పుస్తకం
All about booksపుస్తకభాష

January 24, 2017

H is for Hawk – Helen Macdonald

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: Nagini Kandala
**********************
మనిషికి నవ్వు ఎంత సహజమో ఏడుపూ అంతే సహజం,కానీ ఈ బాధ,కన్నీరు లాంటి ఎమోషన్స్ ని నెగటివ్ ఎమోషన్స్ అనీ, వాటిని వ్యక్త పరచడం ఒక మానసిక దౌర్బల్యం లేదా లోపమనీ భావించే ఆధునిక సమాజంలో రక్తమోడుతున్న గుండె లోపలి గాయాల్ని సంస్కారం, నాగరికత ముసుగుల్లో అందమైన చిరునవ్వుతో కప్పేయ్యాలని విఫలయత్నం చేస్తూ, ఆ గాయాలు ప్రపంచం చూస్తే ఎక్కడ లోకువైపోతామో అనే భయంతో ఆ అహంకారపు పరదా తొలగిపోకుండా గట్టిగా అదిమి పట్టుకుని, ఒక చిరునవ్వుతో ప్రపంచాన్ని పలుకరించడం చేతకాని అసమర్థులు(?) ఆ బాధ నుండి ఉపశమనం పొందడానికి సహజంగానే ఒంటరితనం కోరుకుంటారు. మనిషి సహనపు హద్దుల్ని చేరిపేస్తూ ఎదురయ్యే పెనువిషాదాలను తట్టుకోలేక తీవ్రమైన వేదన కలిగిన ఏదో ఒక సందర్భంలో మనిషై పుట్టాక దుక్ఖం అనివార్యమని అర్ధమైన ఆ తరుణంలో అసలు మనిషిగా పుట్టకపోయి ఉంటే బావుండునని అనుకోవడం పరిపాటి. అ లాంటి ఒక ఒంటరితనం బారినపడి తాను ఈ మానసిక దౌర్బల్యాలు, బాధలు ఏవీ దరిచేరని ఒక Goshawk లా మారిపోతే ఎంత బావుంటుంది అనుకుంటుంది ఈ H is for Hawk అనే మెమోయిర్ ను రాసిన బ్రిటిష్ రచయిత్రి Helen MacDonald.

తను ఎంతగానో ప్రేమించే తండ్రి ఆకస్మిక మరణంతో తీవ్రమైన డిప్రెషన్ కు లోనైన హెలెన్ Mabel అనే ఒక Goshawk కు శిక్షణనివ్వడం ద్వారా తన దుక్ఖం నుండి విముక్తి పొందాలని ప్రయత్నిస్తుంది. ఇంగ్లాండులో, ఒక గ్రామీణ నేపథ్యంలో గడిచిన హెలెన్ బాల్యం ఆమెను ప్రకృతికి దగ్గర చేసేందుకు దోహదపడుతుంది. దానికి తోడు తండ్రి అభిరుచుల ప్రభావం కూడా ఆమె మీద ఉండటంతో ఆమెకు Falconry పట్ల అబ్సెషన్ ఏర్పడుతుంది. ఆ క్రమంలో హెలెన్ తన బాల్యం గురించీ, ఇంగ్లాండు ఒకప్పటి భౌగోళిక, సామాజిక పరిస్థితులను గురించీ చెప్తూ Goshawk కు శిక్షణనివ్వాలనే తన కోరికకు గల కారణాలను విశ్లేషిస్తుంది. ఈ మెమోయిర్ లో హెలెన్ అనుభవాలన్నీ Goshawk ను మచ్చిక చేసుకోవడం అనే నేపధ్యంతో ముడిపడి ఉంటాయి. కానీ ఒక మరణం తాలూకూ బాధకూ, ఒక డేగను పెంచాలనుకోవడానికీ గల సంబంధం ఏమిటనేదాన్నిమెల్లిగా తన సునిశితమైన విశ్లేషణల ద్వారా హెలెన్ మన ముందుంచుతుంది.

While the steps were familiar,the person taking them was not. I was in ruins. Some deep part of me was trying to rebuild itself, and its model was right there on my fist. The hawk was everything I wanted to be: solitary, self-possessed, free from grief, and numb to the hurts of human life.

