A Horse Walks Into a Bar – David Grossman

వ్యాసకర్త: Nagini Kandala

*****************

A Horse Walks Into a Bar‘ అనే టైటిల్ చూసి పుస్తకం చదవడం మొదలుపెట్టిన రెండోరోజే దీనికి MBI అవార్డు వచ్చిందని తెలిసి,పూర్తి చెయ్యాలి అని ఉత్సాహంగా కూర్చుని చదివాను..”fifty-seven years ago today the world became a slightly worse place to live in” అంటూ ఇజ్రాయెల్ కు చెందిన 57 ఏళ్ళ stand-up ఆర్టిస్ట్ అయిన Dovaleh G (Dovaleh  Greenstein) తన కథను చెప్పడం మొదలుపెడతాడు. ఇజ్రాయెల్ లోని Netanya లో ఒక సాయంకాలపు ప్రదర్శనలో ఇజ్రాయెల్ లో తన బాల్యాన్ని, దానితో ముడిపడిన చేదు జ్ఞాపకాలనీ ఒక్కొక్కటిగా మనముందుంచుతాడు Dovaleh. ఆ షో కి తన బాల్య స్నేహితుడు, రిటైర్డ్ జడ్జ్ అయిన Avishai Lazar ను బలవంతంగా ఒప్పించి ఆహ్వానిస్తాడు. తన ప్రదర్శనను పూర్తిగా చూసి తక్షణం అనిపించిందేంటో ఉన్నదున్నట్లుగా రాయమని అతన్ని కోరతాడు. అదే షోకు ‘medium’ అని సంబోధించే అతని చిన్ననాటి స్నేహితురాలు, మానిక్యూరిస్ట్, ఆత్మలతో మాట్లాడగలిగే ఒక స్త్రీ కూడా వస్తుంది. ముందు సరదాగా మొదలు పెట్టిన షోలో క్రమేపీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించడం మొదలు పెట్టడంతో వచ్చిన ప్రేక్షకులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతుంటారు. కానీ తుదికంటా కూర్చుని Dovaleh ను చూసిన Avishai కి అతడిలో 57 ఏళ్ళ Dovaleh బదులు తన బాల్యం తాలూకు మానసిక స్థితినుండి ఎదగని 14 ఏళ్ళ పసివాడు కనిపిస్తాడు. Dovaleh ని గురించి తెలుసుకునే క్రమంలో Avishai తనను గురించి తాను తెలుసుకుంటాడు. అసలు Avishai లో ఈ పరివర్తనకు కారణమైన Dovaleh గతం ఏంటనేది మిగతా కథలో తెలుస్తుంది.
ఈ కథని Dovaleh, Avishai ఇద్దరూ ఏకకాలంలో నేరేట్ చేస్తారు. ఇందులో Dovaleh తో సరిసమాన ప్రాధాన్యత కలిగిన పాత్ర Avishai ది. Avishai ప్రదర్శన జరుగుతున్నంతసేపూ వర్తమానంతో గతజ్ఞాపకాల్లో చూసిన Dovaleh ను పోల్చుకుంటూ ఉంటాడు. బాల్యంలో తనకి పరిచయమైన నవ్వుతూ,నవ్విస్తూ సరదాగా ఉండే Dovaleh జీవితం అంత కఠినమైనదని తనకి ఊహామాత్రం కూడా తెలీకపోవడం Avishai ని విస్మయపరుస్తుంది. Dovaleh చిన్ననాటి అనుభవాలను