“కొత్త బంగారు లోకం” – పరిచయం, అభిప్రాయం, సమీక్ష

రాసిన వారు: చావాకిరణ్
*************

kottabamgaarulokam_cover== ముందు మాట ==

మొన్న విజయవాడ పుస్తకప్రదర్శనకు వెళ్లినప్పుడు ఏవైనా హైదరాబాదులో దొరకని పుస్తకాలు ఉంటే కొందాము అనుకొని బయలుదేరినాను. కాని సమయాభావం వల్ల పుస్తకాల వేటకు ఎక్కువ సమయం దొరకలేదు, ఒక్కసారి వేసిన లుక్కులో ఏవీ అకర్షించలేదు.

ఆ తరువాత అరుణం ద్వారా రచయిత అనిసెట్టి శ్రీధర్ పరిచయం అయ్యాడు. చూడగానే అనిపిస్తుంది He is down to earth అని, అంత సింపుల్ గా మాట్లాడతారు, కొంచం మితభాషి అనుకుంటాను, లేకుంటే మాకే సమయం చిక్కలేదేమో మాట్లాడటానికి. అతని రచనల గురించీ, స్వంత నగదుతో ప్రచురించిన పుస్తకం గురించి మాట్లాడుకున్నం. మళ్లా కొంత సమయానికి వారు వెళ్లేటప్పుడు బై చెప్పటానికనుకుంటాను ప్రతిభా వేదిక దగ్గరకు వచ్చారు. అప్పుడు కానీ నాకు లైటు వెలగలేదు, అరె వీరి పుస్తకం కొని ఆటోగ్రాఫ్ తీసుకుంటే బాగుంటుందే అని. అంతే “మీ పుస్తకం ఇక్కడ ఉందా అని అడిగాను”, అవును రెండు షాపుల్లో ఉంది అని సమాధానం, తరువాత షాప్ నంబర్ 78 అనుకుంటాను వెళ్లి 45 రూపాయలు పెట్టి కొని అటోగ్రాఫ్ ప్లీజ్ అని తీసుకొని పనిలో పడ్డాను. అన్నట్టూ ఒక విషయం ఈ పుస్తకాన్నీ కొన్నిరోజుల ముందు విశాలాంధ్ర అబిడ్సులో చూసి ఇదేదో హిట్టయిన సినిమా పేరుతో మార్కెటింగు చేసుకునే యవ్వారం అని కొనలేదు 🙂 కానీ పుస్తకం చదివిన తరువాతనే తెలిసింది రచయిత అదే పేరుతో ఎప్పుడో ఒక కథ వ్రాశారు అని.

kottabangaarulokam_autograph

వారు వెళ్లేటప్పుడు కూడా మరో మారు గుర్తు చేశారు చదివి అభిప్రాయం చెప్పటం మర్చిపోవద్దు అని.

As Promised by me, here is my opinion on this book.

==  పుస్తకం గురించి ==

—-

శీర్షిక – కొత్త బంగారు లోకం (kottha bangaru lokam)

రచయిత – అనిసెట్టి శ్రీధర్ కథలు (Anishetty Sridhar Kathalu)

తొలి ముద్రణ – 2008

కాపీలు – 1000

కవర్ గీసింది – నార్సిం

కాపీలు లభించు చోట్లు

నవోదయ ప్రచురణలు , కార్ల్ మార్క్స్ రోడ్ , విజయవాడ

నవోదయ బుక్ హౌజ్ , ఆర్యసమాజ్ ఎదురుగా, హైదరాబాద్

విశాలాంధ్ర బుక్ హౌజ్, అన్ని బ్రాంచీలు

ప్రజాశక్తి బుక్ హౌజ్, అన్ని బ్రాంచీలు

వెల – 50 రూపాయలు

ముందు మాట – మునిపల్లె రాజు

వెనుక మాట – పాపినేని శివశంకర్

—-

ఈ పుస్తకం గురించి ముందు చెప్పుకోవాల్సింది కవర్ పేజీ గురించి, కవర్ పేజీ చాలా అందంగా, ఆకర్షణీయమైన రంగులతో ఉంది. అలాగే అర్థవంతంగానే ఉన్నట్టుంది, ఆ అర్థం నాకు పూర్తిగా అర్థం కాలేదు గానీ.