ఈ మెమోయిర్ లో తన కథ చెప్పాలంటే T.H.White గురించీ, ఆయన రాసిన ‘The Goshawk’ గురించీ తప్పకుండా ప్రస్తావించాలంటుంది హెలెన్. చిన్నతనం నుండీ ఆయన రాసిన పుస్తకాలు చదువుతూ పెరిగిన హెలెన్ పై White కఠినమైన బాల్యం, వ్యక్తిత్వం, అతని భయాలు, అభిరుచులు ఇవన్నీ చాలా ప్రభావం చూపిస్తాయి. పిల్లలపై పుస్తకాలు చాలా ప్రభావం చూపిస్తాయనడానికి, వైట్ తనను నిరంతరం haunt చేస్తున్నాడని హెలెన్ చెప్పడం ఒక చక్కని ఉదాహరణ అనొచ్చు. వైట్ కూడా హెలెన్ లాగే జనారణ్యానికి దూరంగా ఒక అరణ్యం మధ్యలోని మారుమూల ఇంట్లో ఒక రాబందుతో కాలం గడుపుతాడు. ఇందులో వైట్ కథనూ,తన కథనూ ఏకకాలంలో చెప్తూ Goshawk ను వశపరుచుకోవాలనే హెలెన్ అలుపెరుగని ప్రయత్నం మనిషి-మృగం తాలూకూ రెండు మనోప్రవృత్తుల మధ్య నడిచే యుద్ధంగా అనిపిస్తుంది. ఎత్తుకు పై ఎత్తులూ, ఒక నైజంపై మరో నైజం సాధించే విజయాలు, అణచివేతలు, ఆధిపత్యధోరణులూ కనిపిస్తాయి. ఇందులో Goshawk క్రూరత్వానికి ప్రతీక అయితే హెలెన్ మానవత్వానికీ ప్రతినిధిగా ఉంటుంది. కానీ ఇక్కడ హెలెన్ ఒక Goshawk కు శిక్షణనిస్తుంది అనే కన్నా దాని సాన్నిహిత్యంతో మృగ లక్షణాలైన ఒంటరితనం, స్వీయ స్వాధీనత, దుఃఖం దరిచేరని మనస్తత్వం వంటి వాటిని వంటబట్టించుకోవాలనే తాపత్రయమే ఆమెలో ఎక్కువగా కనిపిస్తుంది.

I look. There it is. I feel it. The insistent pull to the heart that the hawk brings, that very old longing of mine to possess the hawk’s eye. To live the safe and solitary life; to look down on the world from a height and keep it there. To be the watcher; invulnerable, detached, complete. My eyes fill with water. Here I am, I think. And I do not think I am safe.

White గురించి మరోచోట ప్రస్తావిస్తూ, Goshawk కు శిక్షణనివ్వడం అంటే రెండు పరస్పర విరుద్ధ స్వభావాలు తలపడటం వంటిదనీ, కరుణ, దయ వంటి లక్షణాలు మచ్చుకి కూడా కనపడని క్రూరమైన Goshawk స్వాభిమానాన్ని, సహనాన్నీ తన దృఢ నిశ్చయంతో White ఎలా పటాపంచలు చెయ్యడానికి ప్రయత్నించాడో వివరిస్తుంది. మరో సందర్భంలో ఒక క్రూరమైన వేటాడే జంతువుని మచ్చిక చేసే క్రమంలో దానితో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ దగ్గరగా గడపడం ద్వారా మనలోని అణచివేసుకున్న క్రూరమైన కోరికల్ని కూడా ఒక పూర్తి స్థాయి అమాయకత్వంతో మనం అనుభవం చెందుతామని అంటుంది. వైట్ Goshawk లోని లక్షణాలను own చేసుకోవాలనుకోవడం, అలాగే ఆ లక్షణాలకు వ్యతిరేకంగా ఆ పక్షితో పోరాడటం ఒక భయంకరమైన పారడాక్స్ అంటుంది హెలెన్.

Looking for goshawks is like looking for grace: it comes, but not often, and you don’t get to say when or how.

He explained patience. He said it was the most important thing of all to remember, this: that when you wanted to see something very badly, sometimes you had to stay still, stay in the same place, remember how much you wanted to see it, and be patient.

The old falconers called the manning of a hawk like this watching. It was a reassuringly familiar state of mind, meditative and careful and grave.

