2021లో నేను చదివిన పుస్తకాలు

2021లో నేను చదివిన పుస్తకాలు

నేను 2021లో చదివిన ఆంగ్ల పుస్తకాల సంఖ్య మామూలు కంటే చాలా తక్కువగా ఉంది. ఈ సంవత్సరం మా స్థానిక లైబ్రరీకి బహు తక్కువసార్లు వెళ్ళాను – కరోనా జాగ్రత్తలవల్ల, ఇతర కారణాలవల్ల కూడా. వ్యసనంగా మారిన స్ట్రీమింగ్ సినిమాలు (ముఖ్యంగా మలయాళం సినిమాలు, పాత తెలుగు సినిమాలు), న్యూయార్క్ టైంస్ స్పెల్లింగ్ బీ పజిల్ చాలా సమయాన్ని తీసుకోవటం కూడా కారణాలే; దాదాపు 160 సినిమాలు చూశాం ఈ సంవత్సరంలో. ఎప్పటిలాగానే తానా నవలలపోటీ కొంత సమయాన్ని తీసుకొంది. ఐతే, ఇంగ్లీషు పుస్తకాల స్థానాన్ని తెలుగు పుస్తకాలు భర్తీ చేశాయి. తెలుగు పుస్తకాల సరఫరాకు మళ్ళీ వీలు కావటం ముఖ్య కారణం. హైదరాబాదు నవోదయా పబ్లిషర్స్ వారి సహకారంవల్ల చాలా కొత్త పుస్తకాలు త్వరగా అందాయి. మిత్రుడు చంద్ర కన్నెగంటి లైబ్రరీలో కొన్ని పుస్తకాలు దొరికాయి. మిత్రులు వారి ముద్రిత/ అముద్రిత పుస్తకాలను సహృదయంతో పిడీఎఫ్ కాపీలు పంపిస్తున్నారు.  మొత్తానికి మళ్ళీ పుస్తకపఠనం గాడిలో పడినట్లే ఉంది.

మిత్రులు శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావుగారు మహాప్రస్థానం కాఫీటేబుల్ ఎడిషన్ ప్రచురించినప్పుడు ఆ పుస్తకం ప్రూఫులు చూస్తూ, మహాప్రస్థానం మొత్తంగా ప్రతి పదాన్నీ, పంక్తినీ, పద్యాన్నీ మళ్లీ పనిగట్టుకుని చదివి ఆస్వాదించి ఆనందించటం ఈ సంవత్సరం పుస్తకపఠనంలో ప్రత్యేకం.

ఈ సంవత్సరం చదివిన పుస్తకాలలో అన్నింటికన్నా బాగా నచ్చిన పుస్తకాలు: ఇంగ్లీషులో Grapes of Wrath (John Steinbeck), తెలుగులో కొండకింద కొత్తూరు (మధురాంతకం నరేంద్ర). తీరిక చేసుకుని ఈ పుస్తకాల గురించి, మరికొన్నింటి గురించి వ్రాయాలి.

ఈ పుస్తకాలపురుగుకు మేత అందిస్తున్న అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.

English

   Nonfiction

Maverick Messiah – A political biography of N.T. Rama Rao – Ramesh Kandula; In this well written account, Kandula spends little time on the personal biography and focuses on the rise (and fall) of NTR, the politician. Compared to most others that chronicled the NTR era, Kandula focuses particularly on the lasting impact of NTR on national politics and policies.

CheeseDosa, the BookAditya Surendran; The recollections of a young man of Asian-Indian origin about his growing up in the 90s in New Jersey. Mildly interesting, often amusing, read. (Aside: I came across this book – an autographed copy – at the AirBNB that we rented in Raleigh, North Carolina; apparently Aditya Surendran stayed in the same place earlier for a few days and gifted this book to the owner of the place).

   Fiction

The O’Henry Prize Short Stories (The best short stories of 2018). Received this book as part of a New Year Book/Gift Exchange program.  Good short (and some a little long) stories with a variety of themes.

Undercover Bromance – Lissa Kay Adams. A romance book about a secret club of men who like romance novels. Mildly interesting.

Hercule Poirot The Complete Short Stories – Agatha Christie; all the short stories featuring the master detective in one place; many familiar and some quite famous. Many of the stories are still interesting and almost all of them are now dated (some are 80 plus years old). The Labors of Hercules felt like quite a stretch this time.

