2016 లో చదివిన పుస్తకాలు

వ్యాసకర్త: Naagini Kandala
*********************
ప్రతి సంవత్సరం మొదట్లో క్రమం తప్పకుండా Good reads లో రీడింగ్ ఛాలెంజ్ పెట్టుకోవడం,చెంచాడు భవసాగరాలు ఈదడంతో పాటుగా చివరకి ఏం చదివాను అని చూసుకునే సరికి 50% మాత్రమే పూర్తవ్వడం నాకు ఆనవాయితీగా వస్తున్న విషయం. ఈ ఇయర్ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అనుకున్న వాటిల్లో సగం పుస్తకాలు మాత్రమే చదవడం జరిగింది. ఎప్పట్లా కాకుండా ఈసారి క్లాసిక్స్ తగ్గించి కాంటెంపరరీ లిటరేచర్ కి సంబంధించిన పుస్తకాలు కొన్ని చదివాను. దానికి తోడు పోయినేడాది కంటే ఈ సారి మా అబ్బాయికి పుస్తక పఠనంపై ఆసక్తి పెరగడంతో వాడితో పాటుగా చిల్డ్రన్ బుక్స్ చదవడానికి ప్రాధాన్యతనివ్వవలసి వచ్చింది. అసలు ఈ సారి ఏం చదివారు అంటే చందమామలు, బాల రామాయణం, తెనాలి రామకృష్ణ, ఏసోప్ ఫేబుల్స్, సుపాండి, జాతక టేల్స్, అరేబియన్ నైట్స్ లాంటి పుస్తకాల జాబితా గురించి చెప్పెయ్యాలన్న కుతూహలం కాస్త కంట్రోల్ చేసుకుని ఈ ఇయర్ చదివిన వేరే పుస్తకాల గురించి చెప్తాను.. 🙂

Poetry:

టాగోర్,గుల్జార్ లాంటి బహు కొద్దిమంది శైలి తప్ప నాకు కవిత్వం అంత సులువుగా అర్ధం కాదు..ఇప్పటివరకు పెద్దగా కవిత్వం జోలికి పోయిందీ లేదు. కానీ ఈ సంవత్సరం పెద్ద బాలశిక్షలో వత్తులు హల్లులు నేర్చుకున్నట్లు Rumi,Kahlil Gibran,Maya Angelou లాంటి వారిని కొందర్ని చదివాను.

Stray birds – Rabindranath Tagore
Mother:A Cradle to hold me – Maya Angelou
Phenomenal Woman: Four Poems Celebrating Women – Maya Angelou
Rumi: The Book of Love: Poems of Ecstasy and Longing – Jalaluddin Rumi రుమి గురించి,ఆయన కవిత్వం గురించి అంతకుమునుపు Elif Shafak – The Forty Rules of Love లో చదవడం,Imtiaz సినిమాలపై రుమి పోయెట్రీ ప్రభావం ఈ పుస్తకం పై ఆసక్తి కలగడానికి ప్రధాన కారణాలు..
The Prophet – Kahlil Gibran

Philosophy / Comics:

It’s a Magical World: A Calvin and Hobbes Collection – Bill Watterson
There’s Treasure Everywhere: A Calvin and Hobbes Collection – Bill Watterson
Something Under the Bed is Drooling: A Calvin and Hobbes Collection – Bill Watterson
The Days Are Just Packed: A Calvin and Hobbes Collection – Bill Watterson
Calvin and Hobbes – Bill Watterson
Homicidal Psycho Jungle Cat: A Calvin and Hobbes Collection – Bill Watterson
The Revenge of the Baby-Sat – Bill Watterson

