పుస్తకం
All about booksపుస్తకభాష

November 22, 2017

వెండివెన్నెల: మళ్లీ మళ్లీ నిర్మించిన సినిమాల ముచ్చట్లు

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: కాదంబరి
*************

వెండి తెరకు శీతల వెన్నెల భాష్యాలు వెలయించిన పుస్తకం ‘వెండివెన్నెల’. సినిమా అను మొక్క నేడు మహాతరువుగా వ్రేళ్ళూనుకుని నిలబడింది. ఆ మహా వృక్షం చల్లని నీడ – నేడు కోట్లాదిమందికి ఉపాధి కల్పించిన కల్పతరువు ఐనది. అటువంటి సినిమా నిర్మాణం – తప్పటడుగులు నేరుస్తున్న దశలో –
తొలిదశలో- నిర్మాణంలో భాగం పంచుకున్న మహనీయులు ఎందరో!

ఆ స్థాయిలో ఎన్నో త్యాగాలు, ఎన్నో వింత అనుభవాలు, ఎన్నెన్నో సంఘటనలు తారసిల్లినవి. ఎన్నో శ్రమదమాదులు ఓర్చి, పాఠకులకు అందించారు – రచయిత యు.వినాయకరావు. కేవలం సినిమా విడుదల తేదీలు, నటీ నటుల పట్టికలు ఇచ్చి, సరిపెట్టుకోలేదు రచయిత. షూటింగ్ సమయాలలో తారాగణం, సినీ సిబ్బంది – పడిన ఇబ్బందులను పూసగుచ్చినట్లు వర్ణించిన శైలి ఈ పుస్తకానికి వన్నె తెచ్చింది.

పుస్తకం నుండి కొన్ని విశేషాలు:

దాదా సాహెబ్ ఫాల్కే చలన చిత్ర నిర్మాణానికి స్ఫూర్తి ఏమిటో తెలుసా!? Life of Jesus Christ చూసి వచ్చారు – దాదా సాహెబ్ ఫాల్కే.
చిత్ర నిర్మాణం భారతదేశంలో “హరిశ్చంద్ర” తో శ్రీకారం చుట్టారు పాల్కే. India లో 17 మే 1913 న విడుదల ఐన మొట్టమొదటి మూకీ సినిమా – హరిశ్చంద్ర. తర్వాత – హరిశ్చంద్ర (1935)-బ్యాక్ లైటింగ్ పద్ధతి, బ్రిటీష్ ఆకూస్టింగ్ యంత్రంతో రికార్డింగ్ జరిగింది.
తారాగణం: మాస్టర్ భీమారావు = లోహితాస్యుడు
ఆకుల నరసింహారావ = నారదుడు
కన్నాంబ = చంద్రమతి
అద్దంకి శ్రీరామమూర్తి = హరిశ్చంద్రుడు
కుటుంబ శాస్త్రి = కాల కౌశికుడు
వీరబాహు = కాశీచెంచు
రోషన్ బాయి = హైమావతి
మాతంగ కన్యలు పెండ్యాల సుందరమ్మ కలహకంఠి
16 నవంబర్ 1935 న రిలీజ్ ఐనది. మళ్ళీ – SV రంగారావు హీరోగా, ఎన్టీఆర్ – హీరోగా – రెండు సార్లు వచ్చింది.

శ్రీరామ పాదుకా పట్టాభిషేకము = 1932 1945 1966. కాంతారావు యొక్క 100 వ చిత్రం, ఐనప్పటికీ కాంతారావు పొరబడి, “నా వందవ సినిమా – ‘అంటూ వేరే పేరును ప్రకటించాడు తర్వాత ఆ పొరపాటుకు పశ్చాత్తాప పడ్డాడు కూడా!

రామదాసు – సినిమాను నిర్మిస్తున్న చిత్తూరు నాగయ్య పడిన కష్టాలు లెక్కలేనన్ని. శ్రీరామదాసు [2006] దర్శకుడు – కె.రాఘవేంద్ర రావు
రామదాసు-అక్కినేని నాగార్జున, తండ్రి అక్కినేని = కబీర్ పాత్రధారి. “శ్రీరామ మందిర్” పేరుతో – హిందీ భాషలోకి డబ్బింగ్ చేసారు.

