The Immortal Life of Henrietta Lacks – Rebecca Skloot

వ్యాసకర్త: Naagini Kandala
**************
కొన్నిసార్లు ఒక పుస్తకం చదవాలనే ఆసక్తి కలగడానికి పుస్తకం పేరే కాదు,దాని మీదున్న కవర్ కూడా చాలా కొంతవరకు కారణం. అమెరికన్ జర్నలిస్ట్/రచయిత్రి Rebecca Skloot రాసిన ఈ ‘The Immortal Life of Henrietta Lacks’ కవర్ మీద కాన్ఫిడెంట్ గా నవ్వుతూ ఉన్న అమ్మాయి మొహం, అందునా ‘immortality’ లాంటి బ్రహ్మపదార్థం కనిపించగానే వెంటనే పేజీ తిప్పాలనిపించింది. 1951 లో అమెరికా లోని బాల్టిమోర్ లో Henrietta Lacks అనే ఒక నల్ల జాతీయురాలు సర్వికల్ కాన్సర్ బారినపడి మృతి చెందుతుంది. ఐదుగురు పిల్లల తల్లి అయిన Henrietta మరణించే సమయానికి ఆమెకు కేవలం 31 ఏళ్ళు. పొగాకు తోటల్లో రోజువారీ పనిచేసే ఆమె భర్త డేవిడ్, ఐదుగురు పిల్లలు Elsie, Lawrence, Deborah, Joseph(సోనీ), Zakariyya లతో కలిసి Clover లో నివసించేది. ‘Walnut eyes’ తో ఆకర్షణీయంగా ఉండటం, అందరినీ ప్రేమాభిమానాలతో ఆదరించడం Henrietta ప్రత్యేకత.

ఇప్పుడు భూగోళం మీద Henrietta ప్రపంచానికి అస్సలు సంబంధం లేని మరోప్రపంచం విషయానికి వస్తే, శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించిన ప్రయోగాలు మరియూ పరిశోధనల విషయంలో సైంటిస్టులు దేనిమీదైతే పరిశోధన చేస్తారో దాన్ని సాధారణంగా ఒక ముడిసరుకు లేదా ఒక ఆబ్జెక్ట్ గా మాత్రమే చూడడం జరుగుతుంది. ఇలాంటి విషయాల్లో భావోద్వేగాలకు తావు లేదు. కానీ ఆ ముడిపదార్థంగా తీసుకునే ఆబ్జెక్ట్ ఒక మనిషి అయితే? సరిగ్గా ఇక్కడే Henrietta Lacks కథ మలుపు తిరుగుతుంది. 1950 ల కాలం, అంటే మోడరన్ మెడిసిన్ ఆవిర్భావానికి పునాదులు పడుతున్న సమయంలో పోలియో, కాన్సర్, హెచ్ ఐ వీ లాంటి భయంకరమైన వ్యాధులకు విరుగుడు కనిపెట్టే క్రమంలో శాస్త్రవేత్తలు జంతువులను తమ పరిశోధనలకు ఉపయోగించుకునేవారన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ పరిశోధనల్లో మరో అడుగు ముందుకేస్తూ మేరీల్యాండ్ కు చెందిన George Gey (Guy ), Margaret Gey దంపతులు శస్త్రచికిత్స జరిగే సమయంలో మనిషి శరీరం నుండి తీసిన కాన్సర్ టిష్యూల్లో నుండి వేరు చేసిన సెల్స్ ను సజీవంగా ఉంచే దిశగా ‘సెల్ కల్చర్’ కు శ్రీకారం చుట్టారు. కానీ హ్యూమన్ సెల్స్ ని సజీవంగా ఉంచడానికి అవసరమయ్యే సౌకర్యాలుగానీ, సాంకేతికతగానీ ఏమాత్రం అందుబాటులో లేని ఆ కాలంలో, తన జీవితాన్ని ప్రయోగశాలకే పరిమితం చేసి, తన సంపాదన అంతా కూడా పరిశోధనలకు వెచ్చించినప్పటికీ Gey అప్పటికే ఆ ప్రయత్నంలో చాలా సార్లు విఫలమయ్యారు. సరిగ్గా అదే సమయంలో సెర్వికల్ కాన్సర్ విషమించి Henrietta, Johns Hopkins హాస్పిటల్ కు రావడం, ఆమెకు వైద్యం చేసిన Howard Jones చాలా మంది పేషెంట్స్ లాగే ఆమె శరీరం నుంచి కూడా తీసిన టిష్యూ సాంపిల్స్ ను Gey కు అందజెయ్యడం జరుగుతుంది. కానీ మోడరన్ వైద్య శాస్త్రాన్ని సమూలంగా మార్చేసే ఒక గొప్ప పరిణామానికి అంకురార్పణ జరగబోతోందని ఆ సమయంలో ఎవరూ ఊహించి ఉండరు. Gey,తన అసిస్టెంట్ మేరీ సహాయంతో తన లాబొరేటరీ లో Roller tube culturing technique ద్వారా He-La సెల్స్ ను సృష్టించడంలో ఎట్టకేలకు సఫలీకృతులవుతారు. అప్పటినుండీ Henrietta Lacks మరణించినా కూడా ఆమె లోని కణాలు He Le సెల్స్ గా అమరత్వాన్ని పొందాయి. తొలుత Gey చిన్న ల్యాబ్ లో మొదలైన He La ప్రొడక్షన్ త్వరలోనే Tuskegee, NIH లాంటి పెద్ద పెద్ద సంస్థలనుండి మాస్ ప్రొడక్షన్ చెయ్యడంతో ప్రపంచం నలుమూలల్నుంచీ పరిశోధనలకు మిలియన్ల ఆర్డర్లు,వాటితో పాటుగా లాభాలు కూడా తీసుకొచ్చింది. ముందు పోలియో వాక్సిన్ తయారీకి ఉపయోగించిన ఈ సెల్స్ ను క్రమేణా కాన్సర్, జెనెటిక్స్, క్లోనింగ్, కాస్మెటిక్, ఫార్మసిటికల్ లాంటి చాలా రంగాల్లో విరివిగా ఉపయోగించారు. చివరకు 1960లో రష్యన్లు ప్రయోగించిన రెండవ శాటిలైట్ లోను, అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములతో కూడా He La ప్రయాణించింది.

