అదేగాలి – పుస్తకావిష్కరణ ఆహ్వానం

పుస్తకం: అదేగాలి – ప్రపంచదేశాల కవిత్వం, నేపథ్యం
అనువాదం: ముకుంద రామారావు
తేదీ: ఆగస్టు 17, బుధవారం
స్థలం: గోల్డెన్ థ్రెషోల్డ్, నాంపల్లి, హైదరాబాదు
సమయం: సాయంత్రం ఆరుగంటలకు
ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

పుస్తకం గురించి:
అదే ఆకాశం, శతాబ్దాల సూఫీ కవిత్వం, నోబెల్ కవిత్వం గ్రంథాల ద్వారా అనేక దేశాల అనువాద కవిత్వాన్నీ, సూఫీ తత్త్వ సారాన్నీ, నోబెల్ కవుల కవిత్వ జీవితాల్నీ క్రోడీకరించి తెలుగు సాహిత్య ప్రపంచానికి అందించిన విశిష్ట కవి, అనువాదకుడు వై. ముకుంద రామారావు. స్వయంగా యేడు సంపుటాలు వెలువరించిన కవిగా కవిత్వ ‘ఆల్కెమీ’ రహస్యాన్ని యెరిగిన ముకుంద రామారావు అనువాదాలకు సైతం సృజనాత్మక శైలినీ సహజత్వ శోభనీ అద్దగలిగారు – తనదైన ముద్రతో కవిత్వ ప్రేమికులకు ఆత్మ బంధువు కాగలిగారు.

పుత్తడికి పరిమళం పూసినట్టుండే వచనాన్ని సొంతం చేసుకొన్న రామారావు యిప్పుడు ‘అదే గాలి’ ద్వారా ప్రపంచ దేశాల కవిత్వ చరిత్రతో మరోసారి పాఠకుల హృదయాల్ని స్పృశించి కొత్త లోకాలకి ద్వారాలు తెరుస్తున్నారు. నూట ముప్ఫై దేశాలకు చెందిన రెండు వేల మంది కవుల్ని యీ గ్రంథం ద్వారా ఆయన పరిచయం చేస్తున్నారు. దాదాపు అయిదు వందల కవితల్ని అనువదించి ప్రపంచ దేశాల మధ్య సాంస్కృతిక వారధిని నిర్మిస్తున్నారు.

దేశం యేదైనా జాతి యేదైనా కవిత్వ భాష విశ్వజనీనమనీ, కవి వసుధైక కుటుంబీకుడనీ ‘అదే గాలి’ గ్రంథం మరోసారి నిరూపిస్తుంది.

You Might Also Like

Leave a Reply