ముక్కామల, నాగయ్య, తెరపై కనిపిస్తున్నారు, సరే – ఐతే ఇది బెంగాలీ సినిమా. శకుంతల – 1976 – బెంగాలీ భాషలో హిట్ ఐనది, కానీ తమాషా ఏమిటంటే – తెలుగులో [1966] film flop ఐంది. ఆ సినిమా “శకుంతల” ;- బి.సరోజ, గీతాంజలి, శారద నటించిన “మధుర మధుర” అనే పాట బెంగాలీలో కూడా శ్రవణానందం కలిగిస్తున్నది. వీలు చూసుకుని, – వీలు చేసుకుని, వీలైతే ఒకసారి వంగ రాష్ట్ర – శకుంతల – కు ప్రేక్షకులుగా మారండి మరి.

పౌరాణిక చిత్రంలో ఈలపాట – ఈలపాటకు పెట్టింది పేరు రఘురామయ్య. కనుకనే బిరుదు అతని ఇంటి పేరుగా స్థిరపడింది. రఘురామయ్య విజిల్ సాంగ్ కు అవకాశం ఎట్లా కలుగుతుంది మరి, అందుకే ఒక సీనును కల్పించారు ఈలపాట రఘురామయ్య కోసం. scene story – గోపికలు మురళిని దాచేసారు. ఈలపాట రఘురామయ్య అభినవ కృష్ణుడు. తన ఈల పాట పాడగా, పారవశ్యాన్ని పొందిన భక్త గోపికలు తాము దాచిపెట్టిన వేణువును ఇచ్చేసారు.ఇదంతా – భక్తకుచేల -1935 లో.

మలయాళంలో – నీలా ప్రొడక్షన్స్ సంస్థ యొక్క”భక్త కుచేల” సినిమాకు అనేక విశేషాలు ఉన్నవి. తెలుగు వాడైన CSR నటించారు. విశేషం ఏమిటంటే – సియస్సార్ కి మలయాళం రాదు, ఐనప్పటికీ తెలుగు లిపిలో మలయాళ డైలాగులను రాసుకున్నాడు. ఉచ్ఛారణా దోషాలు లేకుండా – మలయాళ సంభాషణలను చెప్పారు, కేరళ ప్రభుత్వ అవార్డు ఈ చిత్రానికి వచ్చింది. “కేరళ ప్రభుత్వ అవార్డు – ఉత్తమ నటునిగా నన్ను నిలిపింది.” CSR చెమ్మగిల్లిన నయనాలతో చెప్పారు. సి.యస్.ఆంజనేయులు కీర్తిశేషులైనారు. అటు పిమ్మట ఈ మలయాళ “భక్త కుచేల” ను తెలుగులో శ్రీకృష్ణ మహిమ – అనే పేరుతో release చేసారు. కాంతారావు = శ్రీకృష్ణ పాత్రను ధరించుట – ఇంకో విశేషం.

తొలి మహిళా నిర్మాత ఎవరు? ఆ సినిమా ఏమిటి? సతీ సక్కుబాయి (1935) సక్కుబాయిగా దాసరి కోటిరత్నం నటించింది. షూటింగ్ లలో – పరిశీలన వలన – దాసరి కోటిరత్నంకి ఆసక్తి కలిగింది. ఆమె – సతీఅనసూయ – నిర్మించింది. తొలి మహిళా చిత్రం, తొలి మహిళా నిర్మాత స్థానం – ఖ్యాతిని పొందింది దాసరి కోటిరత్నం.