మీకే కాదు ‘ఫిలాసఫీ’ కేటగిరీ లో కాల్విన్ హాబ్స్ కామిక్ బుక్స్ గురించి చెప్పడం నాక్కూడా విచిత్రంగానే ఉంది. కానీ నిజం చెప్పాలంటే these are the best philosophy books I’ve read so far. రెండు మూడేళ్ళ క్రిందట ఫిలాసఫీ మీద ఆసక్తితో జిడ్డు కృష్ణ మూర్తి, Andre Gide, Herman Hesse, Albert Camus, టాల్స్టాయ్ లాంటి వారి పుస్తకాలు కొన్నిచదివి హెవీగా అనిపించిగా ఆ ఆలోచనలతో నాకు నిద్రపట్టని రాత్రులు ఎన్నో! కానీ తన కామిక్స్ లో బిల్ వాటర్సన్ ఫిలాసఫీని కూడా కడుపుబ్బ నవ్వించి మరీ చెప్పారు. మా అబ్బాయితో పాటు సరదాగా చదవడం స్టార్ట్ చేసిన నేను అదో అబ్సెషన్ గా మారడంతో, ప్రతిరోజూ వాడు స్కూల్ నుంచి రాగానే ఇద్దరం రెలీజియస్ గా కాల్విన్ హాబ్స్ చదవడం మా దినచర్య లో భాగం అయిపోయింది.

Memoirs / Biography:

Night – Elie Wiesel: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో Auschwitz, Buchenwald జర్మనీ కాన్సంట్రేషన్ కాంప్స్ లో, 15 ఏళ్ళ Elie Wiesel తన భయానకమైన అనుభవాలను గురించి చెప్తూ రాసిన ఈ పుస్తకం హోలోకాస్ట్ సమయంలో జరిగిన మారణహోమాన్ని మనకు గుర్తుచేస్తుంది. 2016 జులైలో చనిపోయిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత Elie Wiesel అంటూ ఆ మధ్య గార్డియన్ లో ప్రచురించిన కథనం వల్ల ఈ పుస్తకం గురించి తెలిసింది.

The Glass Castle – Jeannette Walls: చాలా కఠినతరమైన బాల్యం గడిపిన Jeanette తన బాల్యానుభవాలకు ఈ మెమోయిర్లో అక్షర రూపం ఇచ్చింది. Jeanette శైలి పుస్తకం ఎక్కడా ఆపకుండా చదివించింది.

My Name Is Lucy Barton – Elizabeth Strout : ఇందులో ఎలిజబెత్ ది కూడా కఠినమైన బాల్యమే అయినప్పటికీ Jeanette, ఎలిజబెత్ ల వ్యక్తిత్వాల మధ్య చాలా అంతరం ఉంటుంది. చాలా చోట్ల బోర్ కొట్టిన పుస్తకం ఇది.

Dark Star:The Lonliness of Being Rajesh Khanna – Gautam Chintamani : పూర్ణిమ తమ్మిరెడ్డి పుస్తకం.నెట్ లో రాసిన రివ్యూ చూసి చాలా కాలంగా చదవాలనుకుని మొత్తానికి ఈ ఇయర్ చదివిన పుస్తకం ఇది. అప్పటికి నా వరకు రాజేష్ ఖన్నా అంటే ‘ఆనంద్’ అంతే. కానీ ఆ ఆనంద్ ముద్రని మన మనసుల్లోంచి పూర్తిగా చెరిపేసి అసలు సిసలు ఖన్నాను ఒక సాధారణ వ్యక్తిగా ఆయన పూర్తి డార్క్ నేచర్ తో మన ముందు నిలబెడుతుంది ఈ ‘డార్క్ స్టార్’.. ఆయన సినిమాలు ఇష్టపడేవారు తప్పకుండా చదవవలసిన బుక్ ఇది.

When Breath Becomes Air – Paul Kalanithi: ఈ ఇయర్ లో బెస్ట్ రీడ్స్ అంటే, కాల్విన్ అండ్ హాబ్స్ తరువాత ఖచ్చితంగా పాల్ కళానిధి అద్భుతమైన మెమోయిర్ గురించి చెప్పుకోవాలి. చాలా పుస్తకాల్లాగా చదివేశాక వెంటనే మర్చిపోయే పుస్తకం అస్సలు కాదు. ప్రతి పదం ఎంతో విలువైనదిగా,ప్రతి సంఘటనా చదివేవాళ్ళ మనసుని కుదిపేసి, చాలారోజుల వరకూ వెంటాడే పుస్తకం ఇది. A must read memoir for everyone. మరణాన్ని కూడా హుందాగా ఆహ్వానించాలానే ఒక న్యూరో సర్జన్ అంతర్మథనానికి అక్షర రూపం ఈ పుస్తకం.