They kept growing like nothing anyone had seen, doubling their numbers every twenty-four hours, stacking hundreds on top of hundreds, accumulating by the millions. “Spreading like crabgrass!” Margaret said. They grew twenty times faster than Henrietta’s normal cells, which died only a few days after Mary put them in culture. As long as they had food and warmth, Henrietta’s cancer cells seemed unstoppable.

మరణాన్ని కూడా శాసించగల శక్తిని తమలో దాచుకున్న He La సెల్స్ ఒక వైపు ప్రపంచం నలుదిశలా వ్యాపిస్తూ, వివిధ దేశాల పాలసీలను రూపకల్పన చేసే దిశగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక పరిశోధనల్లో భాగం పంచుకుని వైద్య రంగాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తుంటే మరో వైపు ఈ సెల్స్ గురించి ఏమీ తెలియని ఆమె కుటుంబం మాత్రం దుర్భరమైన జీవితం గడుపుతుంటుంది. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న Henrietta కుమార్తె Deborah తన తల్లి గురించి తెలుసుకునే క్రమంలో He La సెల్స్ గురించిన విభ్రాంతికరమైన నిజాలు తెలియడంతో తీవ్ర వేదనకు గురవుతుంది. రిటైల్ రంగం ,హాస్పటళ్లు, పలు కంపెనీలు He La కారణంగా సొమ్ము చేసుకుంటుంటే తాము మాత్రం కటిక దారిద్య్రం అనుభవిస్తున్నామనీ, తమ కుటుంబాన్ని అన్ని సంవత్సరాలు చీకట్లో ఉంచి మోసం చేశారని ఆమె బాధపడుతుంది. ఒక సందర్భంలో ఈ విషయం తెలిశాక Henrietta కొడుకు Lawrence, “మా అమ్మ వైద్య రంగానికి అంత ముఖ్యం అయినప్పుడు మాకు కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదేందుకు?” అని రచయిత్రి Rebecca ను అడుగుతాడు.

Henrietta కథలో ముఖ్యమైన పాత్ర Gey ది. ఇందులో నాయకుడూ,ప్రతినాయకుడూ రెండూ ఆయనే. ఆయనకు He La ఐడెంటిటీని బహిర్గతం చేసే ఉద్దేశ్యం లేక 1970 ల్లో Collier’s article ప్రచురించే వరకూ ఆమెను Helen Lane అనీ, Helen Larsen అనీ pseudonyms తో ప్రచారంలో ఉంచారంటారు. అందువల్లే ఆమె కుంటుంబానికి He La గురించి అప్పటివరకూ తెలియదు. ఒక దశలో He La సెల్స్ Henrietta Lacks అనే మహిళవి అని ప్రపంచానికి చెప్పకపోవడం Gey చేసిన పొరపాటు అనిపించినా ఆమె సెల్ లైన్ తయారీ లో Gey స్వలాభాపేక్ష లేకుండా తన స్వంత ఖర్చుతో చేసిన పరిశోధన వెనుక కేవలం సమాజ శ్రేయస్సు మాత్రమే కనిపిస్తుంది. చివరకి He La ను పేటెంట్ చెయ్యమని ఎందరు చెప్పినా కూడా, తన వద్ద అందుకు కూడా సమయం లేదని Gey తిరస్కరించడం, ఆ సెల్స్ ను పరిశోధనల నిమిత్తం ఉచితంగా వైద్యులకు, కంపెనీలకు,ఇతర దేశాలకు కూడా ఇవ్వడంలో Gey లో ఒక ఉన్నతాశయం కోసం తపించే సైంటిస్ట్ మాత్రమే కనపడతారు. కానీ 70 లు వచ్చేసరికి ఆయన He La ను పేటెంట్ చేద్దామనుకున్నా అప్పటికే అది ఆయన చెయ్యి దాటిపోతుంది.