—-

ఇహ పుస్తకం విషయానికి వస్తే ఈ రచయిత పాత కాపే, ముఖ్యంగా కథా రచయిత. ఇతని కథలు నవ్య, ఇండియా టుడే, విపుల వంటి ప్రముఖ ప్రచురణల్లో వచ్చాయి. ఈ ప్రస్తుత పుస్తకంలో అటువంటివి 15 కూర్చినారు.

—-

== రచనా శైలి ==anishettsridhar

ఇతని శైలి చాలా సులభం. అంతా మనం మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఎదురుగా కూర్చోని కథ చెపుతున్నట్టే ఉంటుంది. హాస్యం ఉపయోగించటంలో నేర్పరి. హాస్యం అంటే ప్రత్యేకంగా ఏదో కథలోకి చొప్పించకుండా కథలో భాగంగా హాస్యం ఇమిడిపొయ్యేట్టు వ్రాశారు. కథలకు రీడబిలిటీ బాగుంది. అపకుండా అన్ని కథలను ఏకబిగిన చదవ వచ్చు. వీరు మంచి ఫిక్సన్ నవలలు వ్రాస్తే బాగుంటుంది.

కాకుంటే ప్రతి కథలోకీ రచయిత జోక్యం ఎక్కువ. ఒక్కోసారి మనకు ప్రధాన పాత్ర మాట్లాడుతుందో రచయిత మాట్లాడుతున్నాడో అర్థం కాదు. కథలన్నీ ఒక వైపునుండే ఆలోచిస్తాయి. పేదవారి పక్షపాత కథలు. ఇది మంచా చెడా అంటే చదివే వారిని బట్టి ఉంటుంది.

== కథలు ==

1. మద్దతు

2. స్పృహ

3. పాత సామాను

4. సహాయం

5. నెత్తురు కూడు

6. కొలంబస్

7. తుఫాన్

8. స్త్రీవేదం

9. తీరం చేరని నావ

10. మగాడి పశ్చాత్తాపం

11. పుత్రోత్సాహం

12. కొత్త బంగారులోకం

13. బాధ్యత

14. జనజీవన స్రవంతి

15. షోకేస్

చాలా కథలు అవార్డు కథలు.

{{స్పాయిలర్ వార్నింగ్ }} ఈ దిగువన కథా విషయాలు చర్చించబడ్డాయి, మీరు పుస్తకాన్ని అనాఘ్ర పుష్పంగా చదవాలంటే ఇక్కడితో చదవటం ఆపాలి.

(గమనిక – పక్కన ఉన్నవి నా రేటింగు)

గొపాలం ఒక నిజాయితీపరుడైన అధికారి కథ.మామూలుగా ఉంది. 3/5

స్పృహ , స్త్రీ కథ, చాలా బాగుంది. ముఖ్యంగా కథలోని వివాహితను కొళ్లఫారంలోని కోడిలా తను పంజరంలో ఉన్నా అన్న స్పృహ లేకుండటం అనే కాన్సెప్టు బాగుంది. 4.5/5

పాత సామాను, ఒక సెంటిమెంటు కథ, వృద్ధురాలి చిన్న చిన్న కోరికలు తరువాతి తరం ఎలా తృణీకరిస్తున్నారో చెప్పే కథ. 4/5

సహాయం – మరో మంచి కథ, కాకుంటే ఇటువంటి కథలు మనం చాలా చదివి ఉంటాము, కానీ రచయిత పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. 4/5

నెత్తురు కూడు – ఒక ఎరుపు రంగు కథ, యథావిధిగా పాత్రలు చాలా సహజంగా, సినిమాటెక్కుగా ఉన్నాయి. ఇంకా కొంచం కృషి చేసి ఉంటే యోగా కాన్సెప్టు ఇంకా బాగా వచ్చేది. మూడు ముప్పై రూపాయలు != మూడువేల ముప్పై రూపాయలు కాదు అనే విషయం పాత్రకు లెక్కతేలలేదనుకుంటాను. 3.5/5

కొలంబస్ – బాగుంది. ఏమి మిస్ కాకూడదో చెప్ప ట్రై చేశారు. 4/5

తుఫాన్ – మరో సినిమాటెక్ సొల్యుషన్ కథ. నిజ జీవితంలో అలా జరగవా? ఏమో ఎవరికి తెల్సు. 3.5/5

