పుస్తకం
All about booksపుస్తకభాష

August 12, 2019

‘జక్కాపూర్ బడి పిల్లల కథలు’ – పుస్తక సమీక్ష

More articles by »
Written by: అతిథి
Tags:

వ్యాసకర్త: వురిమళ్ళ సునంద, రచయిత్రి
***************
భావి తరానికి దిక్సూచి కథల పుస్తకం

సాహితీ ప్రపంచం గుర్తించేలా తమ పాఠశాల పేరుతోనే ఆ పాఠశాల బాలల కథలను సంకలనంగా తీసుకురావడం చాలా బాగుంది. ఇందులో ఉన్న ముప్పై కథలను చదివినప్పుడు అనిపించింది వీరంతా రేపటి తరానికి కాబోయే మంచి రచయితలు అవుతారని..
ఇందులో ఆరు కథలు రాష్ట్రస్థాయి కథల పోటీలో ఎంపిక కావడం అనేది మామూలు విషయం కాదు.ఆ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల పట్ల చూపిస్తున్న శ్రద్ధ ,ఓ మంచి తరాన్ని తయారు చేయాలనే తపన భాష పట్ల ఆసక్తి పెంపొందించాలనే ఆలోచన కలిగి ఉండటం చాలా అభినందనీయం.. అద్దంలో మన ముఖం మనకు కనబడుతుంది.. అలాగే మన పాఠశాలలో అంకిత భావంతో చేసే కృషి….విద్యార్థుల చూపించే ప్రతిభలోనూ,వారు రాణిస్తున్న విధానంలోనూ కనిపిస్తుంది..ఈ జక్కాపూర్ పాఠశాల విద్యార్థుల రచనలే ఇందుకు తార్కాణం.
విద్యార్థుల్లో సాహిత్య అభిలాషను గుర్తించి , ముడి ఖనిజం లాంటి వారిని వజ్రాల్లా తయారు చేయడంలో నిరంతరం శ్రమిస్తున్న భైతి దుర్గయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు..

బాలలు రాసిన పుస్తకం ఆరు నెలలు కూడా పూర్తి కాకముందే పునర్ముద్రణ కు వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు.. అందులో ఉన్న ఆణిముత్యాల వంటి బాలల కథలు విద్యార్థులు, పెద్దలు సాహిత్య అభిమానులతో ఇష్టంగా చదివించడమే..

వారి సాహిత్య సృజనకు,బాలల కోసం చేస్తున్న సాహితీ కృషికి హృదయపూర్వక అభినందనలు.

పుస్తకం వెల : 75 రూపాయలు
ప్రతులకు : భైతి దుర్గయ్య , సంపాదకులు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జక్కాపూర్
సిద్దిపేట జిల్లా -502276 ( తెలంగాణ)
సెల్ : 9959007914About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

కేవలం నువ్వే – వసుధారాణి కవిత్వం

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ***************** కనిపిస్తున్న ప్రపంచం అంతా సత్యాసత్యా...
by అతిథి
0

 
 

కథగా కల్పనగా… ఊహాజగత్తుల సంచారం…

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ఒక సినిమా పాటలోని పదాలను తన తొలి నవల టైటిల్‌గా పెట్టుక...
by అతిథి
0

 
 

దోసిలి లోని అల & పిట్టస్నానం

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ***************** తన నుంచి ప్రపంచం, ప్రపంచం నుంచి తను ఆశ...
by అతిథి
0

 

 

ఈ పుస్తకాన్ని రికమెండ్ చెయ్యను. కానీ…

వ్యాసకర్త: వివిన మూర్తి 1990 దశకం మధ్యలో ఆరంభమైన ఆలోచనలతో రాసిన వ్యాసం 2006లో జగన్నాటకం అ...
by అతిథి
0

 
 

విలక్షణ కవితా చైతన్య దీపిక  “గల్మ”

వ్యాసకర్త :  భైతి దుర్గం  ఒకప్పుడు కవిత్వం అంటే కవులు, పండితులకు మాత్రమే అర్ధమయ్యేలా ...
by అతిథి
0

 
 

వైవిధ్యమే  కవిత్వానికైనా ప్రజాస్వామ్యానికైనా ప్రాణం

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (ముకుంద రామారావు తాజా రచన “అదే నేల – భారతీయ కవిత్వం నేపథ్య...
by అతిథి
2