He La వెనుక ఉన్న వ్యక్తి Henrietta Lacks అని ప్రపంచానికి చాటిచెప్పాలని చాలా వ్యయ ప్రయాసలకోర్చి ఈ పుస్తకాన్ని రాసిన Rebecca ఇందులో డాక్టర్స్ కు పేషెంట్స్ కు మధ్య ఉండాల్సిన కమ్యూనికేషన్ అవసరం గురించి చెప్తారు. విచిత్రంగా ఇటీవలే చదివిన అతుల్ గవన్డే ‘Being Mortal’ అనే పుస్తకంలో కూడా Dr.గవన్డే ఇదే విషయం గురించి పలుమార్లు ప్రస్తావించారు. ఒక మనిషికి తమ శరీరంపై ఉండే హక్కును గుర్తించాలనీ, వారి భయాలనూ, అనుమానాలనూ ఓపిగ్గా విని, నివృత్తి చెయ్యాలనీ, అన్నిటినీ మించి పేషెంట్స్ తో నిజాయితీగా వ్యవహరించడం వైద్యుల కనీస ధర్మం అనీ అంటారు. కానీ Henrietta కేసులో ఆమె అంగీకారం లేకుండా, కనీసం ఆమె కుటుంబానికి కూడా తెలుపకుండా ఆమె సెల్ లైన్ ను తయారు చెయ్యడం, వాటిపై పరిశోధనలు జరపడం ఈ కాలంలో అభ్యంతరకరం, వ్యక్తిగత స్వేఛ్చకి భంగం అని కొందరు భావించినా, అప్పటి పరిస్థితుల దృష్ట్యా మనిషి శరీరం నుండి (పాడైపోయి) వేరు చెయ్యబడినదేదైనా అంటే సెల్స్, టిష్యూ, క్యాన్సర్స్ ఇలాంటివి వ్యర్థం క్రిందకే వస్తాయనీ, వాటిని వైద్య పరిశోధనల నిమిత్తం ఉపయోగించడం నేరం కాదనీ మరికొందరి వాదన. ఈ వాద ప్రతివాదాల సంగతెలా ఉన్నా వైద్యానికి సంబంధించి కీలక రంగాల్లో He La ఇప్పటికీ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. ఇలాంటి సందర్భాల్లో పేషెంట్ల ప్రైవసీ ని కాపాడే దిశగా తయారైన Nuremberg Code, American Medical Association Code of Ethics లాంటివి చట్టబద్ధమైనవి కాదనీ అవి కేవలం వైద్యులు చేసే ఒక నామమాత్రపు Hippocratic Oath గా పేర్కొంటారు.

ఇక్కడ Henrietta ఒక నల్లజాతీయురాలు కావడం కూడా అప్పటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా విస్మరించలేని అంశం. ఆ రోజుల్లో ముఖ్యంగా నల్లజాతీయల మీద జరిగే ఆగడాల్లో ఈ వైద్యపరమైన పరిశోధనలు కూడా ఒకటి. వారికి తెలీకుండా వారిని అనేక ప్రయోగాల్లో భాగస్వాముల్ని చెయ్యడం అప్పట్లో పరిపాటి. Henrietta మొదటి కూతురు, మతిస్థిమితం లేని Elsie ఒక ఆస్పత్రి లో దారుణమైన ప్రయోగాల బారినపడి మృతి చెందడాన్ని కూడా ఈ సందర్భంగా ఇందులో పేర్కొంటారు. Johns Hopkins హాస్పిటల్ కూడా అదే చేసిందనీ, తమ తల్లి సెల్స్ తో అందరూ సొమ్ము చేసుకుంటున్నారని Henrietta కుమారులు Lawrence, Zakariyya పలు సందర్భాల్లో ఆరోపించినా, ఆమె కుమార్తె Deborah మాత్రం తన తల్లి ఎవరో ప్రపంచానికి తెలియాలని తప్ప ఇంకేమీ ఆశించట్లేదని అంటూ Rebecca తో ఆమె పుస్తకం రాయడంలో చివరివరకూ సహాయపడుతుంది కానీ పుస్తకం ప్రచురణకు ముందే Deborah గుండెపోటు తో మరణిస్తుంది.

