కౌముది రచనల కోసం విజ్ఞప్తి

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో జన్మించి, కమ్యూనిస్టు వుద్యమంలో భాగస్వామి అయి, హిందీ పండితులుగా అటు ఉత్తరాదిలోనూ, తెలుగు కవిగా, రచయితగా, సాహిత్య విమర్శకులుగా ఇటు తెలుగు నాట పేరు గడించిన వ్యక్తి కౌముది. అభ్యుదయ రచయిత సంఘంలోనూ, ప్రజా నాట్య మండలిలోనూ కౌముది క్రియాశీల కార్యకర్త. హిందీ- తెలుగు భాషల అభ్యుదయ సాహిత్యాల మధ్య సేతువు.

ప్రముఖ అభ్యుదయ రచయిత, కీర్తి శేషులు కౌముది (1940-1998) రచనల సమగ్ర సంకలనాలు అచ్చులోకి తీసుకురావడానికి” కౌముది రచనల ప్రచురణల సమితి” సంకల్పించింది. ఇందులో భాగంగా ఆయన కవితలని కొన్నింటిని సేకరించి “అల్ విదా” శీర్షికన 2010 జనవరి 18 (వర్ధంతి) సందర్భంగా ప్రచురిస్తున్నాము.

అయితే, అభ్యుదయోద్యమ కాలంలోనూ, తరవాతి కాలంలోనూ సాహిత్య విమర్శకులుగా కౌముది అనేక సాహిత్య వ్యాసాలు, సమీక్షలూ వివిధ పత్రికలలో రాశారు. వచ్చే ఏడాది ఈ విమర్శ గ్రంధాన్ని తీసుకు రావాలని మా సంకల్పం. ఈ సాహిత్య విమర్శ, సమీక్షలు కొన్ని మాకు అందుబాటులో లేవు. వీటికి సంబందినించిన వివరాలు పంపించవలసిందిగా కోరుతునాము.

మీరు ఈ దిగువ చిరునామాకి ఈ వివరాలు పంపగలరు.

Gurram Seetaramulu
Research fellow,
Room : C-6 Basheer Hostel,
English and Foriegn Language University,
Hyderabad, India 500 605

Email: seetaramulu@gmail.com

You Might Also Like

Leave a Reply