Citizen Tom Paine – Howard Fast. A fascinating and passionate account of Thomas Paine and the US War of Independence and its aftermath.  Paine was an important personage of American Revolution, whose pamphlets inspired the masses and propelled the revolution. He was a penniless immigrant from England; besides his role in the revolution, he was also known for his later efforts on behalf of the common man in both England and post-revolution France.

Freedom Road – Howard Fast. This is Fast’s rendering of the events in the South during the reconstruction (the period after the Civil War and emancipation of slaves) and after. Fast’s protagonist is the fictional Gideon Jackson, an illiterate, newly freed slave, elected by his neighbors to sit in the constitutional convention of South Carolina. Jackson educates himself during the process both in the literal and the larger sense and eventually becomes a Congressman. There is a remarkable cooperation between poor white and black people resulting in a remarkable constitution treating people equally under law. However, the brief period of equality under law and the prosperity of the newly free slaves is eventually obliterated by the powerful and vengeful white supremacists and a federal government that returned the power to the former plantation owners. I remember reading a Telugu translation of this novel (స్వేచ్ఛాపథం) when I was in high school more than 50 years ago and being very impressed; I am even more impressed now. Fast presents the historical events in a highly personal way. In the 70s, I remember reading that Mohammad Ali was going to play the lead in a movie version.  I recommend the book highly.

Moses – Howard Fast. This is the story of young Moses growing up in Egypt as a prince and heir to Ramses and eventually realizing the truth about his own origin and his obligation to his oppressed ancestors. For me, this is one of the poorer works of Fast, mostly because he is spinning a tale out of whole cloth, without much of actual historical basis. Felt it meandered quite a bit.

Spartacus – Howard Fast. I first read this shortly before I joined medical college; had this paperback with me in my hostel room and read it several times in those days; have not gone back to it in many years; saw the film a couple of times since then. I am now very impressed by the way Fast tells this tale. He builds up the legend of Spartacus, through what others saw and their interactions with him. The book actually begins after the death of Spartacus and the end of the slave rebellion. We learn of him through his main adversary that finally defeated him in the battle, a Roman senator, the woman he loved and other people in his life, in a non-linear narration. Obviously, one of the best (and most known) works of Fast. There was an old Telugu translation in circulation during my college days, and I understand that there are a couple of more recent translations available.

My Italian Bulldozer – Alexander McCall Smith.  A romance set in Italian countryside. Not particularly impressive.

Gold Diggers -Sanjana Sethian; Indian American Teenagers get into stealing gold to make a magical gold lemonade that gives them the qualities of the owners of the gold. Interesting for some insights into the travails of these teenagers, but a bit stretched.

The Grapes of Wrath – John Steinbeck. Another book that I got through the New Year Book/Gift Exchange program (Thank you Anil Rayal) and by far my best read in 2021. A masterclass in writing. Very interesting plot, characters and circumstances. Great narrative skills. And, technically brilliant. Continues to be relevant and resonant for current times. The book won the National Book Award as well as the Pulitzer Prize for fiction. Steinbeck eventually won the Nobel Prize for literature.

Rivera Gold – Laurie R King. Interesting mystery set in the past in Monaco featuring Mary Russell, the wife of Sherlock Holmes and Holmes himself.

Take a Hint, Dani Brown – Talia Hibbert. A fun romance. Apparently, this is part of a trilogy about three sisters. I would like to read the other two.

తెలుగు

   కథలు, కథా సంకలనాలు

అభినందన కధామాల – అజోవిభొ ఫౌండేషన్ బహుమతి కథలు, 1996

అరణ్యఘోష – అల్లం శేషగిరిరావు

ఉత్తుత్తి కథలు – డి.ఆర్. ఇంద్ర

ఉడుకు బెల్లం – చింతకింది శ్రీనివాసరావు

కాలయంత్రం – సం. సాయి పాపినేని

కాగితం పడవలు – వి. మల్లికార్జున్

కొత్త దుప్పటి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

గబ్బగీమి – శాంతివనం మంచికంటి

చలిచీమల కవాతు – ఉణుదుర్తి సుధాకర్

చిట్టచివరి రేడియో నాటకం – వి.చంద్రశేఖరరావు

చీకట్లోంచి చీకట్లోకి – వడ్డెర చండీదాస్

చేదుపూలు – మెహర్

చోంగారోటీ – (సం – వేంపల్లె షరీఫ్)

