స్త్రీ కథలు 50

వ్యాసకర్త: శ్రీమహాలక్ష్మి
**************

వందేళ్లలో ప్రభావవంతమైన స్త్రీ కథలుగా వచ్చిన పుస్తకం లో స్త్రీ వాదం కన్నా నీకు తెలిసిన స్త్రీ గురించి క్షుణ్ణంగా తెలియచేశారు. తెలుసుకోవాల్సిన వాటి గురుంచి, తెలియాల్సిన వారి గురుంచి కూడా చెప్పుకొచ్చారు. మనిషి ఇష్టాన్ని, కష్టాన్ని గ్రహించి మసులుకోవాలి. ఇది జీవించడానికి ఉండాల్సిన మొదటి లక్షణము. ఆ లక్షణము లోపించినప్పుడే పుట్టిన కథలే ఈ 50 కథలు. స్త్రీ కథలు అన్నారు కదా అని స్త్రీ వాదాన్ని నెత్తిన వేసుకున్న కథలు కాదు ఇవి. స్త్రీకై, స్త్రీ తో, స్త్రీ కోసం రాసిన కథలు.ఈ పునఃకథనం అనే విషయం లో రచయిత పాఠకుడు నాడి ని పసిగట్టి క్లుప్తంగా ప్రతీ కథ ని నాలుగు పేజీలు మించకుండా వ్యవహిరించిన తీరు ప్రశంసనీయం.

సమాజ చైతన్యం మొదట మన ఇంటి గడప తోనే సాధ్యం.
స్త్రీ తత్వం అంటే కేవలం మాతృత్వం ఒక్కటే కాదు.
అత్యాచారానికి కూడా కన్నీళ్ల విలువ తెలియాలి అంటే నిరోధించే చట్టాలు కావాలి.
రాబడి యంత్రానికి రాజకీయాలు తెలిస్తే రాణించగలదా.
శ్రమకు చీకటి వెలుగు తెలియవు మరీ సంఘానికి ఎందుకు పరువూ బరువూ కూడా ఇంటికి ఆడ పిల్లేనా??
సంభోదించే విషయంలో ఉన్న చనువుని అహం తో వ్యవస్తికృతం చేసాడు.
నా నుంచి మనం గా ఎదిగిన రోజునా సమాన హక్కు అనేది అడగాల్సిన పనిలేదు.
ఇల్లు తనది అవ్వాలి కానీ వంటిల్లు ఒకటే కాదు.
తల్లినో చెల్లినో కాకపోతే నీకు ఏదైనా అవటానికి నేను సన్నద్ధంగా లేను.
ప్రతి నెల వచ్చే రక్తమే నన్ను స్త్రీ ని చేయలేదు.
రోగాన్ని గ్రహించని పెద్దరోగి ఎవరు ఈ లోకం లో?
తిరగబడింది నిందని మోయటానికి కాదు.
నగదు మాయను కప్పి పుచ్చేదే నగ.
కంటి నిండా నిద్ర పోయే తీరిక లేని స్త్రీలు ఉన్నారు ఈ లోకం లో.
కుటుంబ నిర్మాణం లో వెలిగించాల్సిన మొదటి దీపం మీద స్త్రీ ఆలోచన శక్తే నిప్పు.
బలవంతపు పెళ్లితో జరిగేది కాపురం కాదు వ్యభిచారం.
వద్దు అని చెప్పటం స్త్రీ కి కూడా తెలుసు.
వదిలించుకోవడానికి చేసేది పెళ్ళి ఐతే చావే నయం.

ఇన్ని మాటలు మాట్లాడినా ఇంకా వందేళ్లు అయిన ఇంకా అసమానతలు గురుంచి, దాడులు గురుంచి, దోపిడీ గురుంచి మాట్లాడుకోవాల్సి రావడం బాధాకరం. ఈ కథల్లో నువ్వు ఉన్నావు , అమ్మ ఉంది, చెల్లి ఉంది, అక్క ఉంది , వదిన ఉంది, స్నేహితురాలు ఉంది, పనిమనిషి ఉంది, అన్నింటి కి మించి ఎలా ఉండకోడాని పురుషుడు ఉన్నాడు. పురుషుడి భాధ్యతను వేలు పెట్టి చూపించాయి ఈ కథలు. చట్టానికి దొరికితేనే నేరం కాదు. నేరాలు ఘోరాలు కాకుండా చూసుకోవాలి. అది మన కనీస బాధ్యత. పునః కథనం లో రచయిత చాలా చక్కగా వివరించారు. ప్రతీ కథకు ఇంకో పేరు పెట్టి పాఠకుడి అసలు కథ తో ఈ పేరు కి ఒక సంధి కుదర్చటం గుర్తించాల్సిన విషయం. ఆలోచింప చేసిన ఈ 50 కథలు ఆకాశం లో చుక్కలు. ముందు మాటలో రచయిత అన్నట్టు 50 చుక్కల ఆకాశం వెలుతురు తక్కువ కాదు. నేను ఏకీభవిస్తున్న ఆ మాటలతో ఆ వెలుతురే నా చేత ఇన్ని కబుర్లు చెప్పించింది.

You Might Also Like

2 Comments

  1. Maha lakshmi

    ముందుమాట లో రచయిత తక్షణ రిఫరెన్స్ గా ఉపయోగపడుతుంది అని తెలియచేసారు

  2. leol

    పాత కథలను సంకలనం చేయకుండా పునఃకథనం ఎందుకు చేసారో వివరించారా రచయిత?

Leave a Reply