That was all there was. Waiting. Watching. Sitting with the hawk felt as if I were holding my breath for hours with no effort. No rise, no fall, just my heart beating and I could feel it, in my fingertips, that little clipping throb of blood that – because it was the only thing I could sense moving – didn’t feel part of myself at all. As if it was another person’s heart, or something else living inside me. Something with a flat, reptilian head, two heavy, down-dropped wings. Shadowed, thrush-streaked sides.

ఒక సందర్భంలో తన మానసిక స్థితికి కారణాలను వెతుక్కుంటూ ఒక లక్ష్యం గానీ, బాధ్యత గానీ లేని జీవితం ఎలా గాడి తప్పుతుందో అలాగే తన మనసు కళ్ళెం లేని గుర్రంలా అదుపు తప్పింది అంటుంది.

The kind of madness I had was different. It was quiet, and very, very dangerous. It was a madness designed to keep me sane. My mind struggled to build across the gap, make a new and inhabitable world. The problem was that it had nothing to work with. There was no partner, no children, no home. No nine-to-five job either. So it grabbed anything it could. It was desperate, and it read off the world wrong. I began to notice curious connections between things. Things of no import burst into extraordinary significance.

Marianne Moore: The cure for loneliness is solitude.

మనిషి అనేక జంతువుల్ని సులభంగా మచ్చిక చెయ్యగలిగినా కూడా ఈ Goshawks విషయంలో మాత్రం తీవ్రంగా విఫలమయ్యాడని చెప్పచ్చు. అందుకే వివిధ సంస్కృతుల్లో ఈ పక్షుల్ని wildness కు శక్తిమంతమైన ప్రతీకలుగా భావిస్తారు. అంతే కాకుండా ఓటమిని సులువుగా జీర్ణించుకోలేని మనిషి ఆ లక్షణాలపై ఆధిపత్యం కోసం నిరంతరం తపించాడు. ఇందులో హెలెన్ Goshawk కు శిక్షణనిచ్చే క్రమంలో తనలోని గాడి తప్పిన ఒక wildness ని అదుపు చేస్తూ తనకే క్రమశిక్షణ నేర్పిస్తోందా అనిపిస్తుంది. మరో సందర్భంలో సమాజంలో ఇమడలేని తన నిస్సహాయతన, తనపై తనకే కలిగిన కోపాన్నీ హెలెన్ ఈ రకంగా వివరిస్తుంది.

The anger was vast and it came out of nowhere. It was the rage of something not fitting; the frustration of trying to put something in a box that is slightly too small. You try moving the shape around in the hope that some angle will make it fit in the box. Slowly comes an apprehension that this might not, after all, be possible. And finally you know it won’t fit, know there is no way it can fit, but this doesn’t stop you using brute force to try to crush it in,punishing the bloody thing for not fitting properly. That was what it was like: but I was the box, I was the thing that didn’t fit, and I was the person smashing it, over and over again, with bruised and bleeding hands.

‘Sword in a Stone’ అనే పుస్తకం ప్రభావం కారణంగా మనిషి Goshawk గా పరివర్తన చెందడం అనేది హెలెన్ కు చిన్నతనంలో ఒక మాజికల్ థింగ్ లా అనిపించింది కానీ తాను Goshawk గా metamorphosis చెందాలనుకునే అదే ప్రయత్నం ఆమెను తీవ్ర సంఘర్షణకి లోను చేస్తుంది. Goshawk ఎలియన్ నేచర్, జీవితం పట్ల ఆ పక్షికి ఉండే అమానవీయ దృక్పథం వంటివి హెలెన్ ను కలవరపెడతాయి..బాధ నుండి విముక్తి పొందాలంటే జనజీవనానికి దూరంగా పారిపోయి ప్రకృతిని ఆశ్రయించాలని చాలా మంది చాలా పుస్తకాల్లో చెప్పడమే కాకుండా, White లాగా ఆచరించి చూపించారనీ, అందుకే తాను కూడా ఒక wildness లోకి వెళ్లిపోయాననీ అంటుంది హెలెన్. కానీ చివరకు వచ్చేసరికి తాను చేసింది తప్పని గ్రహించానంటుంది.

So many of them had been quests inspired by grief or sadness. Some had fixed themselves to the stars of elusive animals. Some sought wildness at a distance, others closer to home. ‘Nature in her green, tranquil woods heals and soothes all afflictions,’wrote John Muir. ‘Earth hath no sorrows that earth cannot heal.

