Persepolis

persepolisPersepolis – Marjare Satrapi రాసిన,గీసిన – గ్రాఫిక్ నవల. నవల కాదు – ఆత్మకథ. గ్రాఫిక్ నవల చదవడం ఇదే తొలి అనుభవం నాకు. అలాగే, ఇరానియన్ జీవితం గురించి తెలుసుకోవడం కూడా. ఈ తొలి అనుభవం మంచి అనుభవమే కావడం చేత, ఈ పుస్తకాన్ని గురించి తప్పక రాయాలి అనుకూంటూ ఉన్నా – ఇప్పటికి రాస్తున్నా.

కథ: ఇది రచయిత్రి నిజ జీవితం కథ. ఇరాన్ దేశంలో కమ్యూనిస్టు, సోషలిస్టు ఉద్యమాలు నడుస్తున్న కాలంలో, ఒక ఆధునిక కుటుంబంలో పుట్టిన సత్రపి చిన్నప్పటి నుండీ ఇరాన్ లో జరుగుతున్న మార్పులని దగ్గరగా చూశారు. ఓ వైపు ఆధునికతా… ఓ వైపు చాంధసవాదం – వీటి మధ్య ఇరాన్లో కాస్త చదువుకున్న, అభ్యుదయవాద కుటుంబాలు పడే అవస్థలు ఈ నవల చదువుతూ ఉంటే, కళ్ళకి కట్టినట్లు అర్థమయ్యాయి. ఇరాన్ లో అమ్మాయిలు-అబ్బాయిలకి ఉండే ఆంక్షలను వాటిని చూశాక అవాక్కయ్యాను. నా దృష్టిలో ఇరాన్ తక్కిన ఇస్లాం చాంధసవాద దేశాలకంటే ఓ మెట్టుపైనే ఉండేది మరి!

సరే, కథలోకొద్దాం. చారిత్రకంగా ఇరాన్ కు ఈ డెబ్భై-ఎనభైల కాలం ఎంతో ముఖ్యమైనది. 1979 లో జరిగిన ఇరానియన్ విప్లవం తరువాత, రాచరికం అంతరించింది కానీ, అంతకు మించి, మతతత్వ రాజ్యం మొదలైంది. సత్రపి వంటి కుటుంబాలు దీని వల్ల బాగా అవస్థ పడ్డాయని చెప్పాలి. ఈ సమయంలో సత్రపి ని దీని ప్రభావం నుండి దూరంగా ఉంచేందుకు ఆస్ట్రియా పంపారు ఆమె తల్లిదండ్రులు. ఆమె అక్కడే నాలుగేళ్ళు – చదువు, స్నేహాలూ… వారి సంప్రదాయం ప్రకారం ’చెడు’ సావాసాలు…అక్కడక్కడా వర్ణవివక్ష…ఫ్లూ వల్ల ప్రాణం మీదకి రావడం – ఇంత అయ్యాక, మళ్ళీ ఇరాన్ చేరుకుంటుంది. మధ్యలో ఇరాన్-ఇరాక్ యుద్ధం. వెనక్కొచ్చాక, కొన్నాళ్ళు ఇక్కడుండి, పెళ్ళి-విడాకులు – ఆ తర్వాత మళ్ళీ దేశం వదిలి వెళ్ళిపోతుంది. ఈసారి శాశ్వతంగా. నవల కథ ఇక్కడిదాకే. తరువాత, ఆమె యూరోప్ లో స్థిరపడ్డం, రచయిత కావడం – అది దీనికి కొనసాగింపు.