Plays:
Alice in Bed – Susan Sontag: Susan Sontag గురించి బ్రెయిన్ పికింగ్స్ లో చదివి ఆసక్తి కలిగింది. మొదట చిన్న పుస్తకంతో మొదలు పెడదామని అనుకుని Alice in Bed ను చదివాను. ఇది Henry James చెల్లెలు అయిన Alice James కథను Lewis Carroll ప్రసిద్ధ రచన Alice in Wonderland లోని Alice తో ముడిపెడుతూ రాసిన నాటకం. 19 వ శతాబ్దపు పురుషాధిక్య సమాజంలో స్త్రీల పై ఉండే వత్తిడి, లిమిటేషన్స్ మరియు మానసిక పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. చివర్లో conclusion ఇదన్నమాట అని అనుకోవడం మినహా ఇందులో చర్చించే పాత్రలు గానీ,ఆ సన్నివేశాలకు కారణభూతమైన సంఘటనల పట్ల గానీ, నాకు అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్లే లో చాలా సన్నివేశాలు ఆకళింపు కాలేదు.

Waiting for Godot – Samuel Beckett: ఇద్దరు వ్యక్తులు Godot గురించి ఒక చెట్టు కింద వేచి ఉండటాన్ని మానవ జీవితానికి అర్థాన్ని వెతకడంతో పోలుస్తూ రాసిన ఒక ప్లే ఇది. అసలు చాలాసేపటి వరకు రచయిత ఏమి చెప్పాలనుకున్నారో అర్థం కాలేదు. చెప్పిందే చెప్తున్నారు ఏంటి అని అనుకుని, మళ్ళీ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో అని ఆసక్తి కొద్దీ చదివిన ఈ పుస్తకం. ఇప్పటికీ నాకొక అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ లా అనిపిస్తుంది. నా వరకు అర్థం అయ్యింది ఏంటంటే మనిషి చివరి వరకూ కనిపించనిదాన్నేదో (Godot అనే metaphor) వెతుకుతూ వర్తమానాన్నిగమనించడు అని. కానీ ఇంతకంటే ఇంకేదైనా అర్థం ఉందేమో మరోసారి చదివితే గానీ ఆ సారాన్ని పూర్తిగా గ్రహించలేనేమో అనిపించింది.

Religion:
A Confession – Leo Tolstoy : టాల్స్టాయ్ రాసిన పుస్తకాల్లో అన్న కరెనినా, వార్ అండ్ పీస్ లాంటి క్లాసిక్స్ ఒక వైపైతే The Death of Ivan Ilych, A Confession, A Calendar of wisdom లాంటివి పూర్తిగా మరో వైపుంటాయి. తరువాత చెప్పిన వాటిల్లో టాల్స్టాయ్ ఒక novelist గా కాకుండా ఒక కంప్లీట్ ఫిలాసఫర్ గా కనిపిస్తారు. Scandals గురించి రాసి ప్రపంచం చేత చప్పట్లు కొట్టించుకున్న ఆయనలో అంతర్లీనంగా దాగున్న ఆధ్యాత్మికత, తాత్వికత వీటిల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. Confession అంతా టాల్స్టాయ్ జీవితం యొక్క అర్థం,పరమార్థం తెలుసుకునే దిశగా సాగుతుంది. మతాన్ని నమ్మని ఆయన చివరకి మతం,ధర్మం అనేవి మనుషుల్ని నడిపించే శక్తిమంతమైన అంశాలుగా పేర్కొంటారు. తన వాదనల్ని అనేక తర్కవితర్కాలతో తరువాత సవివరంగా నిరూపిస్తారు.

