‘జక్కాపూర్ బడి పిల్లల కథలు’ – పుస్తక సమీక్ష

వ్యాసకర్త: వురిమళ్ళ సునంద, రచయిత్రి
***************
భావి తరానికి దిక్సూచి కథల పుస్తకం

సాహితీ ప్రపంచం గుర్తించేలా తమ పాఠశాల పేరుతోనే ఆ పాఠశాల బాలల కథలను సంకలనంగా తీసుకురావడం చాలా బాగుంది. ఇందులో ఉన్న ముప్పై కథలను చదివినప్పుడు అనిపించింది వీరంతా రేపటి తరానికి కాబోయే మంచి రచయితలు అవుతారని..
ఇందులో ఆరు కథలు రాష్ట్రస్థాయి కథల పోటీలో ఎంపిక కావడం అనేది మామూలు విషయం కాదు.ఆ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల పట్ల చూపిస్తున్న శ్రద్ధ ,ఓ మంచి తరాన్ని తయారు చేయాలనే తపన భాష పట్ల ఆసక్తి పెంపొందించాలనే ఆలోచన కలిగి ఉండటం చాలా అభినందనీయం.. అద్దంలో మన ముఖం మనకు కనబడుతుంది.. అలాగే మన పాఠశాలలో అంకిత భావంతో చేసే కృషి….విద్యార్థుల చూపించే ప్రతిభలోనూ,వారు రాణిస్తున్న విధానంలోనూ కనిపిస్తుంది..ఈ జక్కాపూర్ పాఠశాల విద్యార్థుల రచనలే ఇందుకు తార్కాణం.
విద్యార్థుల్లో సాహిత్య అభిలాషను గుర్తించి , ముడి ఖనిజం లాంటి వారిని వజ్రాల్లా తయారు చేయడంలో నిరంతరం శ్రమిస్తున్న భైతి దుర్గయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు..

బాలలు రాసిన పుస్తకం ఆరు నెలలు కూడా పూర్తి కాకముందే పునర్ముద్రణ కు వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు.. అందులో ఉన్న ఆణిముత్యాల వంటి బాలల కథలు విద్యార్థులు, పెద్దలు సాహిత్య అభిమానులతో ఇష్టంగా చదివించడమే..

వారి సాహిత్య సృజనకు,బాలల కోసం చేస్తున్న సాహితీ కృషికి హృదయపూర్వక అభినందనలు.

పుస్తకం వెల : 75 రూపాయలు
ప్రతులకు : భైతి దుర్గయ్య , సంపాదకులు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జక్కాపూర్
సిద్దిపేట జిల్లా -502276 ( తెలంగాణ)
సెల్ : 9959007914

You Might Also Like

Leave a Reply