వింటూ తమ చిన్నతనంలో ఇజ్రాయెల్ లోని Be’er Ora అనే స్థలంలో భవిష్యత్తు సైనికుల్ని తయారుచేసే Gadna camp నుండి తన స్నేహితుణ్ణి ఒకరోజు క్యాంపు ట్రక్ లో తీసుకు వెళ్తుంటే ఎక్కడికీ, ఎందుకూ అని కూడా అడగలేదని మధనపడతాడు. క్యాంపులో తాను ప్రేమించిన అమ్మాయి గురించిన ఆలోచనలతో వ్యస్థమై Dovaleh గురించి ఆలోచించలేకపోయానని తన తప్పు తెలుసుకుంటాడు. ఇందులో Avishai ఎవరేమైతే నాకేంటి,నా చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష అనుకునే ప్రతి సమాజానికీ ప్రతినిధిగా అనిపిస్తాడు. మరో వైపు Dovaleh బాధిత వర్గానికి ప్రతినిధిగా కనిపిస్తాడు, అతను చిన్నప్పుడు కొట్టి హింసించే తండ్రి గురించి గానీ, హోలోకాస్ట్ survivor అయిన తల్లి గురించి గానీ ఎప్పుడూ, ఎవరివద్దా పెదవి విప్పలేదు.
 “How, in such a short time, did he manage to turn the audience, even me to some extent, into household members of his soul? And into its hostages?
కథ చెప్పిన విధానంలో తప్ప, కథలో నూతనత్వం అంటూ ఏమీ లేదు. Dovaleh తన ‘Frantic Darting’ తో హాస్యం, వ్యంగ్యం కలిపి షోకు వచ్చిన ప్రేక్షకులను కూడా అవమానిస్తూ ఉంటాడు. Stand-up షో కాబట్టి కామెడీ, జోక్స్ లాంటివి ఉంటాయనుకున్నా, అవి కూడా ఒకటి రెండు మినహా సహజత్వం లేకుండా టీవీల్లో వచ్చే చవకబారు జోక్స్ ని తలపించాయి. కానీ ప్రేక్షకులు ఆ హాస్యానికి పగలబడి నవ్వడం, అదే సమయంలో Dovaleh తన జీవిత సత్యాలను వెల్లడిస్తున్నప్పుడు అయిష్టతను వ్యక్తం చెయ్యడం లాంటివి ఆధునిక సమాజపు జాడ్యాలను ప్రతిబింబిస్తాయి. ఈ విషయంపై “That’s what they’re here for! They’re here to laugh at you! Not so, my friends?” అంటాడు Dovaleh. బహుశా జీవితసత్యాలకంటే చవకబారు హాస్యమే జనాదరణకు నోచుకుంటుందని ఆ షో కు వచ్చిన వారినుద్దేశించి చెప్పాలనుకోవడం ఇక్కడ రచయిత అంతరంగం కావొచ్చు.
The angel of death”—he laughs breathlessly—”appears before a lawyer and says his time has come. The lawyer starts crying and wailing: ‘But I’m only forty!’ Angel of death says, ‘Not according to your billable hours!’ ” A quick punch, a complete spin around.
 
