ఛంఘిజ్ ఖాన్ (1162 – ఆగస్టు 18, 1227) – తెన్నేటి సూరి

తెన్నేటి సూరి ” ఛంఘిజ్ ఖాన్” మీద డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ జనవరి 8,2017 న జరిపిన చర్చలో పాల్గొన్న వారు :మద్దిపాటి కృష్ణారావు,చేకూరి విజయసారధి ,పిన్నమనేని శ్రీనివాస్ ,బూదరాజు కృష్ణ మోహన్, వేములపల్లి రాఘవేంద్ర చౌదరి,చేపలమడుగు ఉదయకుమార్,ఆరి సీతారామయ్య, వీరపనేని విష్ణు
చర్చ లో ముఖ్యాంశాలు సమీక్షించిన సభ్యుడు : పిన్నమనేని శ్రీనివాస్

****
ఛంఘిజ్ ఖాన్ ఎవరు?

భూమిని పాలించిన గొప్ప చక్రవర్తులు ఎందరో చరిత్ర పుటలలో తమ గుర్తుల్ని వదిలి వెళ్లారు. వారిలో ముఖ్యంగా నిరంతర యుద్ధాల ద్వారా ప్రపంచ దేశాలని ఆక్రమించి చక్రవర్తులైన వారిలో ప్రపంచ చరిత్ర మార్చిన వారు — అలగ్జాండర్, సీజర్, ఛంఘిజ్ ఖాన్. మొదటి ఇద్దరూ ఐరోపా దేశాన్నించి బయలు దేరి ఆసియా దేశాలపై రాగా, ఛంఘిజ్ ఖాన్ ఆసియా నుండి బయలు దేరి ప్రపంచ దేశాలు ఆక్రమించి విశ్వవిజేతలుగా ప్రకటించుకున్నవారు. మొదటి ఇద్దరూ నగర జీవితాల నుండి వచ్చిన వారైతే, ఛంఘిజ్ ఖాన్ తండా జీవితం లో వచ్చి చివరి వరకూ అందులో బ్రతికినవాడు. ఛంఘిజ్ ఖాన్ అంటే ముస్లిం పేరులా అనిపిస్తుంది కానీ అది మంగోల్ పేరు. ఛంఘిజ్ ఖాన్ అసలు పేరే కాదు బిరుదు. ఛంఘిజ్ ఖాన్ మతం షమన్ షామానిజం. ఇప్పటి మనకు తెలిసిన రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజానికి మందు 12 కోట్ల చదరపు మైళ్ళు భూమిని యుద్ధాల ద్వారా గెలిచిన ఒకే ఒక యోధుడు. ఎనిమిది వందల సంవత్సరాల క్రితం చని పోయిన ఛంఘిజ్ ఖాన్ సంతతి ఇప్పటికీ మానవ జాతిలో అతి పెద్దది.

ఎక్స్-వై జతలో “వై” క్రోమోజోమ్తండ్రి నుండి కొడుకుకు వస్తుంది. ఇప్పుడు ఈ భూమి మీద జీవించుచున్న ప్రతి 200 మంది మగవారిలో ఒకరు ఛంఘిజ్ ఖాన్ వంశ ము(అంశ) నుండి వచ్చారని 2003 వ సంవత్సరం లో జెనిటిక్ శాస్తవేత్తలు కనిపెట్టిన విషయం.

మన భారతీయులకు అతని సంబంధ మేమిటి?