శ్రీకృష్ణ తులాభారం (1935) – తెరపైన – రేలంగి తొలి సినిమా ఇది. రేలంగి ఇందులో వసుదేవుడు పాత్ర ధరించాడు. గిరిజ [= హేమ] తొలి చిత్రం – పరమానందయ్య శిష్యులు (1950)

ముళ్ళపూడి వెంకట రమణ – ఒక సినిమా రీళ్ళు కోసం గాలించారు, తెలుసా!? వారి అన్వేషణ ఫలించింది, షెడ్ మూలలో పడి ఉన్న నెగిటివ్ ని – మద్రాసుకు తీసుకుని వచ్చారు, శుభ్రం చేయించారు, పూనే ఫిల్మ్ ఆర్కైవ్స్ – కి అందించారు. అది – సంపూర్ణ రామాయణము (1936).
ముసునూరి శ్రీరామ చంద్రమూర్తి = హనుమంతుడు గా నటించారు.
నిర్మాత – నిడమర్తి సూరయ్య
రాజమండ్రిలో తొలి “కృష్ణా సినిమా” ధియేటర్ , మూకీల ప్రదర్శన జరిపించిన ఘనత నిడమర్తి సూరయ్యకే దక్కింది.

చిన్ని బ్రదర్స్ సంస్థ – ఎవరిది, ఆ పేరెందుకని? చిన్ని బ్రదర్స్ బేనర్ పై ఆదినారాయణరావు దంపతులు సినిమాలు అంజలీదేవి, ఆదినారాయణరావు ల తనయుడు వీర వెంకట సత్యనారాయణ – [చిన్నారావు]. కుమారుని పేరుపై చిన్ని బ్రదర్స్ సంస్థను నెలకొల్పారు.

వీరాభిమన్యు [1965]
అభిమన్యుడు – శోభన్ బాబు, కాంచన – ఉత్తర
అభిమన్యు 1936లో ఉత్తర గా కాంచన మాల నటించింది. ఆ పేరు సామ్యం కలిగిన – కాంచన – వీరాభిమన్యు [1965] ఉత్తర పాత్రను పోషించింది.
వీరాభిమన్యు [1965] విశ్వరూపం చిత్రీకరణ 3 నెలలు కొనసాగింది. రవికాంత్ నగాయిచ్ విశ్వరూపం – ఒకే ఫిల్మ్ ని 45 సార్లు తీసారు, కేవలం ఈ సీనుకై – 3 నెలలు పట్టింది.

కోగంటి వెంకట సుబ్బారావు నిర్మించిన 1947 నాటి పల్నాటి యుద్ధంలోని బాలచంద్రుడు [ANR] పాడిన ద్విపద పద్యం అప్పటి దక్కన్ రేడియోలో సిగ్నేచర్ ట్యూన్ గా (స్వాతంత్ర్య సిద్ధికై సలుపు సమరాన) తెలుగు కార్యక్రమాలకు ముందు ప్రసారం చేసేవారు

త్రిలింగ దేశంలో, అంటే ఆంధ్ర ప్రదేశ్ లో, ప్రజానీకం వెండి తెర తారల దుస్తులను చూసి అనుకరించిన ఘట్టం 1949 నుండి “గొల్లభామ” సినిమా ద్వారా ఏర్పడింది. ఈ సినిమాకి కళాదర్శకుడు వాలి. కళాదర్శకుడు మల్లు బట్ట పైన ప్రత్యేక డిజైన్లు ప్రత్యేక శ్రద్ధతో రూపొందిచాడు. అవి మహిళామణులకు నచ్చాయి. హీరోయిన్ కృష్ణవేణి ; గొల్లభామ చీరలు – మార్కెట్ లో వచ్చిన వస్త్ర సంచలనం అది.

అంజలీదేవి అసలు పేరేమిటో తెలుసా!? అంజనీకుమారి -అంజనీకుమారి కాస్తా అంజలీదేవి గా మారింది, ఆమె గొల్లభామ- సినిమాలో మోహిని – పాత్రధారిణి. ఇదే సినిమా మళ్ళీ -భామా విజయం అను గొల్లభామ కథ [1967] నిర్మించబడింది.

గిరిజ [= హేమ] తొలి చిత్రం – పరమానందయ్య శిష్యులు [1950]. ఇందులో సావిత్రి, సరోజ – [శిష్యురాళ్ళు]. ఈ సినిమా ఫెయిల్ అయ్యింది.
పరమానందయ్య శిష్యుల కథ -1966 లో [NTR] వచ్చి అఖండ విజయం సాధించింది. ఇందులో పరమేశునిగా శోభన్ బాబు నటించాడు. శోభన్ బాబు [శివుడు]; పాములు మెడలో వేసుకుని నటించక తప్పదు కదా! – భయంతో శోభన్ బాబు కి ఒళ్ళంతా చెమటలు పట్టేవి. “హిమాలయాలలో ఉండే ఈశునికి చెమటలు పట్టే అవకాశం లేదని మీరు గ్రహించాలి.” సి.పుల్లయ్య అంటూ చమత్కరించే వాడు.

