విలక్షణ కవితా చైతన్య దీపిక  “గల్మ”

వ్యాసకర్త :  భైతి దుర్గం 

ఒకప్పుడు కవిత్వం అంటే కవులు, పండితులకు మాత్రమే అర్ధమయ్యేలా ఉండేది.మారుతున్న కాలాన్ని అనుసరించి సాహిత్యం లో కూడ అనేక మార్పులు సంభవించాయి.తన భావాలను సరళమైన పదబంధాలతో సామాజిక సమస్యలను ఇతివృత్తాలుగా చేసుకుని, సాధారణ పాఠకులు చదివేలా గంభీరావుపేట యాదగిరి చేసిన చక్కని ప్రయత్నమే “గల్మ ” కవితా సంపుటి.

         గల్మ అనగా వ్యవసాయ పొలం మడి లో నుండి మరొక పొలం లోనికి నీరును పంపించడానికి పొలం ఒడ్డును త్రెంచి  ఏర్పాటు చేసిన చిన్న కాలువ.ఈ పదాన్ని తెలంగాణ లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

      ఇందులో 49 కవితలు ఉన్నాయి.అన్ని విలక్షణ కవితలు. సామాజిక స్పృహ తో నిండియున్నవి.సమాజం పట్ల కవి భాద్యత ను గుర్తించి

 చీకటి దీపమై/ఈ సమాజాన్ని/చైతన్య పరిచి/చరిత్రను /తిరగరాస్తనంటుంది.

అని చెబుతారు.అందరి అవసరాలను తీర్చే అల్లావుద్దీన్ అద్భుత దీపమని ఇల్లాలు శక్తి రూపాన్ని గొప్పగా వర్ణిస్తాడు.

        వృద్దాశ్రమములోని కన్న తల్లి ఆవేదనను “ఆత్మఘోష” లో వివరించిన విధానం బాగుంది.చెరువుల గురించి,రైతుల జీవనాధారం గల వర్షం గురించి, పల్లెటూరి తో ఉన్న అనుబంధం ,పట్నం బతుకులు, బాల్యం, టివి సీరియల్స్ వలన కలిగే నష్టాలు, ఒకటేమిటి ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఈ పుస్తకం లో యాదగిరి గారు ప్రస్తావించారు.

       సామాజిక మాధ్యమాల ద్వారా రేపటి తరం దిగజారుతున్న సంఘటనలను “అలోచించండి” అంటూ సూచించారు.తనది సున్నితమైన మనస్తత్వం ఐనప్పటికిని ,తన కలం నుండి జాలు వారిన ఒక్కొక్క కవిత వాడి బాణాల్ల గా సామాజిక రుగ్మతలను చీల్చి చెండాడాయి.

               కవిత్వం లో నవ్యతను జోడించి ,పాఠకులకు అర్థమయ్యే విధానంలో సరళమైన పదాలతో చక్కని అభివ్యక్తులతో వ్రాసిన గంభీరావుపేట యాదగిరి కాలం నుండి మరెన్నో ‘గల్మ’ లాంటి పుస్తకాలు రావాలని మనసారా కోరుకుందాం.

 

          //-  దుర్గమ్ భైతి 

              కవి, రచయిత. 9959007914

 

పేజీలు: 120

వెల.    : 100 రూపాయలు

ప్రతులకు :

గంభీరావుపేట యాదగిరి (రచయిత)

#12-126/3

NGO’s కాలనీ. ప్రశాంత్ నగర్

సిద్దిపేట -502103

సెల్ : 9440617611

You Might Also Like

Leave a Reply