Deep Thinking: Garry Kasparov, Mig Greengard

“Deep Thinking: Where Machine Intelligence Ends and Human Creativity Begins” – ఈ పుస్తకం గురించి Halley ఒక రెండు మూడు వారాల క్రితం మాటల సందర్భంలో చెప్పాడు. ప్రముఖ చెస్ ఆటగాడు గారీ కాస్పరోవ్ Mig Greengard అన్న చెస్ రచయిత తో కలిసి రాసిన పుస్తకం ఇది. కాస్పరోవ్ రాసినది అని కాదు కానీ, ఆ టైటిల్ తో రాసిన పుస్తకం అనగానే కొంచెం కుతూహలం కలిగింది. కొత్తగా విడుదలైన పుస్తకమే అయినా వెంటనే నాకు ఇంటర్-లైబ్రరీ లోన్ లో దొరికింది. గత వారం పదిరోజుల్లో వీల్లున్నప్పుడల్లా చదివాను. నన్ను చాలా ఆకట్టుకుంది. ఈ పుస్తకం గురించి ఒక పరిచయం.

Garry Kasparov జగమెరిగిన చదరంగ మేధావి. చాలా ఏళ్ళు ప్రపంచ ఛాంపియన్ గా ఉన్నవాడు. “Greatest chess player of all time” అని అనేకుల ద్వారా అనిపించుకున్న వాడు. అతని సుదీర్ఘ చెస్ ప్రయాణం వల్ల రెండు మూడు తరాల వారు అతని గురించి పత్రికల్లో చదివే ఉంటారు. నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో తరుచుగా ఆయన గురించి చదివేదాన్ని. ఆనంద్-కాస్పరోవ్, కాస్పరోవ్-కార్పోవ్, కాస్పరోవ్-క్రామ్నిక్ ఇలా రకరకాల మ్యాచ్ ల అనాలసిస్. కాస్పరోవ్-డీప్ బ్లూ కంప్యూటర్ ల మధ్య జరిగిన మ్యాచ్, రీమ్యాచ్ లు అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఓడిపోయిన రోజు కాస్పరోవ్ “look of shock” అప్పటి పేపర్లలో రావడం నాకు గుర్తుంది. ఈ పుస్తకం ఇది జరిగిన ఇరవై ఏళ్ళకి కాస్పరోవ్ ఆనాటి రోజుల గురించి తల్చుకుంటూ, కంప్యూటర్ చెస్ గురించి, కృత్రిమ మేధ గురించి విశ్లేషిస్తూ రాసిన వ్యాసాల సంకలనం.

ఒక చెస్ ప్లేయర్ గా కాస్పరోవ్ కి కంప్యూటర్ చెస్ గురించి ఉన్న ఆసక్తి, దాని చారిత్రక పరిణామం గురించి ఉన్న అవగాహన గురించి నాకు అంత ఆశ్చర్యంగా అనిపించలేదు కానీ, తొలితరం, మలితరం చెస్ సాఫ్ట్వేర్ గురించి, ఆ చెస్ ప్రోగ్రాముల వెనుక ఉన్న అల్గారిథమ్స్ గురించి, brute force search తో చెస్ ఆట గెలవడానికీ, ఇటీవలికాలంలో Deep learning సాయంతో Go ఆటగాడిని ఓడించిన కంప్యూటర్ కి మధ్య ఉన్న తేడా గురించి అతను చాలా అవగాహనతో రాయడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది.

ఇక కృత్రిమ మేధ సంగతి: మామూలుగా దైనందిన జీవితంలో కృత్రిమ మేధకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడే గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల కార్యకలాపాల గురించి రాసినపుడు “savvy” అనుకున్నాను. కానీ, అక్కడ కూడా చారిత్రకాంశాలు కూడా వివరంగా చర్చించాడు. ఉదా: AI Winter గురించిన చర్చ, ఇంటర్నెట్ ఆవిర్భావం వెనుక పనిచేసిన కంప్యూటర్ సైంటిస్టుల్లో ఒకడైన Leonard Kleinrock ని కలవడం – ఇలాంటివి. ఇక, సమకాలీన పరిశోధనల గురించి, రిసర్చి కాన్ఫరెన్సుల గురించి, Jeopardy టీవీ కాంపిటీషన్ లో పాల్గొన్న IBM Watson చేసిన పొరపాట్ల గురించి చేసిన విశ్లేషణ – ఇలా అనేక Computer Science/Engineering కి సంబంధించిన అంశాల పై కాస్పరోవ్ కి మంచి పట్టు ఉన్నట్లు అనిపించింది వ్యాసాలు చదువుతూంటే. ఏదన్నా అంశంపై బాగా చదివి ఏ బ్లాగులోనో రాసే సమ్మరీ నోట్సులు కావు అవి. బాగా ఆలోచించి, విశ్లేషించి చేసిన వ్యాఖ్యలు.