1958 – పార్వతీ కళ్యాణం – బక్క పలచగా ఉన్న రమణారెడ్డి ‘నేను -నారదుని పాత్రకు నప్పను.’ అంటున్నప్పటికీ – నారదుడు పాత్రకు రమణారెడ్డిని ఒప్పించారు. ఈశుడు ఉన్న పౌరాణిక సినిమాలలో సర్పాలు తప్పనిసరి. శోభన్ కు వలెనే కృష్ణకుమారికి భయం, కనుక ఆమెకు బొమ్మ పాములు ఇచ్చారు.
పరమేశునిగా నటించిన బాలయ్య నిజమైన పామును మెడలో వేసుకున్నారు.

సినిమాలు వెండి తెర రూపాలను పొందడానికి మహనీయులు వేసిన పునాదులు – గొప్పవి. వారు వేసిన సోపానాలు ఎక్కి, మన దేశ చలన చిత్రసీమ ఇంతింతై వటుడింతయై అన్న రీతిలో ఎదిగి, మన వీక్షణాల ఎదుట దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది. ప్రథమ చలన చిత్ర కర్తల అనుపమాన కృషికి పరిమళభరిత పుష్పాంజలి ఈ పుస్తకం. ఒకే చోట ఇటువంటి అగణిత ఆసక్తికర సంఘటనలను ప్రోది చేసి, ఒకే రచనగా చదువరులకు లభించేలా చేసిన ప్రయత్నం ఇది. కోమటి జయరామ్ మున్నగు ఉదాత్త వ్యక్తుల సౌజన్యం – చేయూత ఫలితం వెలుగులోకి తెచ్చిన ఈ “వెండి వెన్నెల”.

ప్రతులకు:
వెండివెన్నెల – మళ్ళీ మళ్ళీ నిర్మించిన సినిమా ముచ్చట్లు
యు.వినాయకరావు, జయా పబ్లికేషన్స్
8-3-222/ఆ/12, C-12, మధురానగర్
సంజీవరెడ్డి నగర్
హైదరాబాద్ – 500038
email -uvreditor@gmail.com
Kinige.com linkAbout the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

సాహితీ నీరాజనం – శ్రీ చీమకుర్తి శేషగిరిరావు

వ్యాసకర్త: కాదంబరి ******* ఆంధ్రస్య మాంధ్ర భాషా చ| న అల్పస్య తపసః ఫలం|| అని అప్పయ్య దీక్షిత...
by అతిథి
2

 
 

“శృంగార నైషధము” విశ్లేషణ – కొల్లా శ్రీకృష్ణారావు

వ్యాసకర్త: కాదంబరి ****** “కవికీ, కంసాలికీ సీసం లోకువ.” అని నానుడి. కంసాలి లోహమైన ‘సీ...
by అతిథి
0

 
 

పద్మావతి కృషి

వ్యాసకర్త: కాదంబరి ******* పోట్లూరి పద్మావతి అనేక ఆధ్యాత్మిక పుస్తకములను రచించారు. అన్న...
by అతిథి
1

 

 

మధుబిందువులు

వ్యాసకర్త: కాదంబరి ****** “మధు బిందువులు” పేరు చూడాగానే బోధపడ్తుంది, ఇవి సున్నిత భావాల క...
by అతిథి
0

 
 

కాళికాంబా సప్తశతి

వ్యాసకర్త: కాదంబరి *********** “ముడుమాల” ఒక మారుమూల పల్లెటూరు. ఐతే ఆ చిన్ని కుగ్రామం గొప్ప అ...
by అతిథి
2

 
 

అక్క మహాదేవి సమగ్ర వచనాలు

వ్యాసకర్త: కాదంబరి ******* కర్ణాట సీమను వచన కవితాసీమను సాహిత్యముతో పరిపుష్ఠం చేసిన మహామ...
by అతిథి
3