Novels:
Man Tiger – Eka Kurniawan: సోషల్ రియలిజం శైలిలో ఇండోనేషియా యువ రచయిత Eka Kurniawan ఇండోనేషియా సాహిత్యం పై సుహార్తో ముఫైయ్యేళ్ళ సుదీర్ఘ నియంతృత్వం ప్రభావం తాలూకు చీకటి కోణాల్ని మూల వస్తువుగా చేసుకుని Margio కథను చెప్తారు. ఇందులో మనిషి పులి గా మారిపోవడం లాంటి supernatural ఎలిమెంట్స్ తో పాటు ఇండోనేషియా సంస్కృతి,సంప్రదాయాలు లాంటివి ఆసక్తికరంగా వర్ణిస్తారు.

Norwegian Wood – Haruki Murakami: Murakami ని చదవడం ఇదే తొలిసారి. జపాన్ సాహిత్యంలో Yasunari Kawabata, Kazuo Ishiguro లాంటి వాళ్ళని చదివాకా అనుకున్నాను. ఈ పుస్తకాల్లో ఏదో కామన్ గా అనిపిస్తోంది ఏంటా అని. ‘Sadness’. Sadness లాంటి ఒక ఎమోషన్ ని melancholic ఫ్రేమ్స్ లో పెట్టి కళ్ళకు కట్టినట్లు చూపించడంలో ఈ జపాన్ రచయితలు నిజంగా నిష్ణాతులు. Norwegian wood కూడా అదే కోవలోకి వస్తుంది.

The Book of Laughter and Forgetting – Milan Kundera: 1948 కాలం నాటి Czech రాజకీయ, సామాజిక పరిస్థితులను కథా వస్తువుగా మాజికల్ రియలిజం శైలిలో ఈ కథల సంకలనాన్ని రాశారు కుందేరా. రాజకీయపరమైన వివరణల మొదలు ఫిలాసఫీ, అస్థిత్వ వాదం, ప్రేమ, ఐడెంటిటీ, తాత్విక వాదం, శృంగారం ఇలా పలు అంశాలను స్పృశిస్తూ ఇందులో ఏడు కథలు ఉంటాయి. ఈయన పుస్తకాలు మరికొన్ని చదవాలపించేలా ఈయన రచనా శైలి చాలా బావుంది.

The Vegetarian – Han Kang: సౌత్ కొరియన్ సంస్కృతి లో ఆమోదయోగ్యం కాని ‘వెజిటేరియనిజం’ను బేస్ చేసుకుని,మొత్తం మూడు భాగాల్లో, ముగ్గురు వ్యక్తుల దృష్టికోణం నుంచి Yeong-hye అనే ఒక సాధారణ గృహిణి కథని మనకి చెప్తారు రచయిత్రి Han Kang…Deborah Smith చేసిన అనువాదం చాలా చక్కగా సరిపోయింది..2016 Man Booker International Prize గెలుచుకున్న ఈ పుస్తకం మాంసాహారి అయిన మనిషిలోని మరో అనాగరికమైన క్రూరత్వపు కోణాన్ని చూపిస్తుంది..

The Girl on the Train – Paula Hawkins : ‘Gone girl’ లాంటి మరో సస్పెన్స్ థ్రిల్లర్. కట్టి పడేసే narration తో ఆపకుండా చదివిస్తుంది. కానీ చదివాకా పెద్దగా గుర్తు పెట్టుకోడానికేమీ ఉండదు ఇందులో.

Non-Fiction:
Quiet: The Power of Introverts in a World That Can’t Stop Talking – Susan Cain: ఈ సంవత్సరం చదివిన మరో మంచి పుస్తకం. Introversion/extroversion ల గురించి ఏక కాలంలో చర్చించి introversion ని ఒక లోపంగా చూసే సమాజాన్ని ఎత్తి పొడుస్తుంది. కమ్యూనికేషన్స్ ఆవశ్యకతను చెప్తూనే, quietness కూడా సమాజానికి అంతే అవసరం అంటుంది ఈ రచన.