ఈ నవల చదువుతూ ఉంటే – ఇరాన్ జీవితమే కాదు – సత్రపి ఆలోచనా విధానం ఎలా రూపు మారుతూ వచ్చిందో కూడా అర్థమౌతుంది. అలాగే, ఏళ్ళు గడిచినా మారని కొన్ని behavioral traits కూడా గమనించవచ్చు. ఇలా ఆలోచిస్తే – ఈ పుస్తకం ఓ చరిత్ర పుస్తకంగా ఒక వైపు (సామాన్యుల చరిత్ర), ఒక వ్యక్తి గురించి అనలైజ్ చేసే పుస్తకంగా ఒకవైపు – రెండు రకాలుగా చూడొచ్చు. సత్రపి – నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది – ఇలాంటి ఓ మనిషి – కట్టుబాట్లే పడని మనిషి – ఇరాన్ వంటి దేశంలో… ఊహించలేకపోతున్నాను. మొన్నామధ్య “విష్ మేకర్” చదివినప్పూడూ, ఇప్పుడూ ఒకే విషయం కామన్ గా తోచింది – అదే, ఛాందసవాదం లో ఉన్న ఈ దేశాల్లో, కాస్త డబ్బున్న కుటుంబాల్లో పిల్లలు ఎదిగే పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది. ఏదైతే అక్కడి వ్యవస్థ సిద్ధాంతాల ప్రకారం చేయరాదో – అదే పొందే అవకాశం చేతిలో ఉన్నప్పుడు – అదే చేయాలి – అన్న ఆలోచనావిధానం బాగా ఉన్నట్లు అనిపించింది. సత్రపి విషయంలో ఆమె దేశం వదిలి వెళ్ళినా కూడా – ఇదే ప్రవర్తన కొనసాగిందనుకోండి, అది వేరే విషయం. అఫ్కోర్సు, విష్మేకర్ లో పాకిస్తాన్ సామాజిక పరిస్థితుల గురించి చెప్పింది కొంత భాగమే. ఇందులో సత్రపి జీవితం-ఇరాన్ సమాజం, రెంటికీ సమాన ప్రాధాన్యం ఉంది – రెండో భాగంలోకి చేరి ముందుకెళ్ళే కొద్దీ, సత్రపి వ్యక్తిగత జీవితం కథని డామినేట్ చేసినా కూడా. కొన్ని కథనాలు వింటూ ఉంటే – నాకు చాలా ఆశ్చర్యం కలిగింది – మనుషులన్నాక ఇలా ఎలా చేయగలరు? అని. నేను చూసిన ప్రపంచం చాలా చిన్నదనుకోండీ – కానీ, అలా అనుకోకుండా ఉండలేకపోయాను. ఇంకొన్ని చోట్ల – ఒక దేశం దేశం ఇంత ఛాందసంగా రూపొందడం ఏమిటీ? అని భయమేసింది.

ఇక కథనం – వాక్యాలు తక్కువా, బొమ్మలెక్కువా – విషయం మొత్తాన్నీ, ఈ పద్ధతిలో చాలా చక్కగా చెప్పారు. ఎక్కడా వర్ణనలు లేవు. చెప్పదలుచుకున్న సత్యాలు తప్ప. గ్రాఫిక్ నవల – అన్న ఆలోచన నాకు నచ్చింది. ఇదివరలో కార్టూన్ కథలు చదవడమే కానీ (పిల్లల పుస్తకాల్లో) – ఒక అడల్ట్ నవల, బొమ్మలతో చదవడం ఇదే ప్రథమం. మంచి పుస్తకం. మీగ్గానీ దొరికితే తప్పక చదవండి. అన్నట్లు ఈ పుస్తకాన్ని సినిమాగా కూడా తీశారు.

You Might Also Like

6 Comments

  1. అక్షయ్

    మీకూ పర్సిపోలిస్ నచ్చినందుకు చాలా సంతోషం. నేను ఈ నవల యొక్క మొదటి భాగాన్ని ఫ్రెంచిలో చదివాను. వికిపీడియాలో సూచించినట్టుగా ఫ్రెంచిలోని మొదటి రెండు భాగాలను కలిపి ఇంగ్లీషులో మొదటి భాగంగా ప్రచురించారు; అంటే నేను చదివింది ఇంగ్లీషులోని సగపుస్తకమే అన్నమాట. 🙂

    బహుసా ఇంగ్లీషు అనువాదంలో అంత స్పష్టంగా ఉండకపోవచ్చు, ప్రెంచి-డచ్చ్ భాషల్లో గంభీరమైన కామిక్ పుస్తకాల ఆనవాయితి చాలాలోతైనది; వీటిని వారు ప్రెంచిలో bande desinée (బాందె దెసీనె) లేక bd (‘బెదె’) అని పిలుస్తారు. క్లుప్తమైన ఇంగ్లీషు ఉపోత్ఘాతం ఇక్కడ, ప్రెంచిలో వివరమైన చరిత్ర ఇక్కడ) ప్రముఖ bande desinée శీర్షికలు మీరు వినేవుంటారు: టిన్టిన్ ఆస్టరిక్స్ వంటి కామిక్లతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి.

    నా ఉద్ధేశములో పర్సిపోలిస్ కూడా ఈ కోవకు చెందిన నవల. నామడుకూ పర్సిపోలిస్ల్ లోని అసలు ఆశ్చర్యం కలిగించే విషయం, francophone దేశస్తురాలు కాని మార్జాన్ సత్రపి తన అనుభవాలను ఫార్సీలో కాకుండా ప్రెంచిలో వ్రాయడం. Post-colonial వాదంలో ఇంకో మలుపు. 🙂

  2. viplove

    just checked..now it is available as e-book (which was not available when i watched the movie)
    still seeing the pictures , printed on paper feels closer , i believe

  3. viplove

    hey u got the book ?? can you tell me where can i get it ?
    are the images same as in the movie ? eversince i fell in love with the movie i wanted to see the book , could not get in walden / landmark

  4. సౌమ్య

    Yeah – It was made in to a movie.

  5. కత్తి మహేష్ కుమార్

    ఇది సినిమాగా వచ్చిందనుకుంటానే…

Leave a Reply