జీవని – వి.చంద్రశేఖరరావు

సింహాచలం సంపెంగలు – శ్రీరమణ

దాలప్పతీర్థం – చింతకింది శ్రీనివాసరావు

నల్గొండ కథలు – వి. మల్లికార్జున్

నేనూ-నెమలీ – పి.చంద్రశేఖర్ ఆజాద్

పల్నాడు కథలు – సుజాత వేల్పూరి

బతుకీత – ఎండపల్లి భారతి

బతుకు సేద్యం – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

మా కనపర్తి ముషాయిరా – రమేశ్ చెప్పాల

మిధునం – శ్రీరమణ

ముగింపుకు ముందు –  వి.చంద్రశేఖరరావు

ముడి మనిషి, మరికొన్ని కథలు – 1974-82 అరుణతార కథలు

మునికాంతపల్లి కతలు – సొలోమోన్ విజయ్ కుమార్

నాలుగో ఎకరం – శ్రీరమణ

రామేశ్వరం కాకులు – తలావజ్ఝల పతంజలిశాస్త్రి

లెనిన్ ప్లేస్ – వి.చంద్రశేఖరరావు

   నవలలు

అతడు అతడు కాదు – కొమ్మూరి సాంబశివరావు

అనాచ్ఛాదిత కథ – ఝాన్సీ కొప్పిశెట్టి

అరణ్యం – వాడ్రేవు చినవీరభద్రుడు

అర్ధనారి – బండి నారాయణస్వామి

కొత్త అల్లుడు – కొడవటిగంటి కుటుంబరావు

కొత్త కోడలు – కొడవటిగంటి కుటుంబరావు

కొండకింద కొత్తూరు – మధురాంతకం నరేంద్ర

కొండపొలం – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

గద్దలాడతండాయి – స్వామి

తాటక -బెజ్జారపు రవీందర్

తార – కొడవటిగంటి కుటుంబరావు

తిమింగలం వేట – కొడవటిగంటి కుటుంబరావు

దుఃఖితులు – రంధి సోమరాజు

నర్తకి – సోమ సుధేష్ణ

మనోధర్మపరాగం – మధురాంతకం నరేంద్ర

మారిన జీవితం – కొడవటిగంటి కుటుంబరావు

మారుపేర్లు – కొడవటిగంటి కుటుంబరావు

మున్నీటి గీతలు – చింతకింది శ్రీనివాసరావు

మైనా – శీలా వీర్రాజు

రెబెల్ – హెచ్చార్కె

విపరీత వ్యక్తులు – పి.చంద్రశేఖర్ ఆజాద్

విమానం వచ్చింది – వివినమూర్తి 

విరోధాభాస – ఝాన్సీ కొప్పిశెట్టి

సరితాదేవి డైరీ – కొడవటిగంటి కుటుంబరావు

సరోజ డైరీ – కొడవటిగంటి కుటుంబరావు

సంఘం చేసిన మనిషి – పోలాప్రగడ సత్యనారాయణరావు

శ్రీ బాలాజీ టాకీస్ ప్రేమ ప్రబంధం – కరణ్ గోపిని

   కవిత్వం

కవితా ఓ కవితా – శ్రీశ్రీ. భరణి వ్యాఖ్యానంతో

మట్టిరంగు బొమ్మలు – సిరికి స్వామినాయుడు

మహాప్రస్థానం – శ్రీశ్రీ, శ్రీశ్రీ ప్రచురణలు ఎడిషన్

మహాప్రస్థానం – శ్రీశ్రీ, బాపు బొమ్మలు, బ్నిం వ్యాఖ్యతో,

   అనువాదాలు (కాల్పనిక సాహిత్యం)

అతడే ఒక సముద్రం – Ernest Hemingway (Old Man and the Sea), అను – స్వాతికుమారి, రవి వీరెల్లి