భారత దేశ చరిత్రలో రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన మొఘల్ (మంగోల్ అనేదానికి అరబిక్ పదం) వంశం మొదటి వాడైన బాబర్ తండ్రి తరఫువారు తైమూర్ వంశం, తల్లి తరఫువారు చెంఘిస్ ఖాన్ వంశం. తండ్రి వంశ(తైమూర్ బార్లెస్ తుర్కమెన్) ప్రకారం తైమురెడ్ లేక తుర్కమెన్ వంశం అనాలి అని చాలా మంది అంటారు. కానీ మనకు మొఘల్ గానే ప్రసిద్ధి. చైనా సముద్రం నుండి ఇప్పటి ఉక్రెయిన్ దేశం దాకా తన సైన్యాన్ని నడిపించిన మంగోల్ మహా వీరుడు ఛంఘిజ్ ఖాన్. మంగోల్ వంశాన్ని ప్రపంచం అంతా ప్రాకించిన మొదటి చక్రవర్తి. “చెంగ్ సౌజ” అంటే చైనా భాషలో “సాటిలేని యూధుడు” అని అర్థం అట. ఊరు పేరు లేని ఒక చిన్న మంగోల్ తెగ నాయకుడుగా పుట్టి, పదకొండవ శతాబ్దం లో ప్రపంచాన్ని గడగడ లాడించిన తిరుగు లేని సైన్య నిర్మాణ దక్షుడు, చతుర్యోది పాయలను నేర్పుగా ప్రయోగించిన మహా నాయకుడు.

ఎలా మహా నాయకుడయ్యాడు?

మంగోల్ తండా నాయకుడు యాసుకై భాగత్తూర్ కు మెర్కిట్ తండా నుండి ఎత్తుకు వచ్చిన తల్లి యూలాన్ కు పుట్టిన మొదటి బిడ్డ “టెమూజిన్” (ఉక్కు మనిషి). అతని బాల్యం కష్ట భూయిష్టమైంది. చదువు లేకపోయినా తండా రాజకీయాల్లో మహా నేర్పరి. ఇప్పటి వరకూ భూమి మీద 12 కోట్ల స్క్వేర్ చదరపు మైళ్ళు నిర్దాక్షణ్యం గా జయించిన ఒకే ఒక నాయకుడు టెమూజిన్. తండాలలో ఐక్యత కోసం నిర్దాక్షిక్షణ్యం గా ఉండడం, తండాలలో మూఢ నమ్మకాలను తనకు అనుకూలంగా మలుచుకోవడం, బహు జాగ్రత్త గా సంబంభంధాలు కుదుర్చుకోవడం, తాను చేసే పని ఒప్పు అని తన చుట్టు ప్రక్క నాయకులు అనిపించేలా రంగం తయారు చేయడం, నేల మీద మనిషికి గుఱ్ఱం బలం అని నమ్మిన మహా నాయకుడు. సైన్యాన్ని చిన్న చిన్న గుంపులు గా తయారు చేయడం, వేగంగా కదలడం, ఆ చిన్న గుంపు వారి నాయకుడిని ఎన్నుకొనే అధికారం ఇవ్వడం లాంటి విధానాలు ఇప్పటి దేశాలు కూడా స్ఫూర్తి అక్కడ నుండే తీసుకున్నట్లు అనిపిస్తుంది.

ఎలా పరిపాలించాడు?

ఛంఘిజ్ ఖాన్ గెలిచిన రాజ్యాలకు తన వారసత్వ వారసులకు కాకుండా ప్రజ్ఞ, పనితనం ఉన్నవాడికే (శతృవు ఐనా) అధికారం ఇచ్చి, మత స్వాతంత్రము ప్రజలకి ఇచ్చి చిన్న తెగలన్నిటిని కలిపిన మేధావి. ఆసియా, ఐరోపాని కలిపే “సిల్క్ రోడ్” ని పటిష్టం చేసి రెండు ఖండాల మధ్య వారధిగా నిలబెట్టిన ఘనత ఛంఘిజ్ ఖాన్ దే. చదువు రాని ఛంఘిజ్ ఖాన్ మంగోల్ దేశానికి మొదటి లిపి (హుడం మంగోల్ బిచిగ్) ఇచ్చి దానితోనే రాజ్య నీతి (“యాసా”) ప్రచురించి చేసి పాలించాడు. నగరాలను, నగర జీవితాన్ని ఇష్టపడక, మొదట శత్రువుకు అవకాశం ఇచ్చి, లొంగకపోతే నిరంకుశంసంగా ఆ సామ్రాజ్య మగవారిని నాశనం చేయడం, బంధువులను కాకుండా లొంగిన వాడిని గౌరవించి తన క్రింద సేనాపతులుగా ఉంచు కోవడం అతని గొప్ప లక్షణం. కటువైన శాసనాధికారం, దిటువున గుండె దిటువు అతని శక్తి.

