When breath becomes air – Paul Kalanithi

వ్యాసకర్త: Nagini Kandala
**************

“సాస్ లేనా భీ కైసీ ఆదత్ హై!” అని గుల్జార్ అన్నట్లు లైఫ్ లో ఏదో ఒక సమయంలో,అసలు మనమేం చేస్తున్నాం, ఊరికే అలవాటుగా ఊపిరి తీసుకుంటున్నామా లేక నిజంగా ‘జీవిస్తున్నామా’ అనే ఆలోచన అందరికీ వస్తుంది. మరి ‘జీవిస్తున్నాం’ అనడానికి కొలమానం ఏంటి? కెరీర్ లో ఉన్నత శిఖరాలు అధిరోహించడం, నలుగురికీ ఉపయోగపడేలా జీవించడం, నలుగురిని సంపాదించుకోవడం.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా డిఫైన్ చేస్తారు. ప్రతి దాన్ని డిఫైన్ చెయ్యాలనుకోవడం మనిషి నైజం. డిఫైన్ చెయ్యలేనిది అంటే, అది లేనట్లే (సైన్స్ అదే అంటుంది). జీవితానికి పరమావధి ‘ఇదీ’ అంటాడు మనిషి. ఆ ‘ఇది’ ఒక ఫుల్ స్టాప్. కానీ ఆ ముగింపు ఏంటి? అసలెలా ఉంటుంది? ఇంకొంచెం ముందుకి వెళ్తే, మరి ముగింపు ముందే తెలిసిన కథల మాటేమిటి?

కథలెన్నైనా ముగింపు ఒక్కటే, ఆ ముగింపు ‘శ్వాస వాయువులో కలిసిపోవడం’ అంటారు ఈ ఆటోబయోగ్రఫికల్ వర్క్ లో పాల్ కళానిధి. సరిగ్గా తన గమ్యాన్ని చేరే సమయంలోనే, అంటే ఒక న్యూరో సర్జన్ గా/న్యూరో సైంటిస్ట్ గా తన కలలను సాకారం చేసుకునేలోపే, 37 ఏళ్లకే ఊపిరితిత్తుల కాన్సర్ తో ఆయన మరణించారు. నిన్నటి వరకూ పాల్ కళానిధి అంటే ఎవరో తెలీదు, ఎక్కడో ఖండాతరాల్లో పుట్టిన వ్యకి, కాన్సర్ తో చనిపోయారు, వృత్తి రీత్యా ఒక న్యూరోసర్జన్ అని మాత్రమే తెలుసు. ఆయన తల్లితండ్రులది చెన్నై అయినప్పటికీ వృత్తి రీత్యా వారు US లో సెటిల్ అయ్యారు. కానీ ఆయన మరణానంతరం పబ్లిష్ చేసిన ఈ ఆటోబయోగ్రఫికల్ వర్క్ చదివిన వాళ్లకి ఖచ్చితంగా ఆయనతో ఒక అనిర్వచనీయమైన బాంధవ్యం ఏర్పడుతుంది. ఒక డాక్టర్ రాసిన పుస్తకం అంటే పూర్తిగా మెడికల్ టెర్మినాలజీ తో ఉంటుందని ఉన్న అపోహ కొన్ని పేజీలు చదివేసరికి మాయమైంది. అటు సైన్స్ నీ, ఇటు హ్యూమన్ existence నీ, వేదాంతాన్నీ, తర్కాన్నీ సమపాళ్లలో కలిపి ఆయన రాసిన విధానం నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు.

మృత్యువు దృష్టిలో అందరూ సమానమే. పెద్ద డాక్టర్ అయినా, ఎంతో విజ్ఞాన సముపార్జన చేసినా, మానవీయ విలువలతో బ్రతికినా కూడా అది తేడా చూపించదు. అందుకే పాల్ కూడా తనకి కాన్సర్ అని తెలియగానే మొదట ఒక మామూలు మనిషిగానే రియాక్ట్ అవుతారు. ఒక షాక్ లో, ‘ఇదేంటి లైఫ్ లో ఇంత కష్టపడ్డాను, నా విజయానికి కేవలం ఒక్క మెట్టు దూరంలోనే ఉన్నాను. ఇప్పుడేంటి ఇలా?’ అని దేవుణ్ణి నిందిస్తారు. కానీ ఆయన వివేకం తొందరగానే మరణాన్నికూడా హుందాగా ఆహ్వానించేలా చేస్తుంది. ఒక న్యూరో సర్జన్ గా Religion పట్ల నమ్మకం లేని వ్యక్తి అయినా కూడా చివరి నెలల్లో దేవుని పట్ల శ్రద్ధాభక్తులతో వ్యవహరించానని అంటారు పాల్. టాల్స్టాయ్ రాసిన కొన్నిపుస్తకాల్లోలాగే చివరకి అన్ని దారులూ Spirituality దగ్గరకు వచ్చి ఆగాల్సిందేనని మరోసారి రుజువు చేస్తుంది ఈ పుస్తకం.