ఐదుకాళ్ళ మనిషి – ఎ. ముత్తులింగం, అను – అవినేని భాస్కర్

ఒకవైపు సముద్రం – వివేక్ శాన్ భాగ (కన్నడం), అను – రంగనాధ రామచంద్రరావు

కొండ దొరసాని – నారాయన్ (మలయాళం) అను- ఎల్.ఆర్.స్వామి

తారాబాయి లేఖ -ఎం.ఆర్. దత్తాత్రి (కన్నడం), అను – రంగనాథ రామచంద్రరావు

దూరాంతరం – బిభూతి భూషణ బందోపాధ్యాయ,  అను – దండమూడి మహీధర్

మాఅమ్మంటే నాకిష్టం – వసుధేంద్ర (కన్నడం), అను – రంగనాధ రామచంద్రరావు

వరదగుడి (వివిధ భాషల కథలు) – పరేశ్ దోశి

విశ్వకథాసాహితి (వివిధ దేశాల, భాషల కథలు) – దేవరాజు మహారాజు

సింగారవ్వ – చంద్రశేఖర కంబార (కన్నడం),   అను- సురేష్

   నాటకాలు

కంఠాభరణము – పానుగంటి లక్ష్మీనరసింహరావు

పాండవోద్యోగము – తిరుపతి వెంకటకవులు

పునర్జన్మ – బెల్లంకొండ రామదాసు

కాళరాత్రి – ప్రఖ్య శ్రీరామమూర్తి

మరో మొహెంజొదారో – ఎన్.ఆర్. నంది

   సినిమా

తేరే బినా జిందగీ… – పరోశ్ దోశీ

పిల్లల సినిమా కథలు – అనిల్ బత్తుల

   బాలసాహిత్యం

గుటుక్కు గుటుక్ బ్రే…వ్  – చంద్రలత

తానా-మంచిపుస్తకం 2021 బహుమతి పొందిన పిల్లల బొమ్మల కథలు (పదేళ్ళ లోపు పిల్లల కోసం)

బంగారు కొండ – డా. జాస్తి శివరామకృష్ణ; బొమ్మలు: బాబు దుండ్రపెల్లి

ఆ గదిలో ఏముంది? – అమరజ్యోతి; బొమ్మలు: హేమ భాగ్యలక్ష్మి

ఠాప్ – కథ/ బొమ్మలు: గాయత్రి వెన్నెల (వయసు: 13)

క్యాంపింగ్ – వి. శాంతి ప్రబోధ; బొమ్మలు: తుంబలి శివాజీ

చిన్నూ – పిచ్చుక – కన్నెగంటి అనసూయ; బొమ్మలు: జయదేవ్

ఈ లడ్డూలు ఎక్కడివి? -వేణు గోపాలకృష్ణ; బొమ్మలు: దీప్తాన్షు సన్యాల్

యాత్ర – కిరణ్ జమ్మలమడక; బొమ్మలు: రాహక్

ఏమి చేస్తారు? ఏమేమి చేస్తారు? – సమ్మెట ఉమాదేవి; బొమ్మలు: ఎం. శ్రీకాంత్

మా పిల్లికి లెక్కలొచ్చు – దాసరి వెంకటరమణ; బొమ్మలు: సునితా వాసు

నేను – కథ/బొమ్మలు: సిరి మల్లిక (వయసు: 11)

తానా-మంచిపుస్తకం 2021 బహుమతి పొందిన పిల్లల నవలలు 

అంగారకగ్రహం మీద అంతిమవిజయం – సలీం; బొమ్మలు: రాహక్

క్లిక్-విన్ – శాఖమూరి శ్రీనివాస్; బొమ్మలు: చిన్నారి ముమ్మిడి

అతీతం – కిరణ్ ఝమ్మలమడక; బొమ్మలు: తుంబలి శివాజీ

మాయాలోకం – పి. చంద్రశేఖర్ ఆజాద్; బొమ్మలు: కె.వి.రావు

రక్ష – డా. వి.ఆర్. శర్మ; బొమ్మలు: తెంబూరు సురేఖ

   ఆత్మకథలు, జ్ఞాపకాలు, జీవితకథలు, చరిత్ర

అజాతశత్రువు మాగంటి అంకినీడు – పోలవరపు జగదీశ్వరరావు, బీరం మస్తాన్ రావు

అసఫ్ జాహీ సంస్థానం విలీనగాథ – వి.పి.మీనన్, అను: ఏనుగు నరసింహారెడ్డి

అదృష్టవంతుని ఆత్మకథ – 1: ఆకాశవాణి పరిమళాలు  – రేవూరు అనంత పద్మనాభరావు

అదృష్టవంతుని ఆత్మకథ -2: జ్ఞాపకాలు – వ్యాపకాలు – రేవూరు అనంత పద్మనాభరావు

ఆజన్మం – పూడూరి రాజిరెడ్డి

ఆమె లేఖలు – జూలియా థామస్ (Letters From Madras), అను – పెన్నేపల్లి గోపాలకృష్ణ, కాళిదాసు పురుషోత్తం