ఈ పుస్తకంలో శాస్త్రీయత ఒక పార్శ్వమైతే, మానవీయత మరో పార్స్వ్యం. Henrietta కు దక్కవలసిన గౌరవాన్ని ఇవ్వాలంటూ ఈ రెండింటికీ మధ్యనున్న అంతరాల్ని చెరిపెయ్యడమే రచయిత్రి Rebecca ప్రధానోద్దేశ్యంగా అనిపిస్తుంది. ఒక ప్రక్క He La సెల్స్ ను శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత విశేషంగా వాడుతున్నారో, దానికి సంబంధించిన అనేక పరిశోధనలనుటంకిస్తూ చెప్తూనే, మరో వైపు Henrietta కుటుంబం, పుట్టుపూర్వోత్తరాలు,వారి జీవన శైలి, నల్ల జాతీయులుగా వారు అనుభవించిన దుర్భర పరిస్థితులను బ్యాక్ టు బ్యాక్ మనకు కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు. He La వెనుక ఉన్నది Henrietta Lacks అనీ, ఆమె ఒక సెల్ లైన్ మాత్రమే కాదనీ, ఒక ముడిపదార్థంగా కాకుండా Henrietta Lacks ను ముందు ఒక మనిషిగా గుర్తించాలనీ, ఆమె కథను ప్రపంచం తెలుసుకోవలసిన అవసరం ఉందనీ Rebecca వాదన. మెదడుతో ఆలోచించే సైంటిఫిక్ రీసెర్చ్ ని, మనసుతో ఆలోచించే మామూలు మనిషితో ముడిపెట్టే యత్నంలో అడుగడుగునా అడ్డుపడే హ్యూమన్ ఎథిక్స్ పాత్రను తెలుసుకోవాలంటే ఇలాంటి ఒక పుస్తకం చదవాల్సిందే. ఈ రచన Oprah Winfrey Deborah పాత్రలో నటించగా త్వరలో సినిమాగా రానుంది.

Henrietta Lacks మరియు He La సెల్స్ గురించిన BBC documentary ‘The Way of All Flesh’ యూట్యూబ్ లింక్

పుస్తకం నుండి కొన్ని లైన్స్,
నల్లజాతీయుల వెళ్ళే Johns Hopkins హాస్పిటల్ గురించి రాస్తూ…

For Henrietta, walking into Hopkins was like entering a foreign country where she didn’t speak the language.

“Hopkins, with its large indigent black population, had no dearth of clinical material.

“Hennie,” she whispered, “they burnt you black as tar.”
Henrietta just nodded and said, “Lord, it just feels like that blackness be spreadin all inside me.

Henrietta గురించి Gey అసిస్టెంట్ మేరీ అనుభవాలు:

Mary stood beside Wilbur, waiting as he sewed Henrietta’s abdomen closed. She wanted to run out of the morgue and back to the lab, but instead, she stared at Henrietta’s arms and legs—anything to avoid looking into her lifeless eyes. Then Mary’s gaze fell on Henrietta’s feet, and she gasped: Henrietta’s toenails were covered in chipped bright red polish.

“When I saw those toenails,” Mary told me years later, “I nearly fainted. I thought, Oh jeez, she’s a real person. I started imagining her sitting in her bathroom painting those toenails, and it hit me for the first time that those cells we’d been working with all this time and sending all over the world, they came from a live woman. I’d never thought of it that way.”

When it came to growing viruses—as with many other things—the fact that HeLa was malignant just made it more useful. HeLa cells grew much faster than normal cells, and therefore produced results faster. HeLa was a workhorse: it was hardy, it was inexpensive, and it was everywhere.

You do not engage the attention of the reader unless your story has basic human interest elements.

Several patients had successfully sued their doctors for privacy violations, including one whose medical records were released without her consent, and others whose doctors either published photographs or showed videos of them publicly, all without consent. But those patients had one thing going for them that Henrietta didn’t: They were alive. And the dead have no right to privacy—even if part of them is still alive.

Jones wrote: From a clinical point of view, Mrs. Lacks never did well. …As Charles Dickens said at the beginning of [A] Tale of Two Cities, ‘It was the best of times, it was the worst of times.But it was the best of times for science in that this very peculiar tumor gave rise to the HeLa cell line. … For Mrs. Lacks and the family she left behind, it was the worst of times. Scientific progress and indeed progress of all kinds is often made at great cost, such as the sacrifice made by Henrietta Lacks.

“You know what’s weird? The world got more pictures of my mother cells than it do of her. I guess that’s why nobody knows who she is. Only thing left of her is them cells.

You Might Also Like

One Comment

  1. పవన్ కుమార్

    ఇటువంటి గొప్ప పుస్తకాన్ని తెలుగులోకి అనువదిస్తే బావుంటుంది.

Leave a Reply to పవన్ కుమార్ Cancel