ఇంద్రగంటి జానకీబాల గారి తో ముఖాముఖి – ఆహ్వానం

సాహిత్యాభిమానులకు అభివందనాలు

‘లేఖిని’ మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థ – తరఫున అందరికీ ఇదే మా ఆహ్వానము.

అచ్చమైన మధ్య తరగతి ఆవేశాలకు, అనుమానాలకు, అహంకారాలకు, అపోహలకు, ఆత్మవిశ్వాసాలకు అద్దం పట్టే రచనలు చేసిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల గారితో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. అందరు తప్పక రావసినది గా కోరుతున్నాము.

వివరాలు:
తేదీ: 25.09.2016 ఆదివారము
సమయం: ఉదయం 10.30
వేదిక: కళా సుబ్బారావు వేదిక, శ్రీ త్యాగరాయ గానసభ,
చిక్కడపల్లి, హైదరాబాద్

ఇంద్రగంటి జానకీబాల గారు కవయిత్రిగా, రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణిగా కృషిచేశారు. జానకీబాల భర్త శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు, మామగారు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి తెలుగు సాహిత్యంలో కవులుగా, సాహిత్యవేత్తలుగా ప్రసిద్ధి పొందారు. ఇక ఆకోవలోకి చేరారు వారి కుమారుడు శ్రీ ఇంద్రగంటి మోహనకృష్ణ గారు, అచ్చమైన తెలుగుదనానికి అద్దంపట్ట్టే చిత్రాలకిదర్సకత్వం వహిస్తూ.

సంగీత, సాహిత్యరంగాల్లో కృషిచేసిన జానకీబాలను పలు పురస్కారాలు వరించాయి. అవి: “కనిపించే గతం” నవలకు గాను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి పురస్కారం, కథారచయిత్రిగా రంగా-జ్యోతి పురస్కారం, జ్యోత్స్నా పీఠం సంస్థ నుంచి కథారచయిత్రిగా జ్యోత్స్నాపీఠం పురస్కారం.

పరిచయకర్త: సాహితీ ప్రియులందరికీ ఇష్టమైన ప్రముఖ రచయిత్రి డాక్టర్ K.Bక్ష్మి గారు. వీరు విపుల, చతుర పత్రికల పూర్వ సంపాదకురాలు. అనేక కథలు, వ్యాసాలు, కవితలు, సాహితీ సమీక్షలు, విమర్శలు రాశారు. కాలమిస్ట్ గా లబ్ధప్రతిష్టులు.

You Might Also Like

Leave a Reply