మొదట్నుంచీ లైఫ్ పర్పస్ తెలుసుకోవాలనే తపన పాల్ కళానిధిని సాహిత్యం వైపు ఆకర్షితుడయ్యేలా చేసింది.

What makes human life meaningful? I still felt literature provided the best account of the life of the mind, while neuroscience laid down the most elegant rules of the brain.

కానీ ఒక అనుభవాన్ని ఆలోచనల్లో ఊహించడం వేరు, అదే అనుభవాన్ని జీవించడం వేరు. ఈ కారణంగా ఆయన హ్యూమన్ consciousness అండ్ లైఫ్ పర్పస్ గురించి ప్రాక్టికల్ గా/ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే కుతూహలంతోనే న్యూరోసర్జరీని ఎన్నుకున్నానంటారు. తొలుత Stanford యూనివర్సిటీ లో ఇంగ్లీష్ లిటరేచర్, హ్యూమన్ బయాలజీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి హిస్టరీ మరియు ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. తరువాత Yale school of medicine లో వైద్య విద్యనభ్యసించి Stanford medical school లో రెసిడెన్సీ చేశారు.

ఆయన తోటి స్టూడెంట్స్ స్పెషాలిటీస్ లో లైఫ్ స్టైల్ మెడిసిన్ ని ఎంచుకోగా తాను మాత్రం న్యూరోసర్జరీని వృత్తిగా స్వీకరించాలనుకోవడం ‘ఒక calling’ అంటారు పాల్. ఒక డాక్టర్ గా వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత, passion మనకి ఒక ఆదర్శవంతమైన న్యూరోసర్జన్ ని పరిచయం చేస్తే, సాహిత్యంలో అభిరుచి, మనుషుల పట్ల/జీవితం పట్ల ఆయన దృక్పథం ఆయన్ని ఒక గొప్ప మానవతావాదిగా నిలబెడుతుంది. మొదటి నలభై పేజీలు చదవగానే కాసేపు పుస్తకం ప్రక్కన పెట్టాల్సొచ్చింది. ముఖ్యంగా రెసిడెన్సీ లో భాగంగా Cadavers గురించి చదివేటప్పుడు, మెడికల్ ట్రైనింగ్లో ఒక సాధారణమైన సున్నితమైన వ్యక్తి ఒక callous/arrogant డాక్టర్(రచయిత మాటల్లోనే) గా ట్రాన్స్ఫర్మేషన్ చెందడంలో ఎదుర్కొన్న పరిస్థితులు చదువుతున్నపుడు ఒళ్ళు గగుర్పొడిచింది. వైద్య వృత్తిలో ఉన్నవారికి చేతులెత్తి దణ్ణం పెట్టాలనిపించింది. న్యూరో సర్జరీలో ఛాలెంజెస్ గురించి చెప్తూ, ఒక సందర్భంలో ఆపరేషన్ ఫెయిల్యూర్ కి బాధ్యత వహిస్తూ, గిల్టీ ఫీల్ తో ఆత్మహత్య చేసుకున్న మిత్రుడు Jeff గురించి రాస్తారు. మరోసారి ఒక ఆపరేషన్ లో పేషెంట్ మృతి చెందిన తరువాత ఫ్రిడ్జ్ లో అంతకుమునుపు తినడానికి పెట్టుకున్న శాండ్విచ్ తినే సందర్భం ఒక డాక్టర్ లైఫ్ ఎంత కఠినతరమో చెప్తారు.

Thirty minutes in the freezer resuscitated the sandwich. Pretty tasty, I thought, picking chocolate chips out of my teeth as the family said its last goodbyes. I wondered if, in my brief time as a physician, I had made more moral slides than strides.

తాను కూడా ఒక కాన్సర్ పేషెంట్ గా మారాకా తప్ప, ఒక సర్జన్ గా పేషెంట్స్ బాధ తనకు పూర్తిగా అవగాహన కాలేదంటారు పాల్.

How little do doctors understand the hells through which we put patients.