Exactly at this minute, more or less, in the old Hadassah Hospital in Jerusalem, my mother, Sarah Greenstein, went into labor! Unbelievable, isn’t it? A woman who claimed to want only the best for me, and yet she gave birth to me!
పుస్తకం బావుందా అంటే, బావుంది, బాగాలేదు అని రెండు సమాధానాలు చెప్పాలి. కథ నాకు నచ్చలేదు. మొదటి నుంచీ అనేక భావోద్వేగాలను స్పృశిస్తూ పట్టు సడలకుండా నడిపించిన కథనం రెండో భాగానికి వచ్చేసరికి చతికిలపడి, పట్టు వదిలేసింది. కథనం చాలా బావుంది, కానీ అంతవరకు ఆపకుండా చదివించి చివరకి ఇంతేనా అనిపిస్తుంది. దానికి తోడు అక్కడక్కడా కథకు సంబంధంలేని పాత్రలు, అనవసర ప్రసంగాలు లాంటివి వచ్చిపోవడంతో కథ, కథనం రెండిటి మధ్యా సమన్వయం కొరవడిందనిపించింది. రచయిత పదవిన్యాసం అబ్బురపరిచిన సందర్భాలు కొన్నైతే, ఇంత సాగదీత అవసరమా అనుకున్న సందర్భాలు కూడా కోకొల్లలు.
అవార్డులు, రివార్డులు లాంటివి మర్చిపోయి బ్లాంక్ ఇంప్రెషన్ తో చదివితే David Grossman రచన బావుంది అనచ్చు. కానీ అంతర్జాతీయ గుర్తింపు పొందిన రచన అనుకుంటేనే అసలు బాధ. అసలీ అవార్డులకు కొలమానాలేంటో అర్థం కాదు. హోలోకాస్ట్, సివిల్ రైట్స్ మూవ్మెంట్, వరల్డ్ వార్స్, రేసిజం లాంటి plots ఎంచుకున్న, లేదా వాటితో ముడిపడి ఉన్న కథలకే అగ్రతాంబూలాలిస్తున్నారు. చరిత్రలోని  చీకటి ఘట్టాలతో ముడిపడి ఉన్న సంఘర్షణలను తక్కువ చెయ్యడం ఇక్కడ నా ఉద్దేశ్యం కాదు. కానీ ఆ క్రమంలో కథ, కథనాల తూకాలకంటే Inferior party ను డిఫెండ్ చెయ్యడమే సామాజిక బాధ్యతనో లేదా బాధిత వర్గానికి ఎక్కువ ఓట్లు వెయ్యడమే సమంజసమనో జ్యూరీలు భావిస్తున్నాయేమో అనిపించింది. ఇలాంటి కోవకే చెందిన (Paul Beatty రాసిన Sellout చదవలేక మధ్యలోనే వదిలేశాను) పుస్తకాలకు ఈ మధ్య ఈ అవార్డులు రావడం కారణంగా ఉత్తమ సాహిత్యం అంటే బాధిత/పీడిత వర్గాల కథలు మాత్రమేనా అని అనిపించింది. బహుశా నేను ఈ మధ్య కాలంలో ఇవే స్టీరియో టైప్ రచనలు చదవడం వల్ల కలిగిన విసుగు కావచ్చు.. “ఓ సాథీ రే ” అంటూ కొన్నేళ్ల క్రితం అమితాబ్ ఒక సినిమా పాటలో మొదలు నుండీ తుద వరకూ ఒక స్టేజి మీద కదలకుండా నుంచుని కేవలం తన ముఖ కవళికల్తో తన బాల్యం తాలూకూ ప్రేమను గురించిన పాట ఒకటి ఉంటుంది. శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోయి, ఆ పాట పూర్తయ్యేసరికి ఒక గాఢమైన నిట్టూర్పు మనకు తెలీకుండానే బయటకి వస్తుంది. ఈ పుస్తకం మొదలు పెట్టిన తొలి పేజీల్లో నాకు కలిగిన భావన అదే. ఎటొచ్చీ ఇక్కడ మాత్రం పుస్తకం పూర్తయ్యేసరికి హమ్మయ్య అయిపోయింది అని నిట్టూర్పు విడిచాను 🙂
పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు:
Jews గురించి,We really are a special people, aren’t we, my friends? You just can’t compare any other nation to us Jews. We’re the chosen people! God had other options but he picked us!”
 
I’m beginning to identify the expression. A flash of internal violence. Or perhaps outward violence deeply buried.
 
What’s wrong, table six? What’s the panic, dude? It’s just a story, you won’t have to work your brain gland too hard, you won’t even notice you have one. It’s just words. Wind and chimes. In one ear, out the other..
Avishai కళ్ళతో చూసిన Dovaleh..
The spectacle looks like a fight between at least two men. Within the whirlwind of limbs and expressions I recognize the countenance that has passed over his face more than once this evening: he is uniting with his abuser. Beating himself with another man’s hands.
 
For an instant, when he looks up, the spotlight creates an optical illusion, and a fifty-seven-year-old boy is reflected out of a fourteen-year-old man.
Dovaleh అంతర్మధనం,
How could a whole lifetime flip over on me in one second just because of the stupid, random thoughts of a stupid kid…
 
“Such dirt on me, such pollution…God, all the way to my bones…

You Might Also Like

Leave a Reply