చనిపోకముందు తన సువిశాల సామ్రాజాన్ని తన వారసుడైన ఓగ్దేల్ ఖాను కు మహా ఖాఖాన్ పదవి ఇచ్చి సామ్రాజ్యా్జాన్ని ఐదు ఖానైట్లు (చిన్న రాజ్యలు) చేసి తన పుత్రులకి, మనుమడి కి పంచి చనిపోయాడు. ఛంఘిజ్ ఖాన్ తాను చనిపోయినాక అతని సమాధి ఎవరూ కనిపెట్ట కూడదని అతని కోరిక. అతని ఆంతరంగిక రక్షకులు సమాధి నిర్మిచిన వారిని, భౌతిక కాయాన్ని తీసుకు వెళ్లిన వారిని, ఆ దారిలో కనిపించిన వారిని అందర్నీ చంపి, తాముకూడా చనిపోయారని నమ్మకం. ఎనిమిది వందల సంవత్సరాలైనా ఈ రోజు వరకు అతని సమాధి ఒక కనిపెట్టలేని రహస్యం.

క్రూరుడు అని ఎందుకు చరిత్రలో చదువుతున్నాము?

మనకు తెలిసిన చారిత్రాత్మక విషయాలు ఎక్కడో గ్రంధస్థం చేయబడితేనే వాటిని మనం ప్రామాణికం గా తీసుకుంటున్నాం. ఇప్పటిపవరకు మానవ చరిత్రని గ్రంధస్థం చేసుకుని సొంతం చేసుకున్నది ఐరోపా దేశాలే. మనం చదివేది, చదువుకున్నది వారి దృష్టి తో గ్రంధస్థం చేయబడ్డ చరిత్ర. చరిత్రలో విజేతలే తమ గురించి గ్రంధస్థం చేయించుకున్నారు కానీ ఛంఘిజ్ ఖాన్ చరిత్ర పరాజితులు గ్రంధస్థం చేశారు. చంఘిజ్ ఖాన్ అప్పటి పశ్చిమ ఐరోపా దేశాలైన ముస్లిం పరిపాలకులతో వ్యాపార సంబంధాలు పెంచుకుందామని పంపిన వర్తకులని ఆ నగర పాలకులు చంపి వేయడం తో, రెండు లక్షల సైనికులతో బయలుదేరి దారిలో ఎదురైన ప్రతి రాజ్యాన్ని నిర్దాక్షిణ్యంగా నాశనం చేసి, కొన్ని సంవత్సరాలు యుద్ధం చేసి క్వారీజ్మెన్ చక్రవర్తి షా ఆల్డిన్ మహ్మద్ ని, అతని సంతతిని అంతమొందించాడు. ఆ యుద్దాన్ని పాశ్చాత్య చరిత్రకారులు, ఇప్పటి మంగోలియాని ఆక్రమించి పరిపాలించిన కమ్యూనిస్ట్ రష్యా చంఘిజ్ గొప్పతనాన్ని తగ్గించి అతని యుద్ధ దారుణాలనే ప్రచారం చేశారు. మిగిలిన చక్రవర్తులతో పోల్చితే ఇంకా ఇతని గురించి చరిత్ర పరిశోధనలు జరగాలి అనిపిస్తుంది.