స్త్రీవేదం – మరో స్త్రీ కథ. మరో సినిమాటెక్ సొల్యుషన్ కథ. నిజ జీవితంలో అలా జరగవా? ఏమో ఎవరికి తెల్సు. 3.5/5

తీరం చేరని నావ – బాగుంది. కానీ ఇలా రెండు ముగింపులు ఇవ్వటం బాగోలేదు. ఏదో ఒకటి ఇచ్చి ఉండవలసింది. 4/5

మగాడి పశ్చాత్తాపం – బాగుంది, ముఖ్యంగా ముగింపు. 4/5

పుత్రోత్సాహం – బాగుంది. రచయిత ఒక ఉతోపియాను సృష్టించి ఒక చిన్న సమస్యను విసిరి ఉతోపియా మార్గంలో సాధించాడు. 4/5

కొత్త బంగారు లోకం – ఒక రకమైన సైన్స్ ఫిక్సన్ కథ, కాకపోతే మనవాళ్లు ఇంకా సైన్స్ ఫిక్సన్ అలవాటుపడలేదన్నట్టు చివరలో కలగా తెల్చి కొత్త కలలుకు ప్రాణం పోస్తాడు. 4.5/5

బాద్యత – ఇది సాక్షి స్టైలులో వ్రాసిన కథ. బాగుంది. మళ్లా అవినీతిపైనే అస్త్రం. 3.5/5

జనజీవన స్రవంతి – బహుశా పోకిరి చూశాక వ్రాశారేమో. బానే ఉంది. ఎరుపు కథ. 3.5/5

షోకేస్ – చాలా ఫీలయి వ్రాసినట్టున్నారు. కానీ మరింత రివ్యూ చేసి ఉంటే ఇంకా మంచి కథ తయారయ్యేది. 4/5

You Might Also Like

6 Comments

  1. chavakiran

    తాడేపల్లి గారూ,

    నెనర్లు.
    వ్రాసేటప్పుడే అనుమానం వచ్చింది కానీ నిఘంటువు వెతకడానికి బద్దకమేసింది.

    ఈ సారి సరిగ్గా వ్రాస్తాను.

  2. తాడేపల్లి

    అనాఘ్రపుష్పం = లేదు.
    అనాఘ్రాత పుష్పం = ఉంది

  3. pustakam.net

    నెటిజన్ గారు:

    ఈ సైట్ ఇంకా నిర్మాణ దశలో ఉండడం చేత, కొంత కీలక సమాచారం (సైటు పని చేయు విధానం పై స్పష్టత)పాఠకులకు అందలేదన్నది వాస్తవం. త్వరలోనే అందుబాటులో ఉండేలా చూస్తాం.

    నెనరులు,
    పుస్తకం.నెట్

  4. నెటిజన్

    “పుస్తకం” నిర్వాహకులు మన్నించాలి.
    సమీక్షకుడు (గమనిక – పక్కన ఉన్నవి నా రేటింగు) అన్నది ఇందాక గుర్తించలేదు.

  5. నెటిజన్

    పుస్తకం చదవలేదు కాబట్టి దాన్ని గురించి చెప్పలేను.
    పుస్తకం ఎక్కడ దొరుకుతుందో అన్న వివరాలు – కధల సూచిక ఇచ్చిన తీరు బాగుంది.
    ఇకపోతే కధలని బేరీజు వెయ్యడానికి మీరు తీసుకున్న ప్రమాణాలేమిటి తెలియజేస్తే బాగుంటుంది.(ప్రతి కధకి ఐదింట ఇన్ని వంతులన్నారు కాబట్టీ)
    ఇక ఆ ఐదు ప్రమాణాలు మీ వ్యక్తిగతమైనవా, లేక పుస్తకం డాట్ నెట్ వారివా?
    “పుస్తకం” నిర్వాహకులలో స్పష్టత లోపించిందేమోననిపిస్తున్నది.
    తెలుగు పుస్తకాల సమీక్షలలో పూర్తిగా తెలుగు వాడితే బాగుంటుంది. ఉదా: ఎరుపు కధ అని మీరన్నారు.
    దానిని వివరించగలరా?

Leave a Reply