కాపీలెఫ్ట్‌లో నేరుగా విడుదల అవుతున్న తొలి తెలుగు ప్రింట్ పుస్తకం

కోడిహళ్ళి మురళీమోహన్ (స్వరలాసిక) రాసిన ఆంధ్రసాహిత్యములో బిరుదనామములు అన్న ప్రింట్ పుస్తకం ప్రచురణ జరుగుతూనే అన్ని హక్కులూ రచయితవే అన్న లైసెన్సుతో కాక ఎవరైనా తిరిగి ఉపయోగించుకోగల స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేస్తున్నారు.

వివరాలు:
ఆవిష్కరణ తేదీ: ఫిబ్రవరి 5న (ఆదివారం) ఉదయం 10.30కి
వేదిక: గుంటూరు అన్నమయ్య గ్రంథాలయం

కార్యక్రమంలో భాగంగా తమ రచనలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఆశిస్తూండి, అందుకు వ్యయప్రయాసలతో ప్రయత్నించి మరోమారు ముద్రించుకునే వీలు లేక సాహిత్యపరులు, చదవదలచిన పుస్తకం పై కారణంగా ప్రింట్‌లో అందుబాటులో లేక పాఠకులు ఇబ్బందులు పడడం అన్న సమస్యకు ఒక ప్రత్యామ్నాయాన్ని కాపీహక్కులు, డిజిటైజేషన్ వంటి అంశాల్లో నైపుణ్యం కలిగిన వక్తలు తెలియజేనున్నారు. స్వేచ్ఛా నకలు హక్కుల గురించి ప్రచారం చేయడానికి ఉద్దేశించిన జాతీయ స్థాయి ఫ్రీడం ఇన్ ఫెబ్ అన్న కాంపైన్‌లో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. కార్యక్రమంలో భాగంగా గతంలో ప్రచురణ అయిన తమ పుస్తకాలను తిరిగి స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేసిన కవి, సంగీత వేత్త భూసురపల్లి వెంకటేశ్వర్లు, ఎవరైనా తిరిగి వాడుకోగల విధంగా తాము టైప్‌ చేసిన అన్నమయ్య సంకీర్తనలు మొత్తాన్ని విడుదల చేసిన అన్నమయ్య గ్రంథాలయం ప్రతినిధి పెద్ది సాంబశివరావు వంటి సాహిత్యవేత్తలకు సత్కారం జరుగుతుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సాహిత్యకారులు సోమేపల్లి వెంకట సుబ్బారావు, రావి రంగారావు హాజరుకానున్నారు. ఆసక్తి కలిగిన కవి, రచయితలు, సాహిత్యవేత్తలు, పాఠకులు కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా మనవి.

(వార్త సౌజన్యం: సూరంపూడి పవన్ సంతోష్)

You Might Also Like

Leave a Reply