డాక్టర్ స్థానం నుంచి పేషెంట్ గా మారినప్పుడు తన కంటే జూనియర్ డాక్టర్స్ మాట వినాల్సి వచ్చినప్పుడు ఒక సీనియర్ గా తన pride గురించి, కోపం వచ్చిన సందర్భాల గురించీ చెప్పినప్పుడు ఆయనలో నిజాయితీకి గౌరవం కలుగుతుంది. మరో సందర్భంలో మరణాన్ని అర్థం చేసుకోవాలనుకున్నవాడికి మరణం ఒక బహుమతేకదా అంటారు!

Shouldn’t terminal illness, then, be the perfect gift to that young man who had wanted to understand death? What better way to understand it than to live it? But I’d had no idea how hard it would be, how much terrain I would have to explore, map, settle.

ఇంకోచోట Pancreatic cancer బారిన పడ్డ colleague మరియు మిత్రుడు ‘V ‘ గురించి చెప్తూ “Paul, do you think my life has meaning? Did I make the right choices?” అని అడగడం తనని ఆశ్చర్య పరిచింది అంటూ “It was stunning: even someone I considered a moral exemplar had these questions in the face of mortality” అంటారు.

హ్యూమన్ knowledge కేవలం ఒక మనిషికి పరిమితం కాదనీ, సమాజంలో సంబంధ బాంధవ్యాలు దాన్ని సంఘటితంగా నిర్వచిస్తాయని అనే రచయితలో ఒక సామజిక బాధ్యత కలిగిన వ్యక్తి కనిపిస్తారు.

In the end, it cannot be doubted that each of us can see only a part of the picture. The doctor sees one, the patient another, the engineer a third, the economist a fourth, the pearl diver a fifth, the alcoholic a sixth, the cable guy a seventh, the sheep farmer an eighth, the Indian beggar a ninth, the pastor a tenth. Human knowledge is never contained in one person. It grows from the relationships we create between each other and the world, and still it is never complete. And Truth comes somewhere above all of them, where, as at the end of that Sunday’s reading,
the sower and reaper can rejoice together.
For here the saying is verified that,
“One sows and another reaps.” I sent you to reap what you have not worked for; others have done the work, and you are sharing the fruits of their work.

పాల్ తాను జీవించే రోజులను Kaplan-Meier survival curves తో కొలుచుకుంటున్నప్పుడు, మనిషి తన జీవన ప్రమాణం ముందే తెలిస్తే ఆ కాలాన్ని మరింత పద్ధతిగా సద్వినియోగం చేసుకుంటాడేమో అనిపిస్తుంది. అమాయకంగా ‘ఒక్క రోజుని నేనేం చేసుకోను’ అనే ఆ గొప్ప న్యూరో సర్జన్ ని చూస్తే బాధకలగక మానదు.

Tell me three months, I’d spend time with family. Tell me one year, I’d write a book. Give me ten years, I’d get back to treating diseases. The truth that you live one day at a time didn’t help: What was I supposed to do with that day?

The problem is that you can’t tell an individual patient where she sits on the curve: Will she die in six months or sixty? I came to believe that it is irresponsible to be more precise than you can be accurate.Those apocryphal doctors who gave specific numbers (“The doctor told me I had six months to live”): Who were they, I wondered, and who taught them statistics?

పుస్తకాలు చదివి ఏడవడం ఏంటి? అని నవ్వుతూ కొట్టి పారేసే నన్ను ఈ పుస్తకం కంటతడి పెట్టించింది అని చెప్పడానికి కాస్త ఇబ్బందిగానే ఉంది. అక్షరాలు చాల విలువైనవి కదా!! లేకపోతె కొన్ని ఖండాంతరాల అవతల ఎక్కడో, ఎప్పుడో భూమిలో ప్రశాంతంగా నిద్రిస్తున్న మనిషితో కేవలం కొన్ని అక్షరాలతో ఇంత బాంధవ్యం ఏర్పడడం చాలా అసహజం, విచిత్రం! ఇవే అక్షరాల్లో ఆ వ్యక్తిని చూశాను. విద్యను మించిన ఆయన వివేకానికి జోహార్లర్పించాను. ఆయన విజయాలకు జేజేలు కొట్టాను. ఆయన ఉన్నతమైన ఆలోచనలను పంచుకున్నాను. ఆయన ప్రశ్నలకి నేను కూడా సమాధానాల కోసం వెతికాను. ఆయన లక్ష్యాలను చేరుకోవాలని చేసిన విఫలయత్నానికి సాక్షిగా మారాను. చివరి ఆపరేషన్ చేసి ఇంటికి తిరిగి వెళ్తూ,’మళ్ళీ ఈ హాస్పిటల్ కి సర్జన్ గా రాలేను’ అని తెలిసి కార్ లో కూర్చుని ఏడ్చిన వ్యక్తిని చూసి మౌనం వహించాను. మరణాన్ని కూడా జీవించి చూపించిన ఆ వ్యక్తికి మనసులోనే శ్రద్ధాంజలి ఘటించాను. “I’m ready” అని అంటూ హుందాగా వీడ్కోలు చెప్పిన ఆయన్ని చూస్తూ నిస్సహాయంగా కన్నీరు కార్చాను. నిస్సందేహంగా, ఇవన్నీ ఈ memoir చదివే ప్రతి వారికీ అనుభవమయ్యే విషయాలే.