Ongoingness: The End of a Diary – Sarah Manguso: డాక్యుమెంటేషన్,జర్నల్స్, డైరీస్ ను గురించిన పుస్తకం ఇది. “I knew I couldn’t replicate my whole life in language.” అంటూనే మళ్ళీ అసంభవాన్ని సంభవం చెయ్యాలనే ప్రయత్నంలో ఈ Ongoingness ను రాశానంటారు Sarah. బ్రెయిన్ పికింగ్స్ లో ఈ పుస్తకం గురించి చదివి ఒక మెమోయిర్ ఏమో అనుకున్న నన్ను ఈ పుస్తకం నిరాశపరిచిందనే చెప్పాలి. ఇది ఒక డైరీ అనే కంటే, డైరీ లు రాయడం ఎలా అనే దాని గురించి అంటే బావుంటుంది. ముఖ్యంగా Consciousness ని డైరీలో ఖైదు చెయ్యాలనుకోవడం కొంచెం విచిత్రంగా అనిపించినా ఈ పుస్తకం ద్వారా అమెరికన్ రచయిత్రి Sarah Manguso చేసిన ప్రయత్నం అదే. తన అనుభవాల్నీ, జ్ఞాపకాల్నీ జాగ్రత్తగా పాతిక సంవత్సారాల పాటు సుమారు ఎనిమిది లక్షల పదాల్లో డైరీల్లో పదిల పరిచిన Sarah వాటిని సంక్షిప్తరూపంలో ఒక మెమోయిర్ ని రాద్దామనుకుని అనుకున్నప్పటికీ, చాలా వడపోత తరువాత కేవలం ఒక వంద పేజీల పుస్తకంగా ‘Ongoingness’ ను మన ముందుంచారు.

Telugu:

తెలుగులో నేను చదివిన పుస్తకాలు బహు కొద్ది. 2017 లో అయినా కొన్ని తెలుగు పుస్తకాలు చదవాలి.
Maha Prasthanam – Sri Sri : చాలా కాలంగా చదువుదామని మొత్తానికి ఈ సంవత్సరం చదివిన ఆణిముత్యం.
అరుణ [Aruna] – Chalam : నోబెల్ రచనల స్థాయికి ఏ మాత్రం తగ్గని చలం మరో రచన.

అస్సలు నచ్చక సగంలో వదిలేసిన పుస్తకాలు :

ఒకప్పుడు ఏ పుస్తకం మొదలు పెట్టినా అది ఒక్కోసారి ఎంత నచ్చకపోయినా ఓపిగ్గా పూర్తి చేసేదాన్ని. కానీ James Joyce అన్నట్లు ‘Life is too short to read a bad book’ అనేది ఇప్పటికి అర్థం అయ్యింది. ఇక్కడ గుడ్ బుక్స్, బాడ్ బుక్స్ అంటూ ప్రత్యేకం ఉండవని నా నమ్మకం. అయినప్పటికీ ఆ quote లో బాడ్ బుక్ స్థానంలో ‘నచ్చని పుస్తకం’ అని పెట్టేసుకుని ఈ సారి ఈ పుస్తకాలు సగానికి పైగా చదివి వదిలేశాను.

Brain Droppings – George Carlin : కోట్స్,ఇంట్రడక్షన్ లాంటివి చదివి పుస్తకం చదవకూడదు అని మరోసారి లెంపలు వాయించుకున్న పుస్తకం ఇది .ముఖ్యంగా కార్లిన్ rebellious భావాలు బావున్నప్పటికీ ఆయన ఉపయోగించిన భాష చాలా repulsive గా అనిపించింది.

The Buried Giant – Kazuo Ishiguro : ఈయన పుస్తకం An Artist of the Floating World చదివాక చాలా expectations తో మొదలు పెట్టిన Buried Giant చాలా నిరాశపరిచింది.

You Might Also Like

Leave a Reply