Milk and Honey – Rupi Kaur

వ్యాసకర్త: Nagini Kandala

****************

ఏ రచన అయినా పాఠకుల మనసు వరకూ వెళ్ళాలంటే అది రచయిత మనసులోంచి వచ్చి ఉండాలి. అక్షరాల్లో అణువణువునా ధ్వనించే నిజాయితీ కంటే చదివివేవాళ్ళని కట్టిపడేసే ఆకర్షణీయమైన విషయం ఏముంటుంది! దేన్నైనా మంచి రైట్ అప్ అనడానికి నా వరకూ ఆ నిజాయితీ ప్రధానార్హత. ఒక్కోసారి రచన క్వాలిటీని నిర్దేశించే అంశాలైన భాష, వ్యాకరణం లాంటివి కూడా ఆ నిజాయితీ ముందు కేవలం అలంకారప్రాయాలుగానే మిగిలిపోతాయి. కెనడా కు చెందిన ప్రవాస భారతీయురాలు, జన్మతః పంజాబీ అయిన రచయిత్రి రూపీ కౌర్ రాసిన న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ కవితా సంపుటి ‘మిల్క్ అండ్ హనీ’ కూడా అదే కోవకి చెందుతుంది. ఇన్స్టాగ్రామ్ వాడేవాళ్ళలో రూపీ కౌర్ పేజీ గురించి తెలీని వాళ్ళుండరు. మొదట్లో ఇన్స్టాగ్రామ్ ను తన మనసులో భావాలను పంచుకునే వేదికగా చేసుకున్న ఆమె,తన బోల్డ్ రైట్ అప్స్ తో త్వరలోనే అనేకమంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.

రకరకాల వాయిద్యాలతో పాటు సాకేంతికతను కూడా విరివిగా ఉపయోగించి సృజించిన సంగీతం కూడా అడవుల్లో పచ్చని చెట్ల మీద, స్వేచ్ఛగా ఎగిరే పక్షుల కిలకిలారావాల ముందు దిగదుడుపే. ఎందుకంటే ఈ రెండో దానిలో ఉండే సహజత్వం మొదటిదానిలో కొరవడుతుంది. రూపీ కౌర్ కవితలు అడవి పక్షుల కిలకిలారావాల్లా ఉంటాయి, వర్షానంతరం పచ్చని పచ్చికబయళ్ళ లోనుంచి వచ్చే పచ్చి వాసన వేస్తాయి. స్త్రీల ఋతుచక్రాల మొదలు, లైంగిక వేధింపులు వరకు బోల్డ్, ఇంటిమేట్ విషయాలను ఇంత సున్నితమైన గళంలో చెప్పడం ఆమె ప్రత్యేకత. కవితలన్నిటిలోనూ మనం రిలేట్ చేసుకునే భావోద్వేగాలు ఉండటం వల్ల మనసుకు దగ్గరగా అనిపిస్తాయి.
“Our backs tell stories 
no books have the spine to carry” 
రూపీ కౌర్ కవితల్లో ధ్వనించే గాంభీర్యం ఆమె అక్షరాల్లో ఎంత వెతికినా కనిపించదు. కానీ చిన్న చిన్న పద్యాల్లా అల్లిన వాక్యాలు మాత్రం చెవులు చిల్లులు పడేలా ధ్వని చేస్తూ సరాసరి హృదయాన్ని తాకుతాయి. ఈ కవితలన్నీ స్త్రీల అస్థిత్వానికి చిరునామాల్లాంటి స్వాభిమానం, ప్రేమ, ద్వేషం, విరహం లాంటి సున్నితమైన అంశాల చుట్టూ తిరుగుతాయి. ఈ సంపుటిని the hurting, the loving, the breaking, the healing అనే నాలుగు భాగాల్లో రాశారు. మొదటి భాగంలో బాల్యంలో ఆల్కహాలిక్ అయిన తండ్రి నుండి వేధింపులు, లైంగిక వేధింపులు, ఒంటరితం లాంటి అంశాలైతే, మిగతా భాగాల్లో ప్రేమ, విరహం, విషాదాల్లాంటి అంశాలపై కవితలుంటాయి. ఆమె పదాల్లో ఆశించని ప్రేమ దక్కని నైరాశ్యం కనిపిస్తుంది. తండ్రి ప్రేమకు నోచుకోని ఒంటరి బాల్యం కనిపిస్తుంది. హిపోక్రసీ నిండిపోయిన సమాజం పట్ల నిరసన గళం వినిపిస్తుంది. ఇవన్నీ రచయిత్రి మనసు తాళం తెరచి, అందులో పాఠకులకు కుర్చీ వేసి కూర్చోపెట్టి మరీ తన వాదన వినిపిస్తుంది. ఆమె పదాల్లో ఎక్కడో ఒక చోట తమను తాము పోల్చుకొని స్త్రీలు, ఆత్మపరిశీలన చేసుకోని పురుషులూ ఉండరేమో. ఇది అణువణువునా ఫెమినిజం నిండిపోయిన పుస్తకం కాబట్టి స్త్రీలందరు తప్పకుండా చదవాలి అంటున్నారు కానీ నాకైతే ఈ పుస్తకం ప్రత్యేకం పురుషుల కోసం, పురుషాధిక్య సమాజం కోసం రాయబడింది అనిపించింది.
 
“i do not want to have you
to fill the empty parts of me
i want to be full on my own
 
i want to fill so complete
i could light a whole city
and then
i want to have you
cause the two of
us combined
could set
it on fire”  ఇది ఒక రిలేషన్షిప్ లో స్త్రీ కోరుకునేదేమిటో స్పష్టం చేస్తుంది..
మరో చోట,ఆర్ట్ ను నిర్వచిస్తూ,
“your art
is not about how many people
like your work
your art 
is about
if your heart likes your work
if your soul likes your work
it’s about how honest
you are with yourself
and you 
must never 
trade honesty 
for relatability” 
మరో చోట తనలో సున్నితత్వాన్ని తక్కువ అంచనా వెయ్యొద్దని హెచ్చరిస్తూ,
“i am water
soft enough
to offer life
tough enough
to drown it away” 
చిన్న చిన్న కవితలతో పాటు ప్రక్కన రిలేటెడ్ డ్రాయింగ్స్ ఉండటం వల్ల పుస్తకం నిడివి చాలా తక్కువ. కవిత్వం అంటేనే అదేదో గ్రహాంతర భాష అని భయపడే నేను అర్థగంట లోపు ఒక పోయెట్రీ పుస్తకాన్ని పూర్తి చేస్తానని కల్లో కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇది సామాన్యుల కవిత్వం. సాహిత్యం లో అ ఆ లు రాకపోయినా కూడా ఆస్వాదించడానికి అందుబాటులో ఉండే కవిత్వం.
పుస్తకం నుండి మరికొన్ని,
“i am a museum full of art
but you had your eyes shut” 
“The rape will tear you in half
But it will not end you..”
“you tell me to quiet down cause
 my opinions make me less beautiful
 but i was not made with a fire in my belly
 so i could be put out
 i was not made with a lightness on my tongue
 so i could be easy to swallow
 i was made heavy
 half blade and half silk
 difficult to forget and
 not easy for the mind to follow” 

You Might Also Like

Leave a Reply