పుస్తకం
All about booksపుస్తకభాష

July 12, 2016

How I read “How to be a literary sensation”.

More articles by »
Written by: Purnima
Tags: ,

Don’t judge a book by its cover – అని ఎవరో ఎప్పుడో అన్నార్ట. Let’s try knowing this book by its cover – అని నేను అంటున్నాను. ఒకసారి మౌజ్ అలా పక్కకు జరిపి, కవర్ పేజి ఇమేజి మీద క్లిక్ కొట్టి, దాన్ని కళ్ళతో స్కాన్ చేయండి ఒకట్రెండు నిముషాలు. (నేనేదో సెకండ్ పర్సన్ నరేషన్ ప్రాక్టీసు చేయడం లేదిక్కడ. మిమ్మల్నే, వెళ్ళి అట్టను “చదివి” రండి.)

వచ్చారా?

ఆ అట్టను చూసి పుస్తకానికి కొనడానికో, దాని గురించి మరిన్ని వివరాలు కనుక్కోడానికో వెళ్ళినవారూ –  పుస్తకం “కొనుక్కొని”, చదివేశాక ఇక్కడకు రండి.

అట్టను చూసి, అది పెట్టిన కితకితలకి పుసుక్కున నవ్వి, కొనాలని బుద్ధి పుట్టి, నిన్న సినిమా హాలులో పాప్ కార్న్ మిగిల్చిన లోటు బడ్జట్టును గుర్తొచ్చి ధ్యాసను మార్చేసుకున్నవారూ, ఈ పుస్తకాన్ని ఇప్పటికే చదివున్న వారూ,రచయిత పేరు బాగా తెల్సున్నట్టు అనిపిస్తున్నట్టున్నవారూ, అనిపించటం లేనివారూ, పదండి కిందకు.

ఈ పుస్తకానికి నిర్వచనంగా “హ్యూమరస్”, “ఫన్నీ”, “హిల్లేరియస్”, “కామెడి” లాంటి పదాలు విరివిరిగా వినిపిస్తాయి. (పుస్తకంలో ఈ పదాలకి ఉన్న అర్థాలు కావులే) అవ్వన్నీ నిజానికి ఒకవైపునే చూపిస్తాయి. “చంటబ్బాయి” లాంటి కామెడి సినిమాల్లో కూడా “అడిపస్” లాంటి ట్రాజడీ లక్షణాలను వెతికే నేను, ఆ ఒక్కవైపే చూసి సరిపెట్టుకోలేను.

కామెడి రచనలకి ఒక రెసిపీ ఉంటే, అది ఇలా ఉంటుంది అనుకుంటాను.

ముందుగా మనకి  బాగా దగ్గరైన ఆశలూ, ఆశయాలను తీసుకోవాలి, సుబ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. అవి తీరని, నెరవేరని పరిస్థితులు ఎటూ పుట్టుకొస్తాయి. అసహాయత, అసహనం అనే నీళ్ళల్లో పరిస్థితులను బాగా మరగబెట్టాలి. అవి బాగా గట్టిగా అయ్యాక, వాటిలో పక్కకు పెట్టుకున్న ఆశలను జోడించి, అందులో  తాహతుకు తగ్గ వెటకారం, వీలైనంత self-deprecation, చేతనైనంత చమత్కారం, కుదిరినంత exaggeration అన్నీ వేసుకోవాలి. చివరిగా “నిజం” అనే ద్రవ్యాన్ని ఒకట్రెండు స్పూనులు ఆ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. కొన్ని గంటల నుండి కొన్ని రోజుల నుండి కొన్ని సంవత్సరాల వరకూ మారినేట్ అవ్వనివ్వాలి.

సర్వ్ చేయాలనుకున్నప్పుడు, వెయ్యి ఫారన్‍హీట్ల ప్రీ-హీటెడ్ “కడుపు మంట” అనే ఓవన్‌లో  బంగారు రంగు వచ్చేవరకూ బేక్ చేయాలి. (డీప్ ఫ్రై చేయకూడదు. Comedy is, supposedly, healthy.)

అంతే! పకపక నవ్వించే కరకరలాడే కామెడీ తయారు.

సాహిత్యంలోని జాన్రేలను వంటలలోని రకాలతో పోలిస్తే, కామెడీ రచనలు చిరుతిళ్ళని భావిస్తుంటాం. “లైట్ రీడ్స్” అనుకుంటాం. అవ్వని మీటింగులలో, పూర్తిచేయలేని డెడ్‌లైన్ల చిరాకులో, రెస్పాన్స్ లేని ఈమెయిల్స్ ఎదురుచూపుల్లో, బాస్ మీద అరవలేని అసహనంలో, భార్యమీద చూపించే విసుగులో, కదలని ట్రాఫిక్ జామ్‍లలో, పట్టని నిద్రల్లో, ఒక బి.పి టాబ్లెట్ వేసుకొని  మంచినీళ్ళు తాగినట్టు ఇలాంటి పుస్తకాల్లోని పేరాలను చదువుకుంటాం.