అంతకు మునుపు డెత్ గురింఛీ,లైఫ్ గురించీ The last lecture, The book thief, The death of Evan Ilyich, The confession, Tuesdays with Morrie లాంటి పుస్తకాలు కొన్ని చదివాను. కానీ ఇది మిగిలిన అన్నిటికంటే చాలా వేరుగా అనిపించింది. అవన్నీ అంతో ఇంతో ప్రభావం చూపించాయిగానీ నిస్సందేహంగా కంటతడి మాత్రం పెట్టించలేదు. కారణం ఏంటి అనుకున్నాను. బహుశా ఇది రాసిన వ్యక్తి అటు మరణంతోనూ (కాన్సర్ పేషెంట్ గా) ఇటు జీవితంతోను (ఒక న్యూరో సర్జన్ గా) ప్రత్యక్షమైన సంబంధం కలిగిన వ్యక్తి కావడం వల్లనేమో అనిపించింది. వీటన్నిటినీ మించి లిటరేచర్ లో ఆయనకున్న పట్టు ప్రతి అక్షరంలోను ప్రస్ఫుటమవుతుంది. మధ్యమధ్యలో T.S.Eliot, Samuel Beckett, Nabokov ఇలా చాలా మంది ప్రసిద్ధ రచయితల ప్రస్తావన ఉంటుంది. ఒక సర్జన్ కాకపోయి ఉంటే ఆయన ఖచ్చితంగా ఒక గొప్ప సాహితీవేత్త అయ్యుండేవారు.

I could only think of Samuel Beckett, the metaphors that, in those twins, reached their terminal limit: “One day we were born, one day we shall die, the same day, the same second….Birth astride of a grave, the light gleams an instant, then it’s night once more.” I had stood next to “the grave digger” with his “forceps.” What had these lives amounted to?

చివర్లో పాల్ సతీమణి లూసీ (ఆమె కూడా వృత్తి రీత్యా డాక్టర్) రాసిన epilogue లో ఆమె పాల్ చివరి ఘడియల వరకూ జరిగిన ప్రయాణం గురించి వివరిస్తారు. ఆయన అంత్యకాలంలో కూతురు Cady (నెలల పసికందు) తో గడిపారు. Cady బోసినవ్వుల్ని చూస్తూ గడిపిన సమయంలో అంతకు మునుపెన్నడూ తెలియని ఆనందం అనుభవించానని ఆమెకు వదిలి వెళ్లిన ఒక మెసేజ్ లో పేర్కొంటారు. చివర్లో లూసీ ఈ పుస్తకం రాయడం వెనుక భర్త ఉద్దేశ్యం చెప్తూ తన మరణాన్ని ఒక సెన్సేషన్ చేసే ఉద్దేశ్యం లేదనీ,జీవితంతో/మరణంతో తన అనుభవాలను పంచుకోవాలని, కాలంతో పాటు పోటీ పడుతూ ఈ పుస్తకాన్ని రాశారని అంటారు.

What happened to Paul was tragic, but he was not a tragedy.

This book carries the urgency of racing against time, of having important things to say. Paul confronted death—examined it, wrestled with it, accepted it—as a physician and a patient. He wanted to help people understand death and face their mortality. Dying in one’s fourth decade is unusual now, but dying is not. “The thing about lung cancer is that it’s not exotic,” Paul wrote in an email to his best friend, Robin. “It’s just tragic enough and just imaginable enough. [The reader] can get into these shoes, walk a bit, and say, ‘So that’s what it looks like from here…sooner or later I’ll be back here in my own shoes.’ That’s what I’m aiming for, I think. Not the sensationalism of dying, and not exhortations to gather rosebuds, but: Here’s what lies up ahead on the road.” Of course, he did more than just describe the terrain. He traversed it bravely.

కాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజి లో,అంటే మరణించడానికి కొన్ని నెలల ముందు ఈ పుస్తకాన్నిఎలా అయినా పూర్తి చెయ్యాలని పాల్ శక్తికి మించి శ్రమపడాల్సొచ్చింది. ఇందులో ఒక డాక్టర్ గా, ఆపై కాన్సర్ పేషెంట్ గా తన అనుభవాలకీ, జీవితానికి అర్థం తెలుసుకునే క్రమంలో ఆయన తన మెడిటేషన్స్ కి అక్షర రూపాన్నిచ్చారు. March 9, 2015 లో పాల్ కళానిధి మరణించగా, 2016 లో ఈ memoir పబ్లిష్ అయ్యి న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది . Stanford University Medical School కి చెందిన మరో ప్రసిద్ధ రైటర్/physician Abraham Verghese దీనికి foreword రాశారు. పాల్ కళానిధి జీవించి లేకపోయినా ఒక రైటర్ గా తన సాహిత్యాభిరుచిని చాటుతూ ముందుతరాలకు ఒక అద్భుతమైన memoir ని కానుకగా ఇచ్చారు. ఈ పుస్తకం ద్వారా జీవితాన్నిఎంత హుందాగా స్వీకరిస్తామో, మరణాన్ని కూడా అంతే హుందాగా స్వీకరించడానికి కొంతమందికైనా ఈ memoir సహాయపడుతుందని నమ్మకంతో చేసిన ప్రయత్నంలో ఆయన మరో విజయం సాధించినట్లే.

పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన అంశాలు:

The favorite quote of many an atheist, from the Nobel Prize–winning French biologist Jacques Monod, belies this revelatory aspect: “The ancient covenant is in pieces; man at last knows that he is alone in the unfeeling immensity of the universe, out of which he emerged only by chance.”


Why was I so authoritative in a surgeon’s coat but so meek in a patient’s gown?

If the unexamined life was not worth living, was the unlived life worth examining?

Suddenly, now, I know what I want. I want the counselors to build a pyre…and let my ashes drop and mingle with the sand. Lose my bones amongst the driftwood, my teeth amongst the sand….I don’t believe in the wisdom of children, nor in the wisdom of the old.There is a moment, a cusp, when the sum of gathered experience is worn down by the details of living. We are never so wise as when we live in this moment.

English PhDs reacted to science, as he put it, “like apes to fire, with sheer terror”

Maybe Beckett’s Pozzo is right. Maybe life is merely an “instant,” too brief to consider. But my focus would have to be on my imminent role, intimately involved with the when and how of death—the grave digger with the forceps.

Some days, this is how it felt when I was in the hospital: trapped in an endless jungle summer, wet with sweat, the rain of tears of the families of the dying pouring down.

Neurosurgery attracted me as much for its intertwining of brain and consciousness as for its intertwining of life and death.

If I were a writer of books, I would compile a register, with a comment, of the various deaths of men: he who should teach men to die would at the same time teach them to live.—Michel de Montaigne, “That to Study Philosophy Is to Learn to Die.

One chapter of my life seemed to have ended; perhaps the whole book was closing. Instead of being the pastoral figure aiding a life transition, I found myself the sheep, lost and confused. Severe illness wasn’t life-altering, it was life-shattering. It felt less like an epiphany—a piercing burst of light, illuminating What Really Matters—and more like someone had just firebombed the path forward. Now I would have to work around it.

Graham Greene once said that life was lived in the first twenty years and the remainder was just reflection.

You Might Also Like

One Comment

  1. తమ్మినేని యదుకుల భూషణ్

    పుస్తకం.నెట్ లో ఎన్నో సమీక్షలు వచ్చాయి. ఎవరైనా సరే పుస్తకంలో పూర్తిగా మమేకమై – అందులోని సారాన్ని వంటబట్టించుకుని – నిజాయితీగా పఠనానుభవాన్ని నలుగురితో పంచుకోవాలి అన్న తపనతో ముందుకు వస్తే గాని ఇటువంటి సమీక్షలు రావు. ఏదో అరకొర పైపైన చదివి రాయడం ఎంత సేపు ?? చదువు నడక లాంటిది – అందులో ఆనందం ఉంది – ఏమరుపాటులేని ఏకాంతంలో హృదయం తేలికపడుతుంది ఎన్నో సమీక్షలతో భావనాలోకాన్ని వెలిగించుకొన్న కందాళ నాగినికి అభినందనలు

    తమ్మినేని యదుకుల భూషణ్

Leave a Reply