మా అమ్మంటే నాకిష్టం: వసుధేంద్ర

వ్యాసకర్త: చైతన్య పింగళి

అమ్మ.

అమ్మ అన్న ఒక్క పదం ఒక పూర్తి sentence. Pronoun, adjective, verb, adverb .. what not. ఒక పూర్తి వాక్యం. ‘అమ్మంటే నాకిష్టం’ కావొచ్చు.. ‘పచ్చ నాకు సాక్షిగా’ కావొచ్చు, ‘అలగా తల్లి’ కావొచ్చు.. సామాజిక, ఆర్ధిక నేపధ్యాలు, ఆ అమ్మలు, రాస్తున్న వారి perspective వేరు కావొచ్చు. కానీ ‘అమ్మ’ అనే factor ఒకటే. ఈ పుస్తకాలు రాసిన వాళ్ళ అమ్మలే కాదు, మన అమ్మల్లో కూడా అదే factor కదా.

‘అన్నిటికీ కారణం మనిషి కనుక ప్రతి మనిషిలో నన్ను చూసుకోవడం నాకేంతో ఇష్టం’ అన్నాడు అజంతా. అలాంటిదే అమ్మ కూడా. మన అందరి existence కి కారణం ‘అమ్మ’ కనుక, అజంతా తెలీకపోయినా.. ఏ నేపథ్యము నుండి వచ్చిన అమ్మ గురించి, ఏ కోణం నుండి రాసింది చదివినా… default మన అమ్మే గుర్తొస్తుంది మనకి.

వసుధేంద్ర రాసిన ‘అమ్మంటే నాకిష్టం’ చదివినప్పుడు అట్లే అనిపించింది. ఆ బుల్లి ‘చడ్డీ రాస్కేల్’ చెప్పిన మొదటి కథ చదువుతుంటే ముసి మూసి నవ్వులతో start అయిన ఫీలింగ్స్ నిదానంగా కొండకి అటు దిగిపోతాయి. గ్లాసుడు నీళ్లు తాగి, ఏం చేయాలో తోచక, పుస్తకం అటూ ఇటూ తిప్పి, రెండో దానికి పోతాం. మొదటి కత చాలు ఈ పుస్తకం ఎందుకు చదవాలో చెప్పేస్తుంది.


ఒక పెద్ద మల్లె పూల దండలో అక్కడక్కడా మరువం, కనకాంబరాలు కలిపి అల్లినట్టు.. ‘అమ్మంటే నాకిష్టం’లో కరువు ప్రాంతాలు, అక్కడి స్త్రీల జీవితాలు, వారి ఆశలు, కలలు కలిపి అల్లాడు వసుధేంద్ర.

శవాన్ని అలంకరించి, మేళం వాయించే కురచ కులానికి చెందిన హనుమంతు, వసుధేంద్ర అక్క – ఇద్దరూ classmates. ఆ కథలో ఈ లైన్ చదివితే, ఇద్దరు వేరే కులాలు, వేరే ఆర్ధిక నేపధ్యానికి చెందిన వారు అయినా కలిసి చదువుకునే అవకాశం ఉంది కదా.. ఇప్పుడు ఏంట్రా నాయనా అనిపించింది. హనుమంతు ను పట్టుకుని పోతే ఒక కథ, కళ్ళు లేని శాంభవిని పట్టుకుపోతే ఒక కథ, కన్నడ సూపర్ స్టార్ రాజకుమార్ ఇచ్చిన పది రూపాయలు వాడుకోవాల్సి వచ్చిన పూజారిది ఇంకో కథ.. అమ్మ జీవితం చుట్టూ అల్లుకున్న జీవితాలు ఎన్నో! ఎన్ని ఉప కథలో !

ఇలాంటి బంగారు కథలని మనకి తెలుగులో పరిచయం చేసిన రంగనాథ రామచంద్రరావు గారికి ఎన్నిసార్లు thanks చెప్పుకున్నా చాలదు. ఆయన ఎన్ని పుస్తకాలని అనువాదం చేసి మనకి అందించారో! పేర్లు మార్చేస్తే ఇది తెలుగు పుస్తకం అన్నా నమ్మేస్తారు. అంత చక్కటి అనువాదం.

తెలుగులో ఈ పుస్తకాన్ని ముద్రించిన ఛాయా పబ్లికేషన్స్. కచ్చితంగా కొని చదవండి. కవర్ పేజీ కూడా ముద్దు గున్న ఏనుగు పిల్ల తొండాన్ని తల్లి తొండానికి తాకిస్తున్న బొమ్మ భలే భలే.

ఈ పుస్తకాన్ని కొనాలి అనుకున్న వాళ్ళు మోహన్ గారికి ఫోన్ చేయొచ్చు. ఆయన నెంబర్ 9848023384.

అమెజాన్‍లో కొనడానికి లింక్ ఇది

You Might Also Like

Leave a Reply