Now I knew this for what it was: a beguiling but dangerous lie. I was furious with myself and my own unconscious certainty that this was the cure I needed. Hands are for other human hands to hold. They should not be reserved exclusively as perches for hawks. And the wild is not a panacea for the human soul; too much in the air can corrode it to nothing.

Of all the lessons I’ve learned in my months with Mabel this is the greatest of all: that there is a world of things out there – rocks and trees and stones and grass and all the things that crawl and run and fly. They are all things in themselves, but we make them sensible to us by giving them meanings that shore up our own views of the world. In my time with Mabel I’ve learned how you feel more human once you have known, even in your imagination, what it is like to be not. And I have learned, too, the danger that comes in mistaking the wildness we give a thing for the wildness that animates it.

ఈ పుస్తకంలో బాగా నచ్చిన అంశం Goshawk లక్షణాల గురించి హెలెన్ చేసే అద్భుతమైన పొయెటిక్ narrations. పదాల అల్లిక లో హెలెన్ నైపుణ్యం ప్రతి పేజీలో కనిపిస్తుంది. అంతే కాకుండా ఇందులో Falconry గురించి చర్చించిన అంశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రకృతి/పక్షుల గురించి ఆసక్తి ఉన్నవాళ్లు, ఏకాంతాన్ని ఇష్టపడేవాళ్లు, ముఖ్యంగా loners హెలెన్ కథకు బాగా కనెక్ట్ అవుతారు. చాలా చోట్ల ఆమె అనుభవాలతో మనల్ని మనం relate చేసుకుంటాము. కానీ కథలో అంతర్భాగమైనప్పటికీ కొన్నిచోట్ల Goshawk గురించిన వర్ణనలు చదివే వాళ్లకి కాస్త విసుగు తెప్పిస్తాయి. రాబందు అని ఊరికే వినడమే గానీ వాటిలో అన్ని రకాలు ఉంటాయని గానీ, వాటికి శిక్షణనిచ్చే విధి విధానాల్లో ఎన్నో కష్టానష్టాలకోర్చాలని గానీ ఈ పుస్తకం చదివే వరకూ నాకు తెలీదు. అసలీ Goshawk అంటే ఏంటని చూస్తే తెలుగులో ‘సాళువడేగ, రాజాళి’ అనే రెండు అర్ధాలు ఉన్నాయి. 2014 లో ప్రచురించబడిన ఈ “H is for Hawk” Samuel Johnson Prize మరియు Costa Book Award లను సొంతం చేసుకుంది.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Unforbidden Pleasures – Adam Phillips

వ్యాసకర్త: Nagini Kandala ************* ఆ మధ్య ఇంతియాజ్ అలీ సినిమా ‘తమాషా’ అని ఒకటొచ్చింది. ఎంత త్వర...
by అతిథి
0

 
 

We Are What We Pretend To Be – Kurt Vonnegut

వ్యాసకర్త: Naagini Kandala ********************** ఒక ప్రక్కన వేరే పుస్తకాలు చదువుతున్నా,’మరి నేను రాసిన కథల...
by అతిథి
0

 
 

Uncommon Type: Some Stories – Tom Hanks

వ్యాసకర్త:Naagini Kandala *************** టామ్ హాంక్స్.. సుమారు పదేళ్ళ క్రిందట ఎప్పుడో చూసిన Cast Away సినిమాత...
by అతిథి
1

 

 

Hillbilly Elegy: A Memoir of a Family and Culture in Crisis – J.D.Vance

వ్యాసకర్త: Naagini Kandala ***************** అమెరికాలోని మారుమూల Appalachia ప్రాంతాలకు చెందిన వారిని హిల్ల్బిల...
by అతిథి
0

 
 

Stiff: The Curious Lives of Human Cadavers – Mary Roach

వ్యాసకర్త: Naagini Kandala ****************** Stiff: The Curious Lives of Human Cadavers, అమెరికన్ రచయిత్రి మేరీ రోచ్ 2003లో రాసిన పుస్త...
by అతిథి
1

 
 

Fantastic night and other stories – Stefan Zweig

వ్యాసకర్త: Nagini Kandala ********* Stefan Zweig.. ఈ మధ్యే మొదలైన కొత్త ప్రేమ. అసలీ పుస్తకం కళ్ళపడే వరకూ ఈయన గు...
by అతిథి
0