప్రారంభం అయ్యింది EveningHour.com .

3. ఎప్పుడు ప్రారంభమయ్యింది?

వెబ్సైటు ఆగష్టు 15th 2009 లో మొదలు పెట్టాము. ప్రస్తుతానికి వెబ్సైటు లో ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. కాని అతి త్వరలో అనగా, క్రిస్మస్ రోజు అనగా, 25th డిసెంబర్ 2009 నించి తెలుగు పుస్తకాలు కూడా ఆన్‍లైన్ లో పెడుతాము.

కుకట్‍పల్లి లో ఉన్న షాప్ మరియు గ్రంధాలయం అక్టోబర్ 23rd,2009 మొదలు చేయబడింది. ఇక్కడ తెలుగు మరియు ఇంగ్లీష్ పుస్తకాలు దొరుకుతాయి.

4 . లైబ్రరీ / స్టోర్ పనిచేసే వేళలు?

ప్రతి రోజు ఉదయం 10:00 AM నించి రాత్రి 9 :00 PM వరకు షాప్ తెరిచే ఉంటుంది.

5.   ఏ ఏ భాషల పుస్తకాలుంటాయి మీ దగ్గర? ఎలాంటి పుస్తకాలుంటాయి?

EveningHour.comలో పెద్దలకి, పిల్లలకి కావలసిన పుస్తకాలు దొరుకుతాయి. మరియు ఎప్పుడూ కొత్త కొత్త పుస్తకాలని తెప్పిస్తూనే ఉంటాము. సాహిత్యం, సెల్ఫ్-హెల్ప్ పుస్తకాలు, కథలు, నవలలు, బయోగ్రఫీస్, బిజినెస్, సెల్ఫ్-డెవలప్‍‍మెంట్ ఇలా అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయి.

6 . సభ్యులుగా చేరాలంటే విధానం ఏమిటి?

ఆన్‍లైన్, వెబ్‍సైటు లో నించి కానీ, షాప్ కి వచ్చి అయిన రిజిస్టర్ అవ్వచ్చు. మీ పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిలు అడ్రస్, పోస్టల్ అడ్రస్ చెప్తే చాలు.

7 . లైబ్రరీ నుండి కావాల్సిన పుస్తకాలు ఎలా ఆర్డరు చేసుకోవాలి? ఫోన్? ఈ-మెయిల్? ఆన్‍లైన్ సైట్?

ఫోన్, ఈమెయిలు, ఆన్‍లైన్ వెబ్సైటు – మీకు ఏది సులువు అనుకుంటే ఆ రకంగా మీకు కావలసిన పుస్తకాల పేరులు మా తెలియచేస్తే, మేము మీ వద్దకు పంపుతాము.

8 . మీ దగ్గర పుస్తకాలు కొనే సౌకర్యం కూడా ఉందా?

సైట్ ద్వారా కాని షాప్ లో కాని మీరు పుస్తకాలు కొనుక్కోవచ్చు.

9 .  నేరుగా వచ్చి మీ లైబ్రరీ నుండి పుస్తకాలు కొనాలన్నా, అరువు తీసుకోవాలన్నా ఏ విధంగా సంప్రదించాలి?

మా ఆఫీసు (040-65873003) కు ఫోన్ చేసి ఎటు వంటి ప్రశ్నలు ఉన్న నివృత్తి చేసుకోండి. లేదా నేరుగా గ్రంధాలయానికి రండి.

10 . తెలుగు పుస్తకాలు ఏవేవి ఉన్నాయి? (కాటలాగు లాంటిదుంటే చెప్పండి.)

షాప్ లో పోతన భావాగతం, శరత్ సాహిత్యం వంటి క్లాసిక్స్; బాపు పుస్తకాలు, బారిస్టర్ పార్వతీశం వంటి ఆంధ్రుల ఆదరణను పొందిన ప్రచురణలు, యండమూరి, సులోచన దేవి, మధు బాబు వంటి నవలలు మరియు ఆరోగ్యం, వంటలు, యోగ లాంటి అన్ని వర్గాల పుస్తకాలు దొరకుతాయి. ఈ క్రిస్మస్ నించి ఆన్‍లైన్ వెబ్సైటు ద్వారా కూడా ఇవి అన్ని లభ్యమవుతాయి.