కొన్ని నాకు మంచి పరిశీలనలుగా అనిపించినవి:

Hans Moravec అన్న మాటలని కోట్ చేసారు – “It is comparatively easy to make computers exhibit adult level performance on intelligence tests or playing checkers and, and difficult or impossible to give the skills of a one year old when it comes to perception and mobility

“Don’t make it think, make it do” – అన్న వాక్యం కోట్ చేశారు Artificial Intelligence విషయంలో basic research, applications మధ్య తేడా గురించి చెబుతూ.

“Despite centuries of science fiction about automatons that look and move like people, and for all the physical labor today done by robots, it’s fair to say we have advanced further in duplicating human thought than human movement” అంటాడు రోబోటిక్స్ పరిశోధనలపై వ్యాఖ్యానిస్తూ.

Hardwork talent రెంటినీ వేరు చేసి మాట్లాడ్డం గురించి: “Hard work is a talent. The ability to push yourself, to keep working, practicing, studying more than others is itself a talent. If anyone could do it, everyone would.” అంటాడు.

ఇక డీప్ బ్లూ విషయం. ఇరవై ఏళ్ళ తరువాత ఇప్పుడు ఇదంతా రాయడం ఏమిటి అనిపించింది మొదట. కానీ, పోను పోను ఆసక్తికరంగా, చదివించేలా ఉంది. ఆ మ్యాచ్ ల సందర్భంలో మొదటి నాళ్ళకి, చివరకీ IBM వారి వైఖరిలో మార్పు గురించి రాసిన అంశాలు నాకు ఆశ్చర్యంగా అనిపించాయి. ఆ అధ్యాయం చివర్లో ఆయన వ్యాఖ్య:
“I have been asked “Did Deep Blue cheat?” more times that I could possibly count, and my honest answer has always been “I don’t know”. After twenty years of soul searching, revelations and analysis, my answer is now “no”. As for IBM, the lengths they went to win were a betrayal of fair competition, but the real victim of this betrayal was science.”

కాస్పరోవ్ తో మొదటిసారి గెలవనపుడు వాళ్ళు రీమాచ్ అడిగారు – రీమాచ్ లో కాస్పరోవ్ ఓటమిపాలయ్యాడు. ఐబీఎం కి చాలా చాలా పేరొచ్చింది. అయితే, డీప్ బ్లూ తరువాతెప్పుడూ చెస్ ఆడలేదట!! నేనింకా ఆ తరువాత కూడా డీప్ బ్లూ అప్డేట్ అవుతూ ఆడిందేమో, ఏదో గొప్ప విప్లవానికి నాంది అయిందేమో అన్న భ్రమలో ఉన్నా (నాకు చదరంగం గురించి ఆసక్తి లేదు. ఆ న్యూస్ అంతగా ఫాలో అవను). పైగా వాళ్ళు దాన్ని కాస్పరోవ్ పైన గెలవడానికే కస్టమైజ్ చేసి చాలా మార్పులు చేశారని చదివి అవాక్కయ్యా – అంటే ఇది పూర్తిగా PR కోసం మాత్రమేనా? వేరే scientific curiosity లేదా? అని నాక్కూడా నిరాశగా అనిపించింది కాస్పరోవ్ అంతసేపూ దాని గురించి చెప్పేసరికి. అప్పట్లో దీని గురించి కంప్యూటర్ చెస్ రంగంలో పేరు పొందిన Frederic Friedel
“It is like going to the moon and returning home without looking around” అన్నాడట పత్రికల్లో.

చివరగా: “I have argued that technology can make us more human by freeing us to be more creative. But there is more to being human than creativity. We have other qualities that machines cannot match. They have instructions while we have purpose. Machines cannot dream, not even in sleep mode. Humans can, and we will need our intelligent machines in order to turn our grandest dreams into reality. If we stop dreaming big dreams, if we stop looking for a greater purpose, then we may as well be machines ourselves
అంటాడు ముగింపులో.

ఏమాటకామాటే – చెస్ గురించిన విపరీతమైన చర్చ (ముఖ్యంగా ఒక్కో ఎత్తు గురించి వివరాలు) నాకు బోరు కొట్టాయి. అయితే, నేనెంతో ఇష్టంగా చదివిన కృత్రిమ మేధ విశ్లేషణలు చెస్ ప్రియులకి బోరు కొడతాయి కాబోలు! మొత్తానికి చెస్ ప్రేమికులు ఎలాగూ చదువుతారు. నాకు మల్లే ఆ టైటిల్ చూసి, కంప్యూటర్ మేధ గురించిన ఆసక్తితో చదివితే కూడా నిరాశ చెందరు. పైపెచ్చు బోలెడు కొత్త విషయాలు తెలుస్తాయి కూడానూ!

You Might Also Like

One Comment

  1. Chandra Naga Srinivasa Rao Desu

    ఈ రివ్యూ చాలా బాగుంది

Leave a Reply