…ఐనా, నేను ఓడిపోలేదు – జ్యోతిరెడ్డి, జి. వల్లీశ్వర్

ఒదిగిన జీవితం – నోరి దత్తాత్రేయుడు, అరుణ పప్పు

కారా నివాళి – (సంకలనం) డా. పుల్లూరు సంపత్ రావు

చదువు తీర్చిన జీవితం – ఒక సామాన్య మహిళ ఆత్మకథ – కాళ్లకూరి శేషమ్మ

తానా సజీవచరిత్ర – నరిసెట్టి ఇన్నయ్య

నవ – రసకందాయం – మోహన్ కందా

నిన్నగాక మొన్న – జ్ఞాపకాల జలపాతం – డా. కడియాల వాసుదేవరావు

నేనూ ప్రభుత్వాలూ – ఆరిగపూడి ప్రేమ్ చంద్, అను – అరుణ పప్పు

నేనూ, శాంత కూడా – చిలుకూరి రామమహేశ్వర శర్మ

పొలమారిన జ్ఞాపకాలు – వంశీ

బతుకు వెతుకులాట – సడ్లపల్లె చిదంబరరెడ్డి

మా చెట్టునీడ – పామిరెడ్డి సుధీర్ రెడ్డి

మాగంటివారి చరిత్ర – మాగంటి బాపినీడు

రామోజీరావు – ఉన్నది ఉన్నట్లు – గోవిందరాజుల చక్రధర్  

రాయవాచకం – విశ్వనాధనాయనయ్యవారి స్థానాపతి

రైతుబిడ్డడు గెరిల్లాగా – కొండపల్లి సీతారామయ్య జీవితకథ – కె. అనూరాధ

శ్రీ కల్లూరి చంద్రమౌళి – బొర్రా గోవర్ధన్

వెనుకటి దినాలు – ఎం.వి. రమణారెడ్డి

   ఇతరం

అదృశ్యమైన నిప్పుపిట్టకోసం… – డా. వి. చంద్రశేఖరరావు సాహిత్యావలోకనం

వేల్పుల కథ – రాంభట్ల కృష్ణమూర్తి

కరోనా కరకజ్జం – సరసి

నవ్వుకొరోనాయనా – సరసి (కార్టూన్లు)

తిరుమలకొండ పదచిత్రాలు – పున్నా కృష్ణమూర్తి

నవ్వులో శివుడున్నాడురా – శ్రీరమణ

లెటర్స్ టు లవ్ – కడలి సత్యనారాయణ

రంగంటే ఇష్టం – చాగంటి తులసి

  సంవత్సరాంతానికి ఇంకా చదువుతూ ఉన్నవి

సాహితీసేతువు – సూరపరాజు రాధాకృష్ణమూర్తి

సమాంతరాలు – తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి

తిరుపతి కథలు – పేటశ్రీ

ఇవి కాక, 2021లో నేను చదివిన, ఇంకా ప్రచురింపబడని, 17 తెలుగు నవలలు, ఒక తెలుగు కథాసంకలనం పేర్లు ఇక్కడ ఇవ్వటం లేదు. మిత్రులు వ్రాసిన, ప్రచురించిన ముద్రిత, అముద్రిత పిడీఎఫ్ పుస్తకాలు కొన్ని ఈ జాబితాలో లేవు.  

You Might Also Like

5 Comments

  1. Sai Prabhakar

    What a commitment? An inspiring one indeed.
    Kudos

  2. మూర్తి

    మీవంటి వారు కూడా అన్నేసి పుస్తకాలు చదువుతుండగా సామాన్యులం మేము చదవలేక పోవటానికి సాకులు వెతుకుతున్నము మీరు మాకు ఎప్పటికీ స్ఫూర్తిని ఇస్తారు

  3. Suresh K

    పాత, కొత్తల మేలు కలయిక.

  4. sri

    i always feel jealous of you … i wish i have that much patience 🙂

Leave a Reply