మా మెంబెర్స్ సలహాల మేరకు ఎప్పుడు కొత్త పుస్తకాలు తెప్పిస్తూనే ఉంటాము.

11 . పిల్లల పుస్తకాలు?

తెలుగు మరియు ఇంగ్లీష్ – రెండు బాషలలో కూడా చిన్న పిల్లల పుస్తకాలు ఉన్నాయి. కథల పుస్తకాలు, కలరింగ్ పుస్తకాలు,మాథ్స్, ఇంగ్లీష్ లాంటివి నేర్చువటానికి – ఇలా అన్ని దొరుకుతాయి. ఇవి కాకుండా ఈ మధ్యనే గ్రోలియర్ (Grolier) వాళ్ళు ప్రచురించిన నాలుగేళ్ల నించి పది ఏళ్ళ వరకు ఉపోయోగపడే కాన్సెప్ట్ పుస్తకాలు కూడా తెప్పిస్తున్నాము.

12 . సభ్యత్వ రుసుము ఎంత? ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఒకే సారి ఎన్ని పుస్తకాల వరకూ అరువు తీసుకోవచ్చు?

రెండు రకాల ఇండివిడ్యువల్ సభ్యత్వ ప్లాన్స్ ఉన్నాయి:

1 . బెగిన్నెర్ (Beginner )

నెలసరి రుసుము: 100 రూపాయలు.
డిపాజిట్: 400 రూపాయలు.
సెటప్ ఫీ: 30 రూపాయలు.

ఒక్కొక్క సారి 2 పుస్తకాలు తీసుకుని వెళ్ళచ్చు. ఈ పుస్తకాల ఖరీదు 500 రూపాయలు మించ కూడదు.

2 . ఆవిడ్ (Avid )

నెలసరి రుసుము: 250 రూపాయలు.
డిపాజిట్: 750 రూపాయలు.
సెటప్ ఫీ: 30 రూపాయలు.

ఒక్కొక్క సారి 3 పుస్తకాలు తీసుకుని వెళ్లచ్చు. ఈ పుస్తకాల ఖరీదు 1000 రూపాయలు మించ కూడదు.

కార్పోరేట్ సభ్యత్వాలు కూడా ఆడరిస్తాము. వాటి గురించి మమ్మల్ని సంప్రదించండి.

13 . మీ దగ్గర ఎన్ని పుస్తకాలున్నాయి?

షాప్ లో ఇంగ్లీష్ పుస్తకకాలు ఒక 2000 లకు పైగా ఉంటాయి. తెలుగు పుస్తకాలు ఒక 500 లకు పైగా ఉంటాయి. ఆన్‍లైన్ ఇంకా ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి. ఇంకా కొత్తవి కొంటూనే ఉన్నాం.

– G. Priyanka
http://www.eveninghour.com

67/A Sri Sai Archade
4th Floor
JNTU Lane
Above Levi’s showroom
KPHB Colony
Hyderbad 500072
Ph: 65873003 or 97053-91112

You Might Also Like

5 Comments

  1. Madhu

    Good effort. Congratulations. Your web site will be useful for many people in India as well as abroaf

  2. venkata giri

    want to read good books

  3. Purnima

    ఈనాటి ఈనాడులో ప్రియాంక గారి గురించిన వ్యాసం ఇక్కడ:

    http://eenadu.net/vasundhara.asp?qry=pratibha

    అభినందనలు ప్రియాంక!

  4. sujji

    Informative.. Thanks

  5. sudhakar

    namaskaram,

    ee website hyderabad lo pustakapryilaku oka manchi neestam. manaki kavalasina telugu , english- kathala pustakalu, novels inka chala rakaala pustakalu ikkada doruktayi, leda ee website lo vethukkovochu.

    pustakalani aruvu lo kuda pondavachu…chala sulabahm…

    danyavaadalu

Leave a Reply