నేనో కాఫ్కానో, సరమగోనో, మల్లాది రామకృష్ణశాస్త్రినో చదవాలనుకున్నప్పుడు ఆన్‌లైన్ నుండి లాగౌట్ అవుతాను. ఎవరిని మాట్లాడించొద్దని చెప్తాను. ఒక చార్లీ కాఫ్‍మాన్ సినిమానో, ఒక అనురాగ్ కశ్వప్ సినిమానో ఇంట్లోనే చూస్తున్నా, ఆ రెండు గంటలూ థియటర్‌లో ఉన్నట్టే అన్న నిబంధన పెట్టుకుంటాను. మరదే, ఒక జంధ్యాల సినిమాను మాత్రం ఎందుకన్ని సార్లు pause చేస్తాను? అక్కడకేదో ఆ ఒక్క జోకే మొత్తం సినిమా అయినట్టు?

To be able to enjoy a comedy in its bits and pieces, is it boon or bane for the work?

కృష్ణశాస్త్రి పుస్తకంలో కూడా బోలెడన్ని జోకులున్నాయి. రచయితల మీద, రచయితలను నిర్వచిస్తున్న నెంబర్ల మీద (ఎన్ని పుస్తకాలు అమ్ముడుపోయాయి, ఎంత డబ్బు వచ్చింది) పబ్లిషర్ల మీద, చదివేవాళ్ళ మీద, చదవని వాళ్ళ మీద, సాహిత్య అవార్డుల మీద, లిట్ ఫెస్ట్ ల మీద, ఆయన కెరీరు మీద, వాళ్ళ నాన్న మీద, ఆయన వాచ్‍మాన్ మీద, ఆయన బీర్-ఫ్రెండ్స్ మీద, ఆయనకి నచ్చిన అమ్మాయిల మీద, ఆయణ్ణి నచ్చని అమ్మాయిల మీద, మద్రాసు మీద, ఓ రకంగా నా మీద, మీ మీద, మనందరి మీదా జోకులున్నాయి.

నవ్వు పూర్తయ్యేలోపు నిట్టూర్చేలా చేసేదే నిజమైన జోక్, నన్నడిగితే. ఇదే మాటంటే జనాలు, “ఎక్కువ ఆలోచించకు. నవ్వి ఊరుకో” అంటారు. కామెడి రాసేవాళ్ళు కూడా నవ్వడం తప్ప మనం చేసేది లేదనట్టు రాస్తారు. ఈయన మాత్రం పుస్తకంలోని చివరి వ్యాసంలో, ఇలా అంటారు:

“So I became a writer.

Because that’s what writers are, aren’t they? They are displeasers, wart-magnifiers, manure-detectors, swim-against-the-tiders, the I-don’t-care-what-you-thinkers. The guys who stick a latex-gloved little finger up the world’s rectum to diddle it every time gas builds up.”

దీని గురించే చెహోవ్ ఇలా అంటాడు:

Those who think the task of literature is to extract a ‘pearl’ from a gang of villains deny its very essence. The justification for calling literature an art form is that it depicts life as it really is. It’s purpose is the honest and unconditional truth. To limit its function to nothing but the extraction of ‘pearls’ would threaten its very existence as much as insisting when Levitan paints a tree he should ignore its inconveniently grubby bark or its yellowing leaves. I agree that a ‘pearl’ is a lovely thing but the writer is surely not a confectioner or a beautician or an entertainer. The writer is a man bound by contract to his duty and to his conscience. In for a penny, in for a pound: however degrading he may find it, he has no choice but to overcome his squeamishness and soil his imagination with the filth of life.. the writer is no different from your average news-paper reporter. How could you regard a reporter who, from misplaced delicacy or a willingness to pander to his readers, never wrote about anyone but honest burghers, idealistic ladies or virtuous railwaymen?

ఇప్పుడేదో సోషల్ మీడియా, హైపర్ మార్కటింగ్ , scope for instant gratification వల్ల రచయితలకి ఎక్కడలేని కష్టాలు వచ్చేశాయని అంతా అంటున్నారు గానీ, పై రెండు పేరాలను ఒక్కసారి మళ్ళీ చదివితే తెలుస్తుంది.

వీళ్ళిద్దరూ వేర్వేరు కాలాలకి సంబంధించినవారు. ఇద్దరు రాసేదానికి పొంతన లేదు. ఇద్దరూ ఉన్న పరిస్థితులు వేరు. అయినా చెప్పింది ఒక్కటే – ఎవరికోసమో రాయకు. నీ రచనకు నువ్వే అడ్డుపడకు. రాయాలనుకుంటే, రాయాలనుకున్నదానికి న్యాయం చేస్తూ రాయి. లేదా, రాయడం మానుకో.

KSD is not just another humorist on the block. He’s an artist, to begin with. Successful or not, he’s a sincere artist. That sincerity is intrinsic to every line he wrote in this book. And it is loud enough not be muffled by our laughs at his jokes.

Dear Writer,

As a reader who enjoyed your work and as a fan-in-the-making, by writing this article and writing it the way I wrote, I ensured your “non-best-selling-humorist” status is not in any sort of danger.

Also, I’ve just given you a new topic: How unqualified folks, in the name of reviews, screw the “image” of books. (That way, I will be able to write about how writers like you are responsible for my “condition”.)

No. No thanks needed. As long as the latex-gloved-finger is doing its job. As long as I smell that gas, despite trying to avoid it.

Sincerely,

A reader.

Details: 

How to be a Literary Sensation.

Krishna Shastri Devulapalli

Harper Collins publication.

Available on leading online and offline book stores. Also available in kindle version.About the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..One Comment


  1. Mythili Abbaraju

    నాకు రెండో వైపు చూద్దామని ఉండదు. కాని మీది బ్రహ్మాండమైన రివ్యూ.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0