రచయిత కష్టం –

ఛంఘిజ్ ఖాన్ చారిత్రాత్మక నవల అని రచయిత చెప్పలేదు. తన ఊహా శక్తితో కొన్ని పాత్రలు సృష్టించారు. విభిన్న మైన మంగోల్ దేశపు నైసర్గిక పరిస్థితులు, మంగోల్ తండాల జీవన విధానాలు రచయిత మనకు చక్కగా కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు. మొదటి 30 పేజీలు మనకు కొంచెం మనుషుల పేర్లు, వారు సంచరించే పరిసరాలు వారి అలవాట్లు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఒకసారి అలవాటు పడితే నవల ముగింపు వరకు చాలా చక్కటి కధనాన్ని అల్లారు రచయిత. ముఖ్యంగా ఛంఘిజ్ ఖాన్ (గోబీ బంజర్ల బందిపోటు) తన ప్రత్యర్థులైన సింగపాల్ నగర రాజు తుగ్రల్ ఖాన్ కి, చైనా చక్రవర్తి ప్రధానమంత్రి చిన్-సాంగ్ కు మద్య నడిపిన దౌత్యం బాగా ఆకట్టుకుంది. తండ్రి కి విషమిచ్చి చంపిన టర్గ్ టాయ్ ని చంపి, తన ప్రత్యర్థి ఐన తుగ్రల్ ఖాన్ కి పంపిన తెలివి అబ్బురపరచుతుంది. తనను అణచివేయడానికి పంపిన సైన్యాన్ని తన శత్రువులకు వాడిన తెలివి అబ్బురపరిచింది. చివరకు సంధికి పంపిన లేఖ మనని ఆలోచింప జేస్తుంది. ఈ నవలను ప్రముఖ అభ్యుదయ రచయిత తెన్నేటి సూరి (1911-1958) అద్భుత పద ప్రయోగం మొదటి నుండి చివరి వరకూ చదివింప చేసింది. సూరిగారి మిగిలిన రచనలు ఒక్క అనువాద నవల “రెండు మహానగరాలు( మూలం: చార్లెస్ డికెన్స్)” తప్ప ఎక్కువ రచనలు అందుబాటులేవు.

ఒక యుద్ధ నాయకుడు – ముగ్గురు తెలుగు నవలా కథకులు –

ఛంఘిజ్ ఖాన్ – తెన్నేటి సూరి,
జెంఘిజ్ ఖాన్ – వి.యాన్ (అనువాదం:ఆర్వీయార్),
ఛెంఘిజ్ ఖాన్ – లల్లాదేవి

మేము తెన్నేటి సూరి రాసిన ఛంఘిజ్ ఖాన్ చదువుదామని అనుకున్నపుడు మిగిలిన రెండు పుస్తకాలు జెంఘిజ్ ఖాన్ – రష్యన్ రచయిత – వి.యాన్ (అనువాదం:ఆర్వీయార్) మరియు లల్లాదేవి- ఘిజ్ ఖాన్ ఇంటర్నెట్లో బయటపడ్డాయి. జెంఘిజ్ ఖాన్ రష్యన్ పుస్తకాన్ని ఆర్వీయార్ గారి అనువాదం చాలా బాగుంది. ఒక దర్విష్ (సన్యాసం తీసుకున్న సూఫీ దేశ దిమ్మరి) ద్వారా చెప్పిన కథ. జెంఘిజ్ ఖాన్ తన శత్రువు క్వారీజ్మెన్ చక్రవర్తి షా ఆల్డిన్ మహ్మద్ ను ఎందుకు మరియు ఎలా నాశనం చేశాడు అన్నది ముఖ్య కథనం.

You Might Also Like

5 Comments

  1. Padmaja

    thank you very much.

  2. Srinivas Pinnamaneni

    తెన్నేటి సూరి చెంఘిజ్ ఖాన్: రేడియో నాటకం
    http://eemaata.com/em/issues/201503/6594.html

  3. Padmaja

    Can you kindly let me give the links / source of the below:

    జెంఘిజ్ ఖాన్ – రష్యన్ రచయిత – వి.యాన్ (అనువాదం:ఆర్వీయార్) మరియు లల్లాదేవి- ఘిజ్ ఖాన్

    Thanks,